Saturday, January 1, 2022

మంచి *మాట*.. లు

స్వామియే శరణం అయ్యప్ప 🙏
ఆత్మీయ బంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు.. సమస్యలు రూపు మాపే విజ్ఞా నాయకుడు వినాయకుడు కష్టాలను తొలగించే వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వారు హరి హార సుతుడు అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..

బుధవారం --: 29-12-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
అదృష్టం అంటే ఆస్తులు ఉండటం ఒక్కటే కాదు కడుపారా తినగల్గటం కంటినిండా నిద్రపోగల్గడం కష్టపడి పని చేసుకో గల్గడం కష్టసుఖాలు పంచుకొనే వ్యక్తులు కల్గివుండటం ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోయింది దైర్యంగా అడగలేని భయస్తూల వల్ల మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోయింది .

అవసరం అవకాశం లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలా మారకుండా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధ పడాలని ఎప్పుడూ కోరుకోకు తెలియక బాధ పెడితే వారిని క్షమించు తెలిసి బాధ పెడితే ఆ తీర్పు కాలానికి అప్పగించు .

మనిషి చుట్టు మంచి చెడు కష్టం నష్టం ప్రేమ స్నేహం అన్నీ ఉంటాయి దేన్ని వదిలేస్తాం దేన్ని తీసుకుంటాం అన్నదాన్ని బట్టి మన సంతోషం ఆధారపడి ఉంటుంది , నవ్వించే వందమంది స్నేహితులు లేకపోయినా పర్లేదు కష్ట కాలంలో నీ కన్నీళ్ళు తుడిచే మనసెరిగిన నేస్తం ఒక్కరు ఉన్నా చాలు .

బాదలు అనేవి ఆకాశంలో చందమామ లాoటిది , ఒక రోజు ఎక్కువగా ఉండవచ్చు ఒక రోజు తక్కువగా ఉండవచ్చు మరోక రోజు కనపడకపోవచ్చు అందుకే మనం సంతోషంగా ఉండాలి బాదలున్నాయని బాదపడుతూ కాలం వృదా చేసుకోరాదు .

సేకరణ ✒️*మీ .. ఆత్మీయుడు AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment