శ్రీకృష్ణుని సందేశం
కర్మలు చేయకుండా ఎవడూ ఒక్క క్షణం కూడా ఉండలేడు... శ్రీకృష్ణుని సందేశం
కర్మలు చేయనంత మాత్రాన పురుషుడు కర్మ బంధాలకు దూరంగా ఉండలేడు. కేవలం కర్మ సన్యాసం వల్ల కూడా ఆత్మజ్ఞానం లభించదు.
కర్మలు చేయకుండా ఎవడూ ఒక్క క్షణం కూడా ఉండలేడు.
ప్రకృతి గుణాల ప్రభావాలకు లోనై ప్రతి వాళ్లూ అన్యంత్రులై కర్మలు చేస్తూనే ఉన్నారు
పైకి అన్ని కర్మేంద్రియాలను అణచిపెట్టి మనసులో మాత్రం విషయ సౌఖ్యాల గురించి ఆలోచించే అవివేకిని కపటాచారం కలవాడు అంటారు
అర్జునా! మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని, కర్మేంద్రియాల ద్వారా నిష్కామ కర్మ చేస్తున్నవాడు ఉత్తమడు
నీ కర్తవ్య కర్మ నీవు ఆచరించ వలసిందే. కర్మలు విడిచి పెట్టడం కంటే చేయడమే శ్రేయస్కరం.
కర్మలు చేయ కుండా నీవు జీవనయాత్ర కూడా సాగించ లేవు
యాగ సంబంధ మైనవి తప్ప తక్కిన కర్మలన్నీ మానవులకు సంసార బంధం కలగ జేస్తాయి.
కనుక ప్రతి ఫలాపేక్ష లేకుండా దైవప్రీతి కోసం కర్మలు ఆచరించు - కృష్ణుడు
పార్థా! ఇలా తిరుగుతున్న జగత్ చక్రాన్ని అనుసరించని వాడు పాపి. ఇంద్రియ లోలుడు. అలాంటి జీవితం వ్యర్థం
ఆత్మలోనే ఆసక్తి, సంతృప్తి, సంతోషం పొందే వాడికి విద్యుక్త కర్మలేవీ ఉండవు
నీవు చేసిన పాపపు కర్మలు ఏవైనా ఉన్నా అవి ఒక్క ధ్యాన సాధన ద్వారా దగ్ధం చేసుకోవచ్చు
అందుకే ఓ అర్జునా నీవు చేస్తున్న కర్మలకు ఫలితాన్ని ఆశించ కుండా ముందు "జ్ఞాన యెాగివికా"
🙏🙏🕉🕉🚩🚩🌹🌹🌷🌷
No comments:
Post a Comment