Friday, June 28, 2024

 🔔 *సత్సంగం* 🔔

బుద్ధిలేని వాడితో వాదించడం అంటే ....
 మన చెంప మీద వాలిన దోమను మన చేత్తోనే కొట్టుకోవడం లాంటిది.
ఎన్నిసార్లు కొట్టి దాన్ని చంపాలని చూసినా, అది చావదు సరికదా, మన చెంపల్ని మనమే వాయించుకున్నట్టు అవుతుంది.


మూర్ఖులతో  వాదనకు దిగడం కంటే, 
వీలైనంత దూరంగా ఉండటమే మంచిది.
అన్నీ తెలిసిన వాడికి మనం చెప్పవలసిన అవసరం లేదు.
ఏమీ తెలియని వాడికి ఒకటికి పది సార్లు చెబితే విషయం అర్థం అవచ్చు..... కానీ 

*కొంతమంది ఉంటారు ఏ విషయం మీద వారికి అవగాహన ఉండదు.*
 *ఏ విషయం మీద వాళ్లకు పట్టు ఉండదు... కానీ 
అన్ని తెలిసినట్టు నటిస్తూ ఉంటారు,*
 *అలాంటి వాళ్లకి చెప్పడమే కాదు  వాళ్లతో వాదనకు దిగడం కూడా మూర్ఖత్వమే అనిపించుకుంటుంది.*
 *కాబట్టి నువ్వు ఏదైనా విషయాన్ని ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు వారి స్థాయిని గ్రహించి,*
 *వారికి ఏం చెప్పాలో, ఏం చెప్పొద్దో తెలుసుకుని చెప్పండి,*
 *లేదా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే అవుతుంది.*

 *మంచి విషయాలు చెప్పడం మంచిదే కానీ అది వినే వారికి కూడా అర్హత ఉండాలి కదా.*

No comments:

Post a Comment