రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి Thinking Of Second Marriage? Just Listen
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=pNP4UOPyxTk
Transcript:
(00:01) ఒకప్పుడండి అంటే ఒక 50 55 సంవత్సరాల క్రితం అన్నమాట రెండో వివాహం అనగానే అంత తొందరపడి [గొంతు సవరించుకోవడం] ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు కారు చాలా సీరియస్ గా ఆలోచించేవాళ్ళు బహుశా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో బలం కావచ్చు లేకపోతే ఈ సామాజిక వాతావరణంలోని నైతికత కావచ్చుండి కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ రివర్స్ అయింది. 50 తర్వాత 60 తర్వాత కూడాను రెండో వివాహం చేసుకోవడానికి ఆడ మగ ఎవరు కూడాను పెద్ద తప్పుగా భావించట్లేదు దాన్ని ఒంటరితనం వల్ల కావచ్చు లేకపోతే పిల్లలు దూరంగా ఉండటం వల్ల కావచ్చు బయట ఆహారం పడకపోవటం వల్ల కూడా కావచ్చు
(00:46) లేదు పెద్ద ఇల్లు ఉంది వర్కర్లు ఉన్నారు దాన్ని మెయింటైన్ చేయాలి అంటే ఒక విధంగా అజమాయిష లేకపోవడం వల్ల కూడా కావచ్చుండి ఇలా అనేక రకాల కారణాలు వల్ల ప్రస్తుత సమాజంలో చాలామంది రెండో వివాహం వైపుకు మొగ్గు చూపెడుతున్నారు అన్నమాట ఇదంతా కూడాను కాలలో వస్తున్న మార్పులుండి స్పీడ్ పెరిగిపోయింది కదా నిర్మహమాటంగా చెప్పాలి అంటే సెల్ఫ్ సెంటర్ కూడా అయిపోతున్నారు చాలామంది ఈ రెండో వివాహాన్ని సమాజం తప్పు పట్టట్లేదు ఇప్పుడు చాలా క్యాజువల్ గా తీసుకుంటున్నది పైపచ్చి ఏంటంటే ఆయనకి ఏం సమస్యలు ఉన్నాయో ఏమో పాపం చేసుకున్నాడు.
(01:29) చేసుకొనివ్వండి ఎందుకంటే ఆయన సుఖపడటమే కదా కావాలి లేకపోతే ఈ వయసులో ఒంటరితనంలో ఎలా ఉండిపోతాడు ఆయన అని ఒక విధంగా అటువంటి వాళ్ళని కూడాను సమర్ధించడం జరుగుతుందండి. కానీ ఈ వీడియోలోని ప్రస్తుత అంశం ఏంటంటే ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో 40 45 ఏళ్ల తర్వాత పోని 50,000 వేసుకోండి అవసరం ఏదైనా కావచ్చు లేకపోతే మనస్తత్వాలు పడకపోవచ్చు ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఉండవచ్చు అనీతికత ఏదనా ఉంది అంటే అది బయట పడి ఉండవచ్చు లేదు శారీరక మానసిక లోపాలు కూడా ఉండవచ్చుండి సో ఇటువంటి పరిస్థితుల్లో 40 45 తర్వాత
(02:15) రెండో వివాహం చేసుకుంటే అది నిలబడే అవకాశం ఉంటుందా అసలు నిలబడాలంటే ఏం చేయాలి వెరసి ఈ 40 45 తర్వాత రెండో వివాహాన్ని ఏ దృష్టికోణంలో చూడాలి ఈ విషయాలన్నీ మనం కాసేపు మాట్లాడుకుందాంఅండి అసలు ఈ విషయాన్ని నేర్చుకోవడానికి కారణం ఏంటంటే నాకు తెలిసి చాలా మంది ఈ 40 45 ఏళ్ళ వయసులో రెండో వివాహం చేసుకున్న తర్వాత ఇబ్బంది పడుతున్నట్టుగా నేను గమనించానండి.
(02:47) నాకు ఏమనిపించిందంటే కొన్ని ముందు జాగ్రత్తగా తీసుకుంటే బాగుండేది కదా అని అనిపించింది అన్నమాట. సో అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నానండి నేను చాలా విషయాలని రాసుకోవడం జరిగింది. వేరే వాళ్ళతో చర్చించడం కూడా జరిగిందన్నమాట. సో చెప్పాను కదా 40 40 తర్వాత రెండో వివాహం చేసుకుంటే అది నిలబడే అవకాశం ఉందా లేక ఈ వయసుతో వచ్చిన స్థిరత్వం కానివ్వండి లేకపోతే శారీరక అవసరాలు కానివ్వండి గత అనుభవాలు కలిసి దాన్ని మరింత సంక్లిష్టం ఏమన్నా చేస్తాయా సో ఇటువంటి ప్రశ్నలు ఎటో ఉన్నాయండి కానీ కేవలం [గొంతు సవరించుకోవడం] అవునని లేకపోతే కాదు అనే విధంగా మనం
(03:29) సమాధానం చెప్పడం కూడాను సరైనది కాదండి. అయితే ఒక వాస్తవాన్ని మటుకు మనం మర్చిపోకూడదు అది ఏంటంటే మొదటి వివాహం కంటే రెండో వివాహం ఒక ప్రత్యేకమైన సవాలని కలిగి ఉంటుందండి వాటిని ఎదుర్కోవాలిన్నమాట పాజిటివ్ యాంగిల్ లో గనుక చూసినట్లయితే వయసు పెరిగే కొద్ది మనిషి తనను తాను అర్థం చేసుకునే ప్రయాణంలో ఉంటాడు తనకి ఏం కావాలో స్పష్టంగా తెలుసుకుంటాడు కానీ ఇక్కడే ఉంది ఒక చిన్న చిక్కు అది ఏంటంటే నచ్చని విషయాల భరించే ఈ సామర్థ్యం ఉంది చూసారా అది తగ్గిపోవచ్చుండి అంటే కాంప్రమైజింగ్ ఆటిట్యూడ్ అతనికి తగ్గిపోవచ్చు.
(04:10) ఎందుకంటే స్త్రీలో పురుషుల్లో ఈ వయసులో కొన్ని భావాలు మేట వేసుకొని ఉండవచ్చుండి. ఇప్పుడు ఉదాహరణకి 25 30 ఏళ్ల వయసులో భార్య భర్తలు ఉన్నారు అనుకోండి ఒకళ మనస్తత్వాళ్ళు ఒకళ్ళకి ఒక రెండు విషయాల్లో పడలేదు అనుకోండి అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు సరే చూద్దాం అని అనుకుంటారు లేకపోతే మార్చుకునే ప్రయత్నం చేస్తారు కదా కానీ 45 ఏళ్ల వయసులో ఇది నాకు నచ్చదు నేను ఎలా జీవించలేను అని స్పష్టంగా చెప్పే అవకాశం ఉంటుందండి ఇక్కడ లౌక్యం పాలు కూడా బాగా తగ్గిపోతుంది అన్నమాట ఇవి అవతల వాళ్ళకి ఏమాత్రం కూడా
(04:56) ఇష్టం లేకపోవచ్చు వాళ్ళు కూడా నువ్వు రాగి పడకపోవచ్చుండి. ఈ ప్రమాదం కొంచెం ఉంటుంది దీన్ని కొంచెం సున్నితంగా గమనించాలి. ఎందుకంటే రెండో వివాహం చేసుకున్న తర్వాత వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలండి. కాంప్రమైజ్ మూడ్లోనే ఉండాలన్నమాట. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మొదటి వివాహంలో ఇద్దరు దాదాపు ఖాళీ పుస్తకాలతో వస్తారు కదా నింపుకోవడానికి కానీ రెండో వివాహంలో మాత్రం ఇద్దరు తమతో పాటు ఒ పెద్ద బ్యాగేజీని తెచ్చుకొస్తారండి దాంట్లో ఏముంటాయి అనేది మొట్టమొదటి ఎవరికీ తెలియదు.
(05:36) తర్వాత తర్వాత మెలమెలుగా తెలుస్తూ ఉంటుంది ఆ తెలిసేదాకా అది సస్పెన్స్ అసలు ఆ బ్యాగేజ్లో ఏముంటుంది గత వివాహం యొక్క జ్ఞాపకాలు అవమానాలు కోపాలు భయము ఆర్థిక బాధ్యతలు ఈ మాజి జీవిత భాగస్వామి యొక్క ప్రభావం లైంగిక అనుభవాలు నా జీవితంలో మళ్ళీ అలా జరగకూడదు అన్న అన్న ఒక నిర్ణయము అలాగే నచ్చిన నచ్చని విషయాలపై గట్టి అభిప్రాయాలతో కలిగి ఉండటం ఇలా అనేకం ఉంటాయండి ఆ బ్యాగేజ్లో అన్నమాట ఆ బ్యాగేజ్లో సో మెల్లిమెల్లిగా ఒక్కొకటి బయటికి వస్తూ
(06:22) ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవ్వరు కూడా అంటే రెండో వివాహానికి సంసిద్ధత చూపుతున్న స్త్రీ గాని పురుషుడు గాన బలహీనతల్ని తప్పుల్ని ఒక్కొకసారి బ్యాంక్ బ్యాలెన్స్ ని కూడాను వాళ్ళు చెప్పరండి వివాహేతర సంబంధాలు ఏమన్నా ఉన్నా కూడాను వాటి గురించి చెప్పరు. అందుకే కోర్ట్ మెన్షన్ నేను ఒక మూడు విషయాలు చెప్తున్నానండి కొంచెం మీరు సీరియస్ గా తీసుకోవాలి.
(06:54) ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ వచ్చేసింది జుడిషియల్ సపరేషన్ అయింది. విడాకుల కాయితాలు కూడా వచ్చాయి. వాటిని చూసి సమాధాన పడటం కాదండి మనం చేయాల్సింది మూడు పనులు చేయాలి. నెంబర్ వన్ ఏంటంటే ఆల్రెడీ కోర్ట్లో అటువాళ్ళు ఇటువాళ్ళు ఈ ప్లైంట్స్ కౌంటర్ బెటబిట్స్ లేకపోతే రిజాయింటర్స్ అవన్నీ వేసి ఉంటారు కదా అవన్నీ కూడాను అప్లై చేసి తీసుకోవాలండి అలాగే పోలీస్ కంప్లైంట్లో ఏమనా ఉన్నా కూడాను [గొంతు సవరించుకోవడం] అంటే క్రిమినల్ కేసులో గాని లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసులో గాని ఆ కంప్లైంట్స్ కూడా తీసుకొని చదవాలండి ఎందుకంటే కంప్లైంట్ లో ఉన్నది ఒకటి తర్వాత
(07:33) తర్వాత అవతల వాళ్ళు కౌంటర్ వేసినప్పుడు ఏవి తప్పు ఏవి ఒప్పుని వాళ్ళు కూడా చెప్పే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇవన్నీ చదివితే తప్ప ఒక కంక్లూషన్ కి మనం విధంగా రాలేం అట్లాగే రెండో విషయం ఏంటంటే తప్పనిసరిగా ఆ పేపర్స్ లో ఇద్దరి యొక్క ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి అవతలవా వాళ్ళని వ్యక్తిగతంగా కలవాలి చర్చించాలి వాస్తవాలను తెలుసుకోవాలి.
(07:57) వాళ్ళు ఏదైనా ఆర్గనైజేషన్ లో పని చేస్తున్నారు అనుకోండి వేరే వాళ్ళ ద్వారా అక్కడ తెలిసిన వాళ్ళని కూడాను వీళ్ళ ఎవరికీ తెలియకుండా కలిసి వాళ్ళ మనస్తత్వాలను వీలైనంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇకపోతే మూడో విషయం ఏంటంటే ఇంత సమాచారాన్ని రహస్యంగా సేకరించిన తర్వాత ఏమి తెలియనట్లు అన్ని విషయాలని లోపాయకారిగా డిస్కస్ చేసుకోవాలండి డిస్కస్ చేసిన తర్వాత వాటిని మీరు ఆల్రెడీ కొన్ని విషయాలు మీకు తెలిసిఉన్నాయి కదా వాటితో వేరే తెలుసుకోవాలిన్నమాట ఈ మూడు స్టెప్స్ చాలా ముఖ్యం ఈ స్టెప్స్ లో ఎక్కడ మనసు నో చెప్పినా కూడాను ముందుకు పోకూడదండి ఇది
(08:38) చాలా ముఖ్యమైన విషయం అన్నాడు ఎందుకంటే రెండో వివాహం అంటే ఇద్దరు వ్యక్తుల యొక్క వివాహం కాదండి రెండు తప్పుల గతాల కలయక కూడాను అంతే కదండి వాళ్ళ పిల్లలు గనుక ఉన్నారు అనుకోండి మరి వాళ్ళ భవిష్యత్తు గురించి కూడాను మరి విషయాలు చర్చించుకోవాలి కదా చర్చించుకొని విధమైన అభిప్రాయాలకి రావాలన్నమాట పిల్లలు ఎక్కడ ఉండాలి ఏంటి అన్నది అంటే ఇక్కడ రెండో వివాహం మొదటి వివాహానికి ఎట్టి పరిస్థితిలో కూడాను ఆటోమేటిక్గా రీప్లేస్మెంట్ కాదండి అది కొత్త జీవితం కావాలి.
(09:15) ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి మొదటి వివాహంలో నిర్లక్ష్యానికి గురి అయ్యాడు అని అనుకుందాంండి ఈ రెండో వివాహంలోకి వచ్చేసి ఇప్పుడు నా భార్య గాని లేకపోతే నా భర్త గాని నన్ను ఎంతగా ప్రేమిస్తారో చూడాలి మరి అన్న ఒక ఛాలెంజింగ్ మెంటాలిటీతో గాని లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ తో గాని లేకపోతే ప్రీకన్సీవడ్ నోషన్స్ తో గాని రాకూడదండి రాకూడదు అలా గనుక వస్తే మళ్ళీ సమస్యలు వచ్చినట్టే ఎందుకంటే అతను గాని లేకపోతే ఆమె గాని కొత్త మనిషిని వెతకంట్లేదండి పాత గాయానికి మందు వెతుకుతున్నారని అర్థం అన్నమాట ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఛాలెంజెస్ తో గనక
(09:56) వచ్చినట్లయితే అంతకుముందు జరిగినదా జరిగిపోయిందండి ఆ లోటుబాట్లని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లాగా అసలు మీరు ఏమ ఇస్తున్నారు అన్నది కదా మీకు తెలవాలి ముందు అసలు మీరు ఇచ్చి అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కదా మీరు ఏమి ఇవ్వకుండా అలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటే ఎట్లా ండి సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉందండి అది ఏంటంటే 40 45 50 తర్వాత ఒక వ్యక్తి సాధారణంగా తన స్వభావం గురించి చాలా తెలుసుకుంటాడు.
(10:27) అంతే కదా అది తప్పు కావచ్చు తప్పు కావచ్చు అది వేరే విషయం అలా అతను కొన్ని ఫిక్షన్ నోషన్స్ తో ఉంటాడండి ఉండొచ్చు ఇది ఒక రకంగా మంచిదే కానీ నేను ఇలాగే ఉంటాను నన్ను మార్చాలని ఎవరు ప్రయత్నించకూడదు అనే రిజిడిటీ [గొంతు సవరించుకోవడం] మటుకు రాకూడదండి ఇద్దరు గనుక అలా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ రెండు పొటేళ్ళు డిగ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఇప్పుడు 25 ఏళ్ల వయసులో ఇద్దరు వీలైనంత వరకు ఒకళ్ళని ఒకళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు.
(10:58) కదా ప్రయత్నించకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా మళ్ళీ రెండో వివాహానికి అవసరం పడుతుందేమో మనం చెప్పలేం కానీ 40 45 ఏళ్ళ వయసులో ఇద్దరు నన్ను మార్చే శక్తి నీకు లేదు అని ఒక విధమైన ఒక బేసిక్ మెంటాలిటీతో ఉన్నారు అనుకోండి ఎందుకంటే కొన్ని భావాలు మేటర్ వేసి పోతాయి కదా నేను మారను అట్లా అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతుంది అన్నమాట ఎందుకు చేసుకున్నాను రా రెండో మ్యారేజ్ అని అనుకునే పరిస్థితి వస్తుంది.
(11:34) ఎదైనా చెప్పండి ఒక్క విషయాన్ని మట మనం ఎస్పెంచకూడదండి అదేంటంటే 40 45 ఏళ్ల వయసులో ఇద్దరు లైంగిక ఆకర్షణలో కూడాను ఉంటారు. ఇది సృష్టిపరంగా మనం కాదనే విషయం కూడా కాదండి. సో ఇక్కడ నేను ఏమంటానఅంటే ఈ లైంగిక ఆకర్షణ రెండో వివాహానికి బలం కావచ్చు కానీ అది వివాహాన్ని నిలబెట్టడానికి పునాది కాకూడదండి అసలు పునాది కాదు కూడాను ఆ పునాది గనుక ఏదనా ఉంది అంటే అది పరస్పర గౌరవంతో ఉండటం అవసరమైనప్పుడు సర్దుకు పోవడం ఆహాన్ని పక్కన పెట్టి ఇప్పుడు పొరపాటో గ్రహపాటో మొదటి వివాహంలో తట్ట బుట్టా సర్దుకొని వెళ్ళిపోయారండి కదా అలా వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు రెండో
(12:20) వివాహ విషయంలో మటుకు సంయమనంతో సర్దుకుపోతూ ఉండాలండి అంతకంటే వేరే మార్గం లేదు రెండో మ్యారేజ్ కూడా ఫెయిల్ అయింది అనుకోండి ఇక జీవితంలో పెళ్లి కాదండి ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ లో కూడా ఫస్ట్ ఎలా బిగిన్ అవుతుంది అంటే అంటే సెకండ్ మ్యారేజ్ లో కూడా ఫస్ట్ ఫేజ్ అన్నమాట రిట్రాక్షన్ ఉంటుంది మెల్లమెల్లగా ఇంటెన్సివ్ ఉంటుంది ఆ తర్వాత అది ఎమోషనల్ బాండింగ్ గా అయితుంది అన్నమాట అది సెకండ్ స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి ఏమైపోతుంది అంటే ఒక ట్రస్ట్ గా మారాలిది తర్వాత రెస్పెక్ట్ గా మారాలి.
(12:57) దాని తర్వాత అది కంపేర్షిప్ గా మారాడండి నీకు నేను ఉన్నాను లేకపోతే నువ్వు నాకు ఉన్నావు అన్న భరోసా ఇద్దరిలో ఉండాలండి అలా గనుక ఉన్నట్లయితే వాళ్ళద్దరి మధ్య ఎమోషనల్ సెక్యూరిటీ ఉన్నట్టే సెక్యూరిటీ ఉన్నట్టే ఎందుకంటే ఎంతో నష్టపోయి కదా వాళ్ళు రెండో విపారానికి వచ్చింది విషయాన్ని కొంచెం [గొంతు సవరించుకోవడం] సీరియస్ గా తీసుకోవాలండి ఇప్పుడు మొదటి వివాహంలో శారీరక సంతృప్తి లేదు అనుకున్నాం రెండో వివాహం దొరికితే నా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకోవడం మటకు ప్రమాదకరమ ఎందుకంటే ఈ భౌతిక సుఖం అంటే మానసిక ఆనందం ఉంది చూసారా అది చాలా గొప్పది
(13:40) వ్యక్తిని గనుక మార్చితే సమస్య పోతుంది అని అనుకోవడం వరకు అజ్ఞానం అండి ఇలా గనుక ఉంటే మరిటల్ రిలేషన్స్ డైల్యూట్ అయిపోతాయి. మళ్ళీ విడాకులకు ప్రాబబిలిటీ పెరుగుతుందండి. వెస్ట్ కంట్రీస్ లో ఈ రీమ్యారేజెస్ అనేది అదిఒక పెద్ద విషయం ఏమి కాదండి చాలా క్యాజువల్ గా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. రెండు మ్యారేజ్లు, మూడు మ్యారేజ్లు, నాలుగు మ్యారేజ్లు కూడా జరిగిపోతూ ఉంటాయి.
(14:05) సో అక్కడ ఫస్ట్ మ్యారేజ్ కంటే సెకండ్ మ్యారేజ్ లోనే సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉందని అక్కడ పరిశోధనలు వెల్లడించాయండి. అంటే వీలైనంత వరకు ఈ సెకండ్ మ్యారేజ్ లో ఎవ్వరు కూడాను వారి యొక్క ఫస్ట్ మ్యారేజ్ యొక్క గతాన్ని చర్చించకుండా ఉంటే మంచిదండి. ఎన్ని కోపాలతో పాపాలకు పోయినా కూడా ఎందుకంటే కోపం పరాకాష్టకి చేరినప్పుడు కొంతమంది బలహీనతకు లోబడి నువ్వు వాడితో అలా ఉన్నావు లేకపోతే నువ్వు ఈమెతో ఎలా ఉన్నావు నీ సంగతి నాకు తెలుసులే అని గనుక అనుకున్నారు అనుకోండి ఆ వివాహం కూడా నిలబడదండి అంతే
(14:49) టేక్ ఇట్ గ్రాంటెడ్ ఒంటరితనాన్ని ఎదుగనించడానికి రెండో వివాహం చేసుకోవడం అనేది అజ్ఞానం అండి నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నాకు తోడు కావాలి కాబట్టి నేను రెండో వివాహానికి వెళ్తాను న్నాను అని మట ఎట్టి పరిస్థితులో అనుకోకూడదండి అంటే ఒంటరితనం అంటే మనుషులు లేకపోవడం కాదండి అర్థం చేసుకునే వ్యక్తి లేకపోవడం అన్నమాట అటువంటి వ్యక్తి కోసం మీరు తాపత్రయ పడాలి తాపత్రయ పడాలి సో ఇవన్నీ ఒకతే ఇంకొక విషయం ఉందండి అదేంటంటే 40 50 ఏళ్లకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే స్త్రీలో మెనోపాస్ స్టార్ట్ అవుతుంది.
(15:25) పురుషుడు కూడాను మిడ్ లైఫ్ క్రైసిస్ లో ఉంటాడు. ఈ దశలో బలాల మీద బలహీనతల మీద ఈ శారీరక అసక్తతలు ఉంటాయి చూసారా ఇవి దాడి చేస్తూ ఉంటాయండి దాడి చేస్తూ ఉంటాయి. ఈ ఈస్ట్రోజన్ [గొంతు సవరించుకోవడం] హార్మోన్స్ హెచ్ తగ్గులు వస్తూ ఉంటాయి. ఆడవాళ్ళకయతే ఈ పీరియడ్స్ లో మార్పులు వస్తూ ఉంటాయి. ఒక్కొకసారి హాట్ ఫ్లాషస్ వస్తూ ఉంటాయండి హాట్ ఫ్లాషస్ అంటే ఏం లేదండి ఉన్నట్టుండి చిరాకు పడిపోవడం అప్పటిదాకా మంచిగానే ఉంటారు సడన్ గా చిరాకులు పడిపోతూ ఉంటారు.
(15:57) ఒక్కొకసారి పెద్ద పని చేయకపోయినా కూడాను అలసట వచ్చేస్తూ ఉంటుంది. ఇరిటబిలిటీ ఉంటుంది అట్లాగే యంజైటీ ఉంటుంది ఈ డిప్రెషన్ మోడ్ కూడా ఉంటుందన్నమాట అన్నిటికంటే ముఖ్యంగా సెక్షువల్ డిజైర్స్ లో కూడా మార్పులు ఉంటాయి అంటే శృంగారంలో ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడాను ప్రపంచంఅంతా తప్పించుకోలేని విషయాలండి కొంచం సీరియస్ గా చెప్పాలి అంటే సృష్టి ఆడే ఆట అన్నమాట ఈ మెనపాస్ కానివ్వండి లేకపోతే మిడ్ లైఫ్ క్రైసిస్ కానివ్వండి నేను ఏమంటానఅంటే ఇక్కడే మానసికంగా ఇద్దరు బలపడాలి ఒకళ్ళకఒకడు నేను ఉన్నాను అన్న భరోసాని ఇవ్వాలి సింపుల్ గా గనుక చెప్పాల్సి వస్తే ఇద్దరు
(16:39) నిజయితిగా అనుకోవాలండి ఏమనింటే నేను పెళ్లి చేసుకున్నది 45 ఏళ్ల వ్యక్తి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని తప్ప 25 ఏళ్ల మనిషిని కాను అని అనుకోవాలండి చివరిగా ఒక మాట అండి ఈ 40 40 తర్వాత రెండో వివాహం అంటే [గొంతు సవరించుకోవడం] కేవలం ఇలా ఇద్దరు మనుషులు కలుసుకోవడం కాదండి ఇద్దరూ కూడా పాత జీవితాలను తీసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం అక్కడ ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదండి ముఖ్యంగా సహనం ఉండాలి శారీరక వాస్తవాల పైన అవగాహన ఉండాలి ఎమోషనల్ మెచూరిటీ గుణం కావాలండి.
(17:21) ఈ దృష్టికోణంలో గనుక రెండో వివాహానికి ముందే గనుక మానసికంగా గనక తయారయి ఉంటే మొదటి మ్యారేజ్ కంటే రెండో మ్యారేజ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకా మన చేతిలో ఉందండి అందుకంటే లేదు. సో ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదండి ఈ వీడియో. సో ఇదండి ఈ వీడియోలోని విషయం. కృతజ్ఞతలు ఈ వీడియో గనుక నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
(17:43) వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి. నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ ఇంటి పేరు పూరూరి అండి. బెల్ ఐకాన్ లైక్ బటన్ అంటారా మీరు ఇటు నొక్కుతూనే ఉన్నారు కదా మరి కొంతమందికి చెప్పి మరి వాటిని ప్రెస్ చేయించండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం వీడియో విన్నారుగా కామెంట్ బాక్స్ లో మటుకు మీదైన శైలిలో మంచి మెసేజ్ పెట్టండి.
(18:08) నన్ను విమర్శించినా పర్వాలేదు ఎందుకంటే ఆ విమర్శల వల్ల కూడాను నేను నేర్చుకునే అవకాశం ఉందండి అలా నేర్చుకుంటూ ఉన్నాను కూడాను లేకపోతే 876 వీడియోలు ఎలా చేస్తాను చెప్పండి సో ఇదండి వీడియోలో సంగతి నమస్కారం
No comments:
Post a Comment