Monday, April 3, 2023

::::: అనుభూతి vs అనుభవం:::::

 *:::::  అనుభూతి  vs అనుభవం:::::*

 *1)* అనుభూతి అనేది  మనోశారీరక వ్యవస్థ మొత్తంది.  కేవలం అనుభూతి మాత్రమే వుండి మరొక క్రియ లేని, ఎప్పటి కప్పడు దొర్లి పోతూ వుండే క్షణిక స్థితి
      అనుభవం అంటే  అనుభూతి కలిగిన తర్వాత అది నమోదు కాబడి  జ్ఞాపకం గా మారి తిరిగి జ్ఞప్తికి తెచ్చుకుంటూ వుండేది.
*2)* అనుభూతి వర్తమాన కాలానికి చెందినది.
       అనుభవం గతానిది.
 *3)* అనుభూతి స్వతంత్ర మైనది.
     అనుభవం అనుభూతి లేకుండా ఏర్పడదు.
   *4)* అనుభూతి ని సొంతం చేసుకోలేము.
       అనుభవంని  నా సొంత అనుభవం అని అంటాం
  *5)* అనుభూతి.ఒంటరిది. 
 అనుభవం,  పొందిన అనుభూతి నమోదు (recording)కాబడి, గుర్తించబడి ,జ్ఞప్తికి తెచ్చుకొని,
,నేను ,నాది అనే భావనను  కలుపు కొనిన భావన మాత్రమే.

*షణ్ముఖానంద 97666 99774*

No comments:

Post a Comment