*_ఉన్నది ఒకటే జీవితం కదా! అందుకే మనసు చంపుకొని కాదు... మనస్పూర్తిగా జీవించు..._*
*_మనమేమి బాధలకు బంధువులము కాదు... సంతోషానికి చుట్టాలము అంతకంటే కాదు..._*
*_ఈ బాధలు... సంతోషాలు అనేవి వచ్చిపోయే చుట్టాలు లాంటివి... బాధలు ఉన్నాయని... ఆ బాధలకు బంధీవి అవ్వకు..._*
*_నీకు ఎన్ని బాధలు ఉన్నా... నీ పెదవులపై చిన్న చిరునవ్వు వస్తే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా.!_*
*_ఎంత పెద్ద కష్టమైనా సరే... నీ చిరునవ్వుని చూసి నీకు కలిగే బాధే... నిన్ను చుట్టుముట్టే కష్టమే నిన్ను చూసి అసూయ పడేలా ఉండాలి నువ్వు... అంతేకాని ఎప్పుడు ఏడుస్తూ కూర్చోకు..._*
*_ఏమి జరిగినా అన్ని మన మంచికే అనుకొని ముందడుగు వెయ్... ప్రయత్నం చేస్తూ వెళ్ళు... ఫలితం ఆశించకు... ఏది లభించిన అది దైవ ప్రసాదంగా భావించు.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌻🪷🌻 🌷🙇🌷 🌻🪷🌻
No comments:
Post a Comment