Wednesday, May 27, 2026

 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

"శరీరమాద్యం ఖలు ధర్మసాధనం"
   ధర్మాన్ని ఆచరించడానికి మంచి పనులు చేయడానికి ఈ శరీరమే ప్రధాన సాధనం.

   శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అన్నది ఈ సూక్తి యొక్క పరమార్థం. అందుకే మంచి పోషకాహారంతోపాటు నిత్య వ్యాయామం / యోగ చేయాలి. సమయానికి నిద్ర, పరిశుభ్రత పాటించాలి. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. కానీ సంపాదన పేరుతో పరుగులు తీస్తూ ... పని ఒత్తిడితో ప్రశాంతత కోల్పోతున్నాం. ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం కారణంగా  చిన్నతనం నుండే అనారోగ్య సమస్యలు ఎన్నో ఎదురవు తున్నాయి. డాక్టర్లు, టెస్టులు, ఉదయం లేచింది మొదలు పడుకునేదాకా మందులతో జీవనం. పూర్వ కాలంతో పోలిస్తే జీవించే సగటు వయస్సు పెరిగినా, అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తున్నది. 
శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ధర్మం, కర్తవ్యం, సేవా కార్యక్రమం సక్రమంగా చేయగలం.
"ఆరోగ్యమే మహాభాగ్యం".

                  💐 శుభదినం 💐

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment