Thursday, January 27, 2022

జీవితమంటే ఏమిటి..?

"జీవితమంటే ఏమిటి..?
💫🌹💫🌹💫🌹💫🌹💫🌹💫🌹

📚✍️ మురళీ మోహన్

👌ఎంత ఆలోచించినప్పటికీ జీవితమంటే ఎమిటో తెలియక సతమతమవుతున్న ఒక జీవితపు ప్రయాణ బాటసారి గురువు వద్దకి వెళ్ళి -

"స్వామీ ....!!!! ఎంత ఆలోచించినా జీవితం అంటే ఎమిటో తెలియట్లేదు ఇక మీరే నాకు జ్ఞాన ప్రదాత అని శరణు వేడాడు . ..

అది చూసిన గురువు గారు ఆ శిష్యుడిని పోస్టు మాస్టర్ వద్దకి తీసుకెళ్ళి, ఈరోజు "ఉత్తరాల సంచిని" శిష్యుడికి ఇప్పించి ఆ సంచిలో ఉన్న ఉత్తరాలను అడ్రసుల వారీగా పంచిరమ్మని ఆజ్ఞాపిస్తాడు.

అది చూసిన ఆ బాటసారి కొంత ప్రశ్నార్థకంగా చుస్తూ ......

సరే గురువు గారు చెప్పారు కదా....అని ముందుకి సాగుతాడు .

అలా ఇల్లిల్లూ తిరిగి ఉత్తరాలు పంచుతూ ఉండగా ఒక ఇంటికి వచ్చిన ఉత్తరంలో, ఆ ఇంటి బిడ్డకు ఉద్యోగం వచ్చిందని లేఖ ఉంటుంది , అది చూసి సంతోష పడతాడు.

మరో ఇంటికి వచ్చిన లేఖలో వారి బంధువొకరు మరణించారన్న వార్త చూసి బాధపడతాడు.

ఇంకో పేద వృద్ధురాలికి పించను డబ్బులు మనీ ఆర్డర్ ద్వరా ఇచ్చి సంబరపతాడు.

ఇంకొకరి బంధువుల ఇల్లు మంటలలో కాలిపోయిందన్న ఉత్తరమిచ్చి విలపిస్తాడు.

అలా తిరుగుతూ సాయంకాలానికి గురువుగారి ఆశ్రమానికి చేరుకొని విచారంగా కూర్చుంటాడు.

గురుదేవుల రాకను గమనించి గబుక్కున లేచి కొంత అలసటతో కొంత విచారంతో కొంత తెలుసుకోగలిగానన్న సంతోషంతో గురువుగారి పాదాలకు మనస్కరించి వెళ్ళిపోతాడు.

ఏంటీ .......!!! కథ ను మధ్యలో ఆపాననుకుంటున్నారా .......
నిజమేనండి కథ అయిపోయింది,




!!!...ఆలోచించండి ఆ శిష్యుడికి ఏమి అర్థమయ్యుంటుంది .....?????

"....జీవితమంటే పోస్టు మ్యాన్ భుజానికున్న ఉత్తరాల సంచి లాంటిది అందులో సంతోషం, బాధల కలబోతల ఉత్తరాలున్నట్టు, జీవితం కుడా సుఖ దుఃఖాల కలబోత అన్నిటినీ భరిస్తూ ముందుకి సాగడమే జీవితం .... "

💫🌹💫🌹💫🌹💫🌹💫🌹💫🌹

సేకరణ

No comments:

Post a Comment