*ఎవరి వద్ద పడితే వారి దగ్గర దానాలు తీసుకోరాదు. అవి ముప్పును కలిగిస్తాయి.*
*స్వతంత్రతను కోల్పోయేలా చేస్తాయి. సజ్జనుల వద్దనుంచి మాత్రమే,స్వాతంత్య్ర భంగం ఏ మాత్రం కలిగించక, మన మీద అధికారం చేసే ప్రయత్నం ఏమీ లేనివారి వద్ద నుండి మాత్రమే దానాలను తీసుకోవచ్చు.* 🌹🌹🌹🌹
ఆధ్యాత్మిక సాధకులు మనస్సు స్వాధీనమయ్యే వరకు యితరులతో కలిసిపోవటం చేయకూడదు. మనసు స్వాధీనంలో వుండటం అలవడితే, ఎందరిని కలుసుకున్నా హానిలేదు. 🌹🌹🌹🌹🌹
“మనసు చాలా అశాంతిగా ఉంది' అంటూ చాలామంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మహాత్ముల బోధనలను కేవలం వినడం వలన ప్రయోజనం శూన్యం. ఆ బోధనలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడే నిజమైన ఫలితం ఉంటుంది. ఎవ్వరూ చెప్పింది ఆచరించరు కానీ శాంతి మాత్రం కావాలనుకుంటారు. అదెలా సాధ్యమవుతుంది?❤️❤️❤️
బంధాలన్నిటిలో మన దేహాలపై ' మనకున్న అనురక్తి అగ్రగణ్యమైనది, అత్యంత బలిష్టమైనది. కోతులకు తమ పిల్లల మీద అపారమైన మాతృప్రేమ వుంది. మరణించిన పిల్లయొక్క మాంసమంతా కుళ్లి, రాలిపోయి, అస్థిపంజరం మాత్రమే మిగిలివున్నా,
తల్లికోతి దాన్ని ఎత్తుకొనే వుంటుంది. కాని అవి, యితర జంతువుల మాదిరే, తమ సొంత ప్రాణరక్షణకు అవసరమైనప్పుడు సమస్తాన్ని మరచిపోతాయి.
No comments:
Post a Comment