*_డొనాల్డ్ డక్..ఔట్_*
అనువు గాని చోట అధికులమనరాదు..
చేతులు కాలాక
శాంతి కపోతాలను పట్టుకున్నట్టు..
ఆలూ లేదు..చూలూ లేదు..
కొడుకు పేరు
గెలుపు అన్నట్టు..
ఇంట్లో ఈగల మోత..
బయట బాంబుల వాత..
ఇంట గెలిచి రచ్చ గెలువు..
ఎక్కడా లేదు గెలుపు..
అనవసర బలుపు..
ఉన్నది వాపు..
వీపుపై కురుపు..
తీరింది సలుపు..!
ట్రంపేమో శాంతి చర్చలు అన్నట్టు..
ఇరానేమో జాన్తానై
అని చెప్పినట్టు..
కుక్కకాటుకు చెప్పుదెబ్బ..
*_అణుబాంబుకు_*
*_మిస్సైల్ ఎదురుదెబ్బ..!_*
_పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమే అనుకుంటే_
_అటు నుంచి ఆగని బాంబుల మోత..!_
_కీలెరిగి వాత.._
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ..
(నిజానికి ఆదీ లేదు..
అదీ లేదు)
అందని ఆయిల్ కోసం
అర్రులు చాచుట..
అందితే ఆర్మీ క్యాంపు కుళ్ళు..
అందకపోతే
ఎవరివైనా కాళ్ళు..
చుట్టూ సవాళ్లు..
నెత్తి నుంచి దిగిన కళ్ళు..!
వైట్ హౌస్..టైట్ హౌస్..
అక్కడ పెద్దమనిషికి
నైట్ మేర్.. విత్ ఫియర్..
ఈ వార్ నిలువెల్లా షివర్..
గొప్పగా చెప్పుకున్న ఆయుధాలన్నీ
బూడిదలో పోసిన కన్నీరు..
మూర్ఖపు డొనాల్డ్
చెబితే వినడు..
బాంబులేస్తే ఏడుస్తాడు..
చివరగా..
పిట్ట పోరు..పిట్ట పోరు..
ఏ పిల్లి తీర్చేను..
ట్రంప్ కొరివితో తల గోక్కున్నట్టా..
ఉన్నదీ పోయి..
ఉంచు.. పోయినట్టు..
ఇంధనంపై కన్నేస్తే
ఉన్న ధనం హుష్ కాకి..
ప్రపంచం దృష్టిలో
ఇప్పుడు అమెరికా ఏకాకి..
విరుచుకు పడుతోంది
సర్వ జగత్తు ఎకాఎకి...!
*_సురేష్..9948546286_*
*_7995666286_*
*_సురేష్ ఎలిశెట్టి_*
9948546286
No comments:
Post a Comment