*_శరీరంలోని 'ప్లాస్టిక్'కు చెక్ పెట్టే చింతపండు !_*
*_మన రోజువారీ వంటల్లో వాడుకునే చింతపండు గురించి ఓ అద్భుత మైన విషయం వెలుగులోకి వచ్చింది !_*
*_శరీరంలో పేరుకుపోయిన 'మైక్రో ప్లాస్టిక్' (సూక్ష్మ ప్లాస్టిక్) కణాలను బయటకు పంపడంలో చింతపండు అద్భుతంగా పనిచేస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది._*
*_కంటికి కనిపించనంత చిన్నగా ఉండే ప్లాస్టిక్ కణాలనే 'మైక్రో ప్లాస్టిక్స్' అంటారు. ఇవి మనం పీల్చే గాలి, తాగే నీరు ద్వారా శరీరంలోకి వెళ్లిపోతున్నాయి. ఇవి ఎంత డేంజర్ అంటే.. మన రక్తం, అవయవాలు, చివరికి మెదడులో కూడా పేరుకుపోతున్నాయి._*
*_వీటిని సహజంగా బయటకు పంపడం శరీరానికి చాలా కష్టం. దీనివల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి._*
*_టెక్సాస్ లోని 'టార్లెటన్ స్టేట్ యూనివర్సిటీ' పరిశోధకులు దీనిపై ఓ ప్రయోగం చేశారు. చింతపండు మరియు చింత గింజల్లో ఉండే కొన్ని సహజసిద్ధమైన సమ్మేళనాలకు (Compounds)... ఈ మైక్రో ప్లాస్టిక్స్ కణాలను బంధించి, వాటిని శరీరంలోని వ్యర్థాల ద్వారా (విసర్జన ప్రక్రియలో) బయటకు పంపే శక్తి ఉందని వారు గుర్తించారు._*
*_పరిశోధకులు కొంతమందికి చింతపండు సారాన్ని (Extract) ఇచ్చి పరీక్షించారు. అలా చింతపండు తీసుకున్న వారి శరీరంలోని వ్యర్థాల ద్వారా, చాలా ఎక్కువ మొత్తంలో మైక్రో ప్లాస్టిక్స్ బయటకు పోయినట్లు గుర్తించారు._*
*_మొత్తానికి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మనం రెగ్యులర్ గా వాడే ఈ చింతపండు.. మనకు తెలియ కుండానే శరీరంలో చేరిపోతున్న ప్లాస్టిక్ మహమ్మారికి ఓ న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుందన్నమాట !_*
No comments:
Post a Comment