Saturday, January 1, 2022

మంచి మాటలు

ఆత్మీయ బంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు.. వినాయకుడు సుబ్రహ్మణ్యస్వామి మరియు హరిహర సుతుడు అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మంచిగా ఆలోచిస్తూ మంచి పనులు చేద్దాం సమాజానికి ఉపయోగపడదాం
బుధవారం --: 22-12-2021 :--

నిజాయితీ లేని నూరు మంది వెనుక నడవడం కవ్నా నిజాయితీ ఉన్న ఒక్కడి వెనుక నడవడం ఉత్తమం !

ఆశకు అంతముండదు పైసాకు పద్థతుండదు ఈ రెండిటి వెనకాల పరిగెత్తేటోడికి మనఃశాంతి ఉండదు ,

మన పరిచయానికి మాటలు అక్కర్లేదు చిన్న చిరునవ్వు చాలు మంచితనానికి డబ్బుతో పనిలేదు,మంచి మనసుంటే చాలు స్నేహానికి చుట్టరికం అక్కలేదు మనసులోని భావనలు కలిస్తే చాలు ,

మనకు ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణం రేపు అనేది దేవుడు ఇచ్చే వరం .

జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు నవ్వే వారికి ఏడ్చే రోజు ఏడ్చే వారికి నవ్వే రోజు వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే !

నీతో ఉన్న వారు నిన్ను ఎందుకు కలిసామా అనేలా బతకకూడదు నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అని బాధపడేలా ఉండాలి . ఏ బంధమైన ఒక అడుగు మనం ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం కానీ అన్ని అడుగులు మనమే వేస్తే మనమే చులకన అవుతాము ,

మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు ఒక్కటి ఎవరో చెప్పింది వినడం , రెండు విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం .

తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టు చిన్నదైనా తులసి చెట్టునే పూజిస్తాం అలాగే చెడ్డవారు ఎంత గొప్పవారు అయినా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం , అరుపులు గెలపు కాదు మౌనం ఓటమి కాదు సమయానికి తగినట్టుగా ఉండటమే మనిషి గొప్ప లక్షణం .‌

సేకరణ ✒️*మీ ..ఆత్మీయుడు . AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment