Monday, September 7, 2026

ప్రతిదాన్ని కంట్రోల్ చేయడం ఆపేయ్ | Stop Controlling Every Moment | Satyagrahi

ప్రతిదాన్ని కంట్రోల్ చేయడం ఆపేయ్ | Stop Controlling Every Moment | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9SwpVWTPsCc



Transcript:
(00:04) [సంగీతం] మీకు తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జైలు ఏంటో నాలుగు గోడలు ఉన్నది కాదు మీ తలకాయ లోపల మీరు కట్టుకున్న ఒక భ్రమ నా జీవితాన్ని పూర్తిగా నేనే కంట్రోల్ చేస్తున్నాను అనే ఒక భ్రమ ఒకసారి గుండె మీద చేయేసుకొని నిజాయితిగా ఆలోచించండి రోజుకి 14 గంటలు గుడ్డులా కష్టపడుతున్నారు. రాత్రి నిద్ర కూడా పోకుండా రేపటి గురించి ప్లాన్లు గీసుకుంటున్నారు.
(00:29) అందరి ముందు ఒక పర్ఫెక్ట్ లైఫ్ మెయింటైన్ చేయాలని నలిగిపోతున్నారు. కానీ అర్ధరాత్రి కళ్ళు మూసుకుంటే లోపల ఏదో తెలియని బాధ లోపల ఏదో తెలియని భయం చేతి నుంచి అంతా చేజారిపోతుందేమో అని ఒక ఇన్సెక్యూరిటీ అసలు ఎందుకు వస్తుంది? ఈ అశాంతి మీరు తక్కువ కష్టపడుతున్నారా? కాదు మీరు ప్రతి చిన్న విషయాన్ని పిచ్చివాడిలా కంట్రోల్ చేయాలని చూస్తున్నారు కాబట్టి నిజం ఏంటంటే మనం చేతిలో గుప్పెడి ఇసుకను తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడైనా గమనించారా? ఆ ఇసుకను మనం ఎంత గట్టిగా పిడికిలి బిగించి పట్టుకోవాలని చూస్తే వేళ్ళ సందులోనుంచి అది అంత వేగంగా కిందికి జారిపోతుంది. జీవితం కూడా సరిగ్గా అంతే
(01:07) కానీ ఈ సొసైటీ మన నెత్తి మీద ఒక చెత్త ఆలోచనని రుద్దింది. నువ్వు ఎంత ఎక్కువ కంట్రోల్ చేస్తే అంత పెద్ద సక్సెస్ అవుతావు అని అదే మనల్ని నిలువున మింగేస్తున్న అతి పెద్ద ట్రాప్. ఆఫీస్ లో పని దగ్గర నుంచి పక్కనున్న మనుషుల మైండ్సెట్ వరకు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి రేపటి భవిష్యత్తు వరకు అన్ని మీ రిమోట్ కంట్రోల్ తోనే నడవాలనుకుంటే ఎలా సాధ్యం చెప్పండి మీరు దేవుళ్ళు కాదు కదా కేవలం ఈ అనంతమైన విశ్వంలో ఒక చిన్న రేణువు మాత్రమే ఈ పిచ్చి నియంత్రణ గురించి ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు నీమ్ కరోలి బాబాగారు. ఒకసారి ఆయన దగ్గరికి ఒకతను
(01:42) వచ్చి ఏడుస్తూ కూర్చున్నాడంట బాబా నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది నేను ఎలా బ్రతకాలి అని అప్పుడు బాబాగారు నవ్వి ఒకే మాట అన్నారు. అసలు జీవితం నీ చేతుల్లో ఉందని నీకు ఎవరు చెప్పారు ఈ సృష్టిలో జరిగేది నీ అహంకారం వల్ల కాదు విశ్వం నడిపించే ఒక క్రమం వల్ల నీమ్ కరోలీ బాబాగారి మాటల్లో ఎంత లోతైన తత్వం ఉందో చూడండి.
(02:06) మనం మన ప్లాన్లు మన టైం టేబుల్స్ మన ఈగోలను పట్టుకొని వేలాడుతూ ఉంటాం. మనుషులు మన మాట వినకపోతే కుమిలిపోతాం. అనుకున్న టైం కి పని జరగకపోతే పిచ్చెక్కిపోతాం. ఈ హైపర్ కంట్రోల్ అనే జబ్బు మిమ్మల్ని నిశశబ్దంగా నాశనం చేస్తుంది. మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎదురుగా వచ్చే మనుషుల్ని ఒక్కసారి పరిశీలించండి. ప్రతి ఒక్కరి ముఖంలో ఏదో తెలియని గాబర ఫోన్ వైపు చూస్తూ వేగంగా అడుగులు వేస్తుంటారు.
(02:31) వాళ్ళు కేవలం నడవడం లేదు. తమ మనసులోని భయాలతో యుద్ధం చేస్తున్నారు. ఈ జనరేషన్ యువతులో కనిపించే అతి పెద్ద విషాదం ఏంటో తెలుసా? లైఫ్ లో ఒకచోట ప్రశాంతంగా కూర్చోవడాన్ని ఒక నేరంలా ఫీల్ అవుతున్నారు. ఏ పని లేకుండా 10 నిమిషాలు ఖాళీగా ఉంటే వెంటనే గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. నేనేదో కోల్పోతున్నాను. నా పక్కవాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అనే ఒక అంతు లేని పోలిక అన్నమాట.
(02:57) ఈ విషపూరితమైన పరుగులో పడి మీరు మీ శ్వాసను కూడా గమనించడం మర్చిపోయారు. మీ శరీరం అలసిపోయి కుప్పకూలిపోతుంది. మీ మెదడు మాత్రం ఇంకా ప్లానింగ్ చేస్తూనే ఉంటుంది. ఎందుకు ఈ నియంత్రణ పోతే మీరు జీరో అయిపోతారన్న భయం వల్ల ఈ మాయని నీమ్ కరోలి బాబా గారు చాలా సులువుగా విప్పి చెప్పారు. ఆయన దగ్గరికి ఓ పెద్ద సంపన్నుడు వచ్చి బాబా నేను నా బిజినెస్ ని నా కుటుంబాన్ని నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంతో భద్రంగా కాపాడుతున్నాను.
(03:24) కాకపోతే నా మనసులో ఎప్పుడు ఒక భయం ఉంటుంది. ఏంటి ఆ భయము అని చెప్పేసి అడిగాడు. అప్పుడు బాబాగారు ఆయన వైపు చూసి నవ్వి నువ్వు కాపాడటానికి అసలు ఇక్కడ నీది ఏముంది నీ శ్వాస కూడా నీ సొంతం కాదు ఒకసారి గాలి పీల్చుకొని మళ్ళీ వదలకపోతే నువ్వే శవమైపోతావు అలాంటిది ఈ ప్రపంచాన్ని నువ్వు కాపాడుతున్నావా అన్నారు. ఆ మాట ఎంత పెద్ద చాచి పెట్టిన చెంప పెట్టు అర్థం చేసుకోండి.
(03:51) మనం మన అహంకారంతో ఒక పెద్ద కోట కట్టుకుంటున్నాం. ఆ కోటకి మనమే కాపలాదారులం అయిపోయి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం. మనం ప్రతి పరిస్థితిని పట్టుకొని లాగుతున్నాం. అతిగా లాగితే తీగైనా తెగిపోతుంది. బంధాలైనా విరిగిపోతాయి. మెదడైనా మొద్దు బారిపోతుంది. మీరు ఆలోచించండి గడిచిన ఐదేళ్లలో మీరు ఎన్నో ఆందోళనలు పడ్డారు. ఆ పరీక్ష పాస్ కాకపోతే నా బ్రతుకు వేస్ట్ ఆ ఉద్యోగం రాకపోతే నేను రోడ్డును పడతాను.
(04:14) ఆ మనిషి నన్ను వదిలేస్తే నేను బ్రతకలేను. ఇలా ఎన్నో భయాలతో మీ రక్తాన్ని కాల్చుకున్నారు. మరి ఈరోజు ఏమయ్యారు బ్రతికే ఉన్నారు కదా ఆ రోజు మీరు పడిన టెన్షన్ వల్ల పరిస్థితులు మారాయా లేదు కదా సమయానికి జరగాల్సినది కాలం తన దారిని తాను జరుపుకుంటూ వెళ్ళిపోయింది. కానీ మధ్యలో మీరు పోగొట్టుకునేది మీ మనశశాంతి మాత్రమే. మీ రక్తం, మీ నవ్వు, మీ నిద్ర మీరు నదిలో ప్రవహిస్తూ పొడవులో కూర్చొని నది నీళ్ళని మీ చేతులతో వెనక్కి నట్టాలని చూస్తున్నారు.
(04:45) ఎంత తెలివి తక్కువతనం ఇది సరే ఇదంతా బాగానే ఉంది. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఈ నియంత్రణ పిచ్చి ఈ మానసిక రోగం అసలు లోపల ఎక్కడ మొదలవుతుందో తెలుసా? సరిగ్గా మీ ఈగో అనే చిన్న గదిలో ఈగో అంటే గర్వం మాత్రమే కాదు. నేను లేకపోతే నా ప్రపంచం ఆగిపోతుంది అనే ఒక అంధకారం మీరు ఆఫీస్ లో లేకపోతే ప్రాజెక్ట్ నడవదు అనుకుంటారు. మీరు మాట్లాడకపోతే ఇంట్లో బంధాలు కుమిలిపోతాయి అనుకుంటారు.
(05:10) మీరు రాత్రింబవళ్ళు ఆలోచించకపోతే రేపటి రోజు గడవదు అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే మీరు రేపు పొద్దున చనిపోయినా సరే మహా అయితే నాలుగు రోజులు ఏడుస్తారు. ఐదో రోజుకి ప్రపంచం యదావిధిగా తిరుగుతుంది. సూర్యుడు మీ అనుమతి తీసుకొని ఉదయించట్లేదు. చెట్లు మీ పర్మిషన్తో పచ్చగా మారట్లేదు. ఈ నేల మీద కోట్ల మంది వచ్చి వెళ్ళిపోయారు.
(05:33) ఎవరి వల్ల భూమి తిరగడం ఆగలేదు. మరి అంతా మీరే నడిపిస్తున్నామ అన్న భ్రమ మీకు ఎందుకు వచ్చింది? నీమ్ కరోలి బాబా గారు ఒక మాట తరచూ చెప్పేవారు. మనిషి చేతిలో కేవలం పాత్ర మాత్రమే ఉంటుంది. అందులో పోసే అమృతం ప్రకృతి చేతిలో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం ఆ పాత్ర మనమే చేశం అమృతాన్ని మనమే సృష్టించాలి అని చెప్పేసి పిచ్చి పట్టినట్లు వెతుకుతూ ఉన్నాం.
(05:56) ఈ సమాజం మనకి చిన్నప్పటి నుంచి ఒక కంపారిజన్ నేర్పింది. పక్కింటోడితో పోటీ క్లాస్మేట్ తో పరుగు సోషల్ మీడియాలో కనిపించే నకిలి నవ్వులతో రేసు ఈ పరుగులో పడి లోపల ఏదో కొరత ఉందనే భావన మెదడులో గూడు కట్టుకుపోయింది. ఆ వెలితిని పూడుచుకోవడానికే మనం మనుషుల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాం. డబ్బుని గుప్పెట్లో బిగించాలనుకుంటున్నాం. పరిస్థితులను మన కాళ్ళ కింద ఉంచాలనుకుంటాం.
(06:22) ఈ అహంకారాన్ని నింకరోలి బాబాగారు ఒక అద్భుతమైన ఉపమానంతో తుడిచి పెట్టేశారు. బావిలో ఉన్న బకెట్ ని తాడుతో లాగుతున్నప్పుడు అది నీళ్ళతో నిండి ఉంటే ఎంత బరువుగా అనిపిస్తుంది. కానీ అదే బకెట్ ని బావిలోని నీటి లోపల ఉంచినప్పుడు తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే అది నీటితో కలిసిపోయింది. మనిషి కూడా విశ్వంతో కలిసి బతికినంత కాలం జీవితం తేలిగ్గా ఉంటుంది.
(06:44) నేను వేరు నా ప్రపంచం వేరు అని చెప్పేసి బకెట్ ని పైకి లాగాలని చూస్తే చేతులు తెగిపోతాయి నడుము విరిగిపోతుంది. మనం చేస్తున్న పని సరిగ్గా అదే మనం ప్రకృతి ప్రవాహం నుంచి విడిపోయి ఒంటరిగా అంతా మోయాలని భుజాల మీద పెట్టుకుంటున్నాం. ఆ బరువుకి ఎముకలు విరుగుతున్నాయి. గుండె పగిలిపోతుంది. ఈగోని నెత్తి మీద పెట్టుకొని తిరిగితే దక్కేది ప్రశాంతత కాదు.
(07:08) మనకు దక్కేది కేవలం డిప్రెషన్ మాత్రమే. మీ మైండ్ లో ఎప్పుడూ రన్ అయ్యే ఇంకో పెద్ద రాంగ్ క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా నేను జాగ్రత్తగా ఉంటే నా జీవితంలో ఏ తప్పు జరగదు అనుకోవటం. ఇది పిరికితనం నుంచి పుట్టిన నియంత్రణ. భవిష్యత్తు గురించి భయం ఎక్కడ ఆస్తులు పోతాయో ఎక్కడ ప్రేమించిన వాళ్ళు దూరమవుతారో ఎక్కడ సమాజంలో పరువు పోతుందో అని ప్రతి అడుగులోనూ అనుమానంతో బ్రతుకుతున్నారు.
(07:30) ఈ భయమే మిమ్మల్ని మైక్రో మేనేజర్ గా మారుస్తుంది. మీ భార్యనో భర్తనో పిల్లల్నో ఫ్రెండ్స్ నో వాళ్ళు మీ ఆలోచనల గిరిగీసిన అందులోనే నడవాలి అనుకుంటున్నారు. వాళ్ళు కాస్త పక్కకు జరిగితే చాలు అభద్రత భావం మీ మెడ నొక్కేస్తుంది. బాధ ఏంటంటే ఎవరినైతే మీరు గట్టిగా పట్టుకోవాలని చూస్తున్నారో వాళ్లే మీ నియంత్రణ తట్టుకోలేక మీ నుంచి పారిపోతున్నారు.
(07:55) నీమ్ కరోలి బాబాగారు ఒక విదేశీ భక్తుడితో అన్న మాటలు గుర్తెచ్చుకోండి. ఆ భక్తుడు భారతదేశం వచ్చి బాబాగారి దగ్గర కూర్చొని ఎప్పుడు తన దేశం గురించి అక్కడ వదిలేసిన ఆస్తుల గురించి కంగారుపడుతూ ఉండేవాడు. బాబాగారు అతన్ని చూసి నవ్వి నువ్వు ఇక్కడ కూర్చొని అక్కడ జరుగుతున్న దాన్ని మార్చగలవా అని అడిగారు. అతను లేదు అన్నాడు. మరి ఇక్కడ కూర్చొని దాన్ని తలుచుకొని ఎందుకు ఏడుస్తున్నావు అది ఎప్పుడు ఎలా జరగాలో అది అప్పుడు అలాగే జరుగుతుంది.
(08:20) నువ్వు భయపడినా ఆగదు గేంతి దూకిన ఆగదు. బాబాగారి మాటల్లో ఒక క్రూరమైన కానీ ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే నిజం ఉంది. మనం భయపడి ప్లాన్ చేసినంత మాత్రాన కాలం మన మాటకి తలంచదు. తుఫాను వచ్చినప్పుడు గడ్డి పరక నేలకి వంగుతుంది. బతికిపోతుంది. గట్టిగా నిలబడతాను అని మొండిగా ఎదురొడ్డిన మహా వృక్షం మూలాలతో సహా కూలిపోతుంది. మీరు కూడా ఆ వృక్షం లాగే మొండిగా మారారు.
(08:47) జీవితం మీ వైపు ఒక మార్పును రుద్దినప్పుడు మీరు దాన్ని అంగీకరించరు, ఎదిరిస్తారు, గింజుకుంటారు, అరుస్తారు, నాకే ఎందుకు ఇలా జరిగింది, నా ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయింది అని గుండెలు బాదుకుంటారు. ఎందుకంటే మీ కప్పు ముందే నిండిపోయి ఉంది. మీ పాత నమ్మకాలు మీ మొండి పట్టుదలలు మీ అహంకారాలు ఆ కప్పులో కిక్కిరిసి ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతి మీకేదో కొత్త బాటం నేర్పాలని చూస్తుంటే దాన్ని స్వీకరించే స్థలం మీలో లేదు.
(09:12) ఖాళీగా లేని పాత్రలోకి కొత్త నీరు ఎలా చేరుతుంది? పాత కుళ్ళుని లోపల దాచుకొని నా జీవితం మారట్లేదు ఏంటి అని రోధిస్తే ఎలా మారుతుంది? అసలు ఈ సమస్యని ఎలా అధిగమించాలి? మరి ఈ అనంతమైన టెన్షన్ల నుంచి ఈ పిచ్చి పరుగు నుంచి బయటపడే మార్గం ఏంటి? మొదటి అడుగు లొంగిపోవడం లొంగిపోవడం అంటే చేతులెత్తేసి పిరికివాడిలా పారిపోవడం కాదు అది మీ అసహాయతని ఒక అద్భుతమైన జ్ఞానంగా మార్చుకోవడం మీరు ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాలు మీ ఆధీనంలో ఉండవనే చేదు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడం రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయినప్పుడు హారన్ కొట్టి చించుకున్నా అది
(09:49) కదలదు. మీకు కావాల్సింది కోపం కాదు ఆ నిమిషంలో కారు ఇంజిన్ ఆపి రిలాక్స్ అయ్యే మెచూరిటీ జీవితం కూడా అంతే మీ ప్రయత్నాన్ని మీరు 100% నిజాయితీగా చేయండి. ఆ తర్వాత ఫలితాన్ని రేపటి రోజుని ఆ సృష్టికే వదిలేయండి. నీమ కరోలి బాబా గారు తన జీవిత కాలంలో చెప్పిన అత్యంత బలమైన సూత్రం ఒకటే సబ్ ఏక్ హై ఔర్ సబ్ భగవాన్ కే హాత్ మే హై అంటే ప్రతిదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది అంతా ఆ పరమాత్మ సత్యం చేతుల్లోనే ఉంది అని ఆయనని ఎవరైనా బాబా నా జీవితం ఏమవుతుంది అని అడిగితే ఆయన కేవలం వారి భుజం తట్టి చింతించకు ప్రేమించు సేవ చేయు అనేవారు.
(10:30) బాబాగారి తత్వంలో సంక్లిష్టమైన సిద్ధాంతాలు ఉండవు. ఒక చిన్న పిల్లవాడి లాంటి స్వచ్ఛమైన సమర్పణ మాత్రమే ఉంటుంది. ఒక పసిపాప తల్లి ఊళలో పడుకున్నప్పుడు ఆ తల్లి ఎక్కడికి తీసుకెళ్తుందో అని ఆలోచిస్తూ ఆందోళన పడదు. హాయిగా నిద్రపోతుంది. ఎందుకంటే ఆ బిడ్డకి తల్లి మీద అపారమైన విశ్వాసం ఉంది. మరి మీరెందుకు ఈ విశ్వాన్ని నమ్మలేకపోతున్నారు.
(10:53) మిమ్మల్ని పుట్టించి మీ గుండెను ప్రతి క్షణం ఆపకుండా కొట్టుకునేలా చేస్తున్న ఆ ప్రకృతి రేపు మీకు అన్నం పెట్టకుండా వదిలేస్తుందా? ఈ క్షణం నుంచే ఒక ప్రాక్టికల్ మార్పు మొదలు పెట్టండి. జీవితాన్ని రెండు గదులుగా విభజించండి. మొదటి గది మీ చేతుల్లో ఉన్నవి మీ ఆలోచన, మీ కష్టం, మీ మాట, మీ సంస్కారం, రెండో గది మీ చేతుల్లో లేనివి.
(11:17) ఎదుటి మనిషి రియాక్షన్, మీ పనికి వచ్చే లాభ నష్టాలు లేకపోతే రేపటి ఫలితాలు. ఈ రెండో గదికి తాళం వేసి ఆ తాళం చెవిని విశ్వం పాదాల దగ్గర పడేయండి. ఆ గది వైపు ఇక తొంగి కూడా చూడకండి. నీమ కరోలి బాబాగారి దగ్గర కూర్చున్న భక్తులు కేవలం ఆయన సమక్షంలోనే ఎందుకు అంత ప్రశాంతతను పొందేవారో తెలుసా ఆయన వాళ్ళ తల మీద ఉన్న నియంత్రణ అనే పెనుభారాన్ని ఒక్క చూపుతో దించేసేవారు.
(11:43) నువ్వు భారం మోయడానికి పుట్టలేదు తేలికగా నడవడానికి పుట్టావు అని గుర్తు చేసేవారు. ఆ పిడికిలి విప్పండి. చేతిలోని ఇసుక కింద పడిపోనివ్వండి. మీ అరచేతిని ఆకాశం వైపు తెరిచి ఉంచండి. అప్పుడు మాత్రమే గాలి మీ చేతిని తాకుతుంది. మరో ముఖ్యమైన సాధన ఏంటో తెలుసా ఖాళీ అవ్వండి. మీ తలకాయ నిండ ఒక చెత్త కుప్ప పెరుగుపోయింది.
(12:05) గతం తాలుకు చేదు జ్ఞాపకాలు ఎవరిపైనో ఉన్న కోపాలు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే భయాలు ఈ కుల్లిపోయిన ఆలోచనలతో నిండిన పాత్రలోకి స్వచ్ఛమైన జ్ఞానం ఎలా ప్రవేశిస్తుంది? నీమ కరోలి బాబా గారు ఒకసారి అన్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. చెరుకు గడన మిషన్ లో పెట్టి ఆఖరి బొట్టు వరకు పిండేసినప్పుడే దానినుంచిన తీపు రసం బయటకు వస్తుంది.
(12:30) జీవితం మిమ్మల్ని కొన్ని కష్టాలు గుండా తీసుకెళ్ళినప్పుడు భయపడకండి. ప్రకృతిలో మీలోని అహాన్ని పాత చెత్తని పిండి ఖాళీ చేస్తుంది. ఎందుకంటే మీలో సరికొత్త జ్ఞానాన్ని నింపడానికి బాబాగారి ఈ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుందో గమనించండి. కష్టం వచ్చినప్పుడు నాకు ఎందుకు ఇలా జరిగిందని రోధించకండి. నాలోని అహంకారాన్ని తొలగించడానికి ఇది ఒక అవకాశం అని చూడండి.
(12:56) రోజుకు కనీసం 20 నిమిషాలు ఏ లక్ష్యం లేకుండా బతకడం నేర్చుకోండి. జీరో గోల్ మోడ్ ఫోన్ పక్కన పడేయండి పుస్తకాలు మూసేయండి. ఎవరితోనూ మాట్లాడకండి. కేవలం ఒక చెట్టు కిందో ఒక గది మూలనో ప్రశాంతంగా కూర్చోండి. ప్రపంచం మీ ఆలోచనలు లేకుండా కూడా సాగిపోతుందని మీ కళ్ళతో మీరు చూడండి. ఆ క్షణంలో మీ మెదడులోని రణగుణ ధ్వని తగ్గుతుంది. నీమ కరోలి బాబా గారు తన ఆశ్రమంలో ఎప్పుడు పెద్ద పెద్ద ప్రవచనాలు ఇవ్వలేదు.
(13:23) ఆయన కేవలం ఒక దుప్పటి కప్పుకొని కూర్చునేవారు. వచ్చిన వాళ్ళకి కడుపునిండ భోజనం పెట్టేవాళ్ళు ప్రేమించండి అందరికీ తిండి పెట్టండి భగవంతుని స్మరించండి. ఎంత సింపుల్ ఫిలాసఫీ మనం జీవితాన్ని ఎంత కాంప్లికేట్ చేసుకుంటున్నామో చూస్తే జాలేస్తుంది. ఆ సింప్లిసిటీ లోకి మీరు అడుగు పెట్టిన రోజే మీ నిజమైన బలం ఏంటో మీకు అర్థంవుతుంది. రాత్రి నిద్రపోయే ముందు ఒక చిన్న రిచువల్ చేయండి మంచం మీద వాలగానే రోజంతా జరిగిన విషయాలు నెమరవేసుకుంటూ ఆందోళన చెందడం ఆపేయండి.
(13:50) గుండె మీద చెయ్యి వేసుకొని గట్టిగా ఒక మాట అనుకోండి. ఈరోజు నేను చేయగలిగినంతా చేసేసాను. ఇక ఫలితం నా పరిధిలో లేదు. ఈ రాత్రికి నా ప్రాణాన్ని నా భవిష్యత్తుని ఆ సృష్టి శక్తులకే సమర్పిస్తున్నాను. ఇలా ఒక్కసారి మీ భారాన్ని దించేసి కళ్ళు మూసుకోండి. నిద్ర అనేది చావడం లాంటిదే నిద్రపోయేటప్పుడు మీ పేరు, మీ బ్యాంకు బ్యాలెన్స్ మీ ఆఫీస్ పదవి ఏవి మీతో రావు అన్ని అక్కడే పడి ఉంటాయి.
(14:16) మరి ఆ కాసేపైనా ఆ బరువులన్నిటిని వదిలేయడానికి మీకు ఎందుకు అంత భయం? సమర్పణలో ఉన్న మహత్తరమైన శక్తిని ఒక్కసారి అనుభవించండి. జీవితం ఒక పరుగు పందెంలా కాకుండా ఒక అందమైన నృత్యంలా మారుతుంది. సరే ఇదంతా బాగానే ఉంది. మరి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి. ఇప్పుడు అసలైన జీవితాన్ని మొదలుపెట్టండి. మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అంటే ఇంకో నాలుగు కార్లు కొనటం, కొత్త బిల్డింగులు కట్టడం కాదు.
(14:43) మీ అంతరంగంలో ఎలాంటి వాతావరణం నెలకొందు అనేది మీ అసలైన స్థితిగతి. ఎప్పుడైతే మీరు ఈ అతి నియంత్రణ అనే గొలుసును తెంచుకుంటారో మీ శరీరం తేలిక అవుతుంది. మీ నరాల్లో ప్రవహించే రక్తం శాంతిస్తుంది. మీ ముఖంలో ఒక సహజమైన కాంతి మొదలవుతుంది. అసలైన సృజనాత్మకత అసలైన విజయం ఎప్పుడు బయటకు వస్తాయో తెలుసా మీరు ఫలితం గురించి పిచ్చిగా ఆలోచించడం ఆపేసినప్పుడు ఓడిపోతానన్న భయం లేనివాడు మాత్రమే గ్రౌండ్లో స్వేచ్ఛగా ఆడగలడు.
(15:12) లైఫ్ ని మైక్రో మేనేజ్ చేయడం ఆపిన వాడే జీవితాన్ని నిండుగా అనుభవించగలడు. నీమ కరోలీ బాబాగారి జీవన విధానాన్ని ఒకసారి లోతుగా పరిశీలించండి. ఆయన దగ్గరికి పెద్ద పెద్ద మేధవులు వచ్చారు. స్టీవ్ జాబ్స్ లాంటి ప్రపంచాన్ని మార్చిన వ్యక్తులు ఆయన జ్ఞాపకాల నుంచి స్ఫూర్తి పొందారు. మార్క్ జూకర్బర్గ్ లాంటి వాళ్ళు ఆయన ఆశ్రమానికి వచ్చి కూర్చున్నారు.
(15:35) అసలు ఆయన ఏం చేశారు? ఏ ఆధునిక టెక్నాలజీ గురించి మాట్లాడలేదు. ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ చెప్పలేదు. ఆయన నేర్పిన ఒకే ఒక రహస్యం పూర్తిగా ఈ క్షణంలో జీవించడం అహంకారాన్ని పక్కన పెట్టడం మీరు ఎప్పుడైతే ఈ క్షణాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తారో మీ మైండ్ స్పష్టంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. గతం తాలూకు బరువు ఉండదు. భవిష్యత్తు గురించి భయం ఉండదు.
(15:58) ముందున్న పనిని కలలా చేయగలుగుతారు. మీ సంబంధాలను కూడా ఈ క్షణం నుంచే ఒక కొత్త దృష్టితో చూడండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని మార్చాలనే ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోండి. మీ భార్య అలాగే ఉండాలి. మీ పిల్లలు మీరు గీసిన గీతలోనే నడవాలి. మీ స్నేహితులు మీకు నచ్చినట్లే ప్రవర్తించాలి. ఈ ఆలోచనే ఒక మానసిక దాడి ఎవరిని మీ ఆలోచన చట్రంలో బంధించకండి.
(16:22) నీమ కరోలీ బాబా గారు చెప్పినట్లు ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మ రూపం ఉంది. నువ్వు ఎవరిని జడ్జ్ చేయకు సరిద్ధాలని చూడకు కేవలం ప్రేమించు. ఎదుటి వ్యక్తిని వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించిన క్షణంలో మీ ఇంట్లో ఉండే యుద్ధాలు ఆగిపోతాయి. మీ మనసులో ఉండే అశాంతి శాశ్వతంగా చచ్చిపోతుంది. మీ చేతుల్లో ఉన్న పనిని మాత్రమే మీరు పూజించండి.
(16:44) పడవను నడపడానికి తెడ్లు వేయడం మీ కర్తవ్యం కానీ ఆ పడవ ముందుకు వెళ్ళాలంటే నది ప్రవాహం కావాలి. ఆ నది మీద కోప్పడి దాన్ని మీ ఇష్టానుసారం మల్లించాలని చూస్తే పడవు మునిగిపోతుంది. నదికి లొంగిపోండి. కాలానికి నమస్కరించండి. మీ శ్రమను నిజాయితిగా అర్పించి ఫలితాన్ని ప్రకృతి చేతుల్లో ఉంచండి. అహంకారం వీడిన చోట అద్భుతాలు జరుగుతాయి. మీరు ఖాళీ అయిన చోట అమృతం నిండుతుంది.
(17:09) జీవితం ఒక మూత కాదు అదిఒక అద్భుతమైన ప్రవాహం. ఈరోజు ఆ ప్రవాహంలోకి అడుగు పెట్టండి. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. [సంగీతం] ఆ [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment