. *ఆకర్షణ - వికర్షణ*
. ******************
సృష్టిలో ఆకర్షణకు
ఎంతో ప్రాధాన్యముంది.
సృష్టిని ముందుకు
నెట్టుకు పోయేది ఆకర్షణే.
ఏ మనిషైనా జంతు పశు పక్ష్యాదులైనా
ఆకర్షణ వలెనె చేరువై జీవిస్తారు.
మనుషులలో ఈ ఆకర్షణ
ఎక్కువగా స్త్రీలకే స్వంతమైంది.
పురుషులు స్త్రీలను చూచి
ఆకర్షితులై చేరువౌతున్నారు.
అవసరమైతే బానిసలౌతారు కూడా.
ఈ ఆకర్షణకు అంత శక్తి ఉంది.
సృష్టిలో ప్రతి ప్రక్రియా
ఈ ఆకర్షణ వలెనే.
మరియు ప్రతి నీచ ప్రక్రియ
వికర్షణ వలెనే.
మనలో అనుబంధానికి పునాది
ఆకర్షణ - అనురాగం.
ఆకర్షణ అందం వలన కావచ్చు.
సృష్టి నడక రహస్యం ఈ ఆకర్షణే.
సృష్టిలో ఆకర్షణతో పాటు
వికర్షణ కూడా ఉంది.
ఆకర్షణకు వ్యతిరేకం ఈ వికర్షణ.
ఈ వికర్షణ వలెనే కోప తాపాలు
విరోధాలు - విరహ తాపాలు
యుద్ధాలు మొదలుకొని
మారణ కాండాలు
మారణ హోమాలు.
ఒంటికి నొప్పులు
మనసుకు వికారాలు.
దుర్గతి దుర్గంధాలు దుర్మార్గాలు
అలక్ష్యాలు - నిర్లక్ష్యాలు.
పగసెగల పరితాపాలు.
ఇవన్నీ నరకానికి ఆనవాళ్ళు.
సృష్టి నడవడానికి ఆకర్షణ
సృష్టి వినాశనానికి వికర్షణ
పోటీ పడుతున్నాయి.
కారణభూతులౌతున్నాయి.
మనకు సుఖం సంతోషం సంతృప్తి
సత్కీర్తి ప్రతిష్టలు ఆకర్షణ వలననే
అని తెలుసుకోండి.
మనకు దుఃఖం దుష్పరిణామాలు
చెడు కీర్తి చెడు ప్రతిష్టలు
వికర్షణ వలెనే యని తెలుసుకోండి.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని
మంచి బాట గ్రహించి నడుచుకోవాలి.
ఇవే మన చక్కని మనుగడకు ఆనవాళ్ళు.
చక్కని సంస్కృతి లక్షణాలు.
*******************
రచన:--- రుద్ర మాణిక్యం. (కవి రత్న)
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా)
************************************
No comments:
Post a Comment