Wednesday, May 27, 2026

 *_ప్రతి మనిషి జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి... కొన్ని నవ్వొస్తాయి... కొన్ని ఏడుపొస్తాయి కానీ, కొన్ని మాత్రమే దిక్కుతోచని పరిస్థితికి తీసుకొస్తాయి..._*

*_ఇలాంటప్పుడే మనం తెలిసో తెలియకో మన అనుకొని మన పరిస్థితిని వేరొకరికి చెప్పేసుకుంటాం... చివరికి ఏమవుతుందంటే..._*

*_చెప్పుకున్న పాపానికి చెప్పుతో కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది... మన అనుకొని మనం నమ్మిన నమ్మకమే అక్కడ పెద్ద పొరపాటు..._*

*_ఆ... రోజుల్లో ఒక్క నమస్కారంతో మనిషిలోని సంస్కారాన్ని గుర్తించేవారు... ఈ రోజుల్లో ఏ మనిషిని ఎలా గుర్తించాలో తెలియడం లేదు..._*

*_కాబట్టి ఎవరో వచ్చి ఎదో చేస్తారని ఆశించడం ఆపి నువ్వు ఏమి చేద్దామనుకుంటున్నావో అది చేయి ఎవరు వచ్చి ఏమీ చెయ్యరు ఒక్క నీకు నువ్వు తప్ప..._*

*_నీ కష్టాన్ని నీ ప్రతిభని నమ్ముకో అనుకున్నది సాధించడానికి అహర్నిశలు కష్టపడడానికి ప్రయత్నించు ఈ రోజు కాకపోతే ఎదో ఒక రోజు నీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది._*

*_ఇది వదిలేసి వారికి వీరికి చెపితే నీ సమస్యలు తీరవు... సమస్య నీది, సమస్యను పరిష్కరించుకోవలసిన బాధ్యత కూడా నీదే.☝️_*

     *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌷🌷🌷 🏵️🙇🏵️ 🌷🌷🌷

No comments:

Post a Comment