Friday, December 1, 2023

భాషలో ఉచ్చారణ యొక్క ప్రాముఖ్యాన్ని తెలిపే ఈ చాటుశ్లోకాన్ని చూడండి:

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *భాషలో ఉచ్చారణ యొక్క ప్రాముఖ్యాన్ని తెలిపే ఈ చాటుశ్లోకాన్ని చూడండి:~*
💖 *యద్యపి బహునాధీషే తథాపి పఠపుత్ర వ్యాకరణం స్వజనః శ్వజనః మాభూత్ సకలం శకలం సకృత్ శకృత్*
💞 *~”నాయనా నీవు శాస్త్రాలు, వేదాలు నేర్వకున్నా ఫఱవాలేదు. కానీ… వ్యాకరణం నేర్చుకో! ఎందుకంటే “స్వజన” (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని ‘శ్వజన’ (కుక్కలు) అనకుండా , “సకలం” (సర్వం) అన్న శబ్దాన్ని ‘శకలం’ (ముక్క/లు) అని పలకకుండా, “సకృత్” (ఒకసారి) అన్న శబ్దాన్ని ‘శకృత్’ (మలం) అని పలకకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది.” అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.*
❤️ *సంస్కృతంలో స్పష్టమైన ఉచ్చారణకు వ్యాకరణపఠనం ఎంత ముఖ్యమో అని చాటి చెప్పటానికి ఈ చాటువు శ్లోకాన్ని మనకు వినిపిస్తారు. అయితే, ఈ శ్లోకంలో తప్పుడు ఉచ్చారణలకు తండ్రి ఇచ్చిన ఉదాహరణలు జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అవి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తాయి. ఈ శ్లోకాన్ని బట్టి, ఆ నాటికే శ-కార, స-కారాల మధ్య అయోమయం ఉండేదని మనం ఊహించవచ్చు. అదీ కాక… ఈ శ్లోకం మైథిలి ప్రాకృత ప్రాంతమో, మాగధి ప్రాంతంలోనో చెప్పి ఉండాలి. ఎందుకంటే మైథిలి, మాగధి వంటి తూర్పు ప్రాకృతాలలోనే స- కారాన్ని శ- కారంగా పలకడం తొలినుండి కనిపిస్తోంది. తండ్రి చెప్పిన ఉదాహరణలన్నీ స-కారాన్ని శ-కారంగా పలికితే అర్థం ఎంత దారుణంగా మారిపోతుందో వివరించేవే కాబట్టి ఈ శ్లోకం ఆ తూర్పు ప్రాంతాలకు సంబంధించిందేనని మనం ఊహించవచ్చు.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕 *~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment