Sunday, December 28, 2025

 *_యురేకా..ఆయన పుణ్యమే టీకా..!_*
********************
లూయిస్ పాశ్చర్ జయంతి
      27.12.1822
🕷️🪳🪲🪰🦂🐞🦗

కేవలం సూక్ష్మక్రిముల వల్ల
విలువైన ప్రాణాలు పోకుండా
పడిన టాకా..టీకా..
అది కనిపెట్టిన
మాస్టర్..లూయిస్ పాశ్చర్..!

చిన్నప్పుడు బడికే సరిగా వెళ్ళని పాశ్చర్..
సారై..ప్రొఫసరై..
పరిశోధనలకు తానే సరై..
కుక్కకాటుకు టీకా దెబ్బ..
కనిపెడితే రాబిస్ కు టీకా..
జగతి మొత్తం అనలేదా
యురేకా..!

తన పిల్లలు ముగ్గురు
టైఫాయిడ్..మసూచితో
కన్నుమూసిన వైనం..
పరిశోధనల వైపు పయనం..
అంటువ్యాధులతో మరణిస్తే
శవాన్ని కాల్చాలని
ప్రతిపాదన..
అప్పుడే సూక్ష్మక్రిములు
అంతమవుతాయని 
పరిగణన..!

పశువుల్లో ఆంత్రాక్స్..
నూట యాభై ఏళ్లకు 
మునుపే..టీకా ప్రయోగం..
కోళ్ళలో కలరా 
నియంత్రణకూ మందు..
కోళ్ళ నుంచి తీసిన 
క్రిములే పారుడుకు విరుగుడు..
అవే రోగనిరోధక శక్తి..
సూపర్ కదా పాశ్చర్ యుక్తి!

పులియడం..
వేధించే సమస్య..
ద్రాక్షసారా..
తాగలేక మనసారా..
వ్యాధుల పాలయ్యే
వైన్ ప్రియులకూ వరం..
నిల్వ చేసే పద్ధతులనూ కనుగొన్న శాస్త్రవేత్త..
వెనిగరును కనిపెట్టిన
మేధావి...
పరిశోధనలే ఆయన తెలివి
విరజిమ్మిన తావి..!

✒️✒️✒️✒️✒️✒️✒️

   *_సురేష్ కుమార్ e_*
       9948546286
       7995666286

No comments:

Post a Comment