Friday, June 28, 2024

 *నేటి వాస్తవ దృశ్యం ఈ చిన్ని కథలో నాట్యమాడింది*

*వాట్ ఎ వండర్ :: ఒక చిన్న కథ*
 (పాత పోస్ట్ నే)
రచన : సుధావిశ్వం

మెసెంజర్ లో ఒక ఇద్దరి ఆడవాళ్ళ సంభాషణ:

    "హలో సరళ గారూ! 
వంటా-తంటా గ్రూప్ లో మీరు చాలా వెరైటీ పోస్టులు పెడుతుంటారు. చేసేటప్పుడు ఎలా తంటాలు పడతామో భలే చెప్తారు. ఐ లైక్ ఇట్." 

  "థాంక్యూ.. మీరూ అంతేగా తార గారూ! మీ పోస్టులు కూడా బావుంటాయి. కొత్త ప్రయోగాలతో చిత్ర విచిత్రమైన వంటలు పెడతారు. వాట్ ఎ వండర్."

  "మీరు ప్రతిదానికి వాట్ ఎ వండర్ అంటుంటారు. అది వింటుంటే మా ఫ్రెండ్ ఒకమ్మాయి గుర్తుకు వస్తుంది. అచ్చం అమెలాగే అంటారు. ఇంతకీ మీరెక్కడ చదివారు?

  "అవునా! నేను వనిత కాలేజీలో చదివాను అండి! మరి మీరూ? ఇంతకీ మీ ఫ్రెండ్ పేరు ఏంటి?"

  "నేనూ అదే కాలేజీ.  మా ఫ్రెండ్ పేరు కుమారి అండి"

   "అవునా! వాట్ ఎ వండర్! ఏ ఇయర్ అండీ?"

    "మేము 2005 బ్యాచ్ అండీ! మరి మీరూ?"

  "వావ్.. వాట్ ఎ వండర్! అయితే నేనే ఆ  కుమారిని. పూర్తి పేరు సరళ కుమారి. అయితే మీ పేరు తారనా? ఆ పేరుతో ఫ్రెండ్స్ ఎవరున్నారబ్బా?"

  "నేను సితార. పెళ్లయ్యాక ఆయన తారా అనే పిలుస్తుంటే అదే ఫిక్స్ అయిపోయా.. అబ్బా! ఎంతో ఆనందంగా ఉంది కదా! ఇప్పుడు, ఇలా  విచిత్రంగా కలవడం మనం.  కాలేజీ ఫ్రెండ్స్ మి విడిపోయి, ఇలా కలవడం. చాలా హ్యాపీగా ఉంది. ఇంతకూ మీరు ఎక్కుడుంటున్నారు?"

  "వావ్... వాట్ ఎ వండర్! నువ్వు సితారవా? నాక్కూడా చాలా హ్యాపీగా ఉంది. మనం ఒకసారి కలుద్దాం. మేము హైదరాబాద్ లో ఉంటున్నాం."

  "ఓ గుడ్! అయితే కలవొచ్చు! మేమూ ఉండేది అక్కడే. ఇంతకీ ఏ ఏరియాలో నే మీరుండేది?"

  "వావ్.. వాట్ ఎ వండర్! 
జూబ్లీహిల్స్ లో. మీరూ?"

 "మేము కూడా అక్కడే! ఎక్కడ ల్యాండ్ మార్క్ చెప్పు!"

"వావ్.. వాట్ ఎ వండర్!  అదే స్టేట్ బ్యాంక్ ఎటిఎం పక్కన 'ఆదిత్య హిల్స్' అపార్ట్ మెంట్."

   "వావ్.. వాట్ ఎ వండర్! 
మాది కూడా అదే అపార్ట్మెంట్. ఫ్లాట్ నెంబర్ ఎంత?"

"అవునా! ఫ్లాట్ నెంబర్ 401 నే"

"వాట్ ఎ వండర్!  మాది మీ పక్క ఫ్లాట్ నే అయితే 402. బయటకు రా!"

     అప్పుడు తలుపులు తెరిచి, ఒకళ్లను ఒకళ్ళు కలుసుకున్నారు.
నేటి పరిస్థితి అలా ఉంది ఒకరిని ఒకరు పట్టించుకోకుండా టీవీ, ఇంటర్నెట్ వల్ల సెల్ ఫోన్ వినియోగం ఎక్కువ అయిపోయి అనుబంధాలు, ఆప్యాయతలు తరిగిపోయి మనుషుల మధ్య దూరాలు పెంచుతున్నాయి. ప్రకృతి రమణీయత ఆస్వాదన లేకుండా పోయింది.  అందుకే ఏది ఎంతవరకు వినియోగించుకోవాలో అంతే ఉంటే ఉపయోగం. లేదంటే అపకారమే మరి.
మీరేమంటారు?


సుధావిశ్వం

No comments:

Post a Comment