Monday, October 12, 2020

నిజాయితీ కి బహుమానం

నిజాయితీ కి బహుమానం

అమెరికా పోలీసులు ఒక 15 ఏళ్ళ కుర్రాడిని అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశ పెట్టారు


జడ్జి విషయమేంటని అడిగితే
ఈ అబ్బాయి ఒక బేకరీ లో బ్రెడ్ దొంగతనం చేసి పారిపోతుండగా అక్కడ వాచ్మాన్ పట్టుకున్నాడని...

అప్పుడు పెద్ద అద్దం పగిలిపోయిందని అందుకుగాను ఆ యజమాని కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పారు

జడ్జి: దొంగతనం చేసావా
పిల్లాడు : అవును మేడం

జడ్జి :ఏమీ దొంగతనం చేసావు
పిల్లాడు: ఒక బ్రెడ్ ప్యాకెట్

జడ్జి: డబ్బులిచ్చి తీసుకుని ఉండొచ్చుగా
పిల్లాడు :డబ్బులు లేక తీసుకున్నాను మేడం

జడ్జి :ఇంట్లో వారిని అడిగి ఉండొచ్చుకదా
పిల్లాడు :అమ్మ మాత్రమే ఉన్నారు అందులోనూ అనారోగ్యం అన్నాడు.

జడ్జి :ఏదైనా పని చేయొచ్చుగా నువ్వు.
పిల్లాడు :ఒక కారు షెడ్ లో పనిచేస్తుండేవాడిని మేడం. అమ్మకు అనారోగ్యమని ఒక్కరోజు సెలవు పెట్టినందుకు పని నుండి తీసేసారు.

జడ్జి :ఇంకెక్కడైనా పని చేయొచ్చుగా...

పిల్లాడు :ఉదయం నుండి యాభై మంది దాకా పని అడిగాను. ఒక్కరుకూడా ఇవ్వలేదు.
సూర్యుడు అస్తమించేసాడు ఇక ఏమీ చేయలేక ఈ పనిచేశానని తలదించుకున్నాడు.

పిల్లాడితో సంభాషించాక జడ్జి తీర్పు రాయడం మొదలుపెట్టారు.
ఈరోజు ఈ పిల్లాడి పరిస్థితికి అందరం నేరస్థులమే నాతో సహా
ఆకలి అంటున్న అబ్బాయికి ఒక్క స్నేహహస్తాన్ని అందించలేక పోయాము.
అందుకు జరిమానా ఇక్కడ కోర్ట్ లో ఉన్న ప్రతిఒక్కరు, ఇతడిని పట్టుకున్న పోలీసులు నాతో సహా అందరూ 10 డాలర్ లు కట్టాలి.
ఏ ఒక్కరు కట్టకుండా బయటకు వెళ్ళలేరు.
ఇక ఇతడిపై కేసు పెట్టిన షాప్ యజమాని 100 డాలర్ లు జరిమానా కట్టాలి.

ఈ మొత్తాన్ని ఆ పిల్లాడికి అందించాలి అని తీర్పు రాశారు.
ఆ పిల్లాడు, అక్కడ ప్రజలు ఆ జడ్జి తీర్పుకు ఆశ్చర్యపోయారు.
ఆ పిల్లాడు తల ఎత్తి జడ్జి ని చూడగా బాధతో కళ్ళ వెంట కన్నీళ్లు.

సమాజంలో ఆకలి కోసం దొంగతనం జరుగుతున్నది అంటే మనం అందించలేని ఆ స్నేహ హస్తమే కారణం అని ఆ జడ్జి తలవంచుకున్నారు.

ఇంకా ఏదో ఒక మూల నీతి నిజాయితీ బతికేఉన్నదని ఇలాంటివారిని చూసినప్పుడే అనిపిస్తున్నది

ఆకలి అన్నవారికి అన్నం పెడదాం.

ఆకలి విషయంలో అబద్ధం ఆడలేరు కదా ఎవరైనా.
🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment