మీ Kitchenలో దాగి ఉన్న 10 Cancer కారకాలు! ⚠️ మీరూ ఈ తప్పు చేయకండి..!
Author Name:Dr Chaithanya R
Youtube Channel Url:https://www.youtube.com/@drchaithanyaR
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Lk5Zj9UeeQ4
Transcript:
(00:00) నాకు రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చాడండి స్టమక్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. ఒక డౌట్ అడిగాడు మేడం మా ఫ్యామిలీలో స్టమక్ క్యాన్సర్ కానీ వేరే క్యాన్సర్స్ కానీ అసలు హిస్టరీ లేదు ఒక ఫోర్ జనరేషన్ నుంచి క్యాన్సర్ హిస్టరీనే లేదు. సో నాకు ఎలా క్యాన్సర్ వచ్చింది అని అడిగాడు. క్యాన్సర్ మన ఫ్యామిలీస్ లో ఉంటేనే వస్తుందని గ్యారెంటీ లేదండి రకరకాల కారణాలు ఉన్నాయి క్యాన్సర్ కి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక వీడియోలో క్యాన్సర్ గురించి ఎలా వస్తుంది ఏమి అని సో మన ఇండియన్ కిచెన్ లోనే కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి అవఏంటి
(00:30) అని ఈ వీడియోలో చెప్తున్నాను లాంగ్ వీడియో కాదు లాస్ట్ వరకు వినండి మన వంటగదిలో చేసే పొరపాట్ల వల్ల క్యాన్సర్ రావచ్చా వస్తే ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి అనేది నేను మీకు క్లుప్తంగా చెప్తాను. సో ఈ వీడియోలో మన కిచెన్ లో క్యాన్సర్ కాస్ చేసే కారణాలు కారకాలు ఐటమ్స్ గురించి చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి.
(00:51) మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ ఇది. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో నేను చెప్పే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ 100% క్యాన్సర్ కాస్ చేస్తాయని కాదు కానీ కొందర్లో క్యాన్సర్ రిస్క్ కి కారణం అవుతాయి అని అర్థం. ఫస్ట్ వన్ ఆక్రలిమైడ్. ఈ ఆక్రలిమైడ్ అనే పదార్థం ఎక్కువ ఫ్రై చేసిన పొటాటోస్ లో కానీ హై టెంపరేచర్ లో ఫుడ్స్ ని రోస్ట్ చేసినప్పుడు కానీ మాడిపోయిన మసాలా దోస అంటారు కదా అలాంటి బర్న్ట్ వి తిన్నప్పుడు అంటే ఎక్కువ కాలనీ తిన్నప్పుడు కూడా ఇది ప్రొడ్యూస్ అవుతుందండి.
(01:18) జనరల్ గా 120° పైన కాలినప్పుడు ఒక రియాక్షన్ జరిగి అక్రలిమైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో నేను చెప్పినట్లు బాగా మాడిన పరోటా కానీ లేదా డార్క్ బ్రౌన్ బాగా ఫుల్ రోస్ట్ చేసిన దోసలు గాని లేకపోతే బ్రెడ్ మాడిపోయిన బ్రెడ్ బర్న్డ్ టోస్ట్ కొన్ని బిస్కెట్స్ కొన్ని స్నాక్స్ లో కూడా ఎక్కువగా వేడికి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఈ ఫుడ్ ఐటమ్స్ ని ఈ యక్రలిమైడ్ ఫామ్ అవుతుంది.
(01:39) ఈ యక్రలిమైడ్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు గ్లైసిడమైడ్ అనే కాంపౌండ్ ఫామ్ అవుతుందన్నమాట. ఇది DNAన్ఏ లోపలికి వెళ్లి మ్యూటేషన్ కి కారణం అవుతుంది అంతే జెన్యూ మార్పు జీన్స్ చేంజ్ అవుతాయి అన్నమాట దానివల్ల కాన్సర్ వస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే బాగా మాడిన పదార్థాలు తినకండి. సమ్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు రోస్ట్ చేస్తే సరిపోతుంది డార్క్ బ్రౌన్ బ్లాక్ అయ్యే వరకు అయితే రోస్ట్ చేయకండి.
(02:01) నేను ఈ 10 కాంపౌండ్స్ చెప్తున్నాను. కారణాలు ఆల్మోస్ట్ హై రోస్ట్ వల్లే వస్తదిన్నమాట ఈ కాంపౌండ్స్ ఫార్మేషన్. సో సెకండ్ వన్ హెట్రోసైక్లిక్ అమైన్స్ అంటాం. ఇవి ఎస్పెషల్లీ ప్రోటీన్ రిచ్ మీట్ ఉంటది కదా సో ప్రోటీన్ మీట్ లో ఎక్కువ ఉంటది. సో ఇవి బాగా మార్చినప్పుడు రిలీజ్ అవుతాయి అన్నమాట. మజల్ ఉండాలి మజల్ లో ప్రోటీన్ ఉంటది కదా సో చికెన్ మజల్ కానీ ఫిష్ కానీ మటన్ కానీ ఓవర్ రోస్ట్ చేసినప్పుడు బ్లాక్ గా అయినప్పుడు ఇవి రిలీజ్ అవుతాయి.
(02:26) అది డీప్ ఫ్రై కావచ్చు గ్రిల్ కావచ్చు తందూరి కావచ్చు నేను అవన్నీ బ్యాడ్ అనట్లేదు మరీ నల్లగా మాడితే ఇవి ఫామ్ అయితాయి సో అవి మాడకుండా చూసుకోవాలి. ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే మరీ ఓవర్ రోస్ట్ చేయకుండా చూసుకొని తినాల్సి వస్తుంది. నెక్స్ట్ పాలసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఇది థర్డ్ కాంపౌండ్ కాన్సర్ కాసింగ్ ఇవి మీట్ కానీ లేదా వేరే కొవ్వు పదార్థాలు ఏవైనా కానీ డైరెక్ట్ ఫ్లేమ్ లో కాలుస్తుంటారు కదా గ్యాస్ ఫ్లేమ్ కానీ లేదా కట్లపోయి కూడా పర్వాలేదు డైరెక్ట్ ఫ్లేమ్ లో కాల్చినప్పుడు రిలీజ్ అవుతాయి అన్నమాట సో ఈ కోల్ మీద అంటే బొగ్గుల మీద
(02:57) డైరెక్ట్ గా చికెన్ కాలుస్తుంటారు ఆ నల్లగా వాటి మీద డిపాజిట్ అవుతుంది కదా ఎక్కువ మాడి సో దాని వల్ల కూడా వస్తుందన్నమాట ఇది కూడా మీ Dఎన్ఏ లోపలికి వెళ్లి చేంజెస్ కాస్ చేస్తుంది. ఫోర్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ రిపీటింగ్ కుకింగ్ ఆయిల్ అంటే ఏం చేస్తారు మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారన్నమాట కుకింగ్ ఆయిల్. మల్టిపుల్ టైమ్స్ అది ఎక్కువ బాయిల్ [గొంతు సవరించుకోవడం] అవ్వడం వల్ల పోలార్ కాంపౌండ్స్ అని ఆక్సిడైజ్డ్ ఫ్యాట్స్, ఆల్డిహైడ్స్ రకరకాల పాలిమర్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి.
(03:24) ఇవి కూడా క్యాన్సర్ ని కాస్ చేస్తాయి. DNAన్ఏ లెవెల్ కి వెళ్లి అంటే మీ జీన్స్ లెవెల్ కి వెళ్లి మ్యూటేషన్ కాస్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ ఆఫ్లోటాక్సిన్స్. ఇవేంటంటే ఫంగస్ ఆస్పర్జిల్లస్ అనే ఒక ఫంగస్ బూజు లాంటి పదార్థం రిలీజ్ చేసే విష పదార్థాలు ఎస్పెషల్లీ ఈ ఫంగస్ చనికాయలు మొక్కజొన్న మిల్లెట్స్ ఎక్కువ కాలం స్టోర్ చేసిన రైస్ లేదా గోధుమలు లేదా కొన్ని పప్పు దినుసులు సంవత్సరాల కొద్ది స్టోర్ చేసినప్పుడు ఈ ఫంగస్ వాటి మీద ఫామ్ అవుతుంది అన్నమాట.
(03:53) [గొంతు సవరించుకోవడం] ఇది ఆప్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో వీటిని సరిగ్గా స్టోరేజ్ చేయనప్పుడు ఏమవుతుందంటే కొంచెం తడి ఎక్కువందితుంది హ్యుమిడిటీ లెవెల్స్ ఎక్కువైనప్పుడు దాని మీద ఈ ఫంగస్ ఫామ్ అవుతుంది. ఇది రిలీజ్ చేసే టాక్సిన్ే ఆఫ్లోటాక్సిన్ ఇది డైరెక్ట్ గా లివర్ క్యాన్సర్ కి కారణం అవుతుంది.
(04:10) ఈ ఆఫ్లోటాక్సిన్పి 53 అనే ఒక జీన్ ని పోయి మ్యూటేట్ చేస్తుంది. సో లివర్ క్యాన్సర్ రావచ్చన్నమాట. నెక్స్ట్ కాంపౌండ్ నైట్రోజ అమైన్స్ ఇవి మోస్ట్లీ ప్రిజర్వ్డ్ మీట్ కాండ్ ఫుడ్ కానీ సాసెస్ కానీ ఈ చికెన్ నగ్గెట్స్ ప్రిజర్వ్డ్ ఉంటాయి ప్యాక్డ్ ఫుడ్ అన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన వాటిలో తిన్నప్పుడు వీటిలో ఉండే నైట్రేట్స్ బాడీలోకి వెళ్లి అమైన్ అనే ఇంకొక కాంపౌండ్ తో కలిసినప్పుడు నైట్రోజ అమైన్స్ ఫామ్ అవుతాయి.
(04:37) ఇవే క్యాన్సర్ కాసింగ్ అన్నమాట. సో ఈ నైట్రోజ అమైన్స్ DNAన్ఏ లెవెల్ కి వెళ్లి DNAన్ఏ ఆల్కైలేషన్ కాస్ చేసి మ్యూటేషన్ ద్వారా క్యాన్సర్ ని కాస్ చేస్తాయి. సో ప్యాక్డ్ అండ్ క్యాండ్ ఫుడ్స్ అందుకే ఎక్కువ వాడద్దంట. ఇప్పుడు నేను చెప్తున్న లిస్ట్ ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుందని కాదు ఈ వాడితే కానీ ఇవి రిస్క్ ఫాక్టర్స్ ఆల్రెడీ రీసెర్చ్ చేసి కనుక్కొని ఇవి క్యాన్సర్ కాజంగ్ అని ఆల్రెడీ ప్రూవ్ అయింది.
(04:58) సో అందరికీ వస్తుందని కాదు కానీ మనం జాగ్రత్త పడడం మన బాధ్యత. నెక్స్ట్ రెడ్ మీట్ ఎక్కువగా తినడం రెడ్ మీట్ అంటే బీఫ్ కానీ మటన్ కానీ ఫోర్క్ కానీ ఇవి ఎక్కువగా తిన్న వారికి సో మనకు కాదు కానీ వెస్టర్న్ కంట్రీస్ లో ఇవి స్టేబుల్ ఫుడ్ రోజు వాళ్ళు బీఫ్ తింటుంటారు. సో అలాంటి క్యాండ్ ప్రాసెస్ ఫుడ్స్ తింటుంటారు. అలాంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది.
(05:17) ఎస్పెషల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్స్. ఇంకొకటి ఆర్సనిక్ ఇన్ఆర్గానిక్ ఆర్సెనిక్. సో ఈ ఆర్సనిక్ ఏంటంటే మన గ్రౌండ్ వాటర్ లో కొన్ని ఏరియాస్ లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే బోర్ వాటర్ లో కొన్ని ఏరియాస్ లో ఆర్సెనిక్ ఉందని కనిపెట్టారు. సో ఈ ఆర్సెనిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ రైస్ పండిస్తారు కదా ఈ రైస్ పండించినప్పుడు అది అబ్సర్బ్ చేసుకుంటుంది అన్నమాట.
(05:35) సో ఇది కూడా క్యాన్సర్ కాజంగ్ అని తెలిసింది. ఒక్కొక్కసారి మామూలు రైస్ వండడం కూడా బోర్ వాటర్ తో వండుతుంటారు. సో ఈ ఆర్సెనిక్ ఉన్న వాటర్ తో కుకింగ్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే ఇది క్రోమోసోమల్ అబ్నార్మలిటీ dఎన్ఏ చేంజ్ చేయడం ఇలాంటివి చేయొచ్చు అన్నమాట. క్యాన్సర్ కాసింగ్ కావచ్చు. మీరు వాడుతున్న డ్రింకింగ్ వాటర్ ని టెస్ట్ చేయగలిగితే బెస్ట్.
(05:54) ఇంకొకటి ఏమంటే మనం మామూలుగా కుక్కర్ లో వాడుతుంటాం అలా కాకుండా నీరు వడపోసినట్టయితే అంటే రైస్ కుకింగ్ చేసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇంటెన్సిటీ తగ్గొచ్చు అలాంటి ఏరియాస్ లో ఉన్నవారికి చెప్తున్నాను. సో ఒక కప్పు రైస్ కి ఆరు కప్పుల నీళ్లు వేసి బాగా ఉడికిన తర్వాత గెంజి వంచేస్తాం కదండీ అలా చేస్తే కూడా మనకి ఇలాంటి కెమికల్ కాంటామినేషన్ ఉంటే కొంచెం వరకు సేవ్ అవుతాం.
(06:16) ప్లస్ వాటర్ టెస్టింగ్ చేసుకోవాలి. ఈ ఆర్ఓ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు కదా సో వాటర్ ఫిల్టర్స్ వాళ్ళ దగ్గర కూడా టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో అలా కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఫ్యూరాన్ కాంపౌండ్స్ నెక్స్ట్ వన్ ఈ ఫ్యూరాన్ కాంపౌండ్స్ అన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది ప్యాక్డ్ ఫుడ్స్ క్యాండ్ ఫుడ్స్ ప్రిజర్వేటివ్స్ లో ఉంటాయి.
(06:32) హీట్ స్టెరిలైజ్డ్ బేబీ ఫుడ్స్ లో కూడా ఉంటాయన్నమాట రెడీమేడ్ వి జాగ్రత్త [గొంతు సవరించుకోవడం] అప్పటికప్పుడు చేసుకొని వాడడం బెస్ట్ క్యాండ్ సీల్డ్ కొందరైతే సీల్డ్ ఫుడ్ బాయిలింగ్ వాటర్ వేసి ఇప్పుడు కప్ నూడిల్స్ అని వచ్చాయి కదా సో ఇవన్నీ కొంచెం కారణాలు అనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఇన్ఫాంట్ ఫుడ్ అంటే బేబీస్ కి ఇస్తూఉంటారు కదా ఫుడ్ అది ఎప్పుడూ మీరు ఆ ప్యాక్డ్ సీరియల్ మీదే డిపెండ్ అవ్వకండి.
(06:52) అప్పుడప్పుడు ఇవ్వండి కానీ వెరిఫై చేసుకొని ఆర్గానిక్ నాచురల్లా చూసుకోండి ఇంట్లో చేసుకుంటే బెస్ట్ ఆల్కహాల్ అసిటాల్డిహైడ్ ఈ ఆల్కహాల్ లో ఇథనాల్ అనే కాంపౌండ్ ఉంటుంది అది బాడీలోకి వెళ్ళినప్పుడు అసిటాల్డిహైడ్ గా ఫామ్ అవుతుంది. సో ఆల్కహాల్ అధికంగా తీసుకున్న అంటే మందు ఎక్కువగా తాగిన వైన్ హార్ట్ కి మంచిది అని తాగడం ఇలాంటివన్నీ ఇప్పుడు లేవండి వైన్ ఇస్ ఆల్సో హామ్ఫుల్ బీర్ ఇస్ ఆల్సో హామ్ఫుల్.
(07:15) అన్ని టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ హామ్ఫుల్ే శృతికి మించితే క్యాన్సర్ కాస్ చేయొచ్చు. కొంతమంది ఆల్కహాల్ కుకింగ్ లో కూడా యూస్ చేస్తుంటారు ఈ బిర్యానీస్ లో కానీ కేక్స్ లో కానీ అది కూడా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ నేను ఇప్పుడు చెప్పిన 10 లిస్ట్ ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఈ వీడియోలో 10 చెప్పాను. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన జీన్స్ దగ్గరికి వెళ్లి అంటే dఎన్ఏ దగ్గరికి వెళ్లి దాన్ని మ్యూటేషన్ చేస్తాయి అన్నమాట కోడింగ్ ని చేంజ్ చేస్తాయి.
(07:38) అంతేకాకుండా మనకి dఎన్ఏ డామేజ్ నాచురల్ గానే జరిగినప్పుడు నాచురల్ రిపేర్ జరుగుతూ ఉంటుంది బాడీలో ఆ రిపేర్ ని మధ్యలో ఇంటర్ఫియర్ చేస్తాయి స్టాప్ చేస్తాయి. సో నేను చెప్పిన వాటిలో కామన్ ఏం కనిపిస్తుంది మీకు మోస్ట్లీ హై ఫ్లేమ్ లో హై హీట్ లో కుక్ చేసే ఫుడ్స్ నల్లగా మాడే వరకు కుక్ చేయకూడదు. సో ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్ వెంటిలేటెడ్ కిచెన్స్ ఉంటాయ అంటే గాలి ఆడకుండా ఉండే కిచెన్స్ లో కొంచెం గాలి వెలుతురు వచ్చేటట్లు చూసుకోండి ఎయిర్ సర్క్యులేషన్ ఇంపార్టెంట్.
(08:04) సో ఎక్కువ బొగ్గుల మీద ఫుడ్ వండుకోవడం డైరెక్ట్ గా కోల్ మీద వండుకోవడం ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్. మీ కిచెన్ చిమ్నీ అంటే వెంటిలేటర్ ఉంటది కదా దాన్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం పిల్లల్ని దూరంగా ఉంచండి ఆ స్మోక్ ఎక్స్పోజర్ కూడా హామ్ఫుల్. సో ఈ వీడియోలో మన కిచెన్ లో ఉన్న కార్సినోజన్స్ గురించి చెప్పాను.
(08:21) నెక్స్ట్ వీడియోలో టాప్ 10 క్యాన్సర్స్ ఇన్ ఇండియా మన ఇండియాలో ఏ క్యాన్సర్స్ కామన్ ఎందుకు వరల్డ్ లో ఏ క్యాన్సర్స్ కామన్ అక్కడికి ఇక్కడికి ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అనే టాపిక్ మీద డిస్కస్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ వెల్ విషెస్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి.
(08:39) ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్ రాబోతున్నాయి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నమస్తే [గొంతు సవరించుకోవడం] డాక్టర్ చైతన్య
No comments:
Post a Comment