Thursday, November 24, 2022

కష్టాలు కష్టాలు అని మనం తెగ బాధపడతాం😭 కాని నిజానికి మనవి కష్టాలు అంటారా ?

 కష్టాలు కష్టాలు అని మనం తెగ బాధపడతాం😭
కాని నిజానికి మనవి కష్టాలు అంటారా ?

ఇంద్రుడు అంతటివాడు శాపం తట్టుకోలేక 
వెళ్లి తామరతూడులో దాక్కున్నాడు *

నహుషుడు శాపం వలన తొండగా మారిపోయాడు*

హరిభక్తుడైన పరమ భాగవతోత్తముడు
ప్రహ్లాదుడు తన సంపదలు కోల్పోయి
గాడిదగా మారి ఊక తిన్నాడు *

పాండవులు అడవుల పాలయ్యారు.
వేరేవాడి దగ్గర ఆవులు కాచారు, గుర్రాలను మేపారు. వంటలు వండారు. సేవ చేశారు *

నలుడు భార్యని కూడా కోల్పోయి
తన శౌర్యం కోల్పోయి అడవుల్లో తిరిగాడు *

దేవతలు తమ ప్రతిభ కోల్పోయి తలా ఓ దిక్కు పారిపోయి వందల సంవత్సరాలు దాక్కున్నారు *

రాముడంతటి వాడె భార్యతో
అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది *

శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద
జరిగే దాడులు ఎదుర్కుంటూ నే ఉన్నాడు *

అనేకమంది రాక్షసులు, సైంధవుడు, జరాసంధుడు,         
ఎందఱో కృష్ణుడి మీదికి, అతడి రాజ్యం మీదికి మాటిమాటికి దాడులు చేశారు * చివరికి..
తన కొడుకుని తన కళ్ళ ముందే
చంపితే.. చూస్తూ ఉండిపోయాడు *

అయన భార్యలని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు *

రుక్మిణికి అర్జునుడు చితి పేర్చితే
యోగ విద్య ద్వారా ఆ మంటల్లోకి ఆహుతి అయింది*

సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు
వెళ్లి తపస్సు చేసి శరీరం వదిలింది *

పెళ్లైంది మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతీదేవి దృతరాష్ట్రుడి తో సహా అగ్నీకీలల్లో ఆహుతై పోయింది

ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారిపోయాడు*

అంతటి దేవతలు, మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు.       వీటి ముందు మనకి వచ్చే చిన్ని చిన్ని కష్టాలు
ఓ లేక్కంటారా ? కానేకాదు *

ప్రతీది కాలం నిర్ణయిస్తుంది.. 

నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది
సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది *
అది కష్టం అయినా సుఖం అయినా...
ఓపిక తో ఉండాలి..
ధైర్యంగా ఎదుర్కోవాలి... 
లక్ష్యాన్ని సాధించాలి...
 🙏💐🌹🌷🙏

No comments:

Post a Comment