*మాయ.....*
*రామక్రిష్ణ పరమహంస వారు ఒకసారి "మాయ" ను దర్శించాలనుకున్నారు. కాళి మాతను ప్రార్దించారు. అప్పుడు అక్కడ గంగానది వైపు చూస్తుండగానే ఆ జలాల్లోంచి ఒక చిన్న బుడగ బయటికి వచ్చింది. అది అలా లేచి క్రమేపి పెద్దదవుతూ గట్టు మీదకి వచ్చి, చూస్తూ ఉండగానే ఒక స్త్రీ గా మారింది. ఆ స్త్రీ ఒక బిడ్డను ప్రసవించింది. కాసేపు ఆ బిడ్డను పోషించి, పెంచి, ప్రేమతో లాలించి పెద్ద చేసింది. కొద్ది సేపటికి ఎక్కడి నుండో కత్తిపీట తెచ్చింది. అంత సేపు ఆలనా, పాలనా చూస్తూ కనీ పెంచిన బిడ్డను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కరకరా నమిలి మింగేసింది. తానూ ఆ జలాల్లో కలిసిపోయింది. అయితే ఆ స్త్రీ ముఖములో నీటి బుడగ నుంచి ఉత్పన్నమైన క్షణము నుంచి, తిరిగి నీటిలో కలిసి పోయేవరకు ఒకే రకమైన ప్రసన్నత వుంది.*
*రామకృష్ణులు వంక పలకరింపుగా నవ్వి, అంతర్దానమైంది. వారికీ దృశ్యము అనుభూతమైనంత సేపు, చుట్టు పక్కల జనం సంచరిస్తున్నారు. వారెవరికీ ఈ దృశ్యం కనిపించినట్లు లెదు. అప్పుడు కాళికా దేవి ఇలా వివరించింది. "నీవు చుసిన దృశ్యం మాయ". అయితే మాయను చూచుటకు ఒకడు వుండాలి. చుచువానిని విడిచి మాయ లెదు. చూచువాడు కూడా ఆ మయాసమ్భవములొ ఒక పాత్రను పోషిస్తాడు" అని. రామక్రిష్ణులు అప్పటికే జ్ఞాన సిద్ధులు కాబట్టి స్వయముగా ప్రభావితులు కాకుండానే అ దృశ్యాన్ని దర్శించ గలిగారు. అలా కాని వారికి అది సాధ్యము కాదు. మాయానుభుతికి ఏంతో కొంత సుంకం చెల్లించాలి. అంటే అందులో పాత్రను పోషించి దాని కాస్త నష్టాలను, పంచుకొవాలి. ఈ అనుభూతి ద్వారా మాయను గురించి గ్రహించ వలసిన అంశాలు వున్నయి.*
1. *మాయ తాత్కాలికము. దానికి మొదలు, మధ్య, తుది వున్నాయి.*
2. *దానిలో సంఘటనలు ముందు ఆకర్షణీయముగా ఉన్నప్పటికీ, చివరికి దుఃఖము గానే మారుతున్నయి.*
3. *రామక్రిష్ణుల దర్శనములో మాయారూపిణి అయిన స్త్రీ గంగా జలము నుండి పుట్టి తిరిగి గంగ లోనే కలిసి పొయింది*
*అంతే కాదు తాను సృష్టించిన బిడ్డని తానే తెగ నరికి తిరిగి తనలోకే అంతర్హితం చేసుకుని మరీ గంగలో కలసిపోయింది.*
*గంగ అంటే పరబ్రహ్మము. కాబట్టి మాయ బ్రహ్మము నుండి పుట్టి, దాని నుండి పడినట్టుగా కనిపించి తిరిగి బ్రహ్మము లోనే కలిసి పోతుంది. పై దృశ్యము లోని స్త్రీ మాయకు సంకెతము. ఆమె కని, ప్రేమతో పెంచిన బిడ్డ ఆమె, దేహముతో కలుపుకుని ఈ ప్రపంచానికి సంకెతము. అనగా మాయ తాను కన్న ప్రపంచములో అంతర్భగమె. ముందు ఆకర్షణీయముగా తోచిన ప్రపంచమే చివరకు విషం, విషమం అవుతుంది.*
*దానిని వదిలింన్చుకోవటమే అభ్యాసము. దానిక్ సాధనం విచారమనే కత్తిపీట. తన సృష్టి అనే శిశువును ఖండించి అంతర్హితం చెయ్యాలి. అనగా దేహ భావన, ప్రపంచ భావన అంతరించాలని అన్తరార్ధము. అప్పుడే జీవునికి మరలా గంగా ప్రవేశము.. అనగా బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మము లో కలియుట...*
*🙏⚜️||ఓం నమః శివాయ||⚜️🙏*
🌷🌷🌷 ♨️🕉️♨️ 🌷🌷🌷
No comments:
Post a Comment