నేటి మంచిమాట.
సంతోషం ఎక్కడ దొరుకుతుంది. వస్తువులతో కూడిన సంతోషం తాత్కాలికమైనది. స్నేహితులతో, కుటుంబంతో గడపడంలో నిజమైన ఆనందం ఉంది. ప్రేమ, దయ, సహాయం చేసే గుణంలో సంతోషం ఉంది. డబ్బు కన్నా విలువైనవి, డబ్బుతో కొనలేనివి ప్రపంచంలో చాలా ఉన్నాయి. అవి ప్రేమ, స్నేహం, ఆరోగ్యం వంటివి. ఎంత ధర చెల్లిస్తామన్నా దొరకవు.
పైన చెప్పుకున్నవే కాక ప్రకృతిలో చెట్లు, పువ్వులు, కొండలు, లోయలు, నదులు, జలపాతాలు మొదలైనవి ఉన్నాయి. వాటిని చూసి సంతోషించవచ్చు. ప్రకృతితో అనుబంధం మనసుకు ప్రశాంతత ఇస్తుంది . ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆనందం కలుగుతుంది. మన దగ్గర ఉన్నది కొద్దిగా అయినా ఇతరులతో పంచుకోవడమనేది గొప్ప విషయం.
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment