ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్ ఎందుకు | Find True Inner Peace | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FdsppaHCEwQ
Transcript:
(00:01) [సంగీతం] మీ జీవితాన్ని నాశనం చేయడానికి బయట నుంచి ఏ శత్రువు రానక్కర్లేదు. మీకు మీరే చాలు ఇది చాలా క్రూరమైన నిజమో ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయే వరకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఎవ్వరూ లేరు. మీ లోపల పుట్టే ఒక చిన్న ఫీలింగ్ మాత్రమే ఉంది. ఇప్పుడు నాకు మూడు లేదు. ఇప్పుడు నాకు బోరు కొడుతుంది.
(00:26) నాకు ఎప్పుడు చేయాలనిపించట్లేదు. ఈ మూడు మాటలు మనిషి జీవితాన్ని నిలువున నాశనం చేస్తున్నాయి. మీరు ఎప్పుడైనా గమనించారా ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మాయ ఏంటో తెలుసా మీ మనసుకి ఏది అనిపిస్తే అదే నిజం అనుకోవడం మనం ఎలాంటి భ్రమలో బ్రతుకుతున్నామ అంటే మనసులో ఒక ఆలోచన రాగానే అది మనమే అనుకుంటాం. ఒక బాధ రాగానే మనమే ఆ బాధ అనుకుంటాం.
(00:50) ఒక కోపం రాగానే మనమే ఆ కోపం అని చెప్పేసి రగిలిపోతాం. కానీ రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. అసలు ఈ భూమ్మీద మనిషి పడే ప్రతి దుఃఖానికి కారణం ఒక్కటే కనిపించే దేహాన్ని కదిలే మనసుని పట్టుకొని ఇది నేను అనుకోవడం. రమణ మహర్షి గారు అరుణాచలం కొండల్లో మౌనంగా కూర్చొని ప్రపంచానికి ఒకటే గుర్తు చేశారు. ఈ మనసు ఎప్పుడు ఒకచోట స్థిరంగా ఉండదు. అది ఎగిసపడే అలలాంటిది.
(01:15) మరి అంత అస్థిరమైన అలల మీద మీరు మీ జీవితాన్ని ఎలా నిర్మిస్తారు? ఆలోచించండి. మీరు నమ్మే ఈ భావాలు ఈ ఫీలింగ్స్ నిజంగా మీవేనా లేక అవి మిమ్మల్ని ఆడిస్తున్న తూలు బొమ్మలాటనా నిజం ఏంటంటే మీరు రోజు మీ భావోద్వేగాల చేతిలో బలైపోతున్నారు. మీరు ఒక పని మొదలు పెట్టాలనుకుంటారు కానీ లోపల ఏదో లాగుతుంది. ఒక ఫోన్ నోటిఫికేషన్ చూడగానే మనసు అటు లాగేస్తుంది.
(01:39) వెంటనే ఆ భావానికి లొంగిపోతారు. అంటే మీ లైఫ్ కి డ్రైవర్ మీరు కాదు. ఆ క్షణంలో మీ లోపల లేచిన ఒక అల్పమైన ఎమోషన్ మాత్రమే డ్రైవర్. రమణ మహర్షి గారి బోధనల మూలసారం ఇదే ఏదైతే వస్తుందో పోతుందో అది ఎప్పటికీ మీరు కాలేరు మీ భావాలు ఉదయం ఉంటాయి మధ్యాహ్నానికి చచ్చిపోతాయి సాయంత్రం ఒక రకంగా ఉంటాయి రాత్రికి మరొక రకంగా మారిపోతాయి మరి గంటకు రంగు మార్చే ఈ భావాల మాట విని మీరు మీ భవిష్యత్తుని ఎలా తాకట్టు పెడతారు ఒకసారి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి.
(02:10) మనం రోజు అద్దం ముందు నిలబడి చూసుకునే ఈ శరీరం తలలోపల పరిగెత్తే ఈ ఆలోచనల ప్రవాహం ఇదే మనం అనుకొని ఎంత పెద్ద మోసంలో బ్రతుకుతున్నామో మీరు ఒకరోజు చాలా సంతోషంగా ఉంటారు. అదేరోజు సాయంత్రానికి ఎవడో ఏదో ఒక చిన్న మాట అంటాడు వెంటనే లోపలంతా మారిపోతుంది. గుండెల్లో మంట మొదలవుతుంది. రాత్రంతా నిద్ర పట్టదు. ఎందుకు ఎవరో విసిరిన ఒక మాట మీలోని అహంకారాన్ని తాకింది.
(02:35) ఆ అహంకారం వెంటనే ఒక నెగిటివ్ ఫీలింగ్ ని పుట్టించేస్తుంది. రమణ మహర్షి గారు ఎప్పుడు ఒక సూటి ప్రశ్న వేసేవారు. ఆ బాధని అనుభవిస్తున్నది ఎవరు? ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది. కానీ దీన్ని వెనుకొని నిజం తెలిస్తే మీ వెన్నులో వనుకు పడుతుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే మనం మన భావోద్వేగాలని ఒక అతిధిలా చూడటం లేదు.
(02:56) మన ఇంటికి వచ్చిన ఒక గెస్ట్ లాగా చూస్తున్నాం. మీకు కోపం వస్తే నా కోపం వచ్చింది అంటారు. బాధ వస్తే నేను డిప్రెషన్ లో ఉన్నాను అంటారు అంటే ఆ భావమే మీరైపోతున్నారు. రమణ మహర్షి గారు చెప్పిన ఆత్మ విచారణ ఇక్కడే మొదలవుతుంది. ఆయన అంటారు బాధ అనేది ఒక ఆలోచన మాత్రమే. కోపం అనేది రక్తంలో కలిగే ఒక చిన్న రసాయనిక మార్పు మాత్రమే.
(03:18) అవి వస్తాయి కాసేపటికి వాటి బలం తగ్గి వెళ్ళిపోతాయి. మరి వచ్చిపోయే వాటిని పట్టుకొని ఇదే నా జీవితం నా బతుకు ఇంతే అని కుమ్మిలిపోవడం ఎంత అమాయకత్వం ఈ తరం యువత గమనించండి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ప్రపంచం అరచేతిలో ఉంటుంది. కానీ లోపల మాత్రం భయంకరమైన శూన్యత. ఎందుకంటే వాళ్ళని నడిపిస్తున్నది వాళ్ళ లక్ష్యాలు కావు. వాళ్ళ తాత్కాలిక భావాలు.
(03:42) ఇస్గ ఇస్గ లో ఎవడో ఏదో పెట్టగానే లోపల అసూయ పడుతుంది. వెంటనే నేనుఎందుకు వాడిలా లేను అనే న్యూనత భావం తన్నుకొస్తుంది. క్షణాల వ్యవధిలో మీ మనశశాంతి మాయమైపోతుంది. ఎవరో మీ చేతిలో రిమోట్ పెట్టి ఆడిస్తున్నట్లు లేదు. మీ భావోద్వేగాలకు మీరు బానిసలైపోయినంత కాలం మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఏ స్థాయికి ఎదిగినా మీరు ఒక బిచ్చగాడిలాగా బతకాల్సి వస్తుంది.
(04:05) మీ మనసే మిమ్మల్ని రోజు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు మనం ఇంత బలహీనులమైపోయాం ఒకసారి ఆలోచించండి శరీరానికి ఒక చిన్న దెబ్బ తగిలితే విలవిలాడిపోతాం. కానీ మనసులో రోజుకు 100 సార్లు గాయం చేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే మనం ఒక పెద్ద అబద్ధాన్ని నిజం అనుకొని బ్రతుకుతున్నాం. అదే అహంకారం నేను అనే ఒక ఊహాజనిత భావన. రమణ మహర్షి గారు ఈ మానవ నైజాన్ని ఎంతో సున్నితంగా అంతే నిర్భయంగా వెప్పచెప్పారు.
(04:32) ఆయన అంటారు అసలు ఈ ప్రపంచంలో లేని ఒక దెయ్యం ఉంది. ఆ దెయ్యం పేరు నేను అనే అహంకారం. ఎప్పుడైతే ఆ అహంకారం పుడుతుందో దాని వెనికే కోరికలు, భయాలు, అసూయలు, బాధలు అన్ని ఒక సైన్యంలా వచ్చి చేరుతాయి. నిజం ఏంటంటే మీరు బాధపడుతున్నది బయట జరుగుతున్న సంఘటనల వల్ల కాదు. మీ లోపల ఆ సంఘటనలను వ్యాఖ్యానిస్తున్న మీ అహంకారం వల్ల మీకుొక వింత నిజం చెప్పనా సముద్రం అడుగున ఉండే నీరు ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది.
(05:04) కానీ పైన మాత్రం అలలు ఎగసి పడుతూనే ఉంటాయి. మీ మనసు కూడా సరిగ్గా అంతే. బయట ప్రపంచం విసిరే ప్రతి చిన్న రాయికి మీ మనసులో ఒక పెద్ద అలలు వేస్తుంది. ఆ అలే మీ ఫీలింగ్. మీరు ఆ అలానే సముద్రం అనుకుంటున్నారు. రమణ మహర్షి గారు ఎప్పుడు గుర్తు చేసే ఒక అద్భుతమైన సత్యం ఉంది. సినిమా హాల్ లో తెర మీద మంటలు కనిపిస్తాయి. నదులు ప్రవహిస్తాయి. మనుషులు చనిపోతారు.
(05:28) కానీ సినిమా ముగిసిన తర్వాత తెర తడిచిపోతుందా? లేక మంటలకు కాలిపోతుందా? ఏమీ కాదు తెర ఎల్లప్పుడూ తెల్లగానే శుద్ధంగానే ఉంటుంది. మీరు ఆ తెర లాంటివారు. మీ ఫీలింగ్స్ ఆ తెర మీద పడే సినిమా బొమ్మలు మాత్రమే. కానీ మనం బొమ్మల్లోనే బందీ అయిపోయాం. మనం పుట్టినప్పటి నుంచి సమాజం మనకి ఒకటే నూరిపోసింది. నీకు నచ్చినట్లు చెయ్ నీ మనసు ఏం చెప్తే అది విను ఇది ఆధునిక యుగపు అతి పెద్ద ట్రాప్ ఎందుకంటే మీ మనసుకి ఎప్పుడూ సులభంగా దొరికే సుఖమే కావాలి.
(05:56) కష్టపడటం దానికి నచ్చదు. పరిమితులు దాటడం దానికి ఇష్టం ఉండదు. అందుకే అది మిమ్మల్ని ఎప్పుడూ ఒక కంఫర్ట్ జోన్ లో కట్టేసి ఉంచుతుంది. రమణ మహర్షి గారు అడిగిన ఆ మౌలిక ప్రశ్న ఇక్కడే మ్రోగుతుంది. ఈ మనసు ఎక్కడి నుంచి పుడుతుంది ఈ ఆలోచనల మూలం ఎక్కడుంది? మీరు ఆ మూలాన్ని వెతకడం మానేసి పై పైన తేలియాడే ఆ మురికి ఆలోచనల్నే మీ అస్తిత్వం అనుకుంటున్నారు.
(06:21) అందుకే మీకు నిమిషానికో మూడు మారుతుంది. గంటకో అభిప్రాయం పడుతుంది. జీవితం మొత్తం ఒక అంతులేని గందరగోళంగా మిగిలిపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా మన కళ్ళ ముందు ఒక భయంకరమైన డ్రామా నడుస్తుంది. ఎవరైనా మిమ్మల్ని పోగొడారనుకోండి లోపల ఏదో పెద్ద పండగ జరిగినట్లు ఎగిరి గంతులు వేస్తారు. అదే మనిషి కాసేపటి తర్వాత చిన్న విమర్శ చేశాడనుకోండి పాతాళంలోకి కుంగిపోతారు అంటే మీ సంతోషం మీ ఆనందం మీ మనశశాంతి అవతల వాడి నాలుక మీద ఆధారపడి ఉంది.
(06:50) ఎంత దౌర్భాగ్యం అండి ఇది రమణ మహర్షి గారు ఈ మానసిక బానిసత్వాన్ని చూసి నవ్వుకునేవారు. ఆయన ఎప్పుడూ ఒకటే స్పష్టత ఇచ్చేవారు. నువ్వు ఎవరివో నీకు తెలియనప్పుడు ప్రపంచం నుండి ఏమనుకుంటుందో అదే నువ్వు అనుకుంటావు. నీ ఉనికి ఇతరుల ధ్రువీకరణ మీద పెట్టిన మరుక్షణమే నీ స్వేచ్ఛను నువ్వే చంపేసుకున్నట్లే సమస్య అసలు మూలం ఎక్కడుందో తెలుసా మనం శూన్యాన్ని భరించలేకపోతున్నాం.
(07:14) ఒక 10 నిమిషాలు ఏ ఆలోచన లేకుండా చేతిలో ఏ స్క్రీను లేకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా గదిలో కూర్చోగలరా వెంటనే గుండెల్లో ఏదో తెలియని బెదురు మొదలవుతుంది. చేతులు జీబుల్లోకి వెళ్తాయి. ఫోన్ అన్లాక్ అవుతుంది. మనసు ఏదో ఒక ఉద్దీపాన కోసం వెంపర్లాడుతుంది. ఎందుకంటే నిశ్శబ్దం మనలోని అహంకారానికి మరణశాసం లాంటిది. రమణ మహర్షి గారి మౌనంలోనే అసలైన సత్యాన్ని చూశారు.
(07:40) ఆయన అరుణాచల గృహంలో వెళ్లి ఏళ్ల తరబడి మాట్లాడకుండా కూర్చున్నప్పుడు ప్రపంచం ఆయన్ని పిచ్చువాడు అనుకుంది. కానీ ఆయన ఆ మౌనంలో మనసు యొక్క మూలాన్ని చేదించారు. మనం మాత్రం ఆ నిశశబ్దానికి భయపడి అస్థిరమైన ఫీలింగ్స్ అనే రొంపిలోకి పదే పదే దూకుతున్నాం. మరో పచ్చి నిజం ఏంటంటే మీ భావాలు మీ శరీరం ఆడే రసాయనాల ఆట మాత్రమే.
(08:04) రాత్రి నిద్ర సరిగ్గా లేకపోతే ఉదయం ప్రపంచం అంతా చీకటిగా కనిపిస్తుంది. కడుపులో తిన్న తిండి సరిగ్గా జీర్ణం కాకపోతే పక్కనఉన్న వాళ్ళ మీద విసుగొస్తుంది. ఒక చిన్న హార్మోన్లు హెచ్చుదగ్గలకు లోనైతే జీవితమే వ్యర్థం అనిపిస్తుంది. అంత చిన్న చిన్న భౌతిక కారణాల వల్ల మారే భావాలను పట్టుకొని నేను బాధలో ఉన్నాను నాకు డిప్రెషన్ వచ్చింది అని చెప్పేసి పెద్ద పెద్ద పేర్లు తగిలించుకుంటున్నారు.
(08:27) రమణ మహర్షి గారు చాలా తేలిగ్గా ఒక మాట అనేవారు. గాఢ నిద్రలో నీ శరీరం లేదు నీ ఆలోచనలు లేవు నీ బాధలు లేవు కానీ నిద్ర లేచిన తర్వాత నేను హాయిగా నిద్రపోయాను అంటావు. అంటే ఆలోచనలు లేని చోట కూడా నువ్వు ఉన్నావు కదా మరి ఆ ఆలోచనలు ఆ భావాలు నువ్వు ఎలా అవుతావు? ఈ చిన్న సూత్రాన్ని మనం మర్చిపోయాం కాబట్టి మన ఆలోచనలే మన పాలెట యమపాశాలుగా మారాయి.
(08:50) సరే ఇదంతా బాగానే ఉంది. మరి ఈ సమస్యని ఎలా అధిగమించాలి? ఇప్పుడు అసలైన పోరాటం మొదలు పెడదాం. మరి ఈ మనసు అనే మాయాజాలం నుంచి ఈ భావోద్వేగాల సుడిగుండం నుంచి ఎలా బయటపడాలి? దానికి సమాధానం ఏంటో తెలుసా రమణ మహర్షి గారు ప్రపంచానికి అందించిన అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం నేను ఎవరు? ఈ ప్రశ్న ఏదో పూజ గదిలో కూర్చొని జపించే మంత్రం కాదు.
(09:14) ఇది మీ మనసును నిలువుగా చీల్చే ఒక సర్జికల్ బ్లేడ్ అన్నమాట. ఎప్పుడైనా మీ లోపల ఒక తీవ్రమైన కోపం వచ్చినప్పుడు లేదా భయంకరమైన బద్ధకం మిమ్మల్ని ఆపేస్తున్నప్పుడు వెంటనే ఒక క్షణం ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ కోపం ఎవరికి వచ్చింది నాకు అసలు ఇంతకీ ఈ నేను ఎవరు? ఈ ప్రశ్న వేసిన మరు క్షణం ఆ కోపం మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది.
(09:38) ఎందుకో తెలుసా? మీరు ఒక భావంతో పూర్తిగా కలిసిపోయినప్పుడు మాత్రమే అది మిమ్మల్ని ఏలగలదు. ఎప్పుడైతే మీరు వెనక్కి తగ్గి దాన్ని గమనించడం మొదలు పెడతారో మీరు ఆ భావం కాకుండా ఆ భావాన్ని చూసే సాక్షిగా మారిపోతారు. రమణ మహర్షి గారు పదే పదే ఒక అద్భుతమైన ఉపమానం చెప్పేవారు. దొంగని పట్టుకోవాలంటే వాడి వెంటే పరుగులు తీయనక్కర్లేదు.
(09:58) వాడి ముఖం మీద దీపం పెట్టి చూస్తే చాలు వాడు పారిపోతాడు. మనసు కూడా ఒక దొంగ లాంటిదే. అది మిమ్మల్ని ఆలోచనలతో ఫీలింగ్స్ తో నిరంతరం మోసం చేస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆత్మ విచారణ అనే వెలుగుని ఆ మనసు మీదకు తిప్పుతారో ఆ ఆలోచనలన్నీ మంచుల్లా కరిగిపోతాయి. ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రయోగం చేయండి. మీ మనసు నాకు ఈ పని చేయడం ఇష్టం లేదు అని చెప్పినప్పుడు దానితో వాదించకండి.
(10:24) కేవలం నిశశబ్దంగా ఒక మూడవ వ్యక్తిలా చూడండి. అసలైన మానసిక పరిపక్వత అంటే ఏంటో తెలుసా? మీ మూడు ఉన్నా లేకపోయినా చేయాల్సిన పనిని చేయగలగడమే ప్రపంచంలో ఏదైనా సాధించిన ఏ వ్యక్తి అయినా ఈరోజు నా మూడు బాగుంది కాబట్టి నేను పని చేస్తాను అని గెలవలేదు. రమణ మహర్షి గారి జీవితాన్ని పరిశీలించండి. ఆయన అరుణాచలం కొండలో కూర్చున్నప్పుడు కీటకాలు ఆయన్ని ఎన్నో సార్లు ఇబ్బంది పెట్టాయి. అయినా సరే ఆయన కదలలేదు.
(10:49) ఎందుకంటే ఆయన దృష్టి శరీరం నొప్పి మీద లేదు. ఆ నొప్పిని గమనిస్తున్న శుద్ధ చైతన్యం మీద ఉంది. మీరేమో ఒక చిన్న ఆఫీస్ వర్క్ చేయడానికి ఉదయాన్నే 10 నిమిషాలు పరిగెత్తడానికి నాకు మూడు బాలేదని చెప్పేసి సాకులు వెతుక్కుంటున్నారు. మీ ఫీలింగ్స్ ని ఎప్పుడైతే మీరు పూజించడం మానేస్తారో అప్పుడే మీ నిజమైన జీవితం ప్రారంభం అవుతుంది.
(11:10) మీరు ఇప్పటివరకు చేసిన అతి పెద్ద తప్పుఏంటో చెప్పనా మీ భావాలతో మీరు యుద్ధం చేయడం. కోపం వస్తే దాన్ని అనిచివేయాలని చూస్తారు. బాధ వస్తే బలవంతంగా నవ్వాలని చూస్తారు. బద్ధకం వస్తే మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు. రమణ మహర్షి గారు ఈ మానసిక ఘర్షణను చూసి ఏమన్నారో తెలుసా దొంగని పట్టుకోవడానికి మరో దొంగని పోలీస్ డ్రెస్ వేసి పంపినట్లు ఉంది అని ఆలోచనలతో ఆలోచనలని ఎలా ఆపుతారు? అది అసాధ్యం కదా అని చెప్పిన పరిష్కారం చాలా సహజమైనది నిశశబ్దమైనది.
(11:39) ఏ ఆలోచన వచ్చినా దాన్ని వ్యతిరేకించకు సమర్ధించకు కేవలం అది ఎక్కడి నుంచి లేచిందో ఆ మూలాన్ని చూడు అంటే ఒక అల సముద్రంలో లేచి మళ్ళీ సముద్రంలోనే ఎలా కలిసిపోతుందో మీ ఆలోచన కూడా మీ లోపలి చైతన్యంలోనే లేచి మళ్ళీ అక్కడే లయం కావాలి నిజం ఏంటంటే మీకు మరియు మీ స్పందనకి ఒక చిన్న విరామం ఉంటుంది. ఆ విరామమే మీ నిజమైన స్వేచ్ఛ. ఎవరైనా మిమ్మల్ని తిట్టగానే వెంటనే అరవడం కాదు ఆ మాట మీ చెవుల్లో పడిన క్షణానికి మీ నోటి నుంచి మాట బయటక వచ్చే క్షణానికి మధ్య ఒక 10 సెకండ్ల నిశశబ్దం ఉంటుంది.
(12:13) ఆ నిశశబ్దంలో రమణ మహర్షి గారు అడిగిన ఆత్మ విచారణని ఉంచండి. ఈ మాట నన్ను తాకిందా లేక నాలోని అహంకారాన్ని తాకిందా? ఈ చిన్న ప్రశ్న వేయడం అలవాటు చేసుకుంటే ఎదుటివాడి కోపం మీ ప్రశాంతతని తాకనే తాకదు. వాడు ఒక అగ్నిగోళాన్ని మీ మీదకి విసిరితే మీరు దాన్ని ఒడిచి పట్టుకొని కాలిపోవడం మానేసి కాళీ ఆకాశంల దాన్ని మీ గుండా దాటి పోనిస్తారు.
(12:39) ఇది గాలిలో మాట్లాడే సిద్ధాంతం కాదు పచ్చి ప్రాక్టికల్ లైఫ్ ఉదయాన్నే అలారం మోగినప్పుడు మీ శరీరం బద్ధకంతో నిండిపోతుంది. మనసు ఇంకో 10 నిమిషాలు పడుకో అని చెప్పేసి తీయ్యగా లాలిస్తుంది. ఆ క్షణంలో ఆ భావాన్ని సత్యం అనుకోకండి. అది కేవలం శారీరపు జాడత్వం. ఇది నేను కాదు అని గుర్తించండి. భావన అలాగే ఉంటుంది కానీ మీరు లేచి నిలబడతారు వర్కవుట్ చేయాలనిపించదు కానీ షూ వేసుకొని బయలుదేరుతారు చదవాలనిపించదు కానీ పుస్తకం తెరిచి కూర్చుంటారు.
(13:06) రమణ మహర్షి గారు చెప్పిన సాక్షి భావం అంటే ఇదే మీ మనసు రోధిస్తూనే ఉంటుంది. కానీ మీ కర్తవ్యం వైపు మీ పాదాలు సాగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మీరు మీ ఫీలింగ్స్ కి లొంగకుండా పని చేయడం నేర్చుకుంటారో ఆ రోజు మీ మనసు మీ చేతిలో ఒక పదునైన ఆయుధంగా మారుతుంది. మరి మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడం ఎలా అంటే మాత్రం ఈ రోజు నుంచి మీ జీవితాన్ని మీరు కొత్తగా డిజైన్ చేసుకోవాలి.
(13:28) దానికి పెద్ద పెద్ద హిమాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు మీ ఇంట్లోనే మీ ఆఫీస్ డెస్క్ ముందే ఆ పరివర్తన జరగాలి. మొదటి సూత్రం మూడ్ అనే భ్రమ మీ డిక్షనరీ నుంచి తీసేయండి. చాలా మంది ఏమనుకుంటారంటే మనశశాంతి అనేది ఏదో ఒక రోజు అద్భుతంగా ఆకాశం నుంచి ఓడిపడుతుందని రమణ మహర్షి గారు చాలా స్పష్టంగా చెప్పారు శాంతి అనేది ఎక్కడో దాక్కొని లేదు అది ఎల్లప్పుడూ మీలోనే ఉంది.
(13:52) మీరు ఆ శాంతిని కొత్తగా సంపాదించనక్కర్లేదు. దాని పైన పేరుకుపోయిన చెత్త ఆలోచనలని తీసేస్తే చాలు. మీ మనసు అనే అద్దం మీద ఎమోషన్స్ అనే దుమ్ము పట్టింది. ఆ దుమ్మును చూసి అద్దం పాడైపోయిందని భ్రమపడకండి. కేవలం దాన్ని తుడుచుకుంటూ వెళ్ళండి. ఇక రెండోది సమాజపు అంచనాల నుంచి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోండి. మనం రోజు ఎవరికోసం జీవిస్తున్నాం పక్కవాడు ఏమనుకుంటాడో అనే భయంతో సగం చచ్చిపోతున్నాం.
(14:18) ఒకసారి రమణ మహర్షి గారి వైపు చూడండి ఆయన ఒక చిన్న కౌపీనం కట్టుకొని అరుణాచలం కొండల మీద కూర్చున్నారు. ఆయన దగ్గరికి రాజులు వచ్చారు. బ్రిటిష్ ఆఫీసర్లు వచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత రచయితలు వచ్చారు. ఆయన ఎవరి కోసము తన రూపాన్ని మార్చుకోలేదు. ఎవరిని మెప్పించడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఆయనకి బాహ్య ప్రపంచం ఇచ్చే ప్రశంసల విలువ ఏంటో తెలుసు.
(14:39) అవి నీటి బుడగలు. మరి మీరెందుకు ఎవడో నాలుగు లైగలు కొట్టలేదని డిప్రెషన్ లోకి వెళ్తారు ఎవరో గుర్తించలేదని ఎందుకు కుమ్మిలిపోతున్నారు? మీ విలువను ఇంకొకడి చేతిలో పెట్టినంత కాలం మీరు జీవితాంతం వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే. ప్రతిరోజు కనీసం ఒక 20 నిమిషాలు మీతో మీరు గడపడం నేర్చుకోండి. ఫోన్ పక్కన పెట్టేయండి. ఏ పుస్తకమో తెరవండి.
(15:02) కళ్ళు మూసుకొని రమణ మహర్షి గారి మార్గంలో మీ శ్వాసని మీ లోపల నిశబ్దాన్ని గమనించండి. మీ మనసులోకి ఆలోచనలు రానివ్వండి. వాటిని అడ్డుకోకండి అలాగని వాటి వెనక పరిగెత్తకండి. ఆకాశంలో మేఘాలు ఎలా తేలిపోతుంటాయో మీ కళ్ళ ముందు మీ ఆలోచనలు అలా వచ్చి పోతుండాలి. ఆ నిశ్చల స్థితిలో మీకు ఒక అద్భుతమైన నిజం అర్థమవుతుంది. నేను ఈ కదిలే మనసు కాను. నేను ఈ మార్పులన్నిటిని చూస్తున్న అపారమైన చైతన్యాన్ని ఆ ఒక్క స్పృహ మీ లోపల మొదలైతే ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని భయపెట్టలేదు.
(15:35) ఏ బాధ మిమ్మల్ని కొంగదీయలేదు. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. [సంగీతం] హ
No comments:
Post a Comment