Sunday, April 2, 2023

*****మన ఆలోచనలకు తగ్గట్టుగా మన జీవితం వుంటుంది

 🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

*మన ఆలోచనలకు తగ్గట్టుగా మన జీవితం వుంటుంది*

ఒక వ్యక్తి ఘోరతపస్సు చేసి దేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు!!...

స్వామి అందరి మనసులొని మాటలు నాకు తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు...

సరే అని చెప్పి మాయమయ్యాడు దేవుడు!!...

కొన్నిరోజులు తరువాత ఆ వ్యక్తి వెక్కివెక్కి ఏడుస్తూ దేవుడిని పిలిచాడు!!..

దేవుడు ప్రత్యక్షమై ఏమైందని అడిగాడు!!...

స్వామి అందరూ నాతో అబద్ధం చెబుతున్నారు నేను అసూయపరుడని, నేను చెడు కోరుకునేవాడినని, నేను ఇతరుల ఎదుగుదలను ఓర్వలేనివాడినని అంటున్నారు అని అన్నాడు!!...

అందుకు చిన్నగా నవ్విన భగవంతుడు - ఇదిగో కాసేపు కళ్ళుమూసుకుని ఈ రావిచెట్టు కింద పడుకో అన్నాడు!!...

_ఒక తాగుబోతు వాడు వచ్చాడు, ఇతనెవడో బాగా తాగి ఇలా పడుకున్నాడు అని అన్నాడు_

_ఒక కూలి వచ్చాడు , ఎంత కష్టపడ్డాడో ఇక్కడ ఇలా సేదా తీరుతున్నాడు అని అన్నాడు_

_ఒక రోగి వచ్చాడు, ఎంతటి అనారోగ్యమో ఏంటో ఇలా పడుకున్నాడు అని జాలి చూపాడు_

దేవుడు వచ్చి !!...
చూసావా వారు ఎటువంటి వారో అలాగే నిన్ను అనుకుంటున్నారు అంత మాత్రాన నువ్వు అలా ఉండవు కదా !!...

_ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నారో అని కాదు నువ్వు ఎప్పుడూ నీలా ఉండు చాలు - అదే నీ జీవితానికి ఒక పెద్ద వరం అని జీవిత రహస్యాన్ని  చెప్పి మాయమయ్యాడు..._

_నేడు మనం అంతా ఆలోచించేది ఇదే కదా!!..._

*ఎవరు నన్ను ఏమనుకుంటున్నారో ఎంటో అని, నువ్వు జనాలకు నచ్చడం కాదు ... జనార్ధనుడికి నచ్చాలి ... అప్పుడే ఈ జీవితానికి ఒక అర్థం పరమార్థం వుంటుంది ...*

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ:* 

No comments:

Post a Comment