రమణ మహర్షి
కావ్యకంఠ వాసిష్ట గణపతిముని మొదటిసారి రమణ మహర్షి వద్దకు వచ్చినప్పుడు, తపస్సంటే ఏమిటని ప్రశ్నించాడు. ‘‘నేను అనే భావం ఎక్కడినుంచి వస్తోందో అన్వేషిస్తే మనస్సు దానిలో లీనమైపోతుంది. అదే తపస్సు. ఒక మంత్రం జపించేటప్పుడు ఆ మంత్రపు ధ్వని ఎక్కడినుంచి పుడుతోందో ఆ బుద్ధిని మార్చినట్లైతే మనస్సు దానిలో లీనమై పోతుంది. అదే తపస్సు’’ అని రమణులు సమాధానమిచ్చారు. రమణమహర్షి నిరాడంబరతను, శక్తిమత్వాన్ని కీర్తించారు. యోగి రామయ్య మరొకరు. కొన్ని సంవత్సరాలు మౌనంగా ఆశ్రమంలోనే ఉన్నారు. మహర్షి సన్నిధిలో నివసిస్తే చాలు. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం కుతూహలం వచ్చే వాడెవడూ ఉత్తచేతులతో తిరిగిపోడు.🕉️🚩🕉️
No comments:
Post a Comment