Monday, March 30, 2026

 అనంగ త్రయోదశి ప్రాముఖ్యత ఏమిటి.. ఈ రోజు శివుడిని పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా!

హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి రోజును అనంగ త్రయోదశి అని అంటారు. ఈ రోజే సోమ ప్రదోష ప్రతం కూడా వచ్చింది.  అనంగ త్రయోదశి రోజు పరమేశ్వరుడిని ఆరాధిస్తారు.  ప్రేమకు,  దాంపత్య జీవితానికి ప్రతిరూపమైన పార్వతీపరమేశ్వరులను,  అలాగే మన్మధుడు, రతీదేవికి ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. వైవాహిక జీవితంలో ఆనందాన్ని,  మాధుర్యాన్ని కోరుకునే వారికి, మరీ ముఖ్యంగా ప్రేమ వివాహం సఫలం కావాలని అనుకునేవారికి ఈ రోజు చాలా ముఖ్యమైనది. అనంగ త్రయోదశి రోజు పరమేశ్వరుడని ఎలా ఆరాధించాలి? పూర్తీగా తెలుసుకుంటే..

అనంగ త్రయోదశి..

ప్రేమ,  సంయమనం,  ఆధ్యాత్మిక శక్తి.. మొదలైన అంశాల సమతుల్యలకు  ప్రతీకగా అనంగ త్రయోదశిని చెబుతారు.  పురాణాల ప్రకారం అనంగ అనే పదానికి దేహం లేనిది అని అరతం.  శివుడి ఆగ్రహానికి గురైన తర్వాత మన్మధుడు అనంగుడు అనే పేరును పొందాడు.

సాయంత్రం పూజ..

అనంగ త్రయోదశి పూజను కూడా ప్రదోష కాలంలో చేసుకుంటారు. ఈ రోజు పరమేశ్వరుడితో పాటు కామదేవుడిని, రతీదేవిని కూడా పూజిస్తారు.

విధానం..

ఈ రోజు ఉపవాసం ఉండి,  సాయంత్రం  పరమేశ్వరుడిని,  కామదేవుడిని, రతీదేవిని పూజిస్తే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.  

వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి.  అలాగే శారీరక దాంపత్యం మెరుగ్గా ఉంటుంది,  ఆధ్యాత్మిక శక్తి బలపడుతుంది. శివుడి ఆగ్రహానికి గురైన తర్వాత.. శివుడి అనుగ్రహం వల్లనే మన్మధుడైన కామదేవుడు తిరిగి పునరుజ్జీవనం పొందాడు. అందుకే ఈ రోజు పరమేశ్వరుడితో పాటు మన్మధుడిని,  రతీదేవిని కూడా పూజిస్తారు.

అనంగ త్రయోదశి జరుపుకుంటే..

అనంగ త్రయోదశి రోజు పరమేశ్వరుడిని,  మన్మధుడిని, రతీదేవిని పూజిస్తే..  వ్యక్తిత్వం ఆకట్టుకునేలా మారుతుంది.  

భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆకర్షణ, పరస్పర అవగాహన పెరుగుతాయి.  వైవాహిక సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి.

ప్రేమ విషయంలో లేదా వివాహ పరంగా ఎదురయ్యే ఆటంకాల నుండి ఉపశమనం కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ఇది చాలా మంచి ఫలితం ఇస్తుంది.

పూజ..

అనంగ త్రయోదశి రోజు సాయంత్రం శివుడిని పూజించి, ఆయనకు తెల్లని పువ్వులను సమర్పించి, 'ఓం ఉమా మహేశ్వరాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

కామదేవుడిని,  రతిని ధ్యానిస్తూ, శివలింగానికి సుగంధ ద్రవ్యాలు, చందనం, పండ్లు ,  మిఠాయిలను సమర్పించి, సుఖవంతమైన వైవాహిక జీవితం లేదా విజయవంతమైన ప్రేమ బంధం కోసం ప్రార్థించాలి.
 ఆధ్యాత్మిక సమాచారంతో పాటు astrology  సంబంధ పోస్ట్లు వస్తాయి. ఆసక్తి కలవారు జాయిన్ అవగలరు.                                                       🪷⚛️✡️🕉️https://aratt.ai/@teluguastrology

https://chat.whatsapp.com/DhZBkR4z4pB8E7asGxgjkj

https://www.facebook.com/teluguastrology

 TeluguAstrology channel  https://whatsapp.com/channel/0029Va9d4z5EquiIi18jEp12

'ఓం కామదేవాయ: విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగః ప్రచోదయాత్' అని స్పటిక జపమాలతో వీలైనంత ఎక్కువ సార్లు జపించాలి.

No comments:

Post a Comment