Tuesday, July 28, 2026

 యోగా సాధన చేయడం వల్ల ధూమపానం (స్మోకింగ్) లేదా పొగాకు అలవాటును మానేసే అవకాశాలు 50 శాతం వరకు పెరుగుతాయని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) పరిశోధకులు వెల్లడించారు. 

ఎయిమ్స్‌కు చెందిన 'సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్', 'సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్' విభాగాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన ఈ తాజా అధ్యయనం *'నికోటిన్ అండ్ టొబాకో రీసెర్చ్'* జర్నల్‌లో ప్రచురితమైంది.ఈ రీసెర్చ్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి:

*రీసెర్చ్ ముఖ్యాంశాలు50% మెరుగైన ఫలితాలు:* సాధారణ చికిత్సలతో పాటు యోగాను కూడా అలవాటు చేసుకోవడం వల్ల తక్కువ కాలంలోనే పొగాకు అలవాటును విజయవంతంగా దూరం చేసుకోవచ్చని తేలింది.
*629 మందిపై అధ్యయనం:* భారత్, అమెరికా, థాయ్‌లాండ్‌లలో జరిగిన 7 క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను (629 మంది భాగస్వాములు) పరిశోధకులు విశ్లేషించారు.
*మానసిక ఒత్తిడికి చెక్:* స్మోకింగ్ మానేసే క్రమంలో ఎదురయ్యే విత్‌డ్రాయల్ సింప్టమ్స్ అయిన ఆందోళన, తీవ్రమైన కోరిక (క్రావింగ్స్), డిప్రెషన్, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో యోగా అద్భుతంగా పనిచేస్తుంది.
*ప్రాణాయామం పాత్ర:* హఠ యోగా, విన్యాస, యోగాసనాలతో పాటు ప్రాణాయామం (శ్వాస ప్రక్రియలు) చేయడం వల్ల ప్రతికూల ఆలోచనలు తగ్గి, స్మోకింగ్ చేయాలనే కోరిక అదుపులోకి వస్తుందని గుర్తించారు.🧘🏻‍♀️

No comments:

Post a Comment