Secret of Real Joy 🕉️ నీతో నువ్వు ప్రేమలో పడినప్పుడు 😱 సమస్యలు మాయం #selflove
Author Name:Jagamantha Kutumbam Naadi
Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369
Youtube Video URL:https://www.youtube.com/watch?v=K7vb0iapI0U
Transcript:
(00:00) బాబా నువ్వు పుట్టినప్పుడు హాయిగా బోసి నవ్వులు నవ్వుతూ కేరింతలు కొట్టావు. రెండేళ్ల వరకు ఆనందమయ స్థితిలో గడిపావు. ఇవాళ [సంగీతం] స్ట్రెస్ తో గుండెలో ఒక మంచి ఫీలింగే లేకుండా ఒక వెలితి భావనలో ఉంటూ ఉండొచ్చు. రోజులో చాలా సమయం నువ్వు. ఈ వెలితి భావన నువ్వు మగవాడివి అయితే కాస్త ఎక్కువగా ఇంటివి అయితే కొద్దిగా తక్కువగా ఉండవచ్చు.
(00:26) మరి ఆ రోజుల్లో చంటి పిల్లల వయసులో ఎందుకు అలా ఉన్నావు? ఇవాళ ఎందుకు ఇలా ఉన్నావు? దానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయిరా మొదటి కారణం ఆ వయసులో నీకు మనసు అంటే మైండ్ అనేది ఇంకా పుట్టలేదు రెండవ కారణం రహస్యమై కారణం అదేంటంటే పొత్తిళ్లల్లో చిన్నతనంలో నీతో నువ్వు ప్రేమలో ఉన్నావ ఇవాళ నీతో నీకు అంత ఫ్రెండ్షిప్ లేదు నాన్న. విశ్రాంతిగా కూర్చొని లేదా పడుకొని కళ్ళు మూసుకొని నేను ఇప్పుడు చెప్పబోయే మాటలు విను ఓ ఆరేడు నిమిషాలే పడుతుంది.
(01:01) [సంగీతం] ఈ మాటలు నీ లోపలకు ఒక సిగ్నల్ ను పంపుతాయి. అవి నీలో లోతైన ఒక భాగాన్ని మృదువుగా తట్టి గుర్తు చేస్తాయి. మనసుతో [సంగీతం] కనుబొమ్మల మధ్య దృష్టి పెట్టి ఓ మూడవ నేత్రమా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగావు నువ్వు నీ తలకాయలో ఆ మూడవ కన్ను ఎక్కడ ఉందా అని వెతుకుతున్నావు. మూడవ కంటికి భౌతిక భాగమైన పైనియల్ గ్లాండ్ నీకు కనిపించింది.
(01:31) దానిలోంచి పట్టుల మృదువుగా పాలవంటి ద్రావం బయటకు వస్తోంది. ఆహా అది ఒక్కసారిగా గడియారంగా మారిపోయింది. నీ కళ్ళ ఎదురుగా అంత పెద్దగా 10 అడుగుల గడియారం చూసావు గడియారం అద్దంలోంచి రంగు రాళ్లుు ఇచ్చే రంగులు వస్తున్నాయి. నువ్వు ఎప్పుడూ చూడని రంగులు వర్ణించడం కష్టమైన అందం ఆ రంగులు గడియారం మీద రోమన్ అంకెలు ఉన్నాయి ఒకటి నుండి 12 వరకు గడియారం ముళ్ళు వెనక్కు తిరగడం చూస్తున్నావు నువ్వు ఇప్పుడు సమయం వెనక్కు తిరుగుతోంది వేగంగా అరే ఈ పైనియల్ గ్లాండ్ శారీరిక గడియారం అన్నమాట దీనితో సమయంలో వెనక్కు వెళ్ళవచ్చా వావ్ అనుకున్నావు సమయంలో వెనక్కు వెళ్తున్నట్లు తెలుస్తోంది నీకు
(02:16) కానీ నువ్వు నువ్వు కదలకుండానే ఎక్కడ ఉన్నావో అక్కడే ఉన్నావు గమ్మత్తు రకరకాల తలాల డైమెన్షన్స్ ఒకదానిపై ఒకటి పొరలుగా ఉండడం చూశవు. ఆ పొరల గుండా నీ జీవితం వెనక్కు వెళుతూ జరిగినవన్నీ చూస్తున్నావు వేగంగా వెంటనే నువ్వు నీ పడక గదిలో నిలబడి ఉన్నావు. నువ్వు తొమ్మిది సంవత్సరాల పిల్లాడు లేదా పిల్లగా ఉన్న సమయం అది చిన్నప్పటి నువ్వు నీ ఎదురుగా ఉన్నావు.
(02:45) అది నువ్వే చిన్న శరీరంతో పూర్తిగా ఎరుకతో నిన్ను నువ్వు చూస్తున్నావు ఎదురుగా పక్కమీద తొమ్మిది ఏళ్ల వయసులో పడుకొని ఉన్నావు అప్పుడు నీకు జ్వరం వచ్చింది మీ అమ్మ మందు వేసి బజ్జో పెట్టి బయటకు నడిచింది జ్వరం బాగా ఉంది అంటుంది ఎవరితోనో ఆమె ఆ తొమ్మిది ఏళ్ల నువ్వు కలకంటున్నావు మంచం మీద ఆ కలలో మంచం అవతల నిలబడి చూస్తున్న పెద్ద నువ్వు కనిపిస్తున్నావు చిన్న నువ్వు నిద్రలో చిరునవ్వు నవ్వావు లేతగా ఉంది ఆ నవ్వు ఆ రోజు జ్వరంలో ఎలా ఫీల్ అయ్యావో ఇప్పుడు ఆ ఫీలింగ్ నీకు ఆ బుడతడిని చూస్తుంటే మళ్ళీ తిరిగి వస్తుంది. ఏంటి ఈ సమయం యొక్క అద్భుతం అనే
(03:31) రహస్యం అని కుతూహలం పుట్టింది నీకు. నీకిప్పుడు ఎదురుగా ఒక చదరంగం బోర్డు లా కనిపించింది. మామూలుగా [సంగీతం] లేదది. 3D చెస్ బోర్డు. ఆ గడులేమో ఘనాలుగా ఒక తేనె గూడులా ఉన్నాయి. మనం మారితే మన భవిష్యత్తు ఎలా మారుతుందో అర్థంవుతుంది నీకు అది చూస్తుంటే హార్ని నాకు తొమ్మిది ఏళ్లే అయినా ఇదంతా నాకు అర్థంవుతుంది. [సంగీతం] అదే సమయంలో నువ్వు నీ పక్కన ఉన్నావు నీ పిల్ల నిన్ను నువ్వు చూస్తున్నావు.
(04:04) ఒక్కసారిగా ఛాతిలో ప్రేమ పుట్టింది. [సంగీతం] ఆ పిల్ల లేదా పిల్లవాడంటే ఈ చిన్న అవతారం భవిష్యత్తులో నువ్వుగా మారుతుంది. విస్మయంలో చిరునవ్వు పుట్టింది నీకు. తల అడ్డంగా [సంగీతం] తిప్పుతున్నావు నమ్మలేనట్లుగా అదే క్షణంలో ఆ చిన్నవాడి మీద లేదా చిన్నదాని మీద విపరీతమైన ప్రేమ పుడుతోంది. ఆప్యాయంగా చూసావు ఈ క్షణంలో పుడుతున్న ప్రేమ ఆ చిన్న ఆకారాన్ని భవిష్యత్తు అయిన నాకు ఆకర్షించుకుంటోంది.
(04:34) అదే సమయంలో నువ్వు సమయానికి అవతల ఉన్నావు అని అర్థమైంది నీకు. ఇక్కడ నువ్వే రెండు చోట్ల ఉన్నావు ఒకే సమయంలో రెండు చోట్ల కానీ సమయానికి అవతల కూడా ఉన్నావు. ఈ రెండు నాకు ఎరుకలోకి వస్తున్నాయే అనిపించింది నీకు అప్పుడు నీ తల ఎత్తి చూసావు ఎదురుగా మళ్ళీ పెద్ద గడియారం ఉంది. ముళ్ళు గుండ్రంగా కదిలిపోయాయి. అరెరే భవిష్యత్తులోకి కదిలిపోతున్నాను అనిపించింది నీకు ఇప్పుడు నీ ఎదురుగా పొడవాటి వస్త్రం [సంగీతం] ధరించి నువ్వే నడుస్తున్నావు.
(05:10) అది నీ ఇంటి బయట వెనుక వైపు భాగం కానీ దాని ముందు పచ్చటి మైదానం కనిపిస్తోంది. చల్లటి నవంబర్ మాసంలో అందమైన రాత్రి అది చెప్పులు లేకుండా నీ వెనుక నువ్వే నడుస్తూ ఒక గేటు తెరిచి ముందుకు వెళ్ళావు ఆ ఎదురుగా నడుస్తున్నవి నీ భవిష్యత్తు నువ్వు. గడ్డి మీద సమంగా పరుచుకొని ఉన్నాయి ఏమేంటో అవి ప్రిజమ్ల లాగా గడ్డకట్టిన మంచు బిందువులు. ఆ గడ్డి మీద అద్భుతమైన హరివిల్లు రంగులతో ఉన్నాయి.
(05:39) చల్లటి గడ్డి మీద నీతో పాటు నువ్వు నడుస్తూ హాయిగా ఉంది నీకు ఈ విశ్వం అంతా నేనే అనిపిస్తోంది. అంతటితో నేను లంకెలో ఉన్నాను అనుకున్నావు. కాలు నేల మీద వేస్తున్న ప్రతి అడుగు పాదానికి తగులుతున్న హాయి ఒక గౌరవం ఒక భక్తి భావంతో పడుతున్నాయి ఈ అడుగులు ఇది నీకు ఎప్పుడూ పొందనటువంటి అనుభవం అనిపిస్తోంది. ఎదురుగా ఒక చిన్న ఇసుక దిబ్బ కనిపించింది.
(06:08) ఆ సన్నటి ఇసుకలో నీకు కనిపించింది అప్పుడెప్పుడో నువ్వు స్నేహితుడితో కట్టిన ఇసుక గూడురా సంతోషం వేసింది నీకు దాన్ని చూడగానే ఆగావు ఇప్పుడు చూసుకుంటే నీకే ఆ పొడవాటి వస్త్రం ఉంది ఇప్పుడు నువ్వే నీ భవిష్యత్తు [సంగీతం] నువ్వు ఆ ఇసుకగూడు కట్టినప్పటి విషయాలు గుర్తొచ్చి నవ్వుకుంటున్నావు నువ్వు అప్పుడే ఎదురుగా ఒక మూడు అడుగుల యువతి రావడం కనిపించింది.
(06:35) మునుపెన్నడూ చూడని వింత రంగులతో వెలుగుతోంది ఆమె ఆమె వెనుక ఒక పొడవాటి మనిషి ఉన్నాడు ఆమె రక్షకుడా ఆమె గురువా ఆయన వారు ఆ ఇసుక గూడును దాటి ముందుకు వచ్చి నిలబడ్డారు నీ ఎదురుగా నీ గుండెల్లో చాలా మంచి భావన కలుగుతోంది ఆమెను చూస్తుంటే మరుక్షణం ఆమె నుండి ఏదో వచ్చి నీ ఛాతికి సుతారంగా తగిలింది. మరుక్షణం నీ మనసు శరీరం ప్రేమతో నిండిపోయింది.
(07:03) నీ గుండెలకు తగిలిన ఆ ప్రేమ ఇంతకు ముందు కంటే 1000 రెట్లు ఎక్కువ అనిపిస్తోంది నీకు పట్టలేని ప్రేమ [సంగీతం] పట్టలేని ఆనందం ఈ అనుభూతి విశ్వంలో ఎప్పుడూ ఇంకా ఇంకా ప్రేమ ఉంది [సంగీతం] ఎంత అనుభవిస్తే అంతకంటే ఇంకా ఎక్కువగా వస్తుంటుంది. అని ఆమె చెప్పినట్లు నీకు అనిపించింది. అబ్బా ఇన్నాళ్ళు ఎంత చిన్న ఆలోచనల్లో బతికానా అనిపించింది నీకు ఆమె చిరునవ్వుతో నిన్ను అలా చూస్తూనే ఉంది.
(07:35) గుండెల్లో ఏదో బలంగా మేలుకుంది నీ లోపల. తల పక్కకి తిప్పావు ఎదురుగా ఇప్పుడు నువ్వే ఉన్నావు. ఎక్కడ నీ ఇంట్లో ప్రస్తుతం ఇప్పటి నువ్వు అది. పని చేసుకుంటున్నావు అటు ఇటు తిరుగుతూ. భవిష్యత్తు నువ్వుగా నీ వర్తమాన నువ్వును చూస్తున్నావు అని అర్థమయింది. చేతులు కట్టుకొని నిలబడి చూస్తున్నావు. అక్కడ వర్తమాన నువ్వు ఏవేవో ఆలోచిస్తూ తర్కాలు చేస్తూ సమస్యలకు సమాధానాలు వెతుకుతూ ఇంట్లో పని చేసుకుంటూ తిరుగుతున్నావు.
(08:07) ఇతను లేదా ఈమె భవిష్యత్తును సరిచేసుకోవాలి అనుకోవడం నువ్వు చూస్తున్నావు. ఆ ఆకారాన్ని చూస్తుంటే నీకు అతని మీద లేదా ఆమె మీద ఎంతో ఇష్టం కలుగుతోంది. చిట్టి నాన్న ఎంత బంగారు కొండవురా నువ్వు అనుకున్నావు. ఆ నువ్వులో ఉన్న బలాలు బలహీనతలు నువ్వు చూడగలుగుతున్నావు. [సంగీతం] ఆ నువ్వులో ఉన్న నిజాయతి నీకు కనిపిస్తోంది.
(08:33) వాటి అన్నింటి మీద ఆ మనిషి మీద నీకు ప్రేమ కలుగుతోంది. చిరునవ్వుతో నిలబడిపోయావు అనురాగంతో నిలబడిపోయావు. నీ గుండె విస్తరించి విశ్వమంతా పెద్దది అయింది అనిపించింది. నీ ఇంట్లో పని చేస్తున్న నువ్వు అకస్మాత్తుగా తల [సంగీతం] ఎత్తి అటూ ఇటూ చూసావు. ఏంటి నన్ను ఎవరైనా బయట నుండి గమనిస్తున్నారా? అని చూసావు. కిటికీ [సంగీతం] తెరిచి కూడా చూసావు ఆ నువ్వు.
(09:06) ఎవరూ కనిపించలేదు. నీ గుండెలో ఇప్పుడు ఈ అనుభూతి వలన పుట్టిన ఆ భావన ఉందే దాన్ని పదిల పరుచుకోరా ఇది ఏ లాకర్లో పెట్టిన వజ్రాల కంటే కూడా అమూల్యమైనది. నీ మూడవ నేత్రం [సంగీతం] నీ పైనియల్ గ్లాండ్ చేయగల అద్భుతాలు ఈ విశ్వంలో నిండి ఉన్న ప్రేమ ఇవి అంతు లేనివిరా నిన్ను నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు. నువ్వంటే నీకు ఎంతో [సంగీతం] ఇష్టం ఆ మాట పాపం నీకు నువ్వే చెప్పుకో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది నీలో ఆ నువ్వు బాబా ఇప్పటివరకు నువ్వు విన్న మాటలు అమూల్యమైనవి పాశ్చాత్య యోగి జో డిస్పెన్జా చెప్పిన మాటల ఈ అనుభూతిని జగమంత కుటుంబం నాదిలో
(09:48) నువ్వు పొందావు మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా వచ్చి విను అలా చేస్తే నీ అంతరాత్మ నీకు బోలెడు థాంక్స్ చెప్తుంది రా కామెంట్స్ లో ఐ లవ్ మీ అని రాయి నేను చదువుతాను కొత్తగా మొదలవ్వబోతున్న మెంబర్షిప్ ఏరియాలో ఇంకా ఇటువంటి ముఖ్యమైన ధ్యానాలు ఉంటాయి అనౌన్స్మెంట్ తదుపరి వీడియోలో రాబోతోంది. నిన్ను నువ్వు ప్రేమించు సుఖంగా జీవించు జై శ్రీరామ్ జై భారత్ జై గురుదేవదత్త
No comments:
Post a Comment