Hanuman Ansh (2026) Movie Explained in Telugu | Movies Explained in Telugu
Author Name:BKG Explanations
Youtube Channel Url:https://www.youtube.com/@BKGExplanationsTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=InheHDKPwKA
Transcript:
(00:04) ఈ ప్రపంచంలో కొంతమంది కేవలం మానవుల్లా మాత్రమే పుట్టారని చెప్తారు. అయితే అలాంటి వాళ్ళు ఈ భూమిపైకి రావడం వల్ల ఎవరిదో ఒక జీవితం మారిపోతుంది. సరైన మార్గం దొరుకుతుంది. చివరికి ఎవరికైనా సరే ఆ భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడనే అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. అలాంటి వాళ్ళలో ఒక చెప్పుకోదగ్గ పేరు వచ్చేసి నీమ్ కరోరి బాబా.
(00:24) ఆయన ఈ లోకానికి డబ్బుని ఎలా సంపాదించాలో ఒక మార్గాన్ని చెప్పలేదు. ఎలాంటి అద్భుతాలు చేస్తానని కూడా చెప్పలేదు. కానీ ఆయన కేవలం ఒకే ఒక్క విషయాన్ని నేర్పించారు. జగత్తులో ఉన్న ప్రతి ప్రాణుల పట్ల ప్రేమని కురిపిస్తూ నిత్యం సేవ చేస్తూ ఆ భగవంతుని గుర్తుంచుకోవాలనే విషయాలని చెప్పాడు. అయితే ఆయన జీవితంతో ముడిపడి ఉన్న కొన్ని సంఘటనలు ఇప్పటికీ వాటిని విని ప్రజలంతా ఆశ్చర్యపోతారు.
(00:46) బాబా దగ్గర ఎలాంటి శక్తి ఉందంటే ఆయన శక్తిని అర్థం చేసుకోవడానికి సాధారణ మానవునికి అంత ఈజీ కాదు. ఇంతకీ కరోరి బాబా ఎవరు? ఆయన కేవలం ఒక గొప్ప సాధునా లేక నిజంగా హనుమంతుని యొక్క ప్రతిరూపమా అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం 2026 లో రిలీజ్ అయిన హనుమాన్ అన్ష్ అనే మూవీ ద్వారా తెలుసుకుందాం. స్టోరీ స్టార్టింగ్ గా 1964 నుంచి స్టార్ట్ అవుతుంది.
(01:07) అక్కడ మనం బోస్లే అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ని చూస్తాం. ఆయన తన చిన్న మనవడికి ఒక స్టోరీని చెప్తూ 1942 లో నేను ఎంతో కష్టకాలంలో గడుపుతున్నప్పుడు మహారాజీ నాకు సాయం చేశారు. నిజానికి నేను భక్తిని గాని భగవంతుని గాని ఎక్కువగా నమ్మేవాడిని కాదు. కానీ మహారాజ్ జైని కలిసిన తర్వాతే నాకు అన్ని శక్తులతో పాటు భగవంతుని యొక్క అనుభూతి కలిగింది. 1942 లో నేను బ్రిటిషర్స్ నుంచి దాక్కొని పారిపోతున్నా ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు నన్ను చంపాలని చూస్తూ ఉన్నారు.
(01:32) దీనివల్ల నేను ఒక ప్లేస్ లో దాక్కున్నా కానీ అక్కడికి బ్రిటిష్ పోలీసులు ఈజీగా వచ్చేసి పట్టుకునే అవకాశం ఉంది. ఈ విషయం ఎల్లప్పుడూ నాలో భయాన్ని పుట్టిస్తూనే ఉండేది. నేను దాదాపుగా 10 రోజుల పాటు తినకుండా ఉన్నా. అయితే అప్పుడే నా దగ్గరికి మారాజ్ వచ్చారు. మహారాజ్ నన్ను చూసి ఈ సమస్య ఏంటో అర్థం చేసుకొని ఆయన నాతో ఇలా చెప్పాడు.
(01:50) చాలా రోజుల నుంచి ఆకలిగా ఉన్నారు. కాబట్టి ముందు తినండి. ఇక్కడికి పోలీసులంతా తొందరగా రారని చెప్పాడు. ఇక నేను ఆహారాన్ని చూసిన వెంటనే ఫుడ్ మీద పడిపోయి ఒకేసారి పెద్ద మొత్తంలో కడుపునిండా తిన్నాను. ఎందుకంటే దాదాపుగా 10 రోజుల నుంచి నేను ఆకలిగా ఉన్నా. అందువల్ల నేను ఇక్కడ బాగా తినాల్సి వచ్చింది. ఆ తర్వాత మారాజీ నాతో ఒక విషయం చెప్తూ ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఉత్తర దిక్కున వెళ్ళండి.
(02:11) ఎందుకంటే పోలీసులు ఇక్కడికి వచ్చేస్తారు. మీకోసం నాలుగు రోజులకి సరిపడా ఫుడ్ నఅంతా కూడా ప్యాక్ చేయించి ఉంచానని చెప్తాడు. ఈ అన్ని విషయాలు చూసి నేను షాక్ అయ్యాను. ఈ బాబాకు పోలీసులు నా వెంటపడుతున్నారని ఎలా తెలిసింది. నేను వెళ్తున్న చోటు దగ్గర నాలుగు రోజులకి సరిపడా ఫుడ్ అనేది అవసరమవుతుందని ఎలా తెలిసిందని షాక్ అయ్యాను.
(02:28) అంతేకాదు మహారాజ్జీకి నేను ఎన్ని రోజుల నుంచి ఆకలిగా ఉన్నానో కూడా తెలుసు. ఈ అన్ని విషయాలు చూసిన తర్వాత నాకు ఈ మనిషి ఒక సాధారణ మనిషి కాదని అర్థమైంది. నా జీవితంలో మొట్టమొదటిసారిగా భగవంతునిపై నమ్మకం వచ్చింది. అప్పుడు మహారాజే సాయంతో నేను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్తాడు. అయితే కొంచెం టైం అయిన తర్వాత పోలీసులు ఆ ప్లేస్ కి వచ్చేస్తారు.
(02:46) ఇక్కడే సీన్ అనేది కట్ అవుతుంది. ఇప్పుడు బోస్లే తన మనవడికి ఇక్కడ మారాజీ యొక్క స్టోరీని చిన్నప్పటి నుంచి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. స్టోరీ ఉత్తరప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామానికి వెళ్తుంది. సరిగ్గా అది 1900 ఏళ్ల టైం అయి ఉంటుంది. ఇదే గ్రామంలోనే ఒక బిడ్డ పుడతాడు. అతని పేరు లక్ష్మీ నారాయణ శర్మ అని పెట్టారు. చిన్నప్పటి నుంచే లక్ష్మీనారాయణ మిగతా పిల్లల కంటే పూర్తిగా వేరుగా ఉంటాడు.
(03:09) ఆయన మనసు ఎప్పటికీ కూడా ప్రపంచ విషయాల కంటే ఎక్కువగా ఆ భగవంతుని యొక్క భక్తిలోనే లీనం అవ్వాలని ద్యాస ఎక్కువగా ఉండేది. కానీ అప్పటికీ ఆయన వయసు చాలా చిన్నగా ఉన్నప్పుడే ఆయన జీవితంలో ఒక చెరిగిపోని దుఃఖం వచ్చి పడింది. ఆ పరిస్థితి ఆయన్ని పూర్తిగా బ్రేక్ అయ్యేలా చేసింది. ఎందుకంటే ఉన్నట్టుండి ఆయన తల్లి చనిపోయింది.
(03:28) తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొంత కాలం తర్వాత ఆయన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆయన ఇల్లు విడిచేసి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఇంకొక విషయం వచ్చేసి లక్ష్మీ నారాయణకి చిన్నప్పుడే ఒక అమ్మాయితో పెళ్లి కూడా అయిపోయింది. ఇప్పుడు ఇల్లు విడిచి వెళ్ళాలనే ఆలోచనతో మొదలైన ఆ బాలుడి యొక్క ప్రయాణం అనేది అది మరింత ముందుకెళ్లి ఆయన్ని లక్ష్మీ నారాయణ శర్మ నుంచి నేమ్ కరో బాబా అంటే మహారాజ్జీ పేరుతో ప్రపంచం మొత్తం వినిపించేలా ఫేమస్ అయ్యేలా చేసింది.
(03:57) మహారాజ్జీకి ఇష్టమైన ఆరాధ్య దేవుడు హనుమంతుడే కానీ ఆయనకు భగవాన్ శ్రీరాముని నుంచి కృపని పొందాలని ఆశ ఉంది. అందుకే ఆయన భగవాన్ శ్రీరాముని యొక్క కృపను పొందే క్రమంలో పూర్తిగా సాధనలో నిమగ్నమయ్యారు. దానికోసం ఆయన జగత్తులో ఉన్నటువంటి అన్ని మోహ భాగ్య మాయలను వదిలి పెట్టేసి ఇప్పుడు ఆయన కేవలం సాధనలో మునిగిపోయి ధ్యానం చేసేవారు. అయితే మహారాజ్ ఎప్పుడు కూడా ఒకే చోట ఎక్కువ సమయాన్ని గడిపేవారు కాదు.
(04:21) ఆయన ఎల్లప్పుడూ కూడా గ్రామం నుంచి దూరంగా ఉంటూ ఏకాంతంలో ఉండి సాధన చేస్తూ ధ్యానం చేసేవారు. ఒకరోజు ఆయనకు టెంపుల్ పూజారి అయిన మెహంతిజీతో పరిచయం జరుగుతుంది. మహంతిజీ ఇక్కడ మహారాజ్జీని మొదటిసారి కలిసినప్పుడు ఆయనకు తన గురువు గారి జ్ఞాపకం వస్తుంది. ఆయనకు అనిపించింది ఏంటంటే చూస్తుంటే ఈ పిల్లాడు చాలా విచిత్రమని ఎందుకంటే ఆయన చెప్పే మాటలు పూర్తిగా భిన్నంగా మిగతా పిల్లల కంటే వేరుగా ఉన్నాయి.
(04:45) మహారాజ్జీకి భగవాన్ శ్రీరాము యొక్క కృపని పొందాలనే ఆశ ఎంతో ఉంది. నిత్యం భజనలు చేస్తూ ప్రభు శ్రీరాముని చెంతకి చేర్చే ఏకైక మార్గం బజరంగి హనుమంతునిపై ధ్యానం చేయడంలోనే నా మనసంతా నిండుందని చెప్పేవాడు. మహంతి జై ఒకరోజు ఈ చిన్న పిల్లాడు తన చుట్టూ ఉన్నటువంటి చెట్లు పక్షులతో మాట్లాడుతూ అవి సూచించే అర్థాన్ని తెలుసుకుంటున్నట్టు చూస్తాడు.
(05:06) మొదట్లో మహంతిజీకి ఇవన్నీ అబద్ధాలని అనిపించింది. కానీ ఇక్కడ మహారాజ్జీ ఒక స్టోరీ చెప్పిన తర్వాత మహంతిజీ అది విని షాక్ అవుతారు. మహారాజ్జీ ఏం చెప్పారంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ గ్రామంలోనే ఒక వరద వచ్చింది. ఆ వరద వల్ల టెంపుల్ యొక్క సీలింగ్ పగిలిపోయింది. దానివల్ల గ్రామస్తులు మొత్తం ఇబ్బంది పడి ఈ పెద్ద చెట్టు కిందకి వచ్చేసి ఇక్కడే ఆశ్రయాన్ని తీసుకున్నారు.
(05:25) అయితే మీకు తెలుసా ఈ విషయం నాకు ఎలా తెలిసిందో ఈ చెట్టే నాకు స్వయంగా చెప్పిందని అంటాడు. ఇది విన్న తర్వాత మహంతిజే షాక్ అవుతాడు. మహంతిజే ఇక్కడ మహారాజీకే కొన్ని విషయాలు చెప్తారు. అవేంటంటే నువ్వు ధ్యానం చేయాలంటే మోహ మాయలు అన్నిటిని కూడా వదిలేయాలి. నీకు మోహం ఉన్న ఏ విషయం కూడా నీ దగ్గర ఉండకూడదు. అందుకే నువ్వు ఏకాంతంలోనే ధ్యానం చేయాలి.
(05:45) కానీ మాటల మధ్యలోనే ఇక్కడ మెహంతిజ మరో విషయం చెప్తూ ఇప్పటివరకు నాకు ఒక్క మంచి శిష్యుడు కూడా దొరకలేదు. నేను చనిపోయిన తర్వాత నువ్వు ఈ ఆలయాన్ని చూసుకునే బాధ్యతని తీసుకుంటావని నేను కోరుకుంటున్నాను అని చెప్తాడు. దానికి మహారాజ్జీ అంటాడు మీరే చెప్పారు కదా నేను మోహ మాయల అన్నిటిని కూడా వదిలేయాలని చెప్పారు కదా అందుకే నేను ఆలయ బాధ్యతని స్వీకరించలేనని రిప్లై ఇస్తాడు.
(06:06) అయితే మెహంతిజీతో అతని యొక్క కొంతమంది ఫాలోవర్స్ ఇలా చెప్తారు. మీరు ఆ పిల్లాన్ని పరీక్షించాలని ఆ ప్రశ్నలు వేశారు. జరిగింది చూస్తే ఆ పిల్లాడు ఆల్రెడీ దాంట్లో పాస్ అయ్యాడని అంటారు. కానీ మెహంతిజే ఇక్కడ అంటాడు నేను అతనికి ఎలాంటి టెస్ట్ పెట్టి పరీక్షించాలని అనుకోలేదు. నిజానికి అతనే నన్ను పరీక్షిస్తున్నాడని రిప్లై ఇస్తాడు.
(06:25) ఆ తర్వాత మహారాజ్జీ గుజరాత్ కి వెళ్ళారు. అక్కడ కూడా ఆయన వాటర్ లో సాధన చేశారు. అయితే ఆ ప్లేస్ లో కూడా ఎంతో మంది పిల్లలు తరచు ఆయన్నను ఇబ్బంది పెట్టేవారు. కానీ మహారాజ్ వాళ్ళతో సరదాగా ఆడుకునేవారు. అయితే ఒకరోజు ఆయన కొంతమంది పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు అందరికీ ఫుడ్ ని పెడుతున్నారు. కానీ వాళ్ళు అంటరాని వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వలేదు.
(06:45) కేవలం మహారాజీకి ఒక పిడికడ అన్నాన్ని మాత్రమే ఇచ్చారు. కానీ ఆ ఒక్క పిడికడ అన్నం చేసినటువంటి అద్భుతాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ గుప్పిట్లో పట్టుకున్నటువంటి రైస్ ఏ మాత్రం అయిపోవట్లేదు. ఈ సంఘటన చూసిన తర్వాత అక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క మనిషి పూర్తిగా షాక్ లో ఉన్నారు. వాళ్ళు ఈ బాలుడు బాగా విచిత్రమని ఇతను ఒక సాధారణ మనిషి కాదని అర్థం చేసుకొని ఇతను తప్పకుండా ఆ భగవంతుని నుంచి వచ్చినటువంటి అంశని భావించడం మొదలు పెట్టారు.
(07:13) ఆ తర్వాత మహారాజ్జీ ఉత్తరప్రదేశ్ లోని ఫరూకాబాద్ కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ప్లేస్ పేరు నేమ్ కరో. అక్కడే గోపాల్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతను ఇక్కడ మహారాజ్జీతో చెప్తాడు ఈ చోటు ఎంతో పవిత్రమైంది. ఇక్కడికి పెద్ద పెద్ద సాధువులు వచ్చేసి ఇక్కడే ఉపాసన చేస్తారు. అంటే దేవుడి యొక్క భక్తిలో మునిగిపోతారు.
(07:32) గోపాల్ ఈ గ్రామంలోనే ఉంటూ పక్షులను పట్టుకునే పని చేస్తున్నాడు. ఈ అన్ని విషయాలు విన్న తర్వాత మహారాజ్ జై గోపాల్ తో నువ్వు ఎందుకని ఈ పని చేస్తున్నావ్? చూస్తుంటే నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావ్. మరి ఆ పక్షులకి కూడా స్వేచ్ఛగా జీవించాలనే కోరిక ఉంటుందని అంటాడు. దానికి గోపాల్ అంటాడు నేను ఈ పని చేయకపోతే నా సంసారం ఎలా నడుస్తుంది? ఇంట్లో తల్లి భార్య పిల్లలు ఉన్నారు.
(07:51) వాళ్ళని ఎవరు చూసుకుంటారు? డబ్బు సంపాదించిన తర్వాత నన్ను కూడా ఎవరైనా చూసుకోవాలి కదా ఎందుకంటే నా కొడుకు నన్ను చూసుకోలేడు. దానికి గల కారణం ఏంటంటే నా కొడుకు ఒక హ్యాండీక్యాప్ పర్సన్ అని చెప్తాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత మహారాజ్ అంటాడు ఈ విషయం నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి నీ భార్యని కాళీతో తన్నినప్పుడు ఆలోచించాల్సిందని అంటాడు.
(08:12) ఈ మాట విన్న గోపాల్ పూర్తిగా షాక్ అయిపోయి ఈ బాబాకి నేను నా భార్యను కాళీతో తన్నాననే విషయం ఎలా తెలిసిందని అనుకుంటాడు. సో గోపాల్ అంటాడు ఇప్పటి నుంచి నేను అలాంటి తప్పు చేయనని చెప్తాడు. దానికి మహారాజ్ నా ఆశీర్వాదాలు ఎప్పటికీ కూడా నీతో ఉంటాయి. నీకు త్వరలో ఇంకొక కొడుకు పుడతాడు. అతను పూర్తిగా సేఫ్ గా ఉంటాడు. అతనే నిన్ను భవిష్యత్తులో బాగా చూసుకుంటాడని చెప్పేస్తాడు.
(08:32) ఇక మహారాజ్ ఇదే గ్రామంలోనే ఉంటాడు. కానీ ఆయన ఇప్పటిలాగే గ్రామం లోపలికి వెళ్ళకుండా గ్రామం బయటనే సాధన చేస్తూ ధ్యానం చేసేవారు. ఇప్పుడు జనాలకి ఆయన శక్తుల గురించి తెలిసిపోయింది. అందుకే గ్రామంలోని ప్రతి మనిషి ఆయన ముందుకు వచ్చేసి వాళ్ళు తమ సమస్యలని చెప్పేస్తే మహారాజ్జీ వాటిని తీయించేవారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు మహారాజ్జీ కోసం ఏదో ఒకటి చేయాలని కోరుకునేవారు.
(08:52) అయితే గ్రామస్థులు మహారాజ్జీ గ్రామం లోపల ఉండాలని కోరుకున్నారు. దానికోసమని గ్రామస్థులు ఒక చిన్న కుటీరం లాంటిది కట్టాలని కట్టిన తర్వాత అందులోనే మహారాజ్ ఉంటారని డిసైడ్ అవుతారు. కానీ మహారాజి దానికి ఒప్పుకోకుండా నేను ఊరి లోపల కాకుండా ఊరికి బయట ఉండాలని కోరుకుంటున్నా. దగ్గరలో ఇక్కడ ఏదైనా గుహ లాంటిది ఉంటే మరీ మంచిదని చెప్తాడు.
(09:12) అయితే గ్రామంలో ఎలాంటి గుహ లేదు కానీ ఆ గ్రామస్తులే తమ సొంత కష్టంతో గ్రామంలోనే ఒక మంచి గుహ కట్టేశారు. దాంట్లో మహారాజ్జీ తరచూ సాధన చేస్తూ ధ్యానం చేసేవారు. కాకపోతే ఆ గుహ లోపలికి ఎవ్వరు కూడా వెళ్లేవారు కాదు. ఎందుకంటే మహారాజీ చాలా రోజుల వరకు అదే గుహ లోపల ధ్యానం చేసేవారు. కొన్నిసార్లు 10 రోజులు కూడా దాటిపోయినా కూడా బయటకు వచ్చేవారు కాదు.
(09:33) అయితే ఆయన బయటకు వచ్చినప్పుడల్లా గ్రామస్తుల యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా వినేసి వాటిని తీర్చేవారు. ఒకరోజు ఇలాగే మహారాజ్కి గుహ లోపల ఉండేసి చాలా రోజులు గడిచిపోతాయి. అయినా కూడా ఆయన ఇంకా గుహ నుంచి బయటకి రాలేదు. అందరికీ అనిపించింది ఏంటంటే గోపాల్ లోపలికి వెళ్లేసి చూడాలని మహారాజ్ ఎక్కడున్నారో తెలుసుకోవాలని కోరుకుంటారు. అందువల్ల గోపాల్ లోపలికి వెళ్ళాడు.
(09:52) కానీ అతను లోపలికి వెళ్ళగానే అక్కడ చూసినటువంటి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మహారాజ్ గుహ లోపల ధ్యానం చేస్తున్నారు. కానీ ఆయన మీద దాదాపుగా 20 నుంచి 25 పాముల వరకు ఉన్నాయి. ఇది చూసిన తర్వాత గోపాల్ పరిస్థితి ఎంతగా దిగజారిందంటే నెక్స్ట్ డే అతనికి బాగా జ్వరం వచ్చేస్తుంది. డాక్టర్ అతన్ని టెస్ట్ చేశాడు.
(10:11) అయినా కానీ అతను ఇంకా సెట్ అవ్వలేదు. అప్పుడే గుహ నుంచి మారాజీ బయటక వచ్చేసి గోపాల్ కి ప్రసాదాన్ని తినిపించిన వెంటనే అతని ఆరోగ్యం అంతా బాగైపోతుంది. గోపాల్ చెప్తాడు నేను గుహ లోపల చూసింది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అని అంటాడు. దానికి మహారాజ్ నువ్వు గుహలో చూసింది నీ మనసులో బాగా నాటుకొని పోయింది. నువ్వు నన్ను భగవాన్ శివుని పేరుని పెట్టేసి తలుచుకొని ఉన్నావు.
(10:32) ఎందుకంటే నువ్వు శివుణని నమ్ముతావని రిప్లై ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో చూస్తే మహారాజ్జీ గ్రామస్తులతో బాగా కలిసిపోతాడు. దీనివల్ల వాళ్ళు గ్రామం బయటనే ఒక టెంపుల్ ని కట్టించారు. అదే ఆలయం లోపల భగవాన్ హనుమాన్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. అయితే భగవాన్ హనుమంతుని యొక్క ఈ విగ్రహాన్ని మహారాజ్జీని తయారు చేశారు. ఆ తర్వాత అందరూ ఆలయానికి వచ్చేసి తరచు హనుమంతునికి పూజ చేయడం ప్రారంభించారు.
(10:56) నెక్స్ట్ సీన్ లో మహారాజ్జీ తన కొంతమంది స్నేహితులతో కలిసి పార్వతి అనే ఒక మహిళ ఇంటికి వెళ్తున్నారు. పార్వతి మహారాజ్జీని ఎంతో గౌరవిస్తుంది. అయితే మహారాజ్కి ముందుగానే తెలుసు. పార్వతి ఇంట్లో ఈరోజు పెరుగన్నం బండి ఉందని ఆల్రెడీ తెలుసు. దీనివల్ల ఆయన అందరిని తీసుకొని పార్వతి ఇంటికి వెళ్తాడు. కానీ పార్వతి ఇంట్లో కేవలం ఇద్దరికీ సరిపడా మాత్రమే ఆహారం ఉంది.
(11:19) దీనివల్ల పార్వతి బాగా టెన్షన్ లో పడిపోతుంది. అయితే మహారాజ్ పార్వతితో నువ్వు ముందు ఆహారాన్ని వడ్డించు. అన్ని సరిపోతాయని చెప్తాడు. ఆ తర్వాత పార్వతి అందరికీ వరుస పెట్టేసి ఫుడ్ ని వడ్డిస్తూ ఉంది. కానీ ఆమె ఫుడ్ ని వడ్డిస్తున్నప్పుడల్లా ఆహారం అనేది ఏమాత్రం అయిపోవట్లేదు. ఇది చూసి పార్వతి షాక్ అవుతుంది. ఆమెకి ఇవన్నీ మహారాజ్ కృప వల్లే జరిగాయనే విషయం అర్థమవుతుంది.
(11:40) అయితే అలాంటి అద్భుతాలు గ్రామంలో తరచూ జరుగుతూ ఉండేవి. దీనివల్ల అందరూ కూడా మహారాజ్కి రెస్పెక్ట్ ఇచ్చేవారు. సీన్ కట్ చేస్తే మహారాజ్ గోపాల్ తో కలిసి ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ కోచ్ లో కూర్చొని ఉంటారు. అక్కడ కొంతమంది ఫారనర్స్ కూడా కూర్చొని ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక బ్రిటిషర్ ఇక్కడ ఒక బాబా కూర్చొని ఉన్నాడని చూశాడు.
(11:57) అయితే ఈ బ్రిటిషర్ ఎలాగైనా సరే బాబాను ట్రైన్ నుంచి దింపేయాలని అనుకున్నాడు. కానీ బ్రిటిషర్ కి తెలిసింది ఏంటంటే ఆ మనిషి దగ్గర టికెట్ కూడా లేదని తెలుస్తుంది. వెంటనే అతను టీసీ దగ్గరికి వెళ్ళేసి ఇతన్ని వెంటనే ట్రైన్ నుంచి బయటకి దించేయాలని చెప్తాడు. అది విన్న టీసి చాలాసేపు ఆలోచించాడు. కానీ బ్రిటిషర్ బాగా స్ట్రిక్ట్ గా నువ్వు ఇతన్ని తప్పకుండా తీసేయాలని చెప్తాడు.
(12:18) అప్పుడు టీసీ చైన్ ని లాగాడు. ఇప్పుడిక ఇష్టం లేకపోయినా బాబాను ట్రైన్ నుంచి దించేశారు. గోపల్ అయితే ఎంతో బ్యాడ్ గా కిందికి దింపేస్తారు. కానీ ఈ అన్ని విషయాలు చూసిన తర్వాత మహారాజ్జీ కేవలం ఒకే ఒక విషయం చెప్పారు. నేను నిత్యం ప్రవహించే నీళ్ళ లాంటి వాడిని నేను ఎక్కడైనా ఉంటాను. అయితే మీరు ఈరోజు చేసింది సరైన పని చేశారు. జై సీయారామ్ అని చెప్పేసి నవ్వుతూ మహారాజ్జీ ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయి దూరంగా వెళ్లి కూర్చొని సీతారాముల యొక్క భజల్ని చేయడం మొదలెడతాడు.
(12:43) ఇక గ్రామస్థులకి మహారాజ్జీ చెట్టు కింద కూర్చొని ఉన్నారనే విషయం గురించి తెలిసినప్పుడు వెంటనే గ్రామం మొత్తం కూడా అక్కడికి వచ్చేసి వాళ్ళు అదే చెట్టు కింద కూర్చొని మహారాజ్తో కలిసి భజనల్లో పార్టిసిపేట్ చేశారు. కొంచెం టైం అయిపోయిన తర్వాత ఆ బ్రిటిషర్ అంటాడు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్తాడు. దాంతో ట్రైన్ స్టార్ట్ అయింది. ఇంజన్ కూడా ఫైర్ అయింది.
(13:02) కానీ ట్రైన్ మాత్రం ముందుకే కదలట్లేదు. ఇది చూసి అందరూ షాక్ అవుతారు. ట్రైన్ లోపల వెంట వెంటనే బొగ్గు మీద బొగ్గు వేశారు. ట్రైన్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ట్రైన్ లో బొగ్గు ఉన్నప్పటికీ అది ముందుకే కదలలేదు. దానివల్ల ట్రైన్ లో కూర్చున్నటువంటి ప్రతి టెక్నీషియన్ ఇబ్బంది పడ్డాడు. వాళ్ళకి ట్రైన్ లో ఎలాంటి తప్పు జరిగిందో అర్థం కాలేదు.
(13:18) అప్పుడు వాళ్ళు ఇంకొక ఇంజన్ ని పిలుస్తారు. ఎందుకంటే ఆ ట్రైన్ ని లాగేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలని తెచ్చిఉంటారు. కానీ కొత్త ఇంజన్ ని తెచ్చినా కూడా ట్రైన్ ని లాగడంలో ఫెయిల్ అవుతుంది. చూస్తుంటే సెకండ్ ఇంజన్ వల్ల కూడా ఇప్పుడు పని అవ్వట్లేదు. ఆ తర్వాత టెక్నీషియన్స్ పై అధికారులతో అన్ని విషయాలు చెప్తూ ఇంతకుముందు ట్రైన్ లోపల ఫస్ట్ క్లాస్ లో ఒక బాబా కూర్చుని ఉన్నాడు.
(13:39) కానీ అతన్ని బయటకి దింపేసినప్పటి నుంచి ఈ ట్రైన్ అనేది నడవట్లేదు. ఈ విధంగా మేము మహారాజ్ని కిందికి దించామని అన్ని విషయాలు చెప్పేస్తారు. అయితే ఆ పై అధికారికి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో మొత్తం అర్థమవుతుంది. ఆ తర్వాత రైల్వేకి సంబంధించిన పెద్ద పెద్ద అధికారులు మహారాజ్జీ ముందుకు వచ్చేసి ఆయనతో క్షమాపణ అడుగుతారు. అప్పుడు మహారాజ్ నవ్వుతూ నేను మీ ట్రైన్ ని ఆపలేదు.
(13:59) మీరు చేయగలిగితే మరో ఇంజన్ ని తెప్పించుకొని ఈ ట్రైన్ ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని అంటాడు. అంతేకాదు మహారాజ్జీ దగ్గర ట్రైన్ టికెట్స్ కూడా చేతిలో కనిపిస్తాయి. బ్రిటిషర్ ఇది చూసి షాక్ అవుతాడు. కానీ అందరికీ ఇది మహారాజ్ చేసినటువంటి పనినని తెలిసిపోయింది. దాంతో పై అధికారులంతా ఆయనకు క్షమాపణ చెప్తారు. ఫైనల్ గా ఆ ఫారనర్ కూడా వచ్చేసి క్షమాపణ చెప్పేస్తాడు.
(14:18) ఈ బ్రిటిషర్ కి ఈ మనిషి మామూలు మనిషి కాదని ఇక నుంచి అలాంటి వ్యక్తితో ఫిట్టింగ్ పెట్టుకోకూడదని బాగా అర్థం చేసుకుంటాడు. దీని తర్వాత మహారాజ్జీ అదే ట్రైన్ లో తిరిగి కూర్చున్నారు. దాంతో ఆ ట్రైన్ అనేది తిరిగి రన్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మహారాజ్ యొక్క నాన్నకి తన కొడుకైన లక్ష్మీ నారాయణ ఎక్కడున్నాడో తెలిసిపోయింది.
(14:37) దీనివల్ల ఆయన తన కొడుకుని తిరిగి తీసుకెళ్ళారు. నాన్న తన కొడుకుని ఎలా ఒప్పించారంటే మా జీవితంఅంతా సరిగ్గానే ఉంది. కానీ నీ పెళ్లి ఇదివరకే అయిపోయింది. కాబట్టి దీనివల్ల నువ్వు ఇంటికి తిరిగి రావాల్సిందేనని తన తండ్రి పట్టుదల వల్ల అండ్ తన భార్య కారణంగా మహారాజ్ తిరిగి ఇంటికి రావాల్సి వస్తుంది. ఇకపోతే భార్యా భర్తలు ఇద్దరు కూడా సంతోషంగా ఉన్నారు.
(14:54) కానీ భార్యకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆమె తన భర్తతో మీరు బయట ఉండే హస్బెండ్ లా ఉండరు. మీరు నా వైపు కూడా చూడరని చెప్తుంది. దానికి మహారాజ్జీ నా ఈ జీవితం కేవలం భగవాన్ శ్రీరామ్ మరియు హనుమంతులపై అంకితమై ఉంది. దీనివల్ల నా నుంచి నువ్వు ఎక్కువగా ఆశించకని చెప్పేసి ఇక్కడే మహారాజ్జీ తన నాలుకపై విత్తనాలు పెట్టుకున్న వెంటనే ఆ సీడ్స్ నుంచి అప్పుడే ఆయన నాలుకపై నుంచి చిన్న చిన్న మొలకలు ఎత్తడం చూసేసి ఆయన భార్య షాక్ అవుతుంది.
(15:20) సో ఇలా మహారాజ్జీ ఒక అద్భుతాన్ని కూడా చూపించినట్టు అవుతుంది. ఇక మహారాజ్జీ తన భార్యతో అంటాడు నేను తిరిగి నేను కరోలికి వెళ్ళాలని కోరుకుంటున్నా ఎందుకంటే నాకు అక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. నాకు వాళ్ళని కలవాలని ఉందని చెప్తాడు. ఇక మహారాజ్జీ తిరిగి వెళ్లేసి గోపాల్ని కలిసాడు. కానీ గోపాల్ మహారాజ్జీకి చెప్పిన కొన్ని విషయాలని విని మహారాజ్జీ స్వయంగా షాక్ అవుతారు.
(15:39) గోపాల్ అంటాడు టెంపుల్ ఉన్న చోట రఘు అనే ఒక వ్యక్తి ఆ భూమి నాదని చెప్తూ ఆ భూమిపై కేవలం నాకు మాత్రమే హక్కు ఉందని వాదిస్తున్నాడని గోపాల్ అంతా చెప్పేస్తాడు. దానికి మహారాజి ఆ భూమిపై హక్కు అనేది ఎవరిది అవుతుందనే విషయం ఆ భగవంతుడికే తెలుసు. ఇప్పటి నుంచి నేను ఇక్కడ ఉండలేను. ఇక ముందు ఈ ఆలయాన్ని నువ్వే చూసుకోవాలని చెప్తాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలిసినప్పుడు మహారాజ్జీ ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్తున్నాడని తెలిసేసి ఆ గ్రామం మొత్తం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటుంది.
(16:05) వాళ్ళు ఇక్కడ మహారాజ్జీని ఆపాలని బాగా ట్రై చేశారు. కానీ మహారాజ్జీ ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సీన్ కట్ చేస్తే స్టోరీ అనేది ఫరూకాబాద్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ కొంతమందికి మహారాజ్ గురించి ఇంకా ఏం తెలియదు. వాళ్ళకి ఇతను ఒక పెద్ద మోసగాడు లేదా ఒక దొంగ అని అనిపించింది. దీనివల్ల నాజిర్ అలీ అనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఆయన్ని జైల్లో బంధించాడు.
(16:24) కానీ వాళ్ళు అలా చేసేసి ఒక పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే తర్వాత రోజు పొద్దున్నే కొంతమంది కానిస్టేబుల్స్ నాజిర్ అలీ దగ్గరికి వచ్చేసి ఒక విషయాన్ని చెప్తారు. దాన్ని విన్నాక అతను షాక్ అవుతాడు. వాళ్ళు ఏం చెప్తారంటే మేము లాకప్ లో బంధించినటువంటి వ్యక్తి ఇప్పటికీ ఇంచుమించుగా 10 సార్లు లాకప్ నుంచి బయటక వచ్చాడని చెప్తారు. ఇదే విషయంపై అందరూ షాక్ లోనే ఉన్నారు.
(16:44) నాజిర్ అలీకి వాళ్ళు చెప్పే మాటల మీద నమ్మకం లేదు. ఎందుకంటే అతను స్వయంగా తన కళ్ళతో ఈ అన్ని విషయాలని చూడాలని కోరుకున్నాడు. ఇక అతను పోలీస్ స్టేషన్ కి రీచ్ అయినప్పుడు చూస్తే అక్కడ లాకప్ యొక్క తాళాన్ని తెరవడానికి చూస్తే అది ఓపెన్ అవ్వట్లేదని చూస్తాడు. ఇది చూసిన నాజిర్ అలీ లోపల కూర్చున్న మనిషి సాధారణ మనిషి కాదని అర్థం చేసుకున్నాడు.
(17:03) ఆ తర్వాత మహారాజ్జీ ఆ తాళాన్ని ఓపెన్ చేస్తాడు. ఇక నాజర్ అలీ లోపలికి వెళ్లేసి మహారాజ్జీతో నన్ను క్షమించండి. మీరు ఒక సాధారణ మనిషి కాదని నాకు ముందే తెలియదు. ఈ విషయం నాకు ముందుగానే తెలిసంటే నేను మిమ్మల్ని జైల్లో లాక్ చేసి ఉంచేవాడిని కాదని చెప్పేసి క్షమాపణ అడుగుతాడు. నెక్స్ట్ సీన్ చూస్తే ఒక తెలియని వ్యక్తి దారి తప్పిపోయాడు. అతను ఎలాంటి పరిస్థితిలో అయినా సరే తెల్లారే కల్ల తన బ్రదర్ దగ్గరికి వెళ్ళేసి ఈ ఫైల్ ని ఇవ్వాల్సి ఉంది.
(17:26) కానీ దానికోసం అతను ఈ అడవిని దాటాలి. దీనివల్ల అతను ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఒక వ్యక్తి అతనికి ఈ అడవి గురించి ఒక విషయం చెప్పాడు. అదేంటంటే ఎవరైనా సరే ఈ అడవిని దాటాలని ప్రయత్నిస్తే అతను చనిపోతాడు లేక పిచ్చివాడు అవుతాడు. అదే కాకపోతే అతని శవం కూడా ఎవరికీ దొరకదని చెప్పి ఉంటాడు. కానీ ఈ వ్యక్తికి తన బ్రదర్ దగ్గరికి వెళ్ళడం ఎంతో అవసరం ఉంది.
(17:47) కాబట్టి అడవిలో ముందుకు వెళ్తే అతను ఆ అడవిలో ఇరుక్కుపోయాడు. అతనికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఎందుకంటే ప్రతీసారి అతను ఒకే దారిలోకి వచ్చేసి ఆగుతున్నాడు. అంతే కాదు సడన్ గా అతనికి అక్కడే కొన్ని వింత వింత సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల ఆ వ్యక్తి భయపడతాడు. సరిగ్గా అదే టైంలో అతను తన స్వచ్ఛమైన మనసుతో భూతు పిశాచ నికట నహి ఆవే మహాబీరు జబ్ నాము సునావే అనేసి హనుమాన్ చాలీసాని జపించడం మొదలెడతాడు.
(18:11) అలా చేయగానే కొద్ది క్షణాల్లోనే అక్కడ వినిపిస్తున్నటువంటి ఆ వింత శబ్దాలు దూరమవుతాయి. అంతలో అక్కడికి అతని ముందు మహారాజ్జీ వస్తాడు. ఆయన్ని చూసి ఒక్క క్షణం వరకు ఆ వ్యక్తి భయపడ్డాడు. కానీ మహారాజ్జీ అంటాడు నువ్వు హనుమాన్ చాలీసాని జపం చేస్తున్నావ్. ఇంత పవిత్రమైన హనుమాన్ చాలీసాని జపించినప్పటికీ మనుషులంటే భయపడుతున్నావ అని అంటాడు.
(18:30) ఆ వ్యక్తి మహారాజ్తో నేను పొద్దున కల్లా ఇంటికి చేరుకోవడం ఎంతో అవసరం ఉంది. నేను ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళాల్సిందేనని చెప్తాడు. అప్పుడు మహారాజ్ అతనికి ఒక దారిని చూపించారు. ఆయనకి ఆ వ్యక్తి యొక్క పేరుతో పాటు ఆ ఫైల్ లో ఏముందో కూడా తెలుసు. ఇది విన్న ఆ వ్యక్తి షాక్ అయిపోయి ఈ వ్యక్తి మామూలు మనిషి కాదని ఒక దైవ రూపం అని అర్థం చేసుకొని వెళ్లే ముందు అతను ఆయనతో మహారాజ్జీ నేను మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానని అడుగుతాడు.
(18:53) దానికి మహారాజ్ అంటారు సరిగ్గా 20 ఏళ్ల తర్వాత తప్పకుండా మనం కలవడం జరుగుతుందని చెప్తాడు. ఇక్కడితో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో అవుట్ ఆఫ్ 10 కి మీరు ఎంత రేటింగ్స్ ఇస్తారో చెప్పేసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా పోస్ట్ చేయాలని ఆశిస్తున్న మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు జై శ్రీరామ్ జై హనుమాన్.
No comments:
Post a Comment