Wednesday, May 27, 2026

 *_అన్నింటి కంటే_*
              *_ధర్మము సర్వశ్రేష్టమయినది_* 

*_🏵️ ధర్మం అన్నివేళలా ఒకేలా ఉండదు. అందరికీ ఒకే రకంగా ఉండదు. ఈ ధర్మ విషయంలో గొప్ప గొప్ప మేధావులు జ్ఞానులు తబ్బిబ్బులు పడుతుంటారు._*

*_🏵️ ఉదా:- ఒక ఇంటి యజమాని తన భార్యతో సంభాషించేటపుడు భర్త ధర్మము, అదే కుమారునితో ఉన్నప్పుడు తండ్రి ధర్మము, సోదరునితో ఉన్నప్పుడు సోదర ధర్మము, కార్యాలయానికి వెళ్ళి పని చేయుచున్నప్పుడు ఉద్యోగ ధర్మము, ఇంటికి ఎవరైనా అతిథులు, పూజనీయులు, జ్ఞానులు వచ్చినప్పుడు గృహస్తాశ్రమ ధర్మము, వానప్రస్థాశ్రమం స్వీకరిస్తే వానప్రస్త ధర్మము, అలా ధర్మము అనేది దేశ కాల పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంది._*

*_🏵️ భారత యుద్దములో అశ్వద్ధామ ఉపపాండవులను నిద్ర పోతుండగా సంహరిస్తాడు. అపుడు అర్జునుడు వెళ్ళి అశ్వద్ధామను బంధించి, తీసుకొనివచ్చి ద్రౌపతికి అప్పగించినప్పుడు, తల్లి ద్రౌపతి ఏమంటుందో చూడండి, కడుపుకోతలో, పుత్రశోకము, విలవిల లాడుచున్న ద్రౌపతి, తన పుత్రశోకమునకు కారకుడైన అశ్వద్ధామను చూచి, గురుపుత్రా,విప్రోత్తమా, మీరు పాండవుల గురుపుత్రులు, పాండవులు వారి పరమ పూజ్య గురువుగారిని మీలో చూచు కొనుచున్నారు._*

*_🏵️ నాబిడ్డలు ఉపపాండవులు “ఉద్రేకంబునరారు, శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కించిత్ ద్రోమున్ సేయరు, నిద్రాసక్తుల చిన్నిపాపల సంహరింప నకటా నీచేతులెట్లాడేనో.” ఉపపాండవులు చిన్ని పాపలు, నిద్రపోవుచున్న వారిని చంపడానికి, మీకు చేతులు ఎలావచ్చాయి.. నిన్ను బంధించిన వాడు అర్జునుడని, ఆసాద్ధ్వీమ తల్లి గురుపత్ని ఎంత భయపడుచున్నారో, పుత్రశోకము, ఎలాంటిదో, ఎలా ఉంటుందో నేను అనుభవించుచున్నాను, ఆ పుత్రశోకము గురుపత్నికి కలుగకూడదని, ఆ సాద్వీమ తల్లిది ఎంత ధర్మవర్తనో చూడండి._*

*_🏵️ “ఒరులే యవి యొనరించిన నరవర, అప్రియము తనమనంబునకగు, తా నొరులకు నవి సేయకునికి పరాయణ పరమధర్మ పధములకెల్లన్.”ప్రవర్తించకుండా ఇతరులు మనపట్ల ఎలా ప్రవర్తిస్తే మనకు బాధకలుగుతుందో, అలాంటి పనులు, ప్రవర్తన, మనము ఇతరులపట్ల, చేయకుండా ఉండడము కంటే గొప్పధర్మము వేరొకటి లేదు. అని ధర్మవిషయములను వివరించి, అశ్వద్దామను తీసుకెళ్ళి గురుపత్నికి అప్పగించమని పాండవులను శ్రీ కృష్ణుని ప్రార్తిస్తుంది. చూచార అంతటిబాధలో అంతటి కడుపుకోత అనుభవించుచూ కూడా ధర్మమే మాట్లాడింది తల్లి ద్రౌపతీ అమ్మవారు._*

*_🏵️ శ్రీ రామచంద్రమూర్తి రావణాసురునితో యుద్ధము చేయునప్పుడు రావణాసురుడు బాగా అలసిపోయాడు, ఆ సమయానికి యుద్ధవిరామ సమయము కూడా కావడముతో, శ్రీ రాముడు రావణా ఈరోజువెళ్లి రేపురా అని యుద్ధ విరామము ప్రకటన చేస్తాడు శ్రీ రామచంద్రుడు. ఎందుకనగా, ఈ రాత్రికైన రావణాసురునికి జ్ఞానోదయమైతే రావణాసురుడు బ్రతికి సీతమ్మ వారిని రాములవారికి అప్పగించి, శరణార్ది నంటాడేమో అని, శ్రీరామచంద్రులవారు ఒక్క అవకాశమిచ్చాడు. అదే ధర్మము._*

*_🏵️ తన భార్యను అపహరించిన వానికి కూడా, మారడానికి, తనతప్పును తను తెలుసుకోవడానికి, అవకాశ మిచ్చి ధర్మమునకు నిలబడిన, మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి. అందు కొరకు రామాయణము, మహాభారతము, భాగవతము చదవాలి చదివించాలి, వినాలి వినిపించాలి మనపిల్లలకు మనవారసత్వ సంపదగా అందివ్వాలి. ధనము, బంగారము, భూములు సంపదలుగా ఇచ్చినా అవి వారి జీవితకాలము శాస్వితముగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. కానీ మన సంస్కృతి సంప్రదాయములు సనాతన ధర్మములు భగవద్భక్తి ఇంతవరకు ఎవరినీ పాడుచేసిన ధాకలాలు లేవు._*

*_🏵️ ఆపద్ధర్మం ఉంది చూశారూ, జీవితం నడవడం కష్టమయినప్పుడు, సత్కర్మకు దోషం కలుగకుండా, ఏ పని చేసినా దోషం లేదు. అది ధర్మ విరుద్ధం కాదు. కానీ నిరంతరం ఆపద్ధర్మాన్ని అనుసరించడం ఆశ్రయించడం కూడదు. ధర్మమార్గమున ఏది లభించినా పరమ ప్రీతితో స్వీకరించాలి._*

*_🏵️ మానవునికి నిద్రరాకపోవడానికి విదురుల వారు నాలుగు కారణములు చెప్పినారు._*
*_1.బలవంతులతో వైరం తెచ్చుకున్నా,_*
*_2.పరుల సంపదను అపహరించినా,_*
*_3.పరుల సంపదలను అపహరించాలనుకున్నా, పరుల సంపాదనను, సంపదను చూచి ఈర్ష్య చెందినా,_*
*_4.పరస్త్రీని పొందుకోరుకున్నా,_*

*_ఈ నాలుగు కారణములు తప్ప నీతి శాస్త్రములో మానవ మాత్రులకు రాత్రి యందు నిద్రపట్టక పోవడానికి వేరు కారణాలు చూపలేదు._*

*_┈┉┅━❀꧁హరిఓమ్꧂❀━┅┉┈_*    
       *_ఆధ్యాత్మికం బ్రహ్మానందం_*
🔔🕉️🔔 🙏🕉️🙏 🔔🕉️🔔

No comments:

Post a Comment