Monday, March 30, 2026

life lessons 😒 ఇవి నేర్చుకోక పోతే కష్టమే..ఎలా ఉంటే మనం హ్యాపీ గా ఉంటాం #vijayatwins #vlog #viral

life lessons 😒 ఇవి నేర్చుకోక పోతే కష్టమే..ఎలా ఉంటే మనం హ్యాపీ గా ఉంటాం #vijayatwins #vlog #viral

Author Name:@vijayatwins

Youtube Channel Url:https://www.youtube.com/@Vijayatwins

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JAryLBQeGsA



Transcript:
(00:00) విజయ ట్విస్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసి నా ఇన్ని సంవత్సరాల లైఫ్ ఎక్స్పీరియన్స్ లో నేను ఏమేమి నేర్చుకున్నాను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను నాకు తెలిసిన విషయాలు ఎవరికైనా ఉపయోగపడొచ్చేమో అని చెప్తున్నాను. సింపుల్ గా చెప్పాలంటే లైఫ్ లెసన్స్ అన్నమాట. నేను ఎప్పుడూ అనుకుంటూ అలాగే ఫాలో అయ్యే విషయాలు ఇవన్నీ కూడా వీడియో లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంటుంది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి.
(00:26) మన లైఫ్ హ్యాపీగా ఉండడానికి చాలా ఉపయోగపడతాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎవ్వరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అప్పుడే వాళ్ళలో ఉండే పాజిటివ్ సైడ్ ని మనం చూడగలుగుతాము నేనైతే ఇలా ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు ఇది చేయలేదు అది చేయలేదు నా కోసం అని చెప్పి బాధపడే కంటే కూడా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు అనుకోండి వాళ్ళు చిన్న హెల్ప్ చేసినా కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము.
(00:51) ఇది మనం హ్యాపీగా ఉండడానికి హెల్ప్ చేసిద్ది అన్నమాట అదే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే మనం అంత హ్యాపీగా ఉండలేదేమో వాళ్ళు ఇది చెయ్యలేదు వీళ్ళు అది చేయలేదని ఎప్పుడు బాధతోనే ఉంటాము ఇది చాలా ఎక్కువగా నేను నమ్ముతుంటాను అలాగే మనం ఇది ఎప్పుడు దేనికి అడిక్ట్ అవ్వకూడదు అదేంటంటే ఫుడ్ అయినా గాని మనుషులైనా రిలేషన్ అయినా ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా మనం ఎక్కువగా క్లోజ్ గా ఉండేవాళ్ళు ఏదైనా ఇష్యూ వల్ల చిన్న ఇష్యూ వల్ల గాని లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా మనకి చాలా బాధ అనిపించిద్ది కదా అందుకే ఎక్కువగా అడిక్ట్ అవ కూడదు అని నాకు
(01:20) అనిపించిద్ది. ఫుడ్ కూడా అంతే కొన్ని కొన్ని ఫుడ్స్ మనం అసలు అవాయిడ్ చేయలేం కదా ఎగ్జాంపుల్ కి టీ గాని చికెన్ గాని లేకపోతే మగవాళ్ళయితే డ్రింకింగ్ గాని ఇలాంటివి ఎడిక్ట్ అవుతున్నామ అని తెలియగానే మనం అవాయిడ్ చేయడం బెటర్. ఇంకొకటి టైం అనేది అస్సలు వేస్ట్ చేయకూడదు. ఇది అందరూ చెప్పేదే నా లైఫ్ లో ఏం జరిగిందంటే నేను పిల్లలు పుట్టకముందు మిషన్ నేర్చుకుందాము అని చాలా అనుకున్నాను కానీ మా ఆయన వద్దన్నాడు ఎందుకంటే అప్పుడు పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను కదా ఆ మిషన్ వేడి అంటారు కదా ఇప్పుడు ఎందుకులే పిల్లల కోసం కూడా చూపించుకుంటున్నాం కదా పిల్లలు పుట్టిన
(01:52) తర్వాత నేర్చుకుందువులే అప్పుడు ఖాళీయే కదా అది ఇది అని చెప్పాడు మా ఆయన కానీ అప్పుడు నాకైతే ఏమనిపిచ్చిదంటే అప్పుడు నేర్చుకుంటే బాగుండేది ఎక్కువగా ఇంకా బాగా ఆ ఏంటి నీట్ గా కుట్టడం నేర్చుకునేదాన్నే కదా సీనియర్స్ లాగా అని అనిపించింది ఎక్కువ ఖాళీ టైం ఉంది కదా నాకు అప్పుడైతే బాగా నేర్చుకునేది ఏమో ఉండేమో అనిపిస్తుంది.
(02:12) ఇప్పుడు అంత టైం కుదరట్లేదు పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి ఇంట్లో పని YouTube పిల్లలు నాకు అంత పర్ఫెక్ట్ గా కుట్టే అంతగా టైం ఉండట్లేదు. అందుకే టైం ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు. అలాగే ఇంకొకటి వచ్చేసి నేను ఇంకా ఆ టైం మిషన్ నేర్చుకోలేదు కదా అని చెప్పి ఖాళీగా ఉండలేదు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను నాకు పెళ్లి అప్పటికి జీరో నాలెడ్జ్ అన్నమాట వంటలు నేర్చుకున్నాను రకరకాల వంటలు అలాగే మెహందీ పెట్టడం నేర్చుకున్నాను రకరకాల హెయిర్ స్టైల్స్ నేర్చుకున్నాను ఆ అలాగే ముగ్గులు వేయడం కానీ లేకపోతే బ్యూటీకి సంబంధించి ఆ ఏంటి ఐబ్రోస్ గాని ఇలాంటివి మగ్గం ఇది మగ్గం వర్క్ కాదు గాని చీరల మీద పెయింటింగ్
(02:49) నేర్చుకున్నాను వర్క్ చేయడం నేర్చుకున్నాను ఎంబ్రాయిడరీ చేతోడివి చేస్తారు కదా అలాంటివి ఇలాంటివి నేను చాలా నేర్చుకున్నాను కుట్లు అల్లికలు ఇలాంటివి అంటారు కదా అలాంటివి చాలా నేర్చుకున్నాను హోమ్ మేడ్ వి ఇంట్లో తయారు చేసే కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అవి నేర్చుకున్నాను నేను ఖాళీగా ఎప్పుడూ ఉండలేదు ఆహ్ ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉన్నాను అలాగే నాలెడ్జ్ కూడా పెంచుకోవడానికి బుక్స్ కూడా చదువుతానే ఉన్నాను అట్లాగా టైం వేస్ట్ చేయకూడదు నేనప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండడం వల్లే నాకు ఈరోజు అది YouTube కి హెల్ప్ అయింది
(03:18) చాలా అందుకే టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి ఎప్పుడు ఇప్పుడు మనకి అదే నేర్చుకోవాలి అదే అది కుదరలేదు కదా ఇంకేది నేర్చుకోవాలి అని అనుకోకుండా అది కాకపోతే ఇంకొకటి ఏదో ఒకటి ఖాళీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఇంకొకటి వచ్చేసి ఏ ప్రాబ్లం వచ్చిన కూడా ఏది జరిగినా కూడా మన మంచికే అని అనుకుంటూ ఉండాలి అది మనం ఆలోచించుకున్నా కూడా నిజమే అని అనిపించిద్ది ఇది కూడా నేను చాలా బాగా నమ్ముతాను.
(03:43) ఆ మనం రిలేట్ చేసుకుంటే మనకి కనెక్ట్ అవుతుంది కూడా ఏది జరిగినా మన మంచికే అని చెప్పి అలాగే ఏమనా ప్రాబ్లం వచ్చినా కూడా అది పర్మనెంట్ గా ఉండదు. కొన్ని రోజులు కొన్ని రోజులు మనం కొంచెం ఓపికగా ఉంటే చాలు అని ఆ ఉంటే చాలు ఏ ప్రాబ్లం అయినా పర్మనెంట్ గా ఉండదు కచ్చితంగా సాల్వ్ అయిద్ది ఆ ప్రాబ్లం లో ఉన్నప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఆ ఉంటే చాలు ఆ అనిని నేనైతే అట్లాగే ఉంటాను అదే మనం ఎంత పాజిటివ్ గా ఉంటే అంత పాజిటివ్ గానే జరుగుతుంది.
(04:10) నేను ఇట్లాంటివి ఏంటో నాకు చాలా బాగా నమ్మాలనిపించింది భగవత్గీతలో కూడా అదే ఉంటది కదా యద్భావం తద్భవతి అనేది నేను చాలా బాగా నమ్ముతాను అది కొంతమంది ఆడవాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు అంటే నేను ఏమి చేయలేకపోతున్నాను అంటే బయటకి వెళ్లి జాబ్ చేయలేకపోతున్నాను లేకపోతే మిషన్ కొట్టడం కానీ లేకపోతే ఏమైనా కానీ ఈ యూట్యూబ్ చాలా మంది స్టార్ట్ చేసి క్లిక్ అవ్వక బాధపడుతూ ఉంటారు కదా ఏదైనా చేయకపోతే నేనేం సంపాదించట్లేదు ఏం చేయలేకపోతున్నాను అని చాలా బాధపడుతుంటారు అలా కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇల్లుని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పనులు అన్ని
(04:43) మేనేజ్ చేసుకోవడం అంత ఈజీ పనేం కాదు ఇది కూడా చాలా కష్టమే ఏమి సంపాదన లేకపోయినా పర్లేదు ఇంట్లో వాళ్ళు సంపాదించలేదు అనిని అనకుండా ఉంటే ఏమి పర్లేదు అంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు మీకు మీరు గుర్తుంచుకోండి ఇదేమి చిన్న పని కాదు నేను కూడా ఇంటిని పిల్లల్ని మేనేజ్ చేసుకుంటున్నాను అని చెప్పి మీకు మీరు ధైర్యంగా హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయండి ఇంకొకటి వచ్చేసి హెల్త్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉం ఉండాలి ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అని చెప్పి చీటికి మాటికి తుమ్మినా దగ్గిన అన్నిటికి టాబ్లెట్లు వేసుకున్నామంటే ముందు ముందు రోజుల్లో ఆ చాలా ఇబ్బంది పడతాము ఆ
(05:18) టాబ్లెట్లకి నేను విన్నదాని ప్రకారం ఆ 100 లో 10% మన బాడీకి ఉపయోగపడిద్దంట ఆ రోగానికి సంబంధించి ఉపయోగపడిద్దంట మిగతా 90% మన వేస్టేజే ఉంటదంట ఆ వేస్టేజ్ అంతా మన బాడీలో పేరుకి పోయి ముందు ముందు రోజుల్లో చాలా ఇబ్బంది పడతాము. ఇంకొకటి చెప్తే కామెడీగా ఉంటది కానీ ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ చాలా ఉంది కదా హెయిర్ ఫాల్ ని కూడా అదేముందిలే నార్మల్ అని లైట్ తీసుకోకుండా కొంచం హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వగానే ఏదో ఒక జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ చేయండి నేను కూడా అలాగే వదిలేసాను హెయిర్ ఫాల్ నార్మల్ ఏ కదా అదే పోయిద్దిలే అని చెప్పి బాగా చాలా హెయిర్
(05:50) ఫాల్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యి కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను ఈ మధ్యే అది ఏం చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను ఇంకొకటి 10వ పాయింట్ వచ్చేసి ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి అది ఎందుకనేది మీకు అందరికీ బాగా బాగా తెలుసు దాంట్లో మెయిన్ వచ్చేసి స్వీట్స్ షుగర్స్ బాగా తగ్గించుకుంటే చాలా బెటర్ ఎందుకంటే అవి ఒకసారి మనం అలవాట అయ్యామంటే ఇంకా డ్రగ్స్ లాగా మన బాడీకి ప్రతి రోజు పడాలి అని అనిపించిద్ది ఒక నాలుగు రోజులు స్వీట్స్ తినండి రోజు ఐదో రోజు కూడా తినాలనిపించిద్ది స్వీట్ అలాగ అంత అడిక్ట్ అవుతాము షుగర్స్ కి స్వీట్స్ ఇలాంటివి
(06:23) కూడా చాలా తగ్గేయడం బెటర్ ఇప్పుడు మనం వయసులో ఉన్నప్పుడు బాగానే ఉన్నా కూడా వయసు పెరిగే కొంది మనకి అవి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి మన పిల్ల పిల్లలతోటి మనం హ్యాపీగా కొంచెం ఏజ్ పెరిగాక హ్యాపీగా ఉండాలంటే గనక ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. లేదంటే మనం ఎలా పడితే అలా ఉన్నామంటే మన పిల్లలు మంచిగా కెరియర్ లో కష్టపడే టైంలో లేకపోతే వాళ్ళు బిజీగా ఉండే టైంలో మనకి ఆ హెల్త్ బాలేదు ఈ హెల్త్ బాలేదు మమ్మల్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళమని వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి వచ్చిద్ది.
(06:52) అందుకే మనం హెల్తీ గా ఉన్నామ అంటే వాళ్ళకి కూడా మన వల్ల ఏమి ఇబ్బంది లేకుండా ఉండిద్ది. ఇంకొకటి వచ్చేసి మనం ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది అని నాకు అనిపించిద్ది. ఇరువు బొరువుతో వాళ్ళతో గాని, ఫ్రెండ్స్ తో గాని, రిలేషన్ చుట్టాలలో గాని గొడవలు పెట్టుకోకుండా ఉంటే మంచిది అని నాకు అనిపించిద్ది. ఎందుకంటే ఆ అందరికి ఎలా ఉంటదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం గొడవలు ఎవరితో అయినా గొడవలు అయినాయి అంటే నాకే చాలా డిస్టర్బెన్స్ గా మైండ్ అంతా దాని మీద ఆ గొడవ మీదే ఆ చుట్టూ ఆ గొడవ చుట్టూ తిరుగుతా ఉంటది.
(07:21) అసలు ఎందుకు గొడవ పెట్టుకున్నాను నేనైతే చాలా డిస్టర్బ్ గా ఫీల్ అవుతాను. మైండ్ అంతా నాకు అసలకి పాడైపోయినట్టు అనిపించిద్ది నేను అందుకే సామాన్యంగా ఎవరితోటి గొడవలు పెట్టుకోను గొడవలు పెట్టుకుంటే నేనే బాధపడాల్సిన నేనే ఎక్కువ బాధపడతాను ఏంటో నేను సామాన్యంగా ఎవరితోటి గొడవలు పెట్టుకోను పెట్టుకుంటే మాత్రం నాకు చాలా డిస్టర్బెన్స్ గా అనిపించిద్ది ఎందుకో అందుకే నేను అసలు చాలా దూరంగా ఉంటాను ఇట్లాంటి మైండ్ సెట్ ఎవరికైనా ఉంటే గనుక గొడవలకి చాలా దూరంగా ఉండండి కొంతమందికేమో గొడవలు పడితేనే హ్యాపీగా ఉండిద్ది అనుకుంటా ఎప్పుడు గొడవలు పడతా ఉంటారు
(07:49) అలాంటి వాళ్ళకి నేనేం చెప్పలేను. ఒకవేళ అవతల వాళ్ళది తప్పయినా మంద తప్పు ఏదైనా సరే గొడవ అవుతున్నప్పుడు మీకు మీరు ఏం చెప్పుకుంటారంటే వాళ్ళ మెచూరిటీ అంతవరకే అనేని వాళ్ళని చిన్న పిల్లలులాగా అనుకోండి అప్పుడు కోపం రాదు ఆ నేనైతే అలాగే అనుకుంటాను. ఇంకా 12త్ పాయింట్ ఏంటంటే మనం ఎన్నాళ్ళు ఉంటామో ఎన్నాళ్ళు ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి చిన్న చిన్న ఆనందాలు ఏమన్నా ఉంటే గనుక అవి తీర్చుకోవడం బెటర్ ఆ చిన్న చిన్నవి అంటే మనం ఏమన్నా ట్రిప్లకి వెళ్ళడము లేకపోతే డ్రెస్సింగ్ సెన్సలో గాని మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏముంటాయి చిన్న చిన్నవి కోరికలే కాబట్టి
(08:26) ఎలాగో ఉండేది తక్కువ బడ్జెట్ లోనే ఉంటాయి ఉండేవి కూడా ఎందుకంటే మన కెపాసిటీ మనకు తెలుసు కాబట్టి అలాంటివి ఏమైనా చిన్న చిన్న కోరికలు ఉంటే తీర్చేసుకోవడం బెటర్మీ అంత పిసినారోళ్ళలాగా ఉండకుండా మన పిల్లలకైనా సరే చిన్న చిన్నవి అయితే తీర్చగలిగేవయితే తీచుకోవడం బెటర్ అని నాకు అనిపించిద్ది. అలాగే మనం ఉన్నా లేకపోయినా కూడా మన వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండాలంటే వాళ్ళకి కూడా మంచి సేవింగ్స్ ప్లాన్ చేసి పెట్టాలి.
(08:52) ఆ ఎందుకంటే మరీ అతిగా ఖర్చు పెట్టకుండా అలాగే మరీ అంత పిసినారితనంగా కూడా ఉండకూడదు మేమైతే అలాగే ఉంటాము మోస్ట్లీ పిల్లల కోసం కూడా సెక్యూర్ చేస్తూ దాంట్లోనే మాకు కావాల్సింది ఏంటి అని ఎందుకంటే మేము కూడా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము నేను మా హస్బెండ్ ఆ చిన్నప్పుడు మేము ఏమి ఎంజాయ్ చేయడం కానీ లేకపోతే మా కోరికలు తీర్చుకోవడం కానీ ఏమి చేసింది లేదు మేమిద్దరం అందుకనే మాకున్న చిన్న చిన్న సరదాలు తీర్చుకుంటేనే మా పిల్లలకు కూడా సేవింగ్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము.
(09:19) ఆ ఇది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు కూడా ట్రై కుదిరినంత వరకు అలాగే ఉండండి. మా కోరికలు ఎలాగో మా ఆయన గాని నాయ గాని పెద్ద ఎక్స్పెన్సివ్ గా ఏమి ఉండవు. అందుకే మేము అట్లాగా ప్లాన్ చేసుకుంటాము. ఇంకొకటి వచ్చేసి ఆ మన ఇంట్లో వాళ్ళకి అంటే పిల్లలు గాని మగవాళ్ళు గాని ఆ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా కొంచం చెప్పాలి హెల్ప్ చేయాలి మనం ఆ వాళ్లకు అర్థమైి ఒకవేళ చేసుకోవట్లేదు అని అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా ఇలా మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా రేపు మన పిల్లలు జాబ్ పర్పస్ మీద ఆ వేరే
(09:55) ఎక్కడికైనా మనం దూరంగా ఉండే ప్లేస్ కి వెళ్ళిన కూడా అక్కడ కూడా వాళ్ళు అడ్జస్ట్ అయ్యేలాగా ఉండాలి ఫుడ్ గాని లేకపోతే పోతే బట్టల విషయం కానీ అన్ని వాళ్ళకి వాళ్లే చూసుకునేలాగా ఉండాలి. ఆ పిల్లలకైతే డ్రెస్సులు వాళ్ళ డ్రెస్సులు వాళ్లే సెలెక్ట్ చేసుకోవడం నేర్పించాలి అలాగే మగవాళ్ళకైతే వాళ్ళ బట్టలు వాళ్ళు ఐజిన్ చేసుకోవడం కానీ మీరు నేర్పించారా మీ ఆయనకి అంటారేమో మా ఆయన ఎంత చెప్పినా అసలు వినట్లేదు కొంతమంది మగవాళ్ళు వింటారు చెప్పగానే నేర్చుకో కొంచెం హెల్ప్ చేస్తే నేర్చుకుంటారు.
(10:24) మా ఆయన ఇంకా నేను చెయ్యను అని చెప్పిన బయట ఇస్తున్నాడు కానీ హైరన్ కి మా ఆయన అయితే చేసుకోడు అది వేరే విషయం అనుకోండి చెప్తే వినేవాలైతే కనుక చెప్పి ట్రై చేసి నేర్పించండి మా ఆయన విన్నా వినకపోయినా మా పిల్లలకి మాత్రం నేను అన్ని పనులు ఇప్పటి నుంచో నేర్పిస్తున్నాను ప్రతి ఒక్కటి ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా ఆ ఫుడ్ తినడం గానీ ఫుడ్ వండుకోవడం గాని అట్లాంటివి మగవాళ్ళకి ఒక రోజు రెండు రోజులు మనం ఎక్కడికైనా ఊళ్ళకి వెళ్ళినా హెల్త్ బాలేకైకపోయినా వాళ్ళు మేనేజ్ చేసుకునేటట్టు కొన్ని కొన్ని చిన్న చిన్న పనులయినా సరే అలవాటు చేసి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా నేర్పించాలి
(10:54) పిల్లలకి మెయిన్ చాలా అవసరం ఇది ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడుద్ది. వీళ్ళకి ఈ పనులు ఏమీ రాకపోతే మన దగ్గర మనుషులు మనం లేనప్పుడు చాలా లోగా ఫీల్ అవుతుంటారు చాలా బాధపడుతుంటారు. అదే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగితే గనుక ఇంత బాధపడరు దూరంగా ఉన్న కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు. ఇంకా మోస్ట్లీ అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిదయద్ది ఫ్రెండ్స్ మంచివాళ్ళు అవుతారు ఇరుగు పొరుగు వాళ్ళు మంచివాళ్ళు అవుతారు నేనైతే ఇది చాలా బాగా నమ్ముతాను.
(11:27) ఆ వాళ్ళు అవతల వాళ్ళు చెడ్డ వాళ్ళయనా కూడా మనం ఊకొట్టి వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు లేకపోతే ఇలా అలా అంటున్నప్పుడు ఊకొట్టి ఊరుకున్నామ అంటే ఇంకా అసలు ఏమి ఉండదు ఇదే నేను మొన్న ఇన్స్టా రీల్స్ లో కూడా చెప్పాను మీరు ఎవరైనా చూసారో లేదో ఏంటంటే ఎవరైనా ఆర్గ్యూ చేసినప్పుడు లేకపోతే అలా కాదు ఇలా అని ఆర్గ్యూ చేసినప్పుడు మనం ఏదన్నా మన గురించి ఏదనా ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి నేను బట్టలు కొడుతున్నాను ఏదైనా డ్రెస్సెస్ నీకు బట్టలు కొట్టడం రాదు అలా కొట్టావు ఇలా ఎలా కుట్టావ అన్నా గాని లేకపోతే ఆ YouTube వీడియోలు నీకు అసలు సరిగా మాట్లాడడం రాదని
(12:01) ఏదో ఒకటి నేవుడికి కామెంట్స్ వచ్చినప్పుడు ఆ అవునా అనిని లేకపోతే ఇంకా అవును నేను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ విషయంలో అని వాళ్ళకి సమాధానం చెప్తే సరిపోయిద్ది ఒక మాట తోటి అలా కాకుండా నీకు అది కూడా రాదు కదానో లేకపోతే వాళ్ళతోటి ఆర్గ్యూ చేయడం చాలా టైం వేస్ట్ ఎందుకంటే వాళ్ళకి అంత తెలివి ఉండి వాళ్ళు మనకంటే తెలివి కలవాలైతే గనక మనకి సలహా ఇవ్వరు ఎందుకంటే ఎప్పుడైనా కూడా తెలివి కలవాళ్ళు ఎప్పుడు అవతలి వాళ్ళకి సలహాలు ఇవ్వరు అవతలి వాళ్ళ నాలెడ్జ్ ఏంటి ఇదంతా అవగాహన ఉండిద్ది.
(12:34) ఇంకొకటి తెలివి గల వాళ్ళకి తెలుసు మనం ఎప్పుడూ అవతల వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వకూడదు అని తెలిసే ఉంటది. వాళ్ళకి అంత తెలివి లేదు కాబట్టే అవతలి వాళ్ళకి ఉచిత సలహాలు ఇస్తుంటారు అని నేను అనుకుంటూ ఉంటాను. ఈ మొత్తం వచ్చేసి 15 పాయింట్లు దాకా చెప్పాను. నేను రాసుకొని పేపర్ మీద ఏదైనా మర్చిపోతానేమో అని చెప్పి ఇవన్నీ కూడా నేను గట్టిగా ఫాలో అవుతూ నమ్ముతాను కూడా గట్టిగా ఇలాంటివి ఇంకొకటి మనము అన్నిటికీ చిన్న చిన్న వాటికి భయపడుతూ టెన్షన్స్ పడుతూ నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి జనరల్ గా మనుషులం కాబట్టి అలాంటప్పుడు కొంచెం ఇంట్లో పూజలు చేసుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తే ఏదైనా
(13:07) బుక్స్ చదవడమో భగవద్గీత ఉంటే భగవద్గీత చదవడం ఇలాంటివి మనకు ఖాళీ టైం దొరికినప్పుడు ఏదైనా నేర్చుకుంటూ అసలు మనం మైండ్ ఎప్పుడూ బిజీగా ఉండాలి బుక్స్ చదవడంలోనో పనులు చేయడంలోనో అప్పుడు మన మనము హ్యాపీగా ఉంటాము. ఈ ఖాళీగా ఉన్నామంటే మనము ఇంకా ఏదో ఒకటి దేనికో దాని గురించి ఆలోచించి బాధపడడం భయపడడం ఇలాంటివన్నీ వస్తుంటాయి ఏదో ఒకటి ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకూడదు.
(13:36) ఏది చిన్నది నేర్చుకున్నా కూడా మనకి లైఫ్ లో ఎప్పుడో సరపడుద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ముగ్గులే నాకు నేను ముగ్గులు ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి టైం పాస్ కి నేర్చుకున్నాను. ముగ్గులు నేను ప్రతిదీ అసలు బస్సులో ఎప్పుడైనా చిన్నప్పుడు ఊర్లకి వెళ్తున్నప్పుడు కూడా బస్సుల్లో వెళ్ళేటప్పుడు మామూలుగా ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తూ ఉంటాయి కదా బస్సుల్లో గాని ఆటోలో వెళ్ళేటప్పుడు లేకపోతే ఊర్లో నడిచి వెళ్ళేటప్పుడు కూడా ఇంటి ముందు ముగ్గులు అవి చూస్తా వెళ్ళిపోయేదండి ఆ ముగ్గులన్నీ గమనిస్తే ఎలా వేసారు ఎలా వేశారు అని చెప్పి ఆ ముగ్గులు చూసి ఇంటికి
(14:05) రాగానే నేను చిన్నప్పుడు బుక్స్ లో వేసుకుంటా ఉండేదాన్ని ఇంటికి రాగానే చూసిందంతా బుక్ లో వేసేదాన్ని అది నాకు ఎంత హెల్ప్ అయ్యింది YouTube కి చాలా హెల్ప్ అయ్యింది ముగ్గులు వల్ల కూడా నాకు వ్యూస్ చాలా పెరిగాయి సబ్స్క్రైబర్స్ చాలా మంది పెరిగారు అలాగే ముగ్గుల పోటీల్లో ప్రైజులు వచ్చినయి నాకు ఎంత యూస్ అయిందో చూడండి చూడడానికి ఆ ముగ్గులు నేర్చుకుంటే ఏముందిలే అన్నట్టు అనిపించింది ఇట్లాగే ప్రతిదీ వచ్చేసి నా లైఫ్ లో నాకు మెహందీ పెట్టడం కానివ్వండి హెయిర్ స్టైల్స్ కానివ్వండి నేను నేర్చుకున్న ప్రతిదీ నాకు ఎంతోకంత హెల్ప్ అవుతానే ఉంది. అందుకే మనం
(14:38) ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఆ ఒకవేళ ఫోను మనకి మిగతావి ఏవన్నీ కుదరకపోయినా కూడా మన చేతిలో ఫోన్ ఉంటే చాలు ఈ రోజుల్లో పిల్లల గురించి అయినా గాని ప్రెగ్నెన్సీ గురించి గాని ప్రతిదీ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా ట్విన్స్ అయినా కూడా నేను అస్సలు భయపడలేదు ఎందుకంటే నా చేతిలో అప్పుడు నేను ఇలాంటి పనులు ఏమి చేయకూడదు బెడ్ రెస్ట్ చెప్పారు కంప్లీట్ అప్పుడు కూడా నేను దేనికి భయపడకుండా పాజిటివ్ ఓన్లీ వీడియోస్ లో కూడా అన్ని పాజిటివ్ సైడ్ వీడియోస్ే చూసేదాన్ని నేను చాలా రైరింగ్ ఉన్నాను అసలు ఆ ఈ ప్రెగ్నెన్సీ స్టోరీ అంతా కూడా నేను ఇంకొక
(15:13) వీడియోలో చెప్తాను. ఆ ప్రెగ్నెన్సీ తో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుద్ది దానికంటే ముందు ఆ వేరే నేను ఏమనుకుంటున్నాను అంటే మా లైఫ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వరుసగా ఏమైనా జరిగింది ఇలాంటివి వరుసగా చెప్తే బాగుంటదేమో అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి ఆ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి.
(15:37) ఆ మా హస్బెండ్ గురించి కూడా నేను మా ఇంటి గురించి కూడా చెప్పాలనుకున్నాను కదా అది కూడా చెప్దాం అనుకుంటున్నాను ఏంటి ఎలా అనేది అని చెప్పి మీకు ఏవైనా వీడియోస్ ఐడియా ఉంటే గనుక అవి కూడా సజెస్ట్ చేయండి చేస్తాను కుదిరినంత వరకు నాకు తెలిసిన దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి కచ్చితంగా మన లైఫ్ లో ఉపయోగపడుతూనే ఉంటాయి.
(15:59) చాలా ఉపయోగపడతాయి. వీడియో నచ్చితే గనుక లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మీ సిస్టర్స్ కి గాని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి గాని షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుద్దని నేను అనుకుంటున్నాను అలాగే నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టి ఆల్ అని సెలెక్ట్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే అలాగే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు మీ వీడియోస్ మాకు రావట్లేదండి అనిని అందుకే గంట కొట్టి ఆల్ అని సెలెక్ట్ చేస్తే వీడియోస్ వస్తాయి ఇంకొకటి వచ్చేసి షార్ట్ వీడియోస్ కూడా
(16:31) రావట్లేదని కొంతమంది అంటున్నారు. నేను షార్ట్స్ పెట్టట్లేదండి అసలు YouTube లో చాలా రేర్ గా పెడుతున్నాను ఎప్పుడో ఒకటి పెడుతున్నాను అసలు పెట్టట్లేదు నేను పెట్టకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే షార్ట్స్ కంటే కూడా లాంగ్ వీడియోస్ బెటర్ అంటే గట్టిగా పునాది పడినట్టు అంట లాంగ్ వీడియో పెడితే టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు.
(16:50) నేను అందుకనే ఇంకా లాంగ్ వీడియోసే పెడదాము షార్ట్స్ కంటే అని అనుకుంటున్నాను. కాబట్టి లాంగ్ వీడియోస్ అన్ని చూసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి అంతవరకు వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి కచ్చితంగా అందరికీ ఉపయోగపడుద్ది బాయ్

No comments:

Post a Comment