నేను చెట్టునే
........................
ఒక కొండ మీద రెండు చెట్లు పెరుగుతూ వుండేవి..
ఒకటి చాలా బలంగానూ రెండవది కొద్దిగా చిన్నదిగానూ వుండేది...ఒక రోజు కార్పెంటర్ వచ్చి ఆ రెండు చెట్లను కొట్టుకు పోయాడు...బలంగా వున్న చెట్టు యొక్క కొంత కలప తో,, పవిత్రమైన దేవాలయం వాకిళ్ళు అయ్యాయి...ఆ చెట్టు "' నేను దేవాలయం వాకిళ్ళు అయ్యాను"" అని సంబర పడిపోయింది.. ,,, మరికొంత కలపతో పూజించ బడే దేవుళ్ళ బొమ్మలు అయ్యాయి.. అప్పుడు ఆ చెట్టు "" నేను పవిత్రమైన దేవుళ్ళ బొమ్మలు అయ్యాను అనుకుంది.. ...,,, మిగిలిన కలప తో పవిత్ర గ్రంధాలు నిల్వ వుండే కబోర్డ్స్ అయ్యాయి...ఆ చెట్టు నేను గొప్ప గ్రంథాలను మోసే
కబొర్డ్స్ అయ్యాను అని ఇంకా సంబర పడిపోయింది...
రెండవ చెట్టు వాష్ రూం తలుపులు అయ్యాయి...
అప్పుడు కూడా ఆ చెట్టు ""నేను తలుపులుగా
మారినప్పటికీ నా మూల స్థితి చేట్టునే అని సంతృప్తిగా వుంది..మరికొంత కలపతో వేశ్య వాటిక
గేటుకు ఉపయోగించారు...అప్పటికే ఆ చెట్టు నా మూల నిజ స్థితి నేను చెట్టునే అన్న వాస్తవంలో ఆనందంగా వుంది..మిగిలిన కలపతో శవాల పెట్టెలు
తయారు చేశారు..అప్పుడు కూడా ఆ చెట్టు నా మూల నిజ స్థితి నేను చెట్టునే అని ఆనందంగా వుంది....
ఆ నగరం మీద బయటి దేశం యుద్ధం చేసింది..బాంబుల దాడుల్లో
మొత్తం నగరం తగలబడి పోయింది..ఆ రెండు చెట్ల యొక్క కలప మొత్తం బొగ్గు బొగ్గు అయిపోయింది..
మొదటి చెట్టు అయ్యో నేను చనిపోయానే అని గగ్గోలు పెట్టింది...
రెండవ చెట్టు నేను బొగ్గు అయినప్పటికీ నా నిజ స్థితి చెట్టే,,,నా ఈ బొగ్గు యొక్క మూల రూపం కూడా నేనే ...నా నిజ మూల స్థితిలో నేను చెట్టునే అని ఆనందంగా వుంది...
మనం అయా పదవుల్లోకి లేదా ఆయా మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు బాస్ అవుతాం...ఎమ్మెల్యే అవుతాం..,,,mro అవుతాం,,,తల్లి అవుతాం..తండ్రి అవుతాం,,,కొడుకు అవుతాం,,చెల్లి అవుతాం,,శరీరం అవుతాం,,..కానీ అవన్నీ మన పాత్రలు మాత్రమే..అవే నిజమని మొదటి చెట్టులాగా బ్రమించ కూడదు...పాత్రలు కాకతాళీయం...మారుతూ వుంటాయి...
రెండవ చెట్టు లాగా...ఎలా మనం పాత్రల్లో ప్రవేశిస్తున్నా కూడా మనం ,,,మన మూల నిజ స్థితి
ఆత్మే ( చెట్టే ) అని గుర్తుంచు కుంటే ఎప్పుడూ
ఆనందమే...బాల్యం ,,యవ్వనం ,,, కౌమారం,,,వృధ్యాప్యం,,,శవం ఎలా మారినా కూడా మనం ఆత్మే,,,చెట్టే...మూల స్థితి చెట్టే...ఆత్మే...
No comments:
Post a Comment