దీనెమ్మ జీవితం, ఏం బతుకురా నాది" అని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా?
మనది పేద, మిడిల్ క్లాస్ కుటుంబం అయినపుడు...మన దగ్గర కుటుంబ అవసరాలకు సరిపడా డబ్బు లేనప్పుడు...
మనకు "రెక్కాడితే గానీ డొక్కాడని" పరిస్థితి ఉన్నపుడు...ఇంట్లో భార్యపిల్లల అవసరాలు తీర్చలేక ఒక్కోసారి "దీనెమ్మ జీవితం, ఏం బతుకురా నాది" అనిపిస్తుంది. బాగా డబ్బున్నోళ్లను చూసినపుడు ఒకింత ఈర్ష్య, అసూయ. కానీ ఇలాంటి జీవితంలో చావు గురించి పెద్దగా భయముండదు.పనిచేసి అలసిపోయి పడుకోగానే ప్రశాంతంగా నిద్రపడుతుంది. తెల్లవారినా ఇంకా కొంచెం సేపు పడుకోవాలని అనిపిస్తుంది. బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి సాధారణంగా ఉండవు.
నసీబు మారి.. కొన్నేళ్ల తర్వాత పుష్కలంగా డబ్బు సంపాదించి.. నాలుగు రకాల బిజినెస్సులూ, మంచి ఇల్లు, ఖరీదైన జీవితం, ఇంట్లో నలుగురు పనివాళ్ళు, లగ్జరీ కార్లు, జువెలరీ, ఓ పదీ ఇరవై రియల్ ఎస్టేట్ స్థలాలు, అపార్టుమెంట్ ఫ్లాట్లు వగైరా సమకూరిన తర్వాత...
ఇంకా బతకాలనే ఆశ.. శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతే బావుంటుందనే అత్యాశ మొదలవుతుంది. చావంటే భయం మొదలవుతుంది. "ఈ విలాసాలు, లగ్జరీలు, ఆస్తులు, భోగాలు వదిలిపెట్టి వెళ్ళిపోవాలే" అన్న బెంగ పట్టుకుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది మరింత ఎక్కువవుతుంది. ప్రశాంతంగా నిద్రపట్టదు. నిద్రమాత్రలు తప్పనిసరి. తన ఆస్తుల గురించి నిమిష నిమిషం ఆలోచనలు. ఎవడు ఎక్కడ మనల్ని మోసం చేసి దోచుకుంటాడో, ఎవడు మనకు ఎలాంటి హాని తలపెడతాడో అన్న టెన్షన్. చీమ చిటుక్కుమన్నా ఉలికిపాటు.
"ప్రపంచంలో నేను అనుభవించాల్సిన లగ్జరీలు ఏమున్నాయ్, నేను చూడాల్సినవి ఏమున్నాయ్" అనే ఆలోచనలు.
ఆలోచించి ఆలోచించి బుర్ర పాడై మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. బీపీలు షుగర్లు చుట్టాల్లాగా వచ్చేస్తాయి. కానీ మళ్ళీ వెళ్లవు.
పైకి మాత్రం అందరిముందూ డబ్బున్న మారాజులా బతుకుతున్నా.. ఏదైనా చిన్న రిస్కు తీసుకోవాలంటే భయం. లోలోపల క్షణక్షణం భయం భయం.కానీ ఒక్కటి మాత్రం నగ్నసత్యం. ఇష్టమున్నా లేకపోయినా ఒకరోజు మాత్రం ఈ లోకాన్ని వదిలి వెళ్లక తప్పదు.
అందుకే.. ఈ తాత్కాలిక ప్రపంచంలో డబ్బు అనే పదార్థమును బొత్తిగా కేర్ చేయకూడదు. అంటే.. బాగా సంపాదించకూడదని అర్థం కాదు. డబ్బే దైవంగా భావించకూడదు, పూజించకూడదు. ముందుగా నేడు మనం ఎలాంటి లైఫ్ స్టేయిల్లో బతుకుతున్నామో దాంతో సంతృప్తి చెందాలి. నిరాశ, అసంతృప్తికి చోటివ్వకూడదు. అయితే.. నిత్యం మన అభివృద్ధికి, మెరుగైన జీవితం కోసం కృషి చేస్తూనే ఉండాలి.
ఇవాళ మన దగ్గర ఎంత దుప్పటి ఉందో అంతే కాళ్ళు చాపాలి. కానీ పొడవైన, క్వాలిటీ దుప్పటి కొనడానికి బాగా ప్రయత్నించాలి, కష్టపడాలి. మన నసీబులో ఎంత సంపాదిస్తే అంత డబ్బుతో సంతృప్తి చెందాలి.
డబ్బును కాపాడుకోవాల్సిందే.. కానీ అదేపనిగా డబ్బు, ఆస్తులపై మమకారం పెంచుకోకూడదు. నిత్యం వాటి గురించే ఆలోచించకూడదు. నష్టాలొచ్చినపుడు తీవ్రంగా మధనపడిపోకూడదు. మనకు ఎంత దక్కిందో అంతవరకే మనది అన్న సంతృప్తితో ఉంటే జీవితం ఎంత హాయిగా నడుస్తుందో.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment