ఇక్కడ అక్షింతలు, కుంకుమ తీసుకుంటే చాలు?#satyanandiraju #sanatanadharma #hindu #devotional #ytviral
Author Name:Satya Sanatana Dharma Telugu Channel
Youtube Channel Url:https://www.youtube.com/@satyasanatanadharmateluguc6778
Youtube Video URL:https://www.youtube.com/watch?v=IMnAzQbtQqY
Transcript:
(00:00) శ్రీమాత్రే నమః మీ సత్యానందిరాజు విజయవాడ గుంటూరు రహదారి మధ్యలో మనకి నంబూర్ అనే ఊరు వస్తుంది. ఆ నంబూర్ రైల్వే స్టేషన్ ఎదురుగానే శ్రీ కాళీ గార్డెన్స్ అనే ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమం కనిపిస్తుంది. మీరు ఆశ్రమంలోనికి వెళ్తే ఈ మహానుభావుడు చిత్రపటం కనిపిస్తుంది. ఈయన గొప్ప రాజయోగి ఎక్కడ పుట్టారో ఎవరికి పుట్టారో ఎవరికీ తెలియదు.
(00:29) నన్ను చాలామంది మీలో అడుగుతున్నారు కదా ఇప్పటికీ సజీవులైనటువంటి మహాత్ములు ఉన్నారా అని అటువంటి వారి సత్సంగం చాలా జాగ్రత్తగా చివరిదాకా చూడాలి. అలాగే ఈ తల్లిని చూశారా చిన్నప్పటి నేను చాలా సార్లు టీవీలో చూశాను కానీ ఈ తల్లి వెనక ఎటువంటి ఆధ్యాత్మిక చరిత్ర ఉందో నాకు ఇవాళ తెలిసింది. ఆ విషయాలన్నీ కూడా నేను ఇవాళ మీతో పంచుకోబోతున్నాను.
(00:56) ఈ సత్సంగం మీకు నచ్చినట్లైతే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఆ సత్సంగం చేసుకుని ఈ మహాత్ముల ఆశీస్సులు ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు పొందేద్దాం పదండి అది కృష్ణా జిల్లాలో కోరుకుళ్ళు అనే గ్రామం అక్కడ కామయ్య శాస్త్రి గారు అని చెప్పి ఒక పెద్ద మనిషి ఉండేవారు ఆయన కొన్ని సంవత్సరాల క్రితం హిమాలయాల్లో ఒక వృద్ధులైనటువంటి ఉడిషిని దర్శించారు.
(01:27) సరే 1940 ప్రాంతంలో వారి గ్రామంలోనే చెరువులో స్నానం చేస్తుంటే ఒక పదే ఏళ్ల పిల్లవాడిని చూశారు. చూసినప్పుడు ఆయనక ఎందుకో హిమాలయాల్లో దర్శించినటువంటి ఆ ఋషి యొక్క ముఖ వర్చుసి పిల్లవాడిలో కనిపించింది. సరే కదా అని చెప్పి మాట్లాడి చూస్తే తర్వాత రూఢి అయింది. ఆ వృద్ధులైనటువంటి ఋషే ఈ పదేళ్ల పిల్లవాడు అని మరి ఆ పిల్లవాడి వయసు ఎంత? ఈ పిల్లవాడు ఎవరో కాదు నేను ఇందాక ఒక చిత్రపటం చూపించానా ఆ ఫోటోలోని వ్యక్తే ఈ పదఏళ్ల పిల్లవాడు వారి అసలు పేరు హనుమత్ కాళీ వరప్రసాద్ బాబూజీ గారు అని పిలుచుకుంటారు చాలామంది బాబుగారు అని చెప్పి ప్రేమగా పిలుచుకుంటారు.
(02:11) వీరు చాలా సార్లు ఏం చెప్పేవారు అంటే చిన్నప్పుడే తమ తల్లిదండ్రులు చనిపోయారని ఇల్లు విడిచి నేను చాలా చోట్ల తిరిగాను ఎక్కడెక్కడో తపస్సు చేశాను. హిమాలయాలు తిరుమల పాపికొండలు శ్రీశైలం ఇలా ఎన్నో చోట్ల సుదీర్ఘమైనటువంటి తపస్సు చేశాను అని చెప్పి భక్తులతో చెప్పేవారు వారు సాధనలో ఎంత తీవ్రమైనటువంటి స్థితికి వెళ్ళారు అంటే పాపికొండల్లో ఉన్నప్పుడు ఒకసారి ఆయనకి తపస్సు కలగలేదు అని చెప్పి ఒక కొండ నుంచి కిందకు దూకేశారు లోయలోకి జగన్మాత ఊరుకుంటుందా పచ్చని చెట్లని ఒక పడకలాగా అమర్చి ఆ పిల్లవాడిని కాపాడింది అటువంటి గొప్ప యోగి ఋషి బాబుగారు మనం ఈ
(02:56) సత్సంగంలో ఇంకా ఈయన్ని బాబుగారు అని చెప్పి పిలుచుకున్న ఇంకో చిత్రం ఏంటంటే వీరితో బాల్యంలో ఆడుకున్న వాళ్ళందరూ కూడా వృద్ధాప్యంలోకి వచ్చిన వీరి ఇంకా యవ్వనంలోనే కనిపించేవాళ్ళు నాకు అందుకనే వీరి చరిత్ర చదివేటప్పుడు మన సుధీంద్ర బాబు గారి జీవిత చరిత్ర పాకలపాడి గురువు గారి యొక్క జీవిత చరిత్ర గుర్తుకు వచ్చింది అటువంటి మార్మిక యోగి శ్రీ హనుమత్ కాళీ వరప్రసాద్ బాబూజీ గారు నేను ఇందాక చెప్పాను చూసారా ఆ దేవతార్చనకు సంబంధించినటువంటి ఒక పెట్టి ఉండేదని ఆ పెట్టెని తీసుకుని ఎవరైనా ఆహ్వానిస్తే ఆ భక్తులు ఇళ్లకు వెళ్ళేవారు ఏళ్లలో అయితే వీరు పడుకునేవారో ఆ రాత్రి
(03:35) వారి ఇంట్లో గజ్జల చప్పుళ్లు వినిపించేవి ఎందుకంటే వీరు కాళీమాత ఉపాసకులు కదా ఎప్పుడైనా ఈ సాధనా స్థితిలో వారు దట్టమైన అడుగులు దాటాల్సి వచ్చినప్పుడు స్వామి హనుమ నిత్యం వారికి రక్షణ కల్పించేవారు అని చెప్పి భక్తులు చెప్తుండేవారు ఇంకో ఇంకో విశేషం ఏంటంటే ఎవరైనా భక్తులు వీరితో సంభాషిస్తూ ఉంటే ఆ ఎదుటి వారి కులాన్ని తమ కులంగా చెప్పేవారు అట్లా కుల మతాలకు అతీతంగా ఉండేవారు బాబుగారు అసలు వీరి రూపం అద్భుతంగా ఉండేది నాకు మాత్రం ఈ ఫోటోలో వారిని చూసినప్పుడు సాక్షాత్తు హనుమే ఇలా ఉంటారా అనిపించింది.
(04:11) ఇంకో చిత్రమైన సందర్భం చెప్తాను ఒకసారి ఒక భక్తుడు ఇంటికి వెళ్ళారు సోఫాలో కూర్చున్నారు బాబుగారు ఆ ఇంట్లో ఐదారేళ్ల ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు ఉన్నటువంటి పరిగెత్తుకుంటూ వచ్చాడు తండ్రి దగ్గరికి ధన నాన్న సోఫాలో పెద్ద కోతి వచ్చి కూర్చుంది అన్నాడు తండ్రి హడావిడిగా హాల్లోకి వచ్చి చూస్తే ఆ సోఫాలో కాళీమాత దర్శనం అయింది ఆ తండ్రికి ఆ పిల్లవాడికేమో స్వామి హనుమలాగా తండ్రికేమో కాళీమాత లాగా వారు ఎవరో కాదు మన బాబుగారే నేను ఇందాక చెప్పాను చూసారా వారి దేవతార్చన పెట్టిలో ఎప్పుడూ కూడా స్వామి హనుమ కాళీమాత యొక్క మూర్తులు ఉంటాయని చెప్పి అందుకనే వారికి
(04:53) శ్రీ హనుమత్ కాళీ వరప్రసాద్ బాబు గారు అని చెప్పి పేరు వచ్చింది. వీరిని బాల్యం నుంచి కూడా పూజించుకున్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అందులో కందర్ప పరశురామయ్య గారు ఒకళ్ళు. ఆయన 12 ఏళ్ళు బాలరాముని ఉపాసిస్తే 12 ఏళ్ల వయసులో బాబుగారు పరశురామయ్య గారి ఇంటికి వచ్చారు. అందుకే ఆ పిల్లవాడిని పరశురామయ్యగారు సాక్షాత్తు శ్రీరామునిగా భావించి పూజించేవారు.
(05:20) వయసు రీచ్చా బాబు గారు కూడా పరశురామయ్య గారిని నాన్నగారు అని పిలిచేవారు. సరే చిన్న పిల్లవాడు కదా ఏబిసిడి లు ఏమైనా నేర్పిద్దాం ఇంగ్లీషు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పి. పలక మీద ఏబి సిడిలు దిద్దిస్తున్నారు పరశురామయ్య గారు బాబుగారి చేత ఆశ్చర్యం ఏమిటంటే ఆ పలకలో ఆ పిల్లవాడి కాళీమాత దర్శనం అయింది. నిన్ను నేను అక్షర స్వరూపుణగా మారుద్దాం అనుకుంటే ఈ అక్షరాలు తిద్దే పని నీకెందుకురా అంది కాళీమాత.
(05:49) అప్పుడే చెప్పకనే చెప్పింది ఆ తల్లి ఆ బాబుగారు లోక కళ్యాణం కోసం పుట్టారని చెప్పి ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి లోకోపహిత కార్యక్రమాలు చేపట్టాలని ఏదో ఊళలో బాబుగారు ఉపన్యాసం ఇస్తున్నారు పక్కనే ఆడుకుంటున్నటువంటి ఒక ఐదారేళ్ల చిన్న పాప వచ్చి ఊళలో కూర్చుని తాను కూడా ఏదో ఉపన్యాసం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. బాబుగారు నవ్వుతూ ఏం చందు నువ్వు కూడా ఉపన్యాసం ఇస్తావా నాలాగా అని అడిగారు.
(06:18) అవును బాబు అంది ఆ చిన్న పాప తడుముకోకుండా అప్పుడు బాబుగారు భవిష్యత్తులోకి చూస్తూ నీ అద్భుతమైన గాత్రంతో భగవన్ నామాన్ని ఎప్పుడు ఆలపిస్తూ ఎంతోమందిని దివ్యత్వం వైపు నడిపిస్తావు అని చెప్పి ఆశీర్వదించారు ఆ పాప చందు అసలు పేరు చంద్రశేషమాంబ ఆ తల్లి ఎవరు అంటే నేటి ఆశ్రమాధిపతి అయినటువంటి శ్రీ శ్రీ చంద్రకాళి ప్రసాద్ మాతాజీ తల్లి ఆ తల్లి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు పుట్టింది అక్టోబర్ 31 1955 వీరి తల్లిదండ్రులు చిరంజీవి రాజు గారు రాఘవమ్మ గారు వీరు బాబుగారిని బాల్యం నుంచి పూజించుకున్నటువంటి కుటుంబం నన్ను అడుగుతున్నారు కదా సజీవులైన
(07:03) మహాత్ముల గురించి వెళ్లి ఆశ్రమంలో ఈ తల్లిని దర్శించండి నేను ఒకటి రెండు నెలల్లో తప్పకుండా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఆ తల్లిని దర్శించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీరు కూడా దర్శించండి ఆ తల్లి యొక్క తపస్శక్తికి సంబంధించిన ఒక సంఘటన నేను మీతో పంచుకోబోతున్నాను. ఇప్పుడు బాబుగారి తపస్శక్తి ఎలాంటిదో దానికి సంబంధించిన కొన్ని సంఘటనలు చెప్పుకుందాం.
(07:29) ఒక కొత్తగా పెళ్లైన జంట ఉంది. దురదృష్టం కొద్దీ ఆ పెళ్లి కూతురికి అంటే కొత్తగా పెళ్లినటువంటి ఆ అమ్మాయికి ఏదో దుష్ట గ్రహం ఆవేశించి పాపం చాలా బాధపడింది అనారోగ్యంతో సరే వారు రాఘవేంద్ర స్వామి భక్తులు కాబట్టి మంత్రాలయం వెళ్లి అక్కడ ఒక మండలం వాళ్ళు పూజించుకున్నారు రాఘవేంద్రస్వామి 41వ రోజు రాఘవేంద్రస్వామి ఒక వృద్ధో వేషంలో కనిపించి నేను బాబు గారు వేరు కాదు మీరు స్వయంగా బాబుగారినే పూజించుకోవచ్చుఅని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానం అయ్యాడు.
(08:05) సరే కొన్ని రోజుల తర్వాత ఒక గురువారం నాడు మంత్రాలయంలో ఏనుగు అంబారి మీద ఊరేగింపు జరుగుతోంది రాఘవేంద్ర స్వామి వారిది అప్పుడు వీరికి ఆ రాఘవేంద్ర స్వామి మూర్తిలో బాబుగారు మార్చి మార్చి మరి కనిపించారు అప్పుడు అర్థమైంది రాఘవేంద్ర స్వామి బాబు గారు వేరు కాదు సాక్షాత్తు బాబు గారు దైవ స్వరూపులు అని చెప్పి దాని తర్వాత ఆ తల్లికి అంటే ఆ కొత్తగా పెళ్లి అయినటువంటి ఆ యువతికి ఆ దుష్ట గ్రహం పోయింది దాని తర్వాత చక్కగా స్వస్తురాలు అయిపోయింది.
(08:39) నన్ను మీలో చాలామంది ఏమడుగుతారంటే శరీరంతో ఇప్పుడు వీళ్ళందరూ లేరు కదండీ ఇలాంటి వారి జీవిత చరిత్రలు తెలుసుకుని ఏం ఉపయోగం అని కొంతమంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు వారికి నేను చెప్పే సమాధానమే ఈ సంఘటన సరే బాబుగారు శరీరంతో ఉన్నప్పుడే ఒక భక్తురాలకి ఎప్పటినుంచో ఒక కోరిక ఉండేది బాబుగారికి భోజనం పెట్టాలి అని వారు తమ ఇంటికి వచ్చి ఆ నివేదన స్వీకరించాలి అని బాబుగారు మాట ఇచ్చారు అలాగే వస్తాను అన్నారు దురదృష్టం బాబుగారు శ్రీరం వదిలేశారు.
(09:18) ఆ తల్లి యొక్క కోరిక తీరల చాలా చాలా బాధపడిపోయింది ఆ భక్తురాలు ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఒకసారి దుఃఖంతో రైల్లో ఇంటికి వెళ్తున్నారు ఆ భక్తురాలు వెళ్తూ ఉంటే ఎదురు సీట్లో ఒక ముత్తైదువు కనిపించింది పండు ముత్తైదువ ఎందుకు ఏడుస్తున్నావ్ నీ వెనకాల ఎవరూ లేరని ఎందుకు అనుకుంటున్నావ్ ఎవరూ లేకుండానే నువ్వు రక్షింపబడుతున్నావా అని అడిగింది ఆ పండు ముత్తైదు సరే గానీ నీ చేతిలో ఉన్న ఆ పుస్తకం ఏంటి అని చెప్పి అడిగింది ఆ తల్లి ఆ ముత్తైదువ ఈ భక్తురాలు చెప్పింది రాధ భక్తి కృష్ణ తత్వం అంది మరి అలా అయితే రాధ ఎప్పుడైనా కృష్ణుడు తనకు తోడుగా లేడు అని చెప్పి అనుకు
(10:02) అనుకుందా అని చెప్పి ఆ ముత్త ఏదో ఎదురు ప్రశ్న వేశను. ఎందుకో ఈ భక్తురాలి చూపు కొంచెం ఏమారి కొంచెం అట్లా తల తిప్పింది మళ్ళీ చూసేసరికి ఎదురు సీట్లో ఆ పండు ముత్తైదు అంతర్ధానం అయిపోయింది ఎక్కడా కనిపించలే ఆ ట్రైన్లో సరే అలా ఆలోచిస్తూ ఇంటికి వచ్చేసింది ఆ భక్తురాలు 15 రోజులు గడిచిపోయినాయి ఒక్క మెతుకు కూడా తినలే ఆ భక్తురాలు ఇదే దిగులు ఉంది మనసులో బాబు గారు ఇంటికి వస్తా అన్నారు భోజనం చేయలేదని సరే మధ్యాహ్నం రెండు గంటలు అయింది ఎవరో తలుపు కొట్టారు ఎవరా తీసి చూస్తే బాబుగారు ఎదురుగా నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అన్నారు. ఆవిడ సరే అన్నం చక్కగా
(10:48) వడ్డిచ్చింది ఆయన తిని కొంచెం ప్రసాదంగా భక్తురాలికి పెట్టి నేను లేనని చెప్పి నువ్వు ఎందుకు అనుకుంటున్నావ్ ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది నేను లేకుండా ఉన్నానా నేను లేకుండా ఉంటే నిన్ను రక్షిస్తున్నది ఎవరు రాధా కృష్ణుడి గురించి ఇలాగే అనుకుందా ఆ పండు ముత్తైదువ అడిగిన ప్రశ్నలు నేను నిజంగా నీతో ఉన్నాను అనుకుంటే భోజనం ఎప్పుడో మానేయకు అని చెప్పి సరే ఈ గిన్నెలన్నీ వంటింట్లో సద్దిరప్పో అన్నారు సే భక్తురాలు అదే తన్మయత్వ స్థితిలో ఆ గిన్నెలన్నీ ఆ వంటింట్లోకి తీసుకెళ్లి మళ్ళీ తిరిగి వచ్చేసరికి బాబుగారు
(11:33) మాయమైపోయారు ఎంత ఆ తల్లి నా భా భ్రాంతేమో అనుకుంది ఎక్కడ భ్రాంతి ఎదురుగా బాబుగారు తిన్న ఆ పళ్ళెం అలాగే ఉంది. అంటే ఎటువంటి తన్మయత్వ స్థితో చూడండి అప్పటికీ బాబుగారి శరీరంతో లేరని తెలుసు వారు అడిగిన ప్రశ్నలన్నీ కూడా ట్రైన్లో ఆ పండు ముత్తైదు అడిగిన ప్రశ్నలేనని చెప్పి తెలుసు కానీ ప్రశ్నించలేకపోయింది. ఇటువంటి సంఘటనలు మీలో చాలామందికి ఎదురయ్యే ఉంటాయి.
(12:04) అంటే మనకి తెలుస్తున్న కూడా ఎదురు తిరిగి ప్రశ్నించలేం ఒక తన్మయత్వ స్థితిలో ఉండిపోతాం ఒక ట్రాన్స్ లో ఉండిపోతాం దాని అర్థం ఏంటంటే మన మైండ్ స్పేస్ అంటే మన ఆలోచనల్ని వారు హరింపజేస్తారు ఇటువంటి అనుభవం మీలో ఎవరికైనా జరిగి ఉంటే కామెంట్స్ లో పెట్టి తీరండి మర్చిపోకండి ఎందుకంటే ఎంతోమందికి ఇటువంటి మహాత్ముల పట్ల దైవం పట్ల విశ్వాసం పెరిగేందుకు దోహదం చేస్తాయి ప్రతి కామెంటు డ అది కూడా భగవత్ సేవే నన్ను నమ్మండి ఇప్పుడు చెప్పండి శరీరంతో లేని వారి జీవిత చరిత్రలు తెలుసుకోవడం నిరుపయోగమా ఎప్పుడు ఆ యోగుల యొక్క తపస్శక్తి అలాగే నిలిచి ఉంటుంది.
(12:43) ఇప్పటికీ మీరు ఆ ఖాళీ గార్డెన్స్ కి వెళ్ళండి అక్కడ ప్రసాదంగా ఇచ్చే అక్షింతులు కుంకుమ చాలు మీ కష్టాలు తప్పకుండా గట్టెక్కుతాయి. కానీ మనకు కావాల్సింది ఆ దృఢమైనటువంటి భక్తి విశ్వాసం నేను ఇందాకే చెప్పాను బాబు గారికి కులమత బేధాలు ఎక్కడా కూడా ఉండేవి కాదు అందరినీ కూడా సమానంగా చూసేవారు ఒక చర్చి ఫాదర్ కి తీవ్రమైన కీళ్ళ నొప్పులు ఉండేవి అంటే కనీసం ఒక అడుగు కూడా వేయగలిగేవాడు కాదు ఆయన ఆయన తరుపున కొంతమంది బంధువులు వచ్చారు బాబు గారి దగ్గరికి ఆయన యొక్క కష్టం మొత్తం చెప్పుకున్నారు ఇప్పుడు బాబు గారు నవ్వుతూ అలా అయితే వారిని తల నీళ్లలో ముంచండి ఎంత గించుకున్నా కూడా
(13:24) వదలమాకండి గించుకోవడం ఆపేసిన తర్వాత వదిలేసేయండి. వారి కీళ్ళ నొప్పులు తగ్గాలంటే అది ఒక్కటే మార్గం అని చెప్పారు. అక్కడ ఉన్న వారందరూ కూడా బాబుగారు ఏమనా హాస్యం ఆడుతున్నారేమో అనుకున్నారు ఇదేమి చిట్కా ఇదెక్కడ చిట్కా కీళ్ళ నొప్పులు అయితే తలను తీసుకెళ్లి నీళ్ళలో అమ్ముంచడం ఏంటని సరే ఇదంతా వెళ్లి ఆ ఫాదర్ కి చెప్పారు ఈ బంధువులు ఇట్లా అన్నారు బాబుగారుఅని ఆ చర్చి ఫాదర్ కి ఎంత విశ్వాసమో చూడండి బాబుగారు చెప్పింది చేసి తీరతాను అని చెప్పి బంధువులు ఎంత వద్దంటున్నా కూడా వారిని ఒప్పించాడు అందుకు సరే నీళ్ళ తొట్టి దగ్గరకి తీసుకెళ్ళారు ఆ చర్చి
(14:04) ఫాదర్ ని ఆ బంధువులంతా కూడా నీళ్ళలో ముంచారు ఆ తలకాయని ఇంకా గుంచుకోవడం మొదలు పెట్టాడు కాసేపు ఆగిన తర్వాత ఊపిరాడట్ల 30 సెకండ్లు అయిపోయింది బాబు గారు చెప్పింది గుర్తుంది ఆ బంధువులకి గింజుకున్నంత సేపు వదలద్దు గింజుకోవడం ఆపేసిన తర్వాత మాత్రమే వదలండి అని కాసేపు ఆగిన తర్వాత ఇంకా చర్చి ఫాదర్ గింజుకోవడం ఆపేసాడు అప్పుడు బంధువులు అతన్ని వదిలేశారు చిత్రం ఏంటంటే ఈ సంఘటన తర్వాత చర్చి చర్చి ఫాదర్ యొక్క కీళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోయినాయి.
(14:37) ఒక్క అడుగు కూడా వేయలేని స్థితి నుంచి చక్కగా నడవడం మొదలు పెట్టాడు ఆయన. తర్వాత బంధువులు అడిగారు దించుకున్నావు దాని తర్వాత మేము వదిలేసాము నీకు ఏమైంది అని నన్ను నీళ్ళలో ముంచారు మీరు నాకు ఊపి రాలేదు కాసేపు ఆగిన తర్వాత ఇంక నాకు మరణం తప్పదు అనుకున్నాను దాని తర్వాత నాకు ఒక్కసారి ప్రశాంతత ఏర్పడిపోయింది. అప్పుడు నాకు నీళ్ళల్లో ఆశ్చర్యకరంగా బాబుగారి యొక్క ముఖం కనిపించింది.
(15:07) ఇంకా విశేషం ఏంటంటే ఆ బాబు గారు జీసస్ గా నాకు మారిపోయి కనిపించారు. దాని తర్వాత ఏం జరిగిందో నాకు తెలియలేదు నా కీళ్ల నొప్పులన్నీ పూర్తిగా తగ్గిపోయినాయి అని చెప్పి చెప్పాడు ఆ చర్చి ఫాదర్ అసలు ఇలాంటివి చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి బాబు గారి జీవితంలో ఒకటి కాదు అసలు వారి గురించి చక్కని వెబ్సైటు ఉంది నేను ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అసలు మీరు ఆ వెబ్సైటు లోపలికి వెళితే మీకు అన్ని విశేషాలు తెలిసిపోతాయి బాబు గారి గురించి మాతాజీ గురించి అసలు ఆశ్రమ విశేషాల గురించి మొత్తం సవివరంగా ఉన్నాయి ఇప్పుడు చక్కగా వెళ్లి కాసేపు మీకు మీరే సత్సంగం
(15:41) చేసుకోవచ్చు లేదా మీ కుటుంబ సభ్యులతో సత్సంగం చేసుకోవచ్చు అసలు బాబుగారు ఎప్పుడూ కూడా ఆయన యొక్క తపస్శక్తిని సిద్ధుల్ని ఆయన స్వప్రయోజనాల కోసం ఎప్పుడూ వాడలేదు ఎప్పుడూ కూడా లోకహితం కోసమే బాబుగారికి ఒక అంతేవాసి ఉండేవాడు చాలా చనువుగా ఉండేవాడు ఎంత చనువుగా అంటే బాబుగారు ఊళలో పడుకునేంత చనువు ఉండేది సరే ఒకసారి ఒళ్లో పడుకుని మీరు నాకు ఎలాగైనా సరే జగన్మాత యొక్క దర్శనాన్ని ప్రసాదించాల్సిందే అని చెప్పి పొట్టుపట్టాడు బాబుగారు అన్నారు ఇలా ఇలా కాదు నువ్వు తగిన సాధన చేయకుండా ఇట్లా కోరకూడదు సరైన సమయం వచ్చినప్పుడు అమ్మవారే నీకు దర్శనాన్ని అనుగ్రహిస్తుంది ఓపిక
(16:19) పట్టు అన్నారు. మాట వినలా ఎలాగైనా సరే మీరు నాకు ఇవాళ దర్శనం ఇప్పించాల్సిందే నేను లేకపోతే లేవనే లేవను అని చెప్పి పంతం పట్టాడు. సరే బాబుగారు నవ్వుతూ అలాగైతే లేచి నా దేవతార్చన వైపు చూడు అన్నారు. చాలా ఉత్సాహంగా లేచి అటువైపు చూడడం మొదలుపెట్టాడు. నిమ్మలంగా కాంతి పుంజాలు అతని మీదకి రావడం మొదలుపెట్టినాయి. కాంతి పెరిగిపోతూ పెరిగిపోతూ విపరీతంగా కూడా తేజస్సు ఆవరించింది.
(16:50) కాసేపటికి చూడలేకపోయాడు కళ్ళు మూసుకున్నాడు భయంతో అయినా కూడా తేజస్సు అలాగే అతని మీదకి ప్రసారం అవుతోంది. కాసేపటికి భయపడిపోయి మహాప్రభు ఇంకా ఆపేయండి నా వల్ల కావట్లేదు ఈ తేజస్సు తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. ఇప్పుడు బాబుగారు నెమ్మదిగా ఆ తేజస్సుని అట్లా ఉపసంహరించారు అప్పుడు చెప్పారు సరైన పరిపక్వత లేకుండా సాధనా బలం లేకుండా పరమాత్మ యొక్క దర్శనాన్ని మనం కోరుకోకూడదు అని ఒంకోసారి అది ప్రాణం మీద కూడా తీసుకొస్తుంది అని చెప్పారు ఆ భక్తుడు ఆ శిష్యుడు ఎవరైతే కోరుకున్నాడో ఈ దర్శనం కొన్ని రోజుల పాటు అనారోగ్యం పాలయ్యాడు మళ్ళీ బాబుగారే
(17:33) కుంకుమ అక్షంతలు ఇవ్వాల్సి వచ్చింది సరే ఇప్పుడు మనం మాతాజీ యొక్క తపస్సు శక్తిని తెలుసుకుందాం. దానికి సంబంధించిన సంఘటన మనం ఇప్పుడు చెప్పుకుందాం. సరే ఒక భక్తుడు ఉండేవాడు అసలుకి చెవి దిబ్బెళ్లు వేయడం మొదలు పెట్టింది. నిమ్మలంగా ఈ శబ్దాలు వినడానికి తన శక్తిని కోల్పోయాడు. సరే డాక్టర్ దగ్గరికి వెళితే నీకు నరాలన్నీ దెబ్బ తిన్నాయి నీకు వెంటనే సర్జరీ చేయకపోతే ఇన్ఫెక్షన్ నీకు బ్రెయిన్ వరకు వెళుతుంది నీకు తర్వాత ప్రాణానికే ముప్పు అని చెప్పి నువ్వు వెంటనే సర్జరీ చేయించుకోవాలని చెప్పారు చాలా కంగారుపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి
(18:10) మాతాజీ కాళ్ళ మీద పడిపోయాడు అమ్మ ఇట్లా సర్జరీ చేయాలంటున్నారు అని మాతాజీ నవ్వుతూ ఓహో అయితే సర్జరీ చేయాలంటావ్ అవునమ్మా అన్నారు డాక్టర్లు అలా అలా చేసిన తర్వాత నీకు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి వాళ్ళు హామీ ఇస్తారా అని అడిగారు మాతాజి. అలా ఎందుకు ఇస్తారమ్మ అంటే అలాగైతే భగవంతుడికి వదిలేసేయ అన్నారు మాతాజీ. అలా ఎలా వదిలేస్తాం అమ్మ డాక్టర్లు చాలా ప్రాణానికే ప్రమాదం అన్నారు సర్జరీ చేయించుకోవాలని చెప్పారు అని చెప్పాడు ఆ భక్తుడు.
(18:45) అలా అయితే వెళ్లి హామీ అడిగిరా అన్నారు మాతాజీ. సరే ఈ సందిగ్ధావస్థలో ఒక సంవత్సరం పాటు ఆ భక్తుడు ఆపరేషన్ చేయించుకోవాల మహానంది వెళ్ళారు అందరూ మాతాజీ ఏదో అక్కడ సత్సంగం చేస్తూ ఉపన్యసిస్తున్నారు దూరంగా ఈ భక్తుడు ఇంకో మిత్రుడు ఉన్నారు ఒక చిన్న గుట్ట మీద మాతాజీ ఉన్నట్టుండి ఆ భక్తుడిని పిలిచి నువ్వు ఆ గుట్ట మీద నుంచి కిందకు దూకేసేయ అన్నారు ఆ కింద ఒక నీళ్ళ తొట్టు ఉంది పెద్ద నీళ్లుు కూడా లేవు ఆ తొట్టిలో ఆ భక్తుడు కంగారుపడిపోయి అమ్మ అక్కడ నీళ్లు లోతు లేవు దూకితే తప్పకుండా దెబ్బ తగులుతుంది అని చెప్పాడు మాతాజీ దూకేసే అలా అయితే అన్నారు వెంటనే దూకేసాడు ఆ భక్తుడు పొట్టకి బలంగా దెబ్బ తగిలి
(19:28) ముక్కు నుంచి నోట్లో నుంచి ఒక చిక్కటి పదార్థం బయట పడిపోయింది సరే అట్లా నెమ్మలంగా గుట్ట పైకి వస్తున్నాడు తలకాయ తుడుచుకుంటూ తడిసిపోయింది కదా బట్టలో అతనికి ఆశ్చర్యం వేసి అర్థమైంది ఏమిటంటే శబ్దాలన్నీ యధావిధిగా వినబడటం మొదలుపెట్టినాయి మాతాజీ గారి యొక్క తపస్శక్తి చూశారా అందుకే భక్తులు ఏం చెప్తారంటే మాతాజీని దర్శిస్తే బాబుగారిని దర్శించినట్టే అట్లా బాబుగారు ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దారు ఎంతో మందిని కష్టాల నుంచి గట్టెక్కించారు.
(20:05) అట్లా వారు 1988 డిసెంబర్ మూడవ తారీకుు కార్తీక బహుళ దశమి నాడు తమ శరీరాన్ని వదిలివేసి ఆ పరమాత్మలో ఐక్యమైపోయారు. ఆ తమ అవతారాన్ని వారు అక్కడితో చాలించారు. అంటే అది ఒక రకంగా కరెక్ట్ కాదేమో ఎందుకంటే వారి అవతార కార్యక్రమం ఇప్పటికీ కూడా మాతాజీ ద్వారా ప్రకటితం అవుతూనే ఉంది. ఇంకా అక్కడ చాలా ఉపాలయాలు ఉన్నాయి. రాములవారి ఆలయం కృష్ణుడి ఆలయం పరమేశ్వరుడి యొక్క ఆలయం కాళికామాత ఆలయం నాగేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఈ ఉపాలయాలన్నీ కూడా మామూలు ఆలయాలు కాదు సాక్షాత్తు బాబుగారి యొక్క తపస్సు శక్తి ధారు పోసి ప్రతిష్టింపచేసినటువంటి ఆలయాలు ఆ ఉపాలయాల్లో ఉన్నటువంటి అర్చకులు
(20:43) చాలాసార్లు అక్కడ ఆ దేవతా మూర్తుల ద్వారా బాబుగారి యొక్క తపస్శక్తిని చాలాసార్లు అనుభవించారు. కాబట్టి తప్పకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఉపాలయాలన్నీ కూడా దర్శించండి. ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా ఆ మాతాజీ యొక్క ఆశీస్సులు బాబుగారి యొక్క ఆశీస్సులు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను.
(21:05) ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి. మీలో ఎంతమంది ఆశ్రమాన్ని దర్శిద్దాం అనుకుంటున్నారో కామెంట్స్ లో పెట్టండి. అంతే కాదు మీరు ఇంకా ఎవరి యొక్క జీవిత చరిత్రలు తెలుసుకుందాం అనుకుంటున్నారో ఏ ఆశ్రమాలు ఏ క్షేత్రాలను దర్శిద్దాం అనుకుంటున్నారో కూడా కామెంట్స్ లో పెట్టండి నేను అవన్నీ నోట్ చేసుకుంటున్నాను తగిన సమయం వచ్చినప్పుడు వాటి గురించి మనం చక్కగా సత్సంగం చేసుకుందాం మరొక అద్భుతమైన సత్సంగంలో మనం అందరం కలుద్దాం శ్రీ మాత్రే నమః మీ సత్యానంది రాజు
No comments:
Post a Comment