🙏🏻 *శివోహం*🙏🏻
*నువ్వు భగవంతునికి పరమ భక్తునిగా ఉన్నపుడు, సహజంగానే నీవు పూర్తిగా పాపానికి దూరంగా ఉంటావు.* *(ఎందుకంటే ఈశ్వరుడు నీవు చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు అని గ్రహించుతావు కనుక.)*
*ఒకవేళ నీ పూర్వ కర్మల వలన పాప కర్మలను చేసేందుకు పరిస్థితులు నిన్ను ఉసిరిగొల్పినా కూడా, నీవు ఎన్ని ఉపాయాలు పన్నినా కూడా ఆ పాపకర్మ జరుగనే జరుగదు.. ఆయన జరగనివ్వడు.*
*ఏదో ఒక అడ్డంకి ఏర్పరచైనా సరే దాన్ని అడ్డుకుంటాడు. నీకు ఎలాంటి దోషమూ అంటకుండా చూసుకుంటాడు.*
*నిన్ను ఏ దుష్టశక్తీ కన్నెత్తి చూడకుండా తన గణాల చేత రక్షణ ఏర్పరుస్తాడు.. తన భక్తులకు ఎన్ని అద్భుతాలు చూపిస్తాడో తెలీదు.. వాళ్ళ జీవితమే ఒక పెద్ద అద్భుతంగా మలుస్తాడు.*
*దైవాన్ని నమ్ముకుని ఉన్నవారంటే సామాన్యమా మరి.*
*ఓం నమశ్శివాయ*🔱
No comments:
Post a Comment