లోకం పోకడ
---------------------
"ఏందే రంగమ్మా! పిల్లల కాడికని పట్నం బోతివి! బిడ్డకాడ,కొడుకు కాడ చెరిన్ని రోజులు ఉంటివా!"
..
అడిగింది ఎంకమ్మ.
"ఏం వుండుడో తల్లీ! మా కొడుకు ఇంటికి బోయిన్నా!
ఎబ్బే ఛీ! రెండు రోజులు గూడ వుండబుద్ది గాలె! కోడలమ్మ గుండెలుదీసిన బంటు!మావోడ్ని ఆడిస్తాది! చవట ! ఇంట్ల అన్ని పనులు ఆడే జేస్తడు! మొగోడంటె ఎట్లుండాలె
సూడబుద్ది గాలె! వుండబుద్ది గాక మూడో రోజే బిడ్డ ఇంటికి బోయినా!"
"బిడ్డోళ్లు యెట్లున్నారు?"
"ఎట్లుండుడు ఏంది? మా అల్లుడు భలేమంచోడు! పిల్లని కాలు కింద బెట్టనీయడు!అన్ని పనులు ఆయనేజూసుకుంటడు! మొగుడంటె గట్లుండాలే!ముచ్చటైతాది ఆల్ల సంసారం జూస్తె !
ఇంగ ఇరవై రోజులు ఆడనేవుండొచ్చినా! అస్సలు రాబుద్ది గాకపాయె!"
"ఎట్లనైన నీది అదృష్టమే తల్లీ!"
😀😂🤣
_శ్రీ_
No comments:
Post a Comment