Monday, December 29, 2025

" మనిషి " జీవిత ప్రయాణం

" మనిషి " జీవిత ప్రయాణం

https://youtu.be/lElC1OMC-G0?si=HPcwfHzSnjf6iyFN


https://www.youtube.com/watch?v=lElC1OMC-G0

Transcript:
(00:00) ఈ వీడియో గురించి ఈ వీడియో వినోదం వీరోచితం హాస్యం లాంటి నవరసాల కోసం తయారు చేసిన సినిమా లాంటివి కాదు. మనిషి విడిగ దశల్లో ఎలా ప్రవర్తిస్తున్నాడు? అసలు పద్ధతిగా ఎలా నడుచుకోవాలి? అనుభవజ్ఞుల సలహాలను ఎలా పాటించాలి? కష్టకాలంలో బాధలను ఎలా తప్పించుకోవాలి? ఆనందంగా గడపడానికి ఏ పనులు చేయాలి? రకరకాల రంగాల్లో రాణించడానికి ఏమి చేయాలి? ఇలాంటి అనేక విషయాల్లో ముఖ్యంగా విద్యార్థులకు ఒక అవగాహన కలిగించడానికి చేసిన ఒక చిరు ప్రయత్నం ఇది.
(00:39) ఇక్కడున్న ఆడియోను వింటూ కనిపించే అందమైన దృశ్యాలను చూస్తూ కొన్నైనా కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించమని నా మనవి ఇట్లు మీ విధేయుడు డాక్టర్ విశ్వనాథ కుటుంబరావు ఓం మనిషి జీవిత ప్రయాణం ప్రత్యక్ష పరమాత్మ సూర్యుడు సూర్య భగవానుని అనుగ్రహం వల్లనే సర్వ గ్రహములు తిరుగుచున్నాయి. సూర్య కుటుంబంలో మూడవ గ్రహము భూమి ఈ భూగ్రహం అనేక చరాచర జీవరాసులకు ఆలవాలం ఇక్కడ ప్రకృతి ఎంతో రమణీయంగా బుగ్ధ మనోహరంగా ఉంటుంది.
(01:14) అనేక పర్వతాలు, జలపాతాలు, నదీ నథాలు, సముద్రాలు, ఎడారులు, పట్టణాలు, పల్లెలతో నిత్య నూతనంగా విరాజిల్లుతూ ఉంటుంది. అనేక అద్భుతాలు సుందర ప్రదేశాలు చిత్ర విచిత్ర వాతావరణం భిన్న జాతులు ఆశ్చర్యపరిచే సరిసృపాలు ఆరు ఋతువులతో నిత్య యవ్వనంగా దేదీప్యమానంగా నిత్యం ప్రకాశిస్తుంది. అట్టి ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మనము ఈ భూమి మీద ఎన్నో లక్షల జన్మలను పొందుచున్నాము.
(01:43) ఆ జన్మ పరంపర ఎలా ఉంటుందో చూద్దాము. మొట్టమొదటగా ఈ భూమి మీద మనం చెట్లుగా 30 లక్షలు జలచరాలుగా 9 లక్షలు క్రిమికీటకాలుగా 11 లక్షలు పక్షులుగా 10 లక్షలు పశువులుగా 20 లక్షలు చివరకు మానవులుగానాలుగు లక్షల జీవరాశులుగా జన్మిస్తున్నాము. ఇన్ని రకాలుగా మనం జన్మించడం వల్లనే జంతునాం నరజన్మ దుర్లభం అని అన్నారు.
(02:09) మానవ జన్మకు ముందు ఉన్న 80 లక్షల జీవకోటిలో జ్ఞానం లేదు. జ్ఞానం అనే విశేష గుణం ఒక్క మానవ జన్మకే ఉంది. అందుకే మానవుడు మిగిలిన అన్ని జంతువుల మీద ఆధిపత్యం చలాయిస్తున్నాడు. ప్రతి మానవుడు తాను ఇంతకుముందు పొందిన అసంఖ్యాకమైన జన్మల నుండి ఎన్నో పాపాలు మరెన్నో పుణ్యాలు సంపాదిస్తాడు. మనిషికి తాను ఇంతవరకు చేసిన పాప పుణ్యాలే నిజమైన ఆస్తులు. ప్రతి మనిషికి ఎన్నో కొండల్లాగా పాప పుణ్యాలు ఉంటాయి.
(02:39) ఈ మొత్తం అనుభవించాలంటే మనిషి కొన్ని వేల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. కానీ మనిషిగా జన్మించడం ప్రారంభించాక ప్రతి జన్మలో కొంచెం కొంచెంగా మంచి పనులను చేయడం ప్రారంభిస్తాడు. జన్మ జన్మకు ఉత్తమమైన జన్మలు లభిస్తాయి. తదనుకూలంగా అభివృద్ధి ప్రతి జన్మలో ఉంటుంది. ఆటవికుడిగా పేదవాడిగా ధనవంతుడిగా సంస్కారవంతమైన ఇంట్లో గొప్పవారి ఇంట్లో మహానుభావుల ఇంట్లో మహాత్ముల ఇంట్లో మరియు యోగుల ఇంట్లో చివరకు బ్రహ్మజ్ఞానుల ఇంట జన్మలను వరుసగా పొందుతాడు.
(03:13) ఈ మానవ జన్మలలోనే చివరకు ఏదో ఒక జన్మలో ఎన్నో కష్టాలను అనుభవించి చివరకు ఐహిక సుఖాల పట్ల విరక్తుడై ముముక్షువుగా మారతాడు. భక్తి జ్ఞాన యోగ తపః మొదలైన మోక్షకారకములైన మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ ప్రకారంగా బాగా సాధన చేస్తూ అరిషడ్ వర్గాలను జయించి వైరాగ్యాన్ని పొంది చివరకు భగవత్ సాక్షాత్కారాన్ని పొంది జనన మరణ చక్ర భ్రమణం నుండి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు.
(03:42) మోక్షం పొందేదాకా సుఖ దుఃఖాలు ఈ జీవునికి తప్పవు. ఈశ్వరుడు సమస్త చరాచర ప్రాణికోటి హృదయాల్లో ఆత్మల రూపేణ ఈశ్వరుడు విష్ణుమూర్తి ఆదిపరాశక్తి అనే పేర్లతో కొలువై ఉంటాడు. అనగా బ్రహ్మ పదార్థం ఒక్కటే ఎవరు ఏ దేవుడు లేక ఏ దేవత రూపంలో భావిస్తారో వారికి ఆయా రూపాల్లో భగవంతుడు కనిపిస్తాడు. విద్యుత్ ఒక్కటే కానీ అది ఫ్యాన్ ఎలక్ట్రిక్ లైట్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషిన్, మిక్సీ టీవీ లాంటి ఎలక్ట్రికల్ వస్తువులను కదిలిస్తుంది.
(04:15) అలాగే ఇంట్లో అంబ ఒక్కటే కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవి చదువు చెప్పేటప్పుడు సరస్వతీ దేవి ధైర్యం చెప్పేటప్పుడు పార్వతీ దేవి అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణ దేవి సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రి ఇలా అమ్మ చేసే పనిని బట్టి ఒక్కో పేరుతో పిలుస్తాము. యద్భావం తద్భవతి మనం ఎలా భావిస్తే అలాగే అవుతాము. కాబట్టి భగవంతుడు ఆడే ఈ జగన్నాటకంలో ఎవరి పాత్రను వారు పూషిస్తారు.
(04:40) నిర్మాత దర్శకత్వం గాత్రం సంగీతం స్క్రీన్ ప్లే అన్నీ ఆ భగవంతుడే అనగా ఆడేవాడు ఆడించేవాడు చూసేవాడు చూపించేవాడు వినేవాడు వినిపించేవాడు అంతా మన మంచికే ఒక రాజ్యంలో రాజు ఉన్నాడు. అతనికి ఒక మంత్రి ఉన్నాడు. ఒకరోజున రాజు కత్తితో పండు కోసుకుంటూ ఉండగా ఒక వేలు తెగిపోయింది. అప్పుడు పక్కనే ఉన్న మంత్రి అంతా మన మంచికే అని అన్నాడు.
(05:08) రాజుకు బాగా కోపం వచ్చి మంత్రిని వెంటనే జైల్లో పెట్టించాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వేటకు వెళ్ళాడు. మహారాజు అరణ్యంలో వేటాడుతూ ఉండగా ఆటవికులు చుట్టుముట్టి రాజుని బంధించారు. వాళ్ళ తమ కొండ దేవతకి రాజుని బలిద్దామని ప్రయత్నిస్తున్నప్పుడు ఇతనికి ఒక వేలు లేదు అని తెలుసుకొని ఇతను వికలాంగుడు బలికి పనికి రాడు అని భావించి వదిలేశారు.
(05:34) బతుకు జీవుడా అని మహారాజు తన సభకు వచ్చి మంత్రిని పిలవమన్నాడు. మహారాజు పిలుపు మేరకు సభకు వచ్చిన మంత్రి మహారాజుకు నమస్కరించగానే మంత్రివర్య నువ్వు చెప్పినట్లుగా నా వేలు పోవడం వల్ల నన్ను వాళ్ళు బలివ్వలేదు నా ప్రాణం నిలిచింది నాకు మేలు జరిగింది. కానీ దీనివల్ల నీకే ఉపయోగం జరిగింది అని మంత్రిని అడిగాడు. అప్పుడు మంత్రి మహారాజా నన్ను కనుక మీరు జైల్లో పెట్టకపోయి ఉంటే మీతో పాటు నేను కూడా అరణ్యానికి వేటకి వచ్చి ఉండేవాడిని.
(06:07) ఆ ఆటవికులు మీతో పాటు నన్ను కూడా బంధించి ఉండేవాళ్ళు. నాకు అవయవాలన్నీ సరిగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని బదులు నన్ను బలి ఇచ్చి ఉండేవాళ్ళు. నన్ను మీరు ఇక్కడ బంధించబట్టి నేను మీతో పాటు అరణ్యానికి రాలేకపోయాను. అందువల్ల నేను ఇక్కడే ఉండటం వల్ల నాకు మంచి జరిగింది. దీని వల్ల సారాంశం ఏమిటంటే ఏ పని జరిగినా మన మంచి కోసమే జరిగింది అని భావించాలి. అప్పుడే సంతృప్తి ఉంటుంది.
(06:32) ప్రతి పని భగవంతుని సంకల్పం రల్లే జరిగిందని భావించాలి. జన్మ తొలుత మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆరవ నెలలో శిశువులోకి జీవాత్మ ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ జీవునికి తాను పూర్వం ఏడు జన్మలలో చేసిన పాప పుణ్యాలు కనిపిస్తాయి. అప్పుడు ఆ శిశువు పశ్చాత్తాపంతో ఓ భగవంతుడా త్వరగా నన్ను భూమి మీదకి జన్మింపచేయి అన్ని మంచి పనులే చేస్తాను ఒక్క చెడ్డ పనిని కూడా చేయను అని మనసులో గట్టిగా అనుకుంటూ ఉంటుంది.
(07:03) అప్పుడు బ్రహ్మదేవుడు ఆ శిశువుకి కనిపించి అతడు క్రిందటి జన్మలో చేసిన కర్మల ఫలాలలోంచి కొన్నింటిని తీసుకొని మన నుదుటన వ్రాస్తాడు. విధాత వ్రాసే వ్రాత కాబట్టి విధివ్రాత అని అంటారు. ఆ తర్వాత శిశువు తొమ్మిది నెలల పాటు మాతృ గర్భవాసం చేసి ప్రసవ సమయంలో భూమి మీదకు రాగానే భూమి మీద ఉన్న గాలి ఆ నవజాత శిశువుకు తగిలి పూర్వ జన్మ స్మృతులన్నీ మర్చిపోతుంది.
(07:29) కొద్దిగా మిగిలి ఉన్న పూర్వ జన్మ స్మృతితో నేను ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను క్వ క్వా అంటే ఎక్కడ ఎక్కడ అని శిశువు ఏడుస్తుంది. కొద్దిసేపటికి ఆ కొద్దిపాటి పూర్వజన్మ స్మృతిని కూడా మర్చిపోయి శిశువు గుక్కబట్టి ఏడవటం ప్రారంభిస్తుంది. తర్వాత తల్లిదండ్రులు ఏ భాష నేర్పితే అది నేర్చుకోవడం జరుగుతుంది. సాంప్రదాయం పద్ధతులు అలవాట్లు సంస్కారం తల్లిదండ్రుల నుండి నేర్చుకోవటం శిశువు ప్రారంభిస్తుంది.
(07:59) ప్రతి ఒక్కలు ఎలా జీవించాలో మన పూర్వీకులు నిర్దేశించారు. వారు చెప్పిన జీవన పద్ధతులనే ధర్మములు అని అంటారు. ధర్మము అనగా చేయవలసిన పని అనగా డ్యూటీ విద్యార్థి ధర్మము ఉపాధ్యాయ ధర్మము మొదలైనవి ఒక అడుగు పరిమాణంలో పుట్టినది మొదలు దాదాపు ఆరు అడుగుల వరకు పెరిగే లక్షణం ఉన్నా ఈ మానవ దేహం సైసవం బాల్యం కౌమారం వార్ధక్యం అనే నాలుగు దశలు కలిగి ఉంటుంది.
(08:24) ప్రతి దశలో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. పుట్టినప్పుడు శిశుము అని చనిపోయాక శవం అని పిలవబడే ఈ శరీరానికి మధ్యలో పేరు పెడతారు. ఆ పేరుతో గౌరవ మర్యాదలు చతువు వ్యక్తిత్వము సత్ప్రవర్తన జ్ఞాన విజ్ఞానాలు సభ్యతా సంస్కారాలు సిరి సంపదలు భోగ భాగ్యాలు స్థిరచరాస్తులు, సభా మర్యాదలు మొదలైనవి పొందుతాడు. మనుషులు వారి వారి పూర్వజన్మ పుణ్య పాపాల వలన రకరకాల ఇళ్లల్లో జన్మిస్తున్నారు.
(08:56) ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే రోజున రిక్షావాడు, ఆటో డ్రైవర్, కార్మికుడు, టైలర్, మేస్త్రీ, టీచర్ రాజకీయ నాయకుడు, ప్రభుత్వ ఉద్యోగి, రైతు, పేదవాడు, శాస్త్రజ్ఞుడు మొదలైన వారి భార్యలు బిడ్డలకు జన్మనిస్తారు. అందరూ ధనవంతుల ఇళ్లలో జన్మించాలని కోరుకుంటారు. కానీ అలా జరగట్లేదు. పూర్వజన్మలో రుణం ఉండటం వలనే వివిధ ఇళ్లల్లో జన్మిస్తున్నారు.
(09:27) రుణానుబంధ రూపేన పశుపత్ని సుతాలయ అని శాస్త్రం అనగా పశువులు భార్య పుత్రుడు ఇల్లు ఇవన్నీ పూర్వజన్మలో రుణం ఉండటం వలనే మనకు ఈ జన్మలో కలుగుచున్నాయి. రుణం అయిపోగానే వారు దూరమైపోతారు. ఈ విషయంలో ప్రాజ్ఞుడైన మనిషి బాధపడడు. మనం ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించకపోయినా మనం ఒకరికి సేవ చేసినా లేదా మనకి వేరే వాళ్ళు సేవ చేసినా మనం ఒకరిని హింసించినా వేరే వాళ్ళు మనల్ని హింసించినా మనం ఒకరిని చంపినా లేదా వేరేవారు మనల్ని చంపినా ఇలా ఏదో రూపేణ అప్పు ఉంటే అప్పుని తీర్చడానికి ఈ జన్మలో సంబంధం మొదలవుతుంది.
(10:12) ఆ రుణం తీర్చడానికి అతని ఇంటికి భార్యగా వస్తారు. లేదా సంతానంగాను వారి ఇంట్లో జన్మిస్తారు. మరియు కుక్క, చిలుక, కుందేలు మేకలు, గేదలు దున్నపోతులు ఇలా ఏదా ఒక శరీరాన్ని పొంది ఆ ఇంటికి చేరి ఋణం తీరే వరకు సేవ చేసి ఋణం అయిపోగానే చనిపోవడమో విడిపోవడమో వేరే చోటికి పారిపోవడమో లేక పుట్టిన వాళ్ళు వికలాంగులుగా గాని మానసిక స్థితి సరిగా లేని వాళ్ళుగా గాని ఉండడం అకాల మరణం పొందడమో సరిగా చదువు లేక అల్లరి వాళ్ళుగా పెరిగి తల్లిదండ్రులకు నిత్యం మనస్తాప పాపం కలిగించడం చేస్తారు.
(10:52) పుణ్యరుణం వలన జన్మించిన వాళ్ళు మాత్రం చదువులో రాణిస్తారు. తల్లిదండ్రులకు పనుల్లో సహాయపడతారు. మంచివాళ్ళుగా పెరిగి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ మంచి సంపాదనపరులుగా మారుతారు. తల్లిదండ్రులకు గర్వకారణం అవుతారు. మంచి పనులు చేసి ఆ వంశమునకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు. మనవళ్ళు మనవరాళ్ళతో ఆ ఇల్లు కలకళలాడుతూ నిత్యం సంతోషంగా ఉంటాయి.
(11:20) కాబట్టి క్రిందటి జన్మలో ఏ మంచి లేక చెడ్డ పనులను చేశమో తెలియదు. పుట్టబోయే ముందు మన నుదుటున బ్రహ్మ ఈ జన్మలో మనం ఎన్ని కష్టాలు లేక ఎన్ని సుఖాలను అనుభవించాలో తెలియదు. విధిరాత తెలిసినా మార్చలేము. అందుకనే జీవితంలో వచ్చే కష్టాలను మనోధైర్యంతో ఎదుర్కోవాలి. సుఖ సంతోషాలను ఆనందంగా అనుభవించాలి. రాబోయే జన్మలో మంచిగా జీవించడానికి కావలసిన ఎన్నో మంచి పనులను ఈ జన్మలోనే చేతనైనంత వరకు చేయటమే మనిషిగా మన కర్తవ్యం అప్పుడే మనిషి జన్మకు సార్ధకత భోగాయతనం శరీరం అని అంటారు.
(12:00) అనగా సుఖ దుఃఖాలను భోగములు అని అంటారు. ఈ శరీరం రెండింటిని పొందుతుంది. మరియు సీరియతే ఇతి శరీరం అనగా క్షీణించే స్వభావం ఉన్నటువంటిది కాబట్టి శరీరము దహ్యతే ఇతి దేహం అనగా చనిపోయిన తర్వాత దహింపబడేది కాబట్టి దేహము అని శరీరానికి పేర్లు ఇప్పుడు వివిధ దశలలో మన శరీరం ఎలా మార్పు చెందుతుందో చూద్దాము. మొదటగా శైశవం అనగా పసి వయస్సు దాదాపు పుట్టినది మొదలు మూడు సంవత్సరముల కాలము వరకు శైశవం అని అంటారు.
(12:38) ఒక్క క్షణం తల్లి తన దగ్గర లేకపోతే పిల్లవాడు ఏడుస్తాడు. బాలానాం రోదనం బలం అనే ఒక సామెత ఉంది. ఇక్కడ పిల్లవాడు ఏడిస్తే బలమని కాదు అమ్మను తన దగ్గరకు రప్పించుకోవడానికి పిల్లవాని ఆయుధం ఏడుపు అందుకనే అతడు గట్టిగా ఏడుస్తాడు. ఈ వయస్సులో తల్లి శిశువును అనుక్షణం ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతుంది. బాల్యం నాలుగు సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు బాల్యదశ తల్లియే బిడ్డకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులు తమ సంతానానికి జన్మనివ్వడమే కాకుండా మాట్లాడే విధానం వస్త్రధారణ విధానం పద్ధతులు సత్ప్రవర్తన మంచి అలవాట్లు ఆహారం తీసుకునే విధానం సమయ పాలన ప్రపంచ జ్ఞానం సామాన్య
(13:31) జ్ఞానం ఏది తప్పో ఏది ఒప్పో తెలియజే చేయడం బంధువులు, బాంధవ్యాలు మానవతా విలువలు ఆటలు ఎవరితో ఎలా మెలగాలో తర్ఫీదు ఇలా పిల్లలకు కావలసిన ప్రాథమిక జ్ఞానాన్ని నేర్పిస్తారు. రాత్రి తమ ప్రక్కన పడుకోబెట్టుకొని అనేక నీతి కథలు పద్యాలు ఎన్నో విషయాలను తెలియజేస్తారు. ఛత్రపతి శివాజీ కూడా తన తల్లి చిన్నప్పుడు చెప్పిన వీరోచిత కథల వలన మహావీరుడయ్యాడు.
(13:59) ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడు చెప్పిన విష్ణు కథలను విని గొప్ప భక్తుడయ్యాడు. అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి అర్జునుడు నుండి పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో నేర్చుకున్నాడు. తరువాత మహావీరుడుగా తయారయ్యాడు. ఇలా పిల్లలు పెద్దయ్యాక గొప్పవారుగా తయారవ్వడానికి పునాదులు బాల్యంలోనే బలంగా పడతాయి.
(14:25) గ్రహణ ధారణ పటుర్ బాలః అని ఆర్యోక్తి బాలుడు అంటే గురువు బోధించేదాన్ని గ్రహించే శక్తి విన్నదాన్ని గుర్తుపెట్టుకునే శక్తి మరియు శారీరక బలం ఉండాలి. ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తినే బాలుడు అని అంటారు. పిల్లవానిని మొదటి ఐదు సంవత్సరాలు మహారాజులాగా పెంచాలి. ఆరో సంవత్సరం నుంచి 15 సంవత్సరాల వరకు సేవకుడిలాగా చూస్తూ చదువు నేర్పుతూ అవసరమైతే దండిస్తూ పిల్లవానిని పెంచాలి.
(14:58) 16 సంవత్సరాలు రాగానే పుత్రుని స్నేహితునిలాగా చూడాలి. పిల్లలు తమ తల్లిదండ్రులు చెప్పింది చేయరు. తల్లిదండ్రులు చేసిన పనినే చేస్తారు. గుర్తుంచుకోండి. 10 సంవత్సరాల లోపు వయసు ఉన్న మగపిల్లలు మరియు 12 సంవత్సరాల లోపు వయసు ఉన్న ఆడపిల్లలు చేసే పాప పుణ్యాలు వారి తల్లిదండ్రులకు వెళ్తాయి. ఆ వయసు తర్వాత చేసే పాప పుణ్యాలు ఆ పిల్లలకే వస్తాయి.
(15:22) తరువాత పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తారు. అక్కడ చదువుకుంటాడు. గురువుల నుండి జ్ఞానమును వివేకమును సద్ప్రవర్తనను నేర్చుకుంటారు. సభ్యత సంస్కారము మరియు తన సహ విద్యార్థులతో ఎలా మెలగాలో నేర్చుకుంటాడు. ఎంతో మంది స్నేహితులు ఏర్పడతారు. ఆటపాటలతో ఉల్లాసంగా పాఠశాల చదువు ముగుస్తుంది. కౌమార దశ తెలుగులో వీరిని స్పురద్రూపి నూనూగు మీసాలవాడు అని అంటారు.
(15:50) టీనేజ్ అడాలసెన్స్ ఏజ్ 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు వయసు ఉన్న పిల్లలను టీనేజ్ పిల్లలు అని అంటారు. ఎందుకంటే 13, 14, 15, 16, 17, 18, 19 వీరిని టీనేజర్స్ అని అంటారు. ఈ వయసులో ఎంతో ఉత్సాహంతో ఉంటారు. బాగా ఎక్సైట్మెంట్ కి గురవుతారు. ప్రతిదీ తెలుసుకోవాలనే తపనతో ఉంటారు. అందరినీ తొందరగా నమ్ముతారు. ఆకర్షణలకు లోనవుతారు.
(16:18) ఇన్ఫాక్చుయేషన్ నా ప్రేమ అనే భ్రమలో ఉంటారు. చెడు స్నేహముల వలన చెడ్డవానిగా మారడానికి ఈ వయసులోనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే తల్లిదండ్రులు గురువులు ప్రతిరోజు మంచి మాటని చెబుతూ ఉండాలి. అప్పుడే అతను ఈ వయసులో కట్టుబాటులో ఉంటాడు. యవ్వనం 20 నుండి 40 వరకు యవ్వనం ఈ దశలో కళాశాల మరియు యూనివర్సిటీ చదువు పూర్తి చేసుకుంటాడు.
(16:44) ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. స్వీట్ 16 హాట్ 18 రెబెల్ 20 అని అంటారు. దాదాపు 25 సంవత్సరాల కల్మా చదువు పూర్తి అవుతుంది. చదువు పూర్తి చేయగానే కొంతమంది వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలలో చేరుతారు. ఎవరైతే బాగా చదివారో వారు పెద్ద పెద్ద ఉద్యోగాలను సంపాదిస్తారు. కొంతమంది వాళ్ళ నాన్న చేస్తున్న బిజినెస్ ను కొనసాగిస్తారు.
(17:08) మరి కొందరు చదువుకునే రోజుల్లో సరిగ్గా చదవక జస్ట్ పాస్ మార్కులతో పాస్ అవ్వడం వలన చిన్న ఉద్యోగాలలో చేరి తాము వృధా చేసిన సమయంను గుర్తుకు తెచ్చుకుంటూ అనుక్షణం పశ్చాత్తాపంతో జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్నారు. కాబట్టి బాల్యంలో బాగా చదివితేనే పెద్దైన తర్వాత బాగా సుఖపడతారు. అందుకే ద రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిటర్ బట్ ఇట్స్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్ అని పెద్దలు అన్నారు.
(17:32) జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు బాగా చదువుకున్నవాడు అనుభవం ఉన్నవాడు మంచితనం ఉన్నవాడు ఇలా ఈ మూడు లక్షణాలు ఉన్న వ్యక్తిని మాత్రమే మంచి సలహా కోసం సంప్రదించాలి. అటువంటి వ్యక్తియే సమస్య పరిష్కారం చేయగలడు. ప్రతి వ్యక్తి ధైర్యం అనే కత్తితో సమస్యలనే శత్రువులను ఎదుర్కోవాలి. క్రమశిక్షణ అనే కవచంతో ఇతరుల ప్రభావాలకు గురి కాకుండా ఇతరులు పన్నే పన్నాగాలకు చిక్కకుండా ఎటువంటి భయాలకు లొంగకుండా ఆర్థిక మోసాలకు గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
(18:02) మనలోని అత్యాశ దురాశ పేరాసలే మనం మోసపోవడానికి కారణం అవుతాయి. ఈ ఏ పనిని చేస్తున్నా నేను ఈ పనిని ఎందుకు చేస్తున్నాను ఈ పనిని ఇప్పుడే చేయాలా దీని వల్ల లాభం ఏమిటి అని అనుక్షణం విచారణ చేయాలి. ఇక చివరి దశ వార్ధక్యం మానవ జీవితంలో మిక్కిలి దయనీయమైన స్థితి ముసలితనం 60 సంవత్సరాలు దాటిన మనిషికి వృద్ధాప్యం వస్తుంది. సీనియర్ సిటిజన్స్ అవుతారు.
(18:34) రైలు బస్సు దైవ దర్శనాలలో రాయితీలు ఉంటాయి. ధన సంపాదనలో పరిగెత్తి పరిగెత్తి ఎన్నో శ్రమలకు ఓర్చి ఎన్నో ఆటుపోట్లను చవిచూసి కుటుంబ సమాజ కార్యాలయ బాధ్యతలను మోసి మోసి బాగా అలసిపోతాడు మనిషి 60 సంవత్సరాలు దాటిన తర్వాత కాశీకి వెళితే కాయో పండో వదిలివేయాలి అంటారు. అనగా తినే కూరగాయలో లేక పండ్లను వదలమని కాదు కాయం అనగా శరీరం పండు అనగా సుఖాలనే ఫలాలు ఇంతవరకు శరీరం ద్వారా పొందిన సుఖాలు చాలు ఇక నుంచైనా శరీరం మీద మరియు సుఖాల మీద కోరికలు వ్యామోహాలు తగ్గించుకొని వచ్చే జన్మ మంచిగా ఉండాలని ధ్యానము తపములలో నిమగ్నులు కావాలనే సందేశం మనిషికి 60 సంవత్సరాల
(19:28) తర్వాత వచ్చే జీవితమంతా బోనసే ఈ శేష జీవితాన్ని ఒకచోట కూర్చొని ప్రశాంతంగా గడపాలి. వయసు పెరిగే కొద్ది శరీరంలో పటుత్వం తగ్గిపోతుంది. యవ్వనంలో వచ్చి తగ్గిన వ్యాధులు మళ్ళీ తిరగబెడతాయి. రోగాల వల్ల మంచాన పడతారు. పక్షవాతం క్యాన్సర్ హార్ట్ అటాక్ మనుషులను గుర్తుపట్టకపోవడం తన పనిని తాను చేసుకోలేకపోవడం ఎంత డబ్బున్నా చూసే నాధుడు లేకపోవడం వేసుకున్న మందులు పని చేయకపోవడం ఇంటి ముందు ఉన్న చిన్న షెడ్ లో ఒక కుక్కి మంచం మీద అతన్ని పడవేయడం బట్టలు మార్చేవారు లేకపోవడం ఇలాంటి కష్టాలు పూర్వ జన్మలోనో లేక ఈ జన్మలోనో పాపాలు చేసిన మనిషికి వస్తాయి. అందుకే పాపి చిరాయువు
(20:13) అనే సామెత ఉంది కదా అది ఇక్కడ వర్తిస్తుంది. పుణ్యాత్ములకు కంటికి రెప్పలా చూసుకునే కొడుకులు కూతుర్లు కోడళ్లు ఉంటారు. మరణ పర్యంతం జాగ్రత్తగా చూసుకుంటారు. లేదా బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత నిద్రలోనో లేక కూర్చున్నవాడు కూర్చున్నట్లుగానే చనిపోతారు. అనాయాసైన మరణం వినాదైనీయన జీవనం దేహిమే పార్వతిపతే అనగా దీన స్థితిలో లేని జీవనాన్ని సులభ మరణాన్ని మోక్షాన్ని ఇవ్వమని ఈశ్వరుని ప్రార్థిస్తారు.
(20:46) ఎవరి చేత ఆ వయసులో సేవ చేయించుకోకుండా ఎవరి చీత్కారాలు విసుక్కోవడాలు లేకుండా ఉన్నట్టుండి చనిపోవడం అనేది పొందటం అదృష్టం. ఇంకా చదువు డబ్బు ఆయుష్యు వృత్తి మరణం ఇవన్నీ ఎప్పుడు రావాలో భగవంతుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే వ్రాస్తాడు. వ్రాసిన ప్రకారం ఆ పనులు జరుగుతాయి. వాటిని ఎవరు మార్చలేరు. అందుకే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు.
(21:13) కాబట్టి భగవదనుగ్రహం వల్లనే ఈ వయసులో వచ్చే బాధలను తగ్గించుకోవచ్చు. కోరికలను తగ్గించుకోవాలి. భగవత్ చింతన ఉండాలి. ప్రశాంతమైన జీవితాన్ని గడపటం అభ్యసించాలి. మనం సమాజంలో ఎలా ఉండాలి? ఒక ఊరిలో ఒక పాము ఉండేది. అది అందరినీ కరుస్తూ ఉండేది. ప్రజలు చాలా బాధపడుతుండేవారు. ఒకసారి ఆ ఊరికి ఒక సన్యాసి వచ్చాడు. దివ్యశక్తులు కలిగిన సన్యాసిని ఆ ఊరి ప్రజలు ఇలా వేడుకున్నారు.
(21:43) స్వామి ఈ పాము మమ్మల్ని రోజు కరుస్తున్నది. చాలా బాధ పెడుతున్నది. మీరు ఒకసారి పాముకి కరవద్దని చెప్పండి అని వేడుకున్నారు. సరే అని ఆ సన్యాసి పాముకి ఓ పాము ఇకనుండి నువ్వు ఎవ్వరిని కరవవద్దు అని ఆదేశించాడు. సరే స్వామి అని చెప్పింది. అప్పటి నుంచి పాము కరవడం మానేసింది. రెండు నెలల తర్వాత ఆ ఊరికి తిరుగు ప్రయాణంలో సన్యాసి వచ్చాడు. ఇంతకుముందు ఉన్నటువంటి ఆ పాము ఇప్పుడు ఒళ్ళంతా గాయాలతో రెండు మూడు రోజుల్లో చనిపోయేదిగా ఉంది.
(22:14) ఓయి ఎందుకలా ఒళ్ళంతా గాయాలఅయ్యాయి కారణం ఏమిటి అని సన్యాసి పాముని అడిగాడు. అప్పుడు ఆ పాము స్వామి నన్ను ఎవరిని కరవవద్దన్నారు కదా అప్పుడు ఈ పూరి వాళ్ళు ఈ పాములో శక్తి తగ్గిపోయింది విషం కూడా లేదు అని భావించి అందరూ నన్ను కర్రలతో మరియు రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. చిన్న పిల్లలు కూడా రాళ్లతో కొడుతున్నారు స్వామి అని పాము తన బాధని వెళ్ళబోసుకుంది.
(22:41) అప్పుడు సన్యాసి నిన్ను కరవవద్దని చెప్పాను కానీ బుస కొట్టవద్దని చెప్పానా ఇతరులకు నువ్వు హాని చేయకూడదు నీకు కూడా ఇతరుల వల్ల హాని జరగకూడదు కదా అని ఉపదేశించాడు. అప్పటి నుంచి పాము బుసకొట్టడం ప్రారంభించింది. జనాలు భయపడిపోయి దూరంగా ఉన్నారు. పాముని బాధించడం ఆపేశారు. కాబట్టి సమాజంలో మనం ఎవరికీ హాని చేయకూడదు. ఇతరులు మనకు హాని చేయకుండా మన జాగ్రత్తలో మనము ఉండటం కూడా మన బాధ్యతయే కదా ఇదే ఈ కథలోని నీతి మానవుని శరీరం ఎలా పనిచేస్తుంది? మానవుని హృదయంలో వెలుగుతూ ఉన్న ఆత్మ ఉంటుంది.
(23:20) ఈ ఆత్మ పరమాత్మ నుంచి వచ్చిన ప్రతినిధి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కు వచ్చిన గవర్నర్ లాగా శరీరమునకు కావలసిన శక్తిని ఒక జనరేటర్ లాగా ఇస్తున్నది. సుఖ దుఃఖాలు దీనికి అంటావు. మరియు కంఠంలో ఆరు అంగుళాల పరిమాణం గల వాయు శరీరంతో జీవుడు ఉంటాడు. సుఖ దుఃఖాలు ఈ జీవుడు అనుభవిస్తాడు. ఈ జీవునికి 21 మంది పరిపాలన సిబ్బంది ఉన్నారు.
(23:51) స్టేట్ లో ఉన్న ముఖ్యమంత్రికి పరిపాలన సిబ్బంది ఎంపీలు ఐఏఎస్ లు ఐపిఎస్ లు ఉన్నట్లుగా వారు పంచజ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు నోరు చర్మము చెవి పంచకర్మేంద్రియాలు వాక్కు చెయ్యి పాదము మూత్రనాళము పురీషనాళము ఒక మనసు ప్రాణము అనగా గాలి మన శరీరంలో పది గాలులు ఉన్నాయి. అవి చేసే పని బట్టి వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. పంచప్రాణాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన పంచ ఉపప్రాణాలు నాగ కూర్మ కృకర దేవదత్త ధనుంజయ ఇలా మొత్తము 21 మంది జీవునికి సహాయకులు వీరందరి సహాయంతో జీవుడు శరీర పనులన్నీ చేయిస్తుంటాడు.
(24:42) తద్వారా సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటాడు. మరణం ఒక శాస్త్రజ్ఞుడు రోబోకు ప్రోగ్రాం రాసినట్లుగా భగవంతుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఎప్పుడు చనిపోవాలో ఎక్కడ చనిపోవాలో ఆ డేటును కూడా రాస్తాడు. ప్రతి మనిషికి బ్రహ్మ కొంత ఆయుర్దాయం ఇస్తాడు. ఆయుర్దాయం శ్వాస రూపేణ ఉంటుంది. అనగా గాలి పీల్చి వదిలి పెడితే ఒక శ్వాస అవుతుంది. కాబట్టి మన నుదిటి మీద ఈ మనిషి ఇన్ని లక్షల ఇన్ని వేల ఎన్ని సార్లు శ్వాసించాలి అని ఆయుర్దాయం రాస్తాడు.
(25:19) కేటాయించిన శ్వాసులు పీల్చడం అయిపోగానే మనిషికి మరణం సంభవిస్తుంది. అందువల్లే మనిషి చనిపోయినప్పుడు తుదిశ్వాస విడిచాడు అని అంటారు. మనిషి 100 సంవత్సరాలు జీవించాలి. కానీ కొంతమంది రకరకాల వయసుల్లో చనిపోతున్నారు. కొందరు మంచి ఆరోగ్యంతో 100 సంవత్సరాలు జీవిస్తున్నారు. అనారోగ్యం వలన రోడ్డు ప్రమాదంలోనూ వేరే వాళ్ళ చేత చంపబడో ఆహారం వికటించి గాని కొందలు చనిపోతున్నారు.
(25:50) కొంతమంది జీవితంలో వచ్చే కష్టాలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనం ఎంత జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతున్నా కూడా ఎదురుగా వచ్చేవాడు మితిమీరిన వేగంతో వచ్చి మనల్ని డీ కొట్టి మన మరణానికి కారణం అవుతున్నారు కొందరు కాబట్టి మరణాన్ని ఆపలేము. కానీ భగవంతుడు మన నుదుట వ్రాసిన ఆయుర్దాయాన్ని పూర్తిగా అనుభవించాలంటే సహజ మరణం వచ్చేవరకు మన శరీరాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
(26:19) ప్రతిరోజు తల్లిదండ్రులు గురువులు పెద్దలకు నమస్కరించాలి. వారి ఆశీర్వాద బలం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు పోంవు. శివారాధన చేసేవారికి అకాల మరణం ఉండదు. ఇలా అకాల మరణాన్ని తప్పించుకోవచ్చు. మృత్యు దేవత ఒకసారి భూలోకమంతా ప్రజలతో పూర్తిగా నిండిపోయి కిటకిటలాడుతున్నది. ఎవరూ చనిపోవట్లేదు. అప్పుడు దేవతలు సత్యలోకం వెళ్లి బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు.
(26:49) ఓ బ్రహ్మదేవా మాకు లాగా మానవులకు కూడా మరణం లేకుండా చేశవు. దేవతలకు మానవులకు తేడా ఉండాలి కదా లేకపోతే మా గొప్పతనం ఏముంది అని విన్నవించారు. బ్రహ్మ ఆలోచించి ఒక స్త్రీమూర్తిని సృష్టించి నీ పేరు మృత్యుదేవత ఇక నుంచి మానవులకు మరణం కూడా వ్రాస్తున్నాను. వారికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు వారిని చంపువు అని ఆజ్ఞాపించాడు.
(27:18) అప్పుడు మృత్యుదేవత బ్రహ్మ దగ్గర నుండి ఏడుస్తూ వెళ్ళిపోతున్నది. బ్రహ్మకు ఆమె ఎందుకు ఏడుస్తున్నదో అర్థం కాలేదు. ఆమెని వెలకకు పిలిచి ఎందుకు ఏడుస్తున్నావ్ కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు మృత్యుదేవత ఓ బ్రహ్మదేవా నేను జనాలను చంపినప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు స్నేహితులు అందరూ నన్ను తిడతారు శాపనార్థాలు పెడతారు. అందరి చేత తిట్లు తినేటటువంటి పదవి నాకు ఎందుకు ఇచ్చావని నిష్టూరమాడింది.
(27:46) అప్పుడు బ్రహ్మ ఆలోచించి నిజమే కదా అని భావించి తన పద్మాసనము నుండి దిగి మృత్యుదేవత కళ్ళ నుండి వచ్చిన కన్నీటి బిందువులను తన దోసిలతో తీసుకొని ఇకనుండి ఈ మృత్యుదేవత యొక్క కన్నీరులోని ప్రతి చుక్క ఒక్కొక్క రోగముగా అయి భూలోకములో వ్యాపించుగాక శపించి భూమి మీదకు విసిరేసాడు. అప్పటి నుండి ప్రజలకు మరణం వచ్చే ముందు ఒక వారం గాని నెల ముందు గాని ఆరు నెలల ముందు గాని ఏదో ఒక రోగం ఆ వ్యక్తికి వస్తుంది.
(28:22) కొంతకాలం రోగంతో బాధపడుతూ ఉంటాడు. మరణ సమయం రాగానే మృత్యుదేవత వచ్చి అతని ప్రాణాల్ని తీసుకు వెళ్ళిపోతుంది. కానీ జనాలందరూ రోగం వల్లనే చనిపోయాడని మహమ్మారి రోగమని రోగాలను తిడతారు. అతడు క్యాన్సర్ వలన చనిపోయాడు. మావాడు టైఫాయిడ్ వలన పోయాడు. ఆమె క్షయ వల్ల చనిపోయింది. ఇలా జనాలు అనుకుంటారు కానీ చంపేది మాత్రం మృత్యుదేవతయే గురువు గు అనగా అంధకారము ఋ అనగా నిరోధించేవాడు శిష్యునిలోని అంధకారాన్ని నిరోధించేవాడు అని అర్థం.
(28:58) గురుతర బాధ్యత కలిగినవాడు గురువు అనగా శిష్యునిలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించడం ఈ పనులు గురువు భుజస్కంధాల పైన ఉన్న బాధ్యతలు గురువు శిష్యునికి విద్యాబుద్ధులు నేర్పాలి. చదువుతో పాటు సత్ప్రవర్తన కూడా గురువు శిష్యునికి బోధించాలి. గురువు దగ్గర చదువుకొని ఆ తరువాత గురు దక్షిణ ఇవ్వకపోతే ఆ రుణశేష ఫలితంగా వచ్చే జన్మలో అతనికి చదువు రాదు.
(29:27) ఎంత తెలివి గలవాడైనా ధనవంతుల కుటుంబంలో జన్మించినా కూడా పొట్టబొడిస్తే అక్షరం ముక్క రాదు గురుదక్షిణ ఇవ్వని కారణంగా అందుకే శక్తి కొలది గురుదక్షిణ ఇచ్చి శిష్యుడు గురుఋణం నుండి విముక్తుడు కావాలి. గురువు విజ్ఞానమును వివేకమును ఇస్తాడు. బలరామకృష్ణులు రాముడు కౌశికుడు అనే ఋషికుమారుడు ఇలా అందరూ గురుదక్షిణ వారి శక్తికి తగ్గట్టుగా ఇచ్చినవారే అందువల్లే ఆచార్యదేవోభవ అని అన్నారు.
(29:52) విద్యార్థులు గురువుల దగ్గర ఎలా ప్రవర్తించాలి? బాల్యం చదువుకునే సమయము విద్యను పిల్లలు మూడు రకాలుగా నేర్చుకుంటారు. గురువుగారికి సేవ చేసి నేర్చుకునే విద్య ఉత్తమమైనది. రెండవ విధానము బాగా డబ్బిఇచ్చి చదువు నేర్చుకునేది. ఇది ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది. మూడవ విద్యా విధానం ఎక్స్చేంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేవలం ఇద్దరి మధ్యనే ఈ విద్యా విధానం సాగటానికి ఆస్కారం ఉంది.
(30:24) పిల్లలు గురువు దగ్గరకు శరణాగతితో వెళ్ళాలి. అంటే నువ్వే నాకు దిక్కు నాకు మంచి చదువు చెప్పు అనేటువంటి సద్భావనతో గురువు దగ్గరకు వెళ్ళాలి. గురువులను ప్రశ్నించే సమయంలో పరిప్రశ్న ఉండాలి అనగా గురువులను వినయముతోనే ప్రశ్నించాలి. విద్యార్థులు స్కూల్లో చదివేటప్పుడు మార్జాల కిశోర న్యాయంగా చదువుతారు. అనగా పిల్లి తన పిల్లలను నోటితో గట్టిగా కరచి పట్టుకుని జాగ్రత్తగా ఇంకొక ఇంటికి తీసుకెళ్తుంది.
(30:59) కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వేరే ఇంటికి తీసుకు వెళ్తుంది. అంటే తల్లే పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది. అలాగే స్కూల్లో చదివేటప్పుడు గురువు ప్రతి పిల్లవాని దగ్గరికి వచ్చి అతను బాగా చదువుతున్నాడో లేదో అని పర్సనల్ కేర్ బాగా తీసుకుంటాడు. కాబట్టి స్కూల్ లెవెల్లో ఈ మార్జాల కిశోర న్యాయం వర్తిస్తుంది. తరువాత కళాశాలలోకి వెళ్ళగానే మర్కట కిశోర న్యాయమును విద్యార్థులు అనుసరించాలి.
(31:28) అంటే మార్కటం అంటే కోతి కిశోరం అంటే పిల్ల కోతి ఒక చెట్టు కొమ్మ మీద నుండి మరొక చెట్టుకొమ్మ మీదకు దూకే సమయంలో పిల్ల తన తల్లి పొట్టని గట్టిగా పట్టుకొని జాగ్రత్త తీసుకుంటుంది. అంటే పిల్లె తన బాగోగుల్ని చూసుకుంటుంది. అలాగే ఇక్కడ కళాశాలలో విద్యార్థులు గురువులు చెప్పే పాఠాలను బాగా వింటూ సందేహాలు తీర్చుకుంటూ గురువుల వెంటపడాలి. వివేకంతో ప్రశ్నలు అడగాలి.
(31:56) సందేహాలు తీర్చుకోవాలి. వేదంలో కూడా గురుశిష్య సంబంధం చాలా చక్కగా చెప్పారు. సహనా వవతు అనే శ్లోకం లాగా అనగా గురు శిష్యులమైన మన ఇద్దరిని భగవంతుడు కాపాడుగాక. మనల్లిద్దరిని అతడు పోషించుగాక. మనం మన శక్తి సామర్థ్యాలను సరిగా ఉపయోగించుదుము గాక మనం నేర్చుకున్న విద్య ప్రకాశించుగాక మనలో మనం ఒకరితో ఒకరు కలహించుకోకుండా సఖ్యతతో ఉందుము గాక శారీరకంగా ప్రకృతిపరంగా జంతువుల నుండి గాని మనకు ఆపదలు రాకుండుగాక అని వేదం చెప్పింది.
(32:33) గురుశిష్యుల బంధం ఎంత గొప్పగా ఉంటే అంత బాగా శిష్యులు చదువులో రాణిస్తారు. తోటకూరనాడే చెప్పకపోతివి కదమ్మా పూర్వకాలంలో ఒక పల్లెటూరులో ఒక తల్లి పిల్లవాడు ఉండేవారు. ఒక రోజున పిల్లవాడు ప్రక్క ఇంటిలోని పెరట్లోని తోటకూరని దొంగతనంగా కోసుకొచ్చి అమ్మక ఇచ్చాడు. తల్లి మెచ్చుకుంది. కమ్మటి కూర చేసి పెట్టింది.
(33:02) మర్నాడు కూరగాయలను దొంగతనం చేసుకొచ్చాడు. అమ్మ మురిసిపోయింది. అమ్మ మెచ్చుకుంటుంది కాబట్టి నేను చేసేది మంచి పనియే అనుకొనిన ఆ పిల్లవాడు ప్రతిరోజు రకరకాల దొంగతనాలను చేస్తూ ఇంట్లో ఇస్తూ ఉండేవాడు. అలా చెడ్డదారిలో వెళ్లి వెళ్లి పెద్దయ్యాక ఒక గజదొంగ అయ్యాడు. ఒకనాడు రాజబటులు అతన్ని పట్టుకున్నారు. రాజు అతన్ని ఉరితీయమని ఆజ్ఞాపించాడు. అధికారులు అతని చివరి కోరిక ఏమిటో కోరుకోమన్నారు.
(33:35) అప్పుడు మా అమ్మతో ఒకసారి మాట్లాడాలని అన్నాడు కొడుకు అమ్మని తీసుకొచ్చారు. కొడుకు పరిస్థితిని చూసి తల్లి చెలించిపోయి ఏడవటం ప్రారంభించింది. అప్పుడు నా దగ్గరకు రా అమ్మ నీ చెవిలో నేను ఒక విషయం చెప్పాలి అని అన్నాడు కొడుకు అతని దగ్గరకు తల్లి వచ్చింది. అప్పుడు కొడుకు తల్లి చెవిని గట్టిగా కొరికాడు.
(34:01) తల్లి బాధపడుతూ ఎందుకురా నా చెవిని కొరికావని అన్నది. అప్పుడు తోటకూర తెచ్చినప్పుడే నన్ను కొట్టి నేను చేసేది తప్పు అని మందలించి ఉంటే నేను నేడు దొంగగా మారేవాడిని కాదు కదా నువ్వు నన్ను సరిగా పెంచలేదు. అందుకే నీవు చేసిన పని తప్పు అని చెప్పటానికి నీ చెవి కొరికాను. నీ వల్లే నేను అర్ధాంతరంగా చనిపోతున్నాను. అమ్మ ఎంత పని చేశవు అని ఎంతో బాధపడ్డాడు.
(34:27) కాబట్టి తల్లులు పిల్లలు తప్పు చేసినప్పుడు గట్టిగా మందలించి అవసరమైతే కొట్టైనా సరే వారిని సరైన మార్గంలో పెట్టాలి. విద్యార్థులు బాగుపడాలంటే విద్యార్థులు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలి. సంస్కారం సత్ప్రవర్తన వలన వస్తుంది. సత్ప్రవర్తనను తల్లిదండ్రులు గురువులు మరియు పెద్దలు చెబుతారు. విద్యార్థులు కేవలం డబ్బు సంపాదించడానికి అవసరమైన చదువులు చదివితే సరిపోదు.
(34:57) సత్ప్రవర్తన సూక్తులు, సుభాషితాలు, నీతి కథలను కూడా గురువులు చెప్పాలి. అప్పుడే విద్యార్థులు తాము సంపాదించిన జ్ఞానముతో ఉద్యోగం చేస్తూ నేర్చుకున్న నీతులను ఆచరించి సత్ప్రవర్తనను పాటించడం వలన ఎవరికీ అపకారం చేయకుండా తమ ఉద్యోగ ధర్మాన్ని మనశశాంతిగా నిర్వహిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. సద్గుణము ఇవ్వని చదువు నిష్ప్రయోజనము ఎందుకంటే ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో ఏ సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో కష్టాలు వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆపత్కాలాల్లో ఎవరి దగ్గరకు వెళ్ళాలో చుట్టుముట్టిన ఆపదలను ఎలా తప్పించుకోవాలో తెలియక సతమతం అవుతారు
(35:42) విద్యార్థులు సమస్య యొక్క యదార్థ స్థితిని తెలుసుకోలేక ప్రతి చిన్న సమస్యను కూడా చాలా పెద్ద సమస్య అని భూత భూతద్దంలో చూస్తూ భయపడతారు. దుర్బలులైన వారు ఆత్మహత్య లాంటివి చేసుకొని నిష్కారణంగా జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అందువల్ల జీవితంలో రాణించాలంటే శాస్త్రజ్ఞానం ఒక్కటే సరిపోదు. సత్ప్రవర్తన సుగుణాలు ధైర్యం నిర్భయత్వం చలాకీతనం సమయ స్ఫూర్తి సహాయం చేసే గుణం సభ్యత 10 మందితో ఎలా మాట్లాడాలో ఇవన్నీ ప్రతి విద్యార్థి చదువుకునే అప్పుడే నేర్చుకొని తీరాలి.
(36:22) ఒక్కసారిగా ఈ జ్ఞానం రాదు పుస్తకాలు చదివినంత మాత్రాన రాదు. మొక్కై వంగనిది మానయ విద్యార్థులు ప్రతిరోజు తప్పక చేయాల్సిన పనులు 11 ఉన్నాయి. పాఠాలు త్వరగా అర్థం కావాలంటే విద్యార్థులు ప్రతిరోజు రాత్రి 10 గంటలకు పడుకొని తెల్లవారు జామున లేచినాలుగు గంటల నుండిఆరు వరకు చదవాలి. అప్పుడు శరీరం పూర్తిగా విశ్రాంతి పొంది ఉంటుంది. ప్రకృతి చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది.
(36:51) యోగులు ఆ సమయంలో ధ్యానం చేస్తుంటారు. వారి భావనా తరంగాలు ప్రపంచం అంతటా వ్యాపిస్తాయి. మన మనసు ఆ సమయంలో పాదరసంలాగా వేగంగా పనిచేస్తుంది. ఎంత పెద్ద కఠిన పాఠమైనా అప్పుడు చదివితే త్వరగా అర్థమవుతుంది. కాబట్టి ఆ బ్రాహ్మి ముహూర్తాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని చదువులో ముందు ఉండాలి. నమస్కారం ఉపయోగాలు పెద్దలకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రతిరోజు నమస్కారాలు చేయాలి.
(37:26) ఈ ఆశీర్వాదం యొక్క ప్రభావం మనపై 24 గంటలు ఉంటుంది. అది మనకు వచ్చే అకాల మరణాన్ని ఆపుతుంది. మనం ప్రతిరోజు నమస్కారం చేస్తే ప్రమాదం జరిగే రోజును కూడా పెద్దలు మరియు గురువుల నుండి తీసుకున్న ఆశీర్వాద బలం కారణంగా ప్రాణాపాయం నుండి బయట పడతాము. మనం పని మీద కార్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి అధికారులకు నమస్కరిస్తే మన పని త్వరగా అవుతుంది.
(37:56) నమస్కరించడం వల్ల మనం మంచి వాళ్ళమని అందరూ భావిస్తారు. అలాగే తడిలి పాదాలకు ఒక్కసారి నమస్కారం చేస్తే ఆరు సార్లు భూమిని చుట్టి వచ్చిన పుణ్యం 1000 సార్లు కాశీకి వెళ్ళిన పుణ్యం మరియు వంద సార్లు సముద్రంలో స్నానం చేస్తే వచ్చేంత పుణ్యం వస్తుంది. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షణం చేసినంత పుణ్యం వస్తుందని గణేశుడు తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షణం చేయటం ద్వారా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు.
(38:28) పూర్వం కుక్కుటముని కూడా తన తల్లిదండ్రులను ఎంతో భక్తితో పూజించేవాడు. ఆ భక్తి ప్రభావం వల్ల ఆ కుక్కుటముని నిద్రలో ఉండగా అర్ధరాత్రి గంగా యమునా సరస్వతి నదులు స్త్రీ రూపాలలో అక్కడికి వచ్చి ఆ మునిపాదాలను తాకి తాము పాపాత్ముల నుండి తీసుకున్న పాపాలను తొలగించుకొని తమ దివ్య రూపాలను పొందేవారు. కాబట్టి నమస్కారం మనకు సమాజంలో గౌరవాన్ని తెస్తుంది అకాల మరణం నుండి మనల్ని తొలగిస్తుంది.
(39:02) మనకు అనంతమైన పుణ్యాన్ని తెస్తుంది మరియు మన పాపాలను తొలగిస్తుంది. మాతృదేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ దేవుని ఎలా ప్రార్థించాలి మనం ప్రతిరోజు నా కష్టాలను పోగొట్టు స్వామి నాకు సద్బుద్ధిని ప్రసాదించు స్వామి అని మాత్రమే భగవంతుని ప్రార్థించాలి. మనకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో భగవంతునికి తెలుసు మనకు అవసరమైనదే ఇస్తాడు.
(39:35) అపాయాన్ని కలిగించేదయతే ఎంత ప్రార్థించినా దాన్ని ఇవ్వడు. దేవుడి మీద నమ్మకం ఉంటే శివాయ గురవే నమః అని ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత 10 సార్లు స్మరిస్తే శివానుగ్రహం వల్ల పిల్లలకి తెలివితేటలు బాగా వస్తాయి. ఈ విధంగా ఆరు నెలలు స్మరిస్తే చాలు గొప్ప మేధావిగా పిల్లవాడు తయారవుతాడు. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఉదయం ఈ మూడు ఆసనాలు వేయాలి.
(40:05) అవి పాదహస్తాసనం త్రికోణాసనం ధనురాసనం ఈ మూడు ఆసనాలు మూడు సార్లు చప్పున వేయాలి. 15 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత 10 గుంజీలు తీయాలి. మొత్తం 20 నిమిషాలు సమయం పడుతుంది. ఇది ప్రతి విద్యార్థి ప్రతిరోజు చేయవలసిన కనీస వ్యాయామం విద్యార్థులు ప్రతిరోజు ఉదయం ఇలా స్మరించుకోవాలి. ఈ బాల్యం చదువుకోవడం కోసమే యవ్వనం ఆనందించడం కోసమే ఇలా అనుకోవటం వల్ల సమయాన్ని వృధా చేయకుండా చదువు మీదనే ఏకాగ్రత చూపించడానికి ఆస్కారం ఉంటుంది.
(40:46) ఏ పనిని చేసినా ఈ విధంగా అనుకోవాలి. నేను ఈ పనిని ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను దీనివల్ల లాభం ఏమిటి ఈ పని ఇప్పుడే చేయాలా అని నిరంతరం తను తాను ప్రశ్నించుకోవాలి. అప్పుడే వృధా పనులు చేయకుండా ఉంటాము. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాము. ప్రతిరోజు మీరు మిమ్మల్ని ఇలా ప్రోత్సహించుకోండి. ఇతరులు చేయగలిగితే నేను కూడా చేయగలను. నేర్చుకోవడం నాకొక ఆట లాంటిది.
(41:16) నా విధికి నేనే బాధ్యత వహిస్తాను. నేను తెలివైన విద్యార్థిని నేను సృష్టికర్తను మేధావిని నేను ప్రతిభావంతుడైన విద్యార్థిని నేను ఉత్సాహభరతుడైన విద్యార్థిని నేను ఎల్లప్పుడూ విజేతని నాకు పనే పూజ కర్తవ్యమే దేవుడు నాకు గొప్ప లక్ష్యం ఉంది. నేను నిరంతరం జ్ఞానాన్ని సంపాదిస్తాను. నేను కష్టపడి పని చేస్తాను నేను పట్టుదలతో ఉండి విజయం సాధిస్తాను అని ఆటలాడటం వల్ల కలిగే లాభాలు పిల్లలు రోజు ఒక గంటన్న ఆటలాడాలి.
(41:56) ఆటలాడటం వల్ల టీం్ స్పిరిట్ వస్తుంది. ఆటల్లో బాగా అరవటం వల్ల స్ట్రెస్ తొలగిపోతుంది. 10 మందితో కలిసి ఉండటం ఎలాగో అలవాటఅవుతుంది. స్నేహితులతో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. శరీరానికి బాగా వ్యాయామం అవుతుంది. చలాకీతనం వస్తుంది. కలగోల్పుతనం వస్తుంది. ప్రారంభ దశలో ఉన్న అహంకారాన్ని తొలగించుకోవడానికి సాయంత్రం సంధ్యా సమయంలో ఆకాశం యొక్క అందాలను తెలికించాలి.
(42:25) ఆకాశాన్ని చూస్తూ అందులోని ఎర్రని రంగులో ఉన్న రకరకాల ఆకారాలలో ఉన్న మేఘాలను చూడటం ద్వారా మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఆకాశంలోని నక్షత్రాలను గ్రహాలను చూడటం చేత మనసులో వివేచన జ్ఞానం మొదలై ఈ విశాల విశ్వంలో మన భూమి ఎంత ఈ భూమిలో మన దేశం ఎంత మన దేశంలో మన ఊర ఎంత అని అలా విచారణ చేయడం చేత ప్రారంభ దశలో ఉన్న అహంకారం పోతుంది.
(42:59) నేను ఇంకా చాలా తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలుగుతుంది. నిన్ను నువ్వు బాగు చేసుకోవాలంటే రాత్రి పడుకోబోయే ముందు ఒక్క ఐదు నిమిషాల పాటు ఆ రోజున చేసిన పనులను గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే సింహావలోకనం చేసుకోవాలి. తద్వారా తాము చేసిన తప్పులను గుర్తించడానికి వీలవుతుంది. నేను ఈరోజు మాటలతో ఎవరినైనా బాధించానా టైం వేస్ట్ చేశానా ఏమైనా పొరపాట్లు చేశానా అని అప్పుడే మనం చేసిన పొరపాట్లు మనకి గుర్తుకొస్తాయి.
(43:32) మనసులో మీ ఇష్ట దైవాన్ని ఓ భగవంతుడా ఈరోజు ఈ పొరపాట్లు చేశాను. రేపు ఈ పొరపాట్లను నేను మళ్ళీ నేను చేయకుండా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా ఒక్కసారి ప్రార్థిస్తే చాలు మర్నాడు ఆ పొరపాట్లు ఎవరో చెప్పినట్లుగా చేయరు. అలా ప్రతిరోజు తాము చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారా మంచివాళ్ళుగా ఎదుగుతాము. విద్యార్థికి పూర్తి జ్ఞానం ఎలా వస్తుంది? విద్యార్థి గురువు నుంచి ఒక పావు భాగ జ్ఞానాన్ని తన సొంత తెలివితేటల చేత ఒక పావు భాగాన్ని తనతో పాటు చదువుకునే స్నేహితుల నుండి ఒక పావు భాగాన్ని మరియు భవిష్యత్తులో ఆ మిగిలిన ఆ పావుభాగ జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. విద్యార్థులు ఈ
(44:14) క్రింది విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. విజయ రహస్యం ఏమిటంటే జీవితానికి ఒక ఖచ్చితమైన లక్ష్యం దాన్ని సాధించగలననే నమ్మకం తప్పక సాధించే తీరాలన్న పట్టుదల సాధించడానికి ఒక పకడ్బంది ప్రణాళిక సాధించేవరకు నిరంతర కృషి అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. ఒక స్పష్టమైన లక్ష్యం ఒక ఆశ ఒక కల ఒక ఇష్టం ఒక కోరిక ఒక ఆశయం గొప్పవాళ్ళుగా మారడానికి కావలసిన అర్హతలు శక్తి సామర్థ్యాలు తెలివితేటలు అన్నీ మీలోనే ఉన్నాయి.
(44:57) దృఢ సంకల్పం రగిలే తపన సడలని పట్టుదల మీద మీకు అపారమైన నమ్మకం ప్రేమ అభిమానం ఇష్టం మరియు గౌరవం ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని గొప్పవాళ్ళు కాకుండా ఆపలేదు. మిమ్మల్ని అదోగతి పాలు చేసేవి తెచ్చిపెట్టుకున్న అసమర్థత అజ్ఞానం ఆధారపడే మనస్తత్వం ఆత్మన్యూనత నిర్లక్ష్యం బద్ధకం సోమరితనం వాయిదాలు వేసే మనస్తత్వం అతినిద్ర మీలో ఇవి ఉంటే మీరు పేదవాళ్ళుగానే మిగిలిపోతారు.
(45:32) అసమర్థులుగా తెలివి తక్కువ వాళ్ళుగా చేతకాని వాళ్ళుగా ముద్ర పడిపోతారు. శ్రద్ధగా ఒక్కొక్క మెట్టే ఎక్కండి. ఇక్కడ ఎవరూ తెలివి తక్కువ వాళ్ళు మందమతులు బుద్ధిహీనులు లేరు. తమ మెదడును సక్రమంగా ఉపయోగించడం చేత కాక తాము చేయవలసిన పనిని తప్ప అనవసరమైన మరియు తమకు హాని కలిగించే మరియు ఉపయోగం లేని పనులు చేసేవాళ్ళు సమయాన్ని నిర్లక్ష్యంగా గడిపేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. 90% కృషి 10 శాతం ప్రేరణ ఉండాలి.
(46:06) కాయకష్టం చేసే శ్రమజీవులుగా కాక మేధావులుగా ఎదగడానికి ప్రయత్నించండి. మీలో కొన్ని బలహీనతలు చెడు అలవాట్లు మీ అభివృద్ధికి ఆటంకాలుగా ఉన్నాయి. మీరు పేదవాళ్ళు అని మీకు ఎవరి అండా లేదని మీకు రాదు చేత కాదు ఇది కష్టం మేము చేయలేము అనుకుంటూ మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ అట్టడుగు స్థాయిలోకి జారిపోతున్నారు. మీరు సర్వశక్తి సంపన్నులు అత్యంత ప్రతిభావంతులు గొప్ప ప్రజ్ఞ పాఠవాలు ఉన్నవాళ్ళు ఐన్స్టీన్ తన మేదస్సులో 15 శాతం మాత్రమే ఉపయోగించాడట గొప్పవాళ్ళు ఎవరూ గొప్ప పనులు చేసి గొప్పవాళ్ళు కాలేదు.
(46:50) తాము చేస్తున్న పనినే గొప్పగా చేశారు. మీ పేదరికాలకు మూల కారణాలు నిర్లక్ష్యం సోమరితనం అని స్వామి వివేకానందుడే చెప్పాడు. ఒక్క క్షణం రోడ్డు మీద నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఏమవుతుంది? ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇక్కడ మీకు ఎవరు ఉచితంగా సహాయం చేయరు. మీకు మీరే గొప్ప స్నేహితులు మీకు మీరే సహాయం చేసుకోవాలి. తనకు తాను సహాయం చేసుకొని వానికి దేవుడు కూడా సహాయం చేయడు.
(47:20) నిర్లక్ష్యానికి తోబుట్టివులు సోమరితనం బద్ధకం మొద్దు నిద్ర ఏ పని చేయకుండా ఊరికే పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేయటం చిన్నా చితకా పనులు చేసుకుంటూ నైపుణ్యం లేని కార్మికులుగా జీవితాలను భారంగా గడికేస్తారేమో ఆలోచించుకోండి. సోమరితనం మీ అభివృద్ధికి శత్రువుగా మారకూడదు. స్టీఫెన్ హాకింగ్ 40 సంవత్సరాల జీవితాన్ని చక్రాల కుర్చీలోనే గడిపాడు.
(47:50) చాలా కనుగొన్నాడు. పేదరికంలో పుట్టటం తప్పు కాదు అయితే పేదరికంలో చనిపోవటం మాత్రం మీ చేతులారా చేసుకునే తప్పే బిల్ గేట్స్ మీ నమ్మకాలు మీ ఆలోచనలుగా మారుతాయి. మీ ఆలోచనలు మీ పనులుగా మారుతాయి. మీ చర్యలు మీ అభిరుచులుగా మారుతాయి. మీ అభిరుచులు మీ పాత్రగా మారుతాయి. మీ పాత్ర మీ విధిగా మారుతుంది. పుస్తకాలు చదవటం ద్వారా పిల్లలు మేదోపరంగా పదునుగా ఉంటారు.
(48:25) ధ్యాన సాధన ద్వారా సంకల్ప శక్తి అభివృద్ధి చెందుతుంది. వైఫల్యం అనగా నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం పాస్ వర్తమాన చర్య హృదయపూర్వకంగా విజయం సాధించింది. ప్రతి ఒక్కరికీ మూడు ఒత్తిళ్లు ఉంటాయి. అవి ఒకటి ఆర్థిక ఒత్తిడి రెండు కుటుంబ ఒత్తిడి మూడు పని ఒత్తిడి ప్రతి ఒక్కరికీ ఆరు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగత లక్ష్యం రెండు కుటుంబ లక్ష్యం మూడు వృత్తిపరమైన లక్ష్యం నాలుగు ఆర్థిక లక్ష్యం ఐదు సామాజిక లక్ష్యం మరియు ఆరు ఆధ్యాత్మిక లక్ష్యం మీ ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుంది.
(49:14) సమాజం బాగుంటే దేశం మొత్తం బాగుంటుంది అని ఎల్లప్పుడూ భావించండి. స్పష్టంగా ఆలోచించండి. తగిన విధంగా ప్లాన్ చేయండి. మీ ప్రణాళికలను పట్టుదలతో అమలు చేయండి. జ్ఞానాన్ని సరిగ్గా అమలు చేసినప్పుడే అది శక్తివంతమైనదిగా అవుతుంది. వర్తమానంపై దృష్టి పెట్టండి. గతాన్ని చూసి పశ్చాత్తాప పడకండి. భవిష్యత్తు గురించి భయపడకండి. అర్థం చేసుకోవడం అంటే మనసుతో ఒక విషయాన్ని విశ్లేషించడమే విచారణ.
(49:45) అలా విచారణ చేయడం చేత మనసుకు ఒక అవగాహన వస్తుంది. అలా అవగాహన రావడమే అర్థం కావడం అదే విచారణ అదే జ్ఞానం సరిగ్గా మనసుతో విశ్లేషించకపోతే అర్థం కావడం లేదు అని అర్థం అంటే సరైన అవగాహన కలగట్లేదు అని భావం మనసుతో విశ్లేషించిన తర్వాత ఒక విషయం బాగా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకునే మనసే బుద్ధి.
(50:16) ఎలా మాట్లాడాలి మన మనసులోకి మంచి చెడు ఆలోచనలు మిశ్రమంగా వస్తుంటాయి. అప్పుడు మనము మన వివేకమును ఉపయోగించి యుక్తమైన పనికి వచ్చేవి సందర్భోచితమైన మరియు ఎవ్వరిని నొప్పించని మాటలనే వాడాలి. మనం మాట్లాడే మాటలు తెలివిగా ధైర్యంతో కూడి ఉన్నవిగా ప్రేమపూర్వకంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. అప్పుడే అందరూ మనల్ని మెచ్చుకుంటారు మరియు గౌరవిస్తారు. స్నేహితులు ఎక్కువమంది ఏర్పడతారు.
(50:47) చక్కని మాటకారి వివేకవంతుడు అని మనకు మంచి పేరు వస్తుంది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదిఅవుతుందని మన పెద్దలు చెప్పారు. తెలివి అనగా ఇది మనిషి మనసు యొక్క సామర్థ్యాలు సముదాయం. ఇది జీవితంలోని వివిధ పరిస్థితులను అర్థం చేసుకోవడం సమస్యలను పరిష్కరించడం నూతన అనుభవాల నుండి నేర్చుకోవడం వంటి సామర్థ్యాలను కలిగి ఉంటుంది.
(51:14) ఇది సంక్లిష్ట సమస్యలను విశ్లేషించి సృజనాత్మక పరిష్కారాలను కనుగొంటుంది. మారుతున్న పరిస్థితులకు వెంటనే సర్దుబాటు చేసుకునే సామర్థ్యం నేర్చుకున్న దాని ప్రాక్టికల్ జీవితంలో ఎలా అమలు చేయాలో తలిసి ఉండటం త్వరగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం ఇది ఈక్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని కూడా కలిగి ఉంటుంది. సమాచారాన్ని గుర్తించడం ప్రశ్నించడం అసాధారణమైన ఆలోచనలు మరియు ఊహ ఆలోచనలను స్పష్టంగా తెలియజేయగల సామర్థ్యం తన బలాలు మరియు బలహీనతలను గుర్తించడం వివేకం అనగా మనిషిలో ఇది సత్యం అసత్యం శుభం అశుభం ధర్మం అధర్మం మధ్య తేడా గమనించగలిగే సామర్థ్యం ఇది విశ్లేషణాత్మక
(51:57) స్వభావం గలది. సత్యాన్ని అన్వేషించే ధోరణి ధర్మ అధర్మ విభజన శక్తి నిత్యం అనిత్యం మధ్య తేడా గుర్తించడం ఇది తార్కిక విచారణ సరైన తను గుర్తించే సామర్థ్యం ఇది ఒక అంతర్గత జ్ఞాన శక్తి ఇది ఏది శ్రేయస్సుకు దారి తీస్తుందో ఏది హానికరమో నిర్ణయించడంలో సహాయపడుతుంది. వివేకం ఆత్మ సంబంధిత జ్ఞాన శక్తి మనసు బుద్ధి చిత్త అహంకారంలో బుద్ధి భాగంలో కనిపిస్తుంది.
(52:27) సంయమనంలో సహాయపడే గుణం అభిమానం మోహం నుండి దూరంగా ఉంచే శక్తి తప్పు చేసేదాన్ని త్రోసివేయడం మంచిదాన్ని ఆచరించడం ఆత్మాన్వేషణకై మార్గ నిర్దేశం సద్బుద్ధిని ప్రేరేపించడం ఆలోచనలు మరియు కర్మలు ధర్మబద్ధంగా జరిగేలా చేయడం జీవితం యొక్క శ్రేయో మార్గాన్ని తెలియజేయడం ఇది ఇంద్రియాల ప్రకోపాల నుండి మనసును రక్షించడం మనసు ఎటు పోకుండా నియంత్రణ చేయడం ధార్మికంగా జీవించడానికి ఇది ముఖ్య ఆధారం.
(53:01) ఆత్మ సాక్షాత్కారం సాధించాలంటే ఇది అత్యవసరం. ఒక వ్యక్తిని వివేకవంతుడిగా చేస్తుంది. సాంఘికంగా నైతికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. సత్యాన్ని అన్వేషించడంలో అత్యంత ప్రభావవంతమైన సాధనం. తప్పులను గుర్తించడం తప్పులను సరిదిద్దుకోవడం సులభం చేస్తుంది. సాంకేతిక ప్రాక్టికల్ విషయాలకు సరైన తీర్పు ఇవ్వగలదు. జీవిత నిర్ణయాల్లో జాగ్రత్తగా నడిపిస్తుంది.
(53:28) వివేకం అనేది మనిషిని మానవత్వానికి చిహ్నంగా నిలబెట్టే అంతర్లీన శక్తి ఇది స్వీయ పరిణతి మోక్ష సాధనకి సమాజ హితానికి మూలాధారం మానవ జీవితానికి ఇది అస్త్రంగా పనిచేస్తుంది. పంచభూతాల నుండి మనం ఇవి నేర్చుకోవాలి. భూమి లాగా మనం సహనంగా ఉండాలి. నీరు లాగా అందరినీ చల్లగా చూడాలి. జనాల తాపాలను అంటే బాధలను పోగొట్టాలి. జలము పాత్రకు తగ్గట్టుగా వదిగిపోతుంది.
(54:00) అట్లాగే మనం కూడా రకరకాల సందర్భాలకు అనుగుణంగా అడ్జస్ట్ అవ్వాలి. మన జ్ఞానం అగ్నిలాగా ప్రకాశించాలి. వాయువులాగా ఎక్కడ విషయాలను అక్కడే వదిలేయాలి. మనతో తీసుకెళ్ళకూడదు. తీసుకు వెళితే మనశశాంతి ఉండదు. ఆకాశం లాగా అందరితో కలిసి ఉండాలి కానీ అంటక విడిగా ఉండాలి. చీకటి అంటే 400 నుండి 700 నానోమీటర్ల వరకు ఫోటాన్స్ లేకపోవడమే చీకటి అందుకే చీకటి అంటే భయపడవలసిన అవసరం లేదు.
(54:34) ఎలాన్ మస్క్ కూడా ఒకప్పుడు చీకటికి భయపడేవాడు. ఇలా తెలిసిపోవడం వల్ల అతనికి ఇప్పుడు చీకటి ఉంటే భయం లేదు. ఎడ్యుకేషన్ అంటే సోషల్ స్కిల్స్ మంచి చెడులు గుర్తించు వివేకం ఇవ్వని చదువు వ్యర్థము ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుందని గుర్తించాలి. దోషాలను పట్టించుకోకుండా సుగుణాలను చూసుకుంటూ వెళ్ళడమే పాజిటివ్ థింకింగ్ సమస్యలు మిమ్మల్ని శక్తిమంతులుగా తయారు చేస్తాయి.
(55:06) సన్మార్గంలో నడిచిన వారి సలహాలను వినాలి. తల్లిదండ్రులను గురువులను గౌరవించనివాడు సమాజంలో చెడ్డవాడిగా ఎదుగుతాడు. సనాతన సాంప్రదాయాన్ని కుటుంబంలోని పద్ధతులను పాటించేవాడు మంచివాడుగా ఎదుగుతాడు. సత్యనిష్ట అనగా సత్యము యొక్క గొప్పదనము ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర కొన్ని ఆవులు దూడలు ఉండేవి. ప్రతిరోజు రైతు వాటన్నింటిని మేపటం కోసం అరణ్యానికి తీసుకువెళ్లి సాయంకాలం గ్రామానికి తోలుకొచ్చేవాడు.
(55:43) ఒక రోజున ఒక ఆవు అరణ్యంలో తప్పిపోయింది. కొంచెం సేపటి తరువాత ఆవుకి పులి ఎదురయింది. పులి ఆవుని చంపటానికి దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆవు పులితో ఈ విధంగా అన్నది. ఓ పులి నాకు ఒక దూడ ఉన్నది. నాకోసం సాయంకాలం అవ్వగానే ఆకలితో ఎదురుచూస్తుంటుంది. నేను వెళ్ళకపోతే ఆకలితో అది చచ్చిపోతుంది. అట్లాగే నీవు కూడా చాలా ఆకలితో ఉన్నావు.
(56:14) నేను మీ ఇద్దరికీ న్యాయం చేయాలి. అందుకే నేను ఇంటికి వెళ్లి నా బిడ్డకు కడుపునిండా పాలిచ్చి మళ్ళీ వెంటనే తిరిగి ఇక్కడికి వస్తాను. నన్ను చంపి తినడం ద్వారా నీ ఆకలి కూడా తీరుతుంది. మీ ఇద్దరికీ న్యాయం చేసిన దానిని అవుతాను. కాబట్టి దయచేసి నన్ను ఒక్కసారి ఇంటికి వెళ్లి రావటానికి అనుమతి ఇవ్వు అని పులిని బ్రతిమాలింది.
(56:40) అందుకు పులి నువ్వు తిరిగి వస్తావని నేను ఎట్లా నమ్మేది అని అన్నది. అప్పుడు ఆవు ఎన్నో ప్రమాణాలను చేసింది. పులి నమ్మింది. ఇంటికి వెళ్లి రావటానికి ఆవుకి అనుమతి ఇచ్చింది. ఆవు త్వరగా ఇంటికి వెళ్లి తన దూడకు కడుపు నిండా పాలిచ్చి మరలా వడివడిగా పులి ఉన్న ప్రదేశానికి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన ఆవుని చూసి పులి ఆవు యొక్క సత్యనిష్టకు ఆశ్చర్యపడింది.
(57:08) మరియు ఆవు నిజాయితీకి మెచ్చుకొని ఆవుని తిరిగి వెళ్లి తన బిడ్డతో సుఖంగా ఉండమని చెప్పి దాన్ని చంపకుండా పంపివేసింది. ఆవు కూడా మహదానందంగా ఇంటికి వెళ్లి తన దూడతో సుఖంగా జీవించింది. కాబట్టి మనకు కూడా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సత్యానికి నిలబడాలి. అందుకే సత్యమేవ జయతే నా నృతం అని వేద వాక్యం అనగా సత్యమే జయిస్తుంది.
(57:38) అబద్ధం జయించదు. సత్యం అంటే శాస్త్రం చెప్పిన దానిని మాటల ద్వారా మరియు చేతల ద్వారా చేయటమే సత్యము. గోవు గొప్పదనం గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. గోవుకి దానా వేస్తే సమస్త దేవతలకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది. దివీప మహారాజు 40 రోజుల పాటు గోవుని సేవించి చక్రవర్తి అయ్యే కొడుకుని పొందాడు. అతడే రఘు మహారాజు దేవతల్లో ఒక వర్గమైన అష్టవసువుల్లో చివరివాడు ఆవుని చంపడం వల్ల భీష్మునిగా జన్మించి చాలా కాలం పాటు జీవించి నానా కష్టాలు పడ్డాడు.
(58:20) గౌతమ మహర్షి ఈనుతున్న ఆవుకి ప్రదక్షిణం చేసి భూ ప్రదక్షిణం చేసిన పుణ్యాన్ని పొంది అహల్యను భార్యగా సంపాదించాడు. గోదానం చేస్తే భూమిని అంతా దానం చేసిన పుణ్యం లభిస్తుంది. పితృ దేవతల పేరు మీద గోదానం చేస్తే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు భూమిని అంతా దానం చేసిన పుణ్యాన్ని పొంది స్వర్గాన్ని పొందుతారు. గోవు యొక్క తోక భాగానికి నమస్కరించాలి మరియు పూజించాలి.
(58:49) ప్రతిరోజు గోవుకి కొంచెం దానా పెడుతూ ఉంటే నెల రోజుల్లోనే గొప్ప ధనవంతుడు అవుతారు. వ్యక్తిత్వ వికాసము మన శరీరము మంచి ఆహారము తీసుకోవడం ద్వారా చక్కగా ఎదుగుతుంది. శరీర ఆకృతికి వ్యాయామము తప్పనిసరి అలాగే వ్యక్తి యొక్క నడవడిక వలన అతనికి మంచి పేరు వస్తుంది. అదియే అతని వ్యక్తిత్వము. ప్రతిరోజు వ్యక్తితో పాటు వ్యక్తిత్వము కూడా అభివృద్ధి చెందాలి.
(59:16) అప్పుడే అతను తాను బాగుపడుతూ తన గొప్ప గుణ సంపద చేత తన తోటి వారికి సహాయపడతాడు. జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. అందరూ మొదటిగా మనిషి యొక్క అందమును మరియు వస్త్రాలంకరణను శరీర ఆకృతిని నడకను చూసే చూపులను మాట్లాడే మాటలను చేసే పనులను తినే ఆహారమును వరుసగా పరిశీలిస్తారు. వీటిలో మొట్టమొదటగా అందరూ గమనించేది శరీరమును ఆ తర్వాతనే వస్త్రధారణను చూస్తారు.
(59:43) అందువలన ప్రతి ఒక్కరు పౌష్టికాహారమును తీసుకుంటూ వ్యాయామమును అవసరమైనంతగా ప్రతిరోజు చేయాలి. అప్పుడే శరీరం యొక్క ఎదుగుదల బాగుంటుంది. వ్యాయామము దానికి తోడైనప్పుడు మంచి శరీర ఆకృతి లభిస్తుంది. అందరికీ ఆకర్షణగా నిలుస్తాడు. తరువాత జనులు మనిషి ఎలా మాట్లాడుతున్నాడని చూస్తారు. ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడినప్పుడు అతనిని అందరూ చులకనగా చూస్తారు.
(1:00:08) మనసులోకి వచ్చిన ఆలోచనలను అన్నింటిని పైకి చెప్పకూడదు. వివేకాన్ని ఉపయోగించి ఉచితమైన ఎవ్వరిని నొప్పించని సందర్భోచితమైన మాటలనే మాట్లాడాలి. వ్యక్తిత్వము వలన కలిగే లాభాలు మనం చేసే మంచి పనుల వలన మనకు మంచి పేరు వస్తుంది. బలవర్ధకరమైన పదార్థాలను తినడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా అభిమానంగా ప్రేమగా తెలివిగా ధైర్యంగా సందర్భోచితంగా ఎల్లప్పుడూ మాట్లాడాలి.
(1:00:34) మంచి పనులను చేయడం, దానాలు చేయడం, మంచి పుస్తకాలను చదవడం, తన చుట్టూ ఉన్న వారికి తనకు చేతనైనంతవరకు సహాయం చేస్తూ ఉండటం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, నిస్సహాయులకు చేయుతనివ్వడం, తాను ధర్మాన్ని అనుసరిస్తూ మిగతా వారిని ధర్మబద్ధమైన జీవితం గడిపెట్టు చేయడం, తల్లిదండ్రుల యందు భక్తి కలిగి ఉండటం, కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండటం, స్నేహితుల పట్ల విశ్వాసంతో ఉండటం, దైవభక్తి, దేశభక్తి కలిగి ఉండటం, ఇలా ప్రతిరోజు యధాశక్తి ప్రవర్తిస్తూ ఉండే వ్యక్తికి కి గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అందరూ మెచ్చుకుంటూ ఉంటారు.
(1:01:06) అలాంటి మంచి మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అందరూ సహాయం చేయడానికి ముందుంటారు. మనం చేసే మంచి పనులను మన చుట్టూ ఉన్నవారు మొదటిగా గుర్తిస్తారు. తర్వాత ఒకరికొకరు చెప్పుకుంటారు. అలా దేశం నలుమూలలకు వ్యాపిస్తాయి. తద్వారా అతని ఖ్యాతి బాగా పెరుగుతుంది. ఆదాయం కూడా బాగా వస్తుంది. రికగ్నిషన్, రెప్్యుటేషన్, రెమునరేషన్ వరసగా వస్తాయి.
(1:01:32) ఒక వ్యక్తి జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నాడో దానికి కావలసిన జ్ఞానాన్ని అందించడమే వ్యక్తిత్వ వికాసం యొక్క కీలకమైన అంశము. సూక్తులు ఉపయోగాలు సు అనగా మంచి ఉక్తి అనగా మాట మంచి మాట అని అర్థం. అలాగే సుభాషితం అనగా సు అంటే మంచి భాషితం అంటే చెప్పబడినది. మంచిగా చెప్పబడినది అని అర్థము. పూర్వకాలంలో చాలామంది మహానుభావులు తమ జీవితం చివరలో తమ అనుభవాలను ఒకే ఒక వాక్యంలో చెప్పారు.
(1:02:06) అనుభవంతో చెప్పిన మాటలే సూక్తులు లేక సుభాషితాలు ఆ సూక్తులను మనము మన జీవితంలో ఆచరిస్తే వారు పొందిన సుఖాలను పొందుతాము. పాటించకపోతే వారు పడిన కష్టాలు మనకు వస్తాయి. మన జీవన ప్రయాణంలో ఎదురొచ్చే కష్టాలను ప్రమాదాలను సమస్యలను వారు చెప్పిన అనుభవాల సాయంతో ఎదుర్కోవచ్చు. వారు చేసిన మంచి పనులను మనం చేసి కీర్తి ప్రతిష్టలను ధనాన్ని సుఖవంతమైన విలాసవంతమైన జీవితాన్ని పొందవచ్చు.
(1:02:40) కనీసం 100 సూక్తులను పాటిస్తే విద్యార్థులు ఆదర్శ పౌరులు అవుతారు. అవే సుమతి శతకం, వేమన శతకం మొదలైనవి. అందుకే చిన్నప్పుడు మనకు ఈ శతకాల పద్యాలు నేర్పించేవారు. సమాజంలో మనుషుల స్వభావాలు ఎలా ఉంటాయి? మానవ ప్రయత్నానికి దైవ సహాయం తోడైతేనే మానవుడు విజయుడు అవుతాడు. గుణాలు జన్మతః వస్తాయి కానీ సంస్కారం నేర్చుకుంటే వస్తుంది.
(1:03:10) సత్ప్రవర్తన వల్ల సంస్కారం వస్తుంది. మన తోటి వారు మాట్లాడుతున్న మాటలు పనులు ఆలోచనలు అలవాట్లు మనకు కూడా అలవాటఅవుతాయి. అందుకే ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారని సామెత సాప్తపదీనం మైత్రం అని అంటారు అనగా తెలియని వారు ఏడు మాటలు మాట్లాడినా లేక ఏడు అడుగులు కలిసి నడిచినా వారు స్నేహితులు అవుతారు. మనం మంచివారితో ఉంటే మంచివారిగా మారతాము చెడ్డవారితో ఉంటే చెడ్డవారిగా మారతాము.
(1:03:40) తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగుతున్నా కూడా కళ్ళు త్రాగుతున్నారని జనాలు అపోహ పడతారు. మనం ఎంత మంచివారిమైనా ఆడవాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతుంటే మనల్ని అనుమానిస్తారు. ఆకాశం నుంచి పడిన వాన చినుకు స్వాతి నక్షత్రం నాడు ముత్యపు చిప్పలో పడితే మంచి ముత్యం అవుతుంది. అలాగే మనం మంచివాళ్ళతో ఉంటే మంచివాళ్ళగా మారుతాము. అదే వానచినుకు తామర మీద పడితే ముత్యం లాగా మెరుస్తుంది.
(1:04:07) అలాగే మనం మంచి వాళ్ళతో ఉంటే మనలో ఇంకా చెడ్డ గుణాలు ఆ సమయంలో ఉన్నప్పటికీ కూడా మంచి వాళ్ళ సహవాసం వల్ల లోకానికి మంచివాళ్ళలాగా మనము కనబడతాము. అదే నీటి చుక్క బాగా వేడిగా ఉన్న పెనం మీద పడితే వెంటనే నామరూపాలు లేకుండా పోతుంది. అలాగే మనం చెడ్డవాళ్ళతో కలిసి ఉంటే వాళ్ళ దుష్ట ప్రవర్తన చేత మనకు అవమానాలు జరగడమే కాకుండా అనేక కష్టాలు బాధలు కలుగుతాయి.
(1:04:36) మన శక్తి సామర్థ్యాలు దుర్వినియోగం అవుతాయి. ఒక్కోసారి మన ప్రాణాలు కూడా పోవచ్చు. కాబట్టి దుష్టే దూరవర్జితః అన్నట్లు దుష్టులకు చాలా దూరంగా ఉండాలి. చెడ్డవాళ్ళతో స్నేహం వద్దు విరోధం వద్దు. నిప్పు వేడిగా ఉన్నప్పుడు కాలుతుంది. చల్లబడి బొగ్గుగా ఉన్నప్పుడు కూడా నల్లని మసి మన చేతులకు అంటుకుంటుంది. చెడ్డవాళ్ళు వేరు పురుగు చీడ పురుగు లాంటి వాళ్ళు.
(1:05:02) వేరుపురుగు చెట్టు వేళ్ళు తినడం ద్వారా చీడపురుగు ఆకులను తినుట ద్వారా చెట్టును నాశనం చేస్తాయి. పాముకి ఎన్ని పాలు పోసినా విషమే పెరుగుతుంది. మరియు అది హానే చేస్తుంది. వేపు చెట్టుకి ఎన్ని పాలు పోసినా దాని చేదు తగ్గదు. అలాగే తేలు తనకు ఉపయోగం ఉన్నా లేకపోయినా కూడా కనిపించిన దాన్ని నల్లల్లా కుట్టుకుంటూ వెళ్తుంది. అది దాని సహజ స్వభావమో అలాగే చెడ్డవాళ్ళు వాళ్ళ స్వభావ రీత్యా వాళ్ళకు ఉపయోగం ఉన్నా లేకపోయినా కూడా ఎదుటి వారి అభివృద్ధిని ఓర్వలేక గాని తప్పుడు సలహాలు విని గాని మన మంచితనం వారికి నచ్చకపోవడం వల్ల గాని ఇతరుల మెప్పు కోసం గాని ఇలా ఏదో ఒక కారణం
(1:05:44) చేత ఎల్లప్పుడూ మంచి వాళ్ళకి తమ శక్తి కొలది హాని చేయాలని చూస్తారు. మంచి మాటలకు లొంగరు అనగా చెడు చేయకుండా ఉండలేరు కాబట్టి మనల్ని మనమే వాళ్ళ నుండి కాపాడుకోవాలి. అన్ని చోట్ల వివేకంతోనే గొప్పవాడు ప్రవర్తించాలి. వివేకేనవ సర్వత్ర వర్తితవ్యం మనీషిణ అని అన్నారు. వివేకం లేకపోతే ఆపదలు వస్తాయి. ఇక్కడ మూడు చేపల కథ ఒక మంచి ఉదసరణ.
(1:06:14) ఒక చెరువులో దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘ సూత్రుడు అనే మూడు చేపలు ఉన్నాయి. ఎండాకాలం వచ్చింది. దీర్ఘదర్శి తక్కిన రెండు చేపల్ని పిలిచి చెరువు ఎండిపోయేలా ఉంది. నీరు ఆవిరవ్వకుండానే ప్రవాహ మార్గాన మరో చోటికి వెళ్ళడం మంచిది అని చెప్పింది. అందుకు తక్కిన రెండు చేపలు నవ్వి ఎప్పుడో వచ్చే ఆపదకి ఇప్పుడే కామారెందుకు ఎండలు ముదిరాక చూద్దాంలే అన్నాయి.
(1:06:40) దీర్ఘదర్శి వారితో వాదించకుండా తన దారిన తాను మరో జలాశయం చేరిపోయింది. ఎండలు ముదిరి నీరు ఎండింది. జాలర్లు వచ్చి వలలు వేశారు. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు వలత్రాడు నోట కరిచిపట్టి చనిపోయినట్టు నటించింది. జాలరి ఆ వల తీసి చేపల బురద కడగడందుకు మంచి నీళ్ళల్లో ముంచి వలను కడుగుతుండగా ప్రాప్త కాలజ్ఞుడు వలను వదిలి దాక్కుొని ప్రాణం రక్షించుకున్నాడు.
(1:07:08) దీర్ఘ సూత్రుడు మాత్రం గిలగిల కొట్టుకుంటూ జాలర్లకు చిక్కుపోయాడు. కాబట్టి ప్రతి ఒక్కరు దీర్ఘదర్శుల దీర్ఘ చూపుతో ఆపదలు గుర్తించి జాగ్రత్త పడాలి. ఆచరించి సలహా ఇవ్వాలి. ఒకసారి రామకృష్ణ పరమహంస గారి వద్దకు ఒక తల్లి తన బిడ్డను తీసుకువచ్చి ఆయనతో ఇలా చెప్పింది. వీడు రోజు చెక్కర ఎక్కువగా తింటున్నాడు. తినవద్దని చెప్పండి స్వామి అని వేడుకొన్నది.
(1:07:36) మరునాడు అతనిని తీసుకురమ్మని పంపారు. ఆమె ఆ మరునాడు అతనిని తీసుకువస్తే మళ్ళీ అలానే అన్నారు. అలా 10 రోజులు గడిచాయి. 11వ రోజున ఆ బాబుకి చెక్కర తినవత్తని ఉపదేశించారు. అప్పుడు ఆ తల్లి ఇన్ని రోజులు మమ్మల్ని ఎందుకు తిప్పించుకున్నారు అని అడగగా స్వామి అమ్మ నేను కూడా చక్కర రోజు బాగా గుప్పెళ్లు గుప్పెళ్లుు తింటాను.
(1:08:07) ఇన్ని రోజులు నేను బాగా సాధన చేసి నన్ను నేను చక్కర తినకుండా కంట్రోల్ చేసుకున్నాను. ఇతరులు మన మాట వినాలంటే మనము ముందు ఆచరించాలి అని చెప్పారు. నీతి ఆచరించకుండా చెప్పేవాడు వక్త ఆచరించి చెప్పేవాడు ప్రవక్త కొన్ని మంచి మాటలు విద్య ప్రధాన ఉద్దేశం వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దటం మనోవికాసము జరగాలంటే జ్ఞాన సముపార్జన చేయాలి. జ్ఞానము వల్లనే మనసు వికసించును.
(1:08:37) సర్వ ధర్మములకు సారము తన దుఃఖానికి ఏది కారణం అనిపిస్తుందో దానిని ఇతరులకు చేయరాదు. దరిద్రుడు ఎవరంటే తృప్తి ఎవరికి లేదో ఎవని ఆశకు అంతము లేదో అతడే దరిద్రుడు. సుగుణాలను దోషములుగా చూడటమే అసూయ. శతశ్లోకేన పండితః అనగా 100 నీతి శ్లోకాలను చదివి వాటిని జీవితంలో ఆచరించినవాడే పండితుడు. సమయోచితమైన పలుకు స్వభావ ఉచితమైన పని తన శక్తికి తగిన కోపమును తెలిసి ప్రవర్తించువాడే పండితుడు.
(1:09:13) సుఖము కోరువాడు విద్యను వదులుకోవాల్సిందే. సోమరికి విద్య రాదు. స్వయంగా ప్రజ్ఞ లేని వానికి శాస్త్రము వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కళ్ళు లేని వానికి అద్దము వలన లాభము ఏమిటి? జ్ఞానులు చెప్పినది జాగ్రత్తగా వినినప్పుడే మనము కూడా జ్ఞానులం అవుతాము. సహనము వలన సమస్త కార్యములను సాధించవచ్చును. పూర్ణ పురుషుడు అనగా జీవితంలో కష్టాలను సహించినవాడే పూర్ణ పురుషుడు అని అంటారు.
(1:09:45) ఆలస్యమైనా సహించాలి శ్రమ కలిగినా భరించాలి. అప్పుడు చెడిపోయిన పనులు కూడా నెరవేరుతాయి. ఎవరితో విరోధము పెట్టుకోరాదు. శరీర బలము కలవాని కంటే నైతిక బలము కలవాడే బలవంతుడు. ధైర్యవంతుడే బలవంతుడు భక్తి కలవాడే బలవంతుడు మంచి చెడులు గుర్తించని వివేకము ఇవ్వని చదువు వ్యర్థము రేపు చేయాల్సిన పనిని ఈరోజే చేయాలి.
(1:10:13) ఈరోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాలి. శ్రద్ధ కలిగిన వానికి జ్ఞానము వస్తుంది. నీ క్షేమం కోరి చెప్పేవారందరూ నీకు ఆత్మీయులే మంచిని చిన్న పిల్లవాడు చెప్పినా తీసుకోవాలి. చెడుని ఎంత పెద్దవారు చెప్పినా చేయకూడదు. నువ్వు స్వీకరిస్తే ప్రకృతి నీకు పాఠాలు నేర్పుతుంది. దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు నీతి కథలు సుభాషితాలు రామాయణ భారత కథలు నిన్ను సన్మార్గం వైపు నడిపిస్తాయి మరియు సృజనాత్మకత వస్తుంది.
(1:10:45) మనసు నిర్మలంగా ఉంటేనే ఏకాగ్రత కుదురుతుంది. పంచతంత్రాన్ని ప్రతిరోజు 10 నిమిషాల పాటు పిల్లలు చదవాలి. గొప్ప వ్యక్తిత్వం వస్తుంది. మంచి నిర్ణయాలతో మంచి ప్రవర్తనలతో మంచి ఉద్దేశాలతో మనం జీవనం గడపగలిగితే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. భగవద్గీతను మన నిత్య జీవితంలో ఆచరించాలి. అప్పుడే ఆనందం వస్తుంది. అది జీవితాంతం ఉంటుంది.
(1:11:11) నేనొక్కడిని నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాడు. దానికి చాలా పాలు కావాలి. అందుకోసం ఎలా అన్ని పాలు సేకరించాలి అని రాజు మంత్రిని సలహా అడిగాడు. అప్పుడు మంత్రి మహారాజా ప్రజలందరూ తప్పనిసరిగా పాలు తీసుకువచ్చి ఇవ్వాలని దండోరా వేయించండి అని సలహా ఇచ్చాడు. అలాగే దండోర ఆ రాజధానిలో వేశారు.
(1:11:36) ప్రజలందరూ పాలు తీసుకువచ్చి రాజభవనం ముందు ఉన్న పెద్ద గంగాళాలలో పోయాలి. కొంతమంది నిజాయితీగా పాలు పోశారు కానీ చాలామంది నేనొక్కడినే పాలకు బదులుగా నీళ్లు పోస్తే ఏమీ కాదులే అని అనుకొని చాలా మంది పాలకు బదులుగా నీళ్లు ఆ పాత్రల్లో పోశారు. పాలసేకరణ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రాజు మంత్రితో కలిసి ఆ ప్రదేశానికి వచ్చాడు.
(1:11:59) మూతలు తీసి చూడగా కొద్దిగా మాత్రమే పాలు మిగతావంతా నీళ్లు కలపడం చేత అంతా నీళ్లు అయిపోయాయి. మహారాజు ఆశ్చర్యపడి మంత్రిగారు ఏమిటి ఇలా జరిగింది అని అడగగా అప్పుడు మంత్రి అన్నాడు మహారాజా అందరూ పాలు పూస్తుండగా నేను ఒక్కడినే నీళ్లుు పోస్తే ఏమవుతుందిలే అని చాలా మంది అనుకోవడం వలన అన్ని నీళ్లు వచ్చాయని మంత్రి రాజుకి వివరించాడు. రాజుకి ఏమి మాట్లాడాలో ఏమనుకోవాలో అర్థం కాలేదు.
(1:12:25) దీనివల్ల తెలుసుకున్న నీతి ఏమిటంటే ఇతరులతో పోల్చుకోకుండా ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన పనిని సక్రమంగా చేయాలి అని ఈ కథలోని సారాంశం. ఆత్మహత్య ఆలోచించండి. నేటి సమాజంలో ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువైంది. దానివలన కలిగే దుష్పరిణామాల గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
(1:12:50) వీటిని ఎలా నివారించాలంటే ఆత్మహత్య అనేది మహాపాపం అన్నారు మన పెద్దలు ఎందుకంటే భగవంతుడు మనకు నూరేళ్ళు జీవించమని ఆయువు ఇచ్చాడు. మనవల్ల కుటుంబ సభ్యులకు జీవనాధారం దొరుకుతుంది. కొంతమందికి మనం సహాయం చేయాలని భగవన్ సంకల్పం. భగవత్ సంకల్పాన్ని కాదని నీవు అనుభవించాల్సిన కష్టాలు అనుభవించకుండా అకస్మాతుగా నీ శరీరాన్ని బలవంతంగా వదిలేస్తే అప్పుడు మరణం తర్వాత మరుజన్మలో మనం ఎక్కువ కష్టాలు ఎదుర్కోవాలి.
(1:13:23) కారణం ఈ జన్మలోని కష్టాలు అనుభవించకపోవడం మనం లేకపోవడం వల్ల ఎంతమంది ఎన్ని రోజుల పాటు బాధపడతారో వారందరూ పొందిన బాధను మరియు మనం ఇంతకుముందు జన్మలో చేసిన మరికొన్ని పాపాలను మొత్తం కలిపి ఎక్కువ కష్టాలు బాధలు రాబోయే జన్మలో కలుగుతాయి. ఎన్నో కష్టాలు పడేవాడుగా జన్మిస్తాం. మరణ సమయంలో కలిగే బాధను కూడా మనవాళ్ళు చెప్పారు. లక్ష తేళ్లు ఒకేసారి కూడితే ఎంత బాధ కలుగుతుందో మన మరణ సమయంలో కూడా అంతే బాధ కలుగుతుంది.
(1:13:53) కొన్ని వేల జన్మలలో మనకు ఆ బాధ అనుభవమైంది. అందుకే ప్రతి ఒక్కరు మరణం అంటే భయపడతారు. కొంతమంది 10వ తరగతి తప్పానో డిగ్రీలో పరీక్ష సరిగ్గా రాయలేదనో ఉద్యోగం రాలేదనో వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదనో ఇటువంటి చిన్న కారణాలతో ఆత్మ చేసుకుంటున్నారు పరీక్ష జీవితం కాదు నేను చంద బాగా జీవిస్తారు. మనకు వచ్చే కోపాన్ని ఆదుపుకోవడం కోసం వంటి సంకల్ని లెక్కపెట్టాలి.
(1:14:26) ఆ ఆయుధ సమయంలో మనకున్న ఈ విధంగా అంటే వాణిజ్యం దేనిది వివేకం ఇదే పని చేయదు. కోపం విషయంలో మెదలు ఎక్కువగా ఆలోచించారు. కనుక రైన్ మాటలు సన్నిసం పొందుకొని ఎక్కువ ఆక్సిజన్ సప్లై చేయటం కన్నా ఎక్కువగా పని చేయడం మొదలు పెడుతుంది. శ్వాస ప్రజల శరీరంలో మిగతా అవయవాలకు రక్తం పంపించే తగ్గించి బ్రెయిన్ ఎక్కువ రక్తం పంపినీ చేస్తుంది.
(1:15:00) ఇంకా ఆక్సిజన్ కావాలి ఇంకా ఇంకా ఆక్సిజన్ కావాలి అని హార్ట్ కు బ్రెయిన్ నుంచి సందేశం వస్తుంది. మళ్లా ఎక్కువ వేగంతో పంపించేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో కొద్దిసేపటి తర్వాత ఒక స్థాయి దాటితే హార్ట్ వాల్వ్ ఏదైనా కొలాప్స్ అయి మరణం సంభవించడమో పక్షవాతం రావడమో పిచ్చివాడు కావడమో ఆవేశం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడమో లేక హత్య చేయడమో జరుగుతుంది.
(1:15:26) అందుకే మన పూర్వీకులు తన కోపమే తన శత్రువు అని అన్నారు. కష్టే ఫలి అంటే కష్టపడి పని చేస్తేనే ఫలితం లభిస్తుంది. అన్యాయంగా సంపాదించినది అవసరానికి ఉపయోగపడదు. కష్టపడి పని చేసినందుకు ప్రతిఫలం వెంటనే రాకపోవచ్చు కానీ తరువాత అది అవసరమైనప్పుడు ఫలితం ఖచ్చితంగా నీ చేతికి వస్తుంది. ధైర్యవంతులకు అదృష్టం అనుగ్రహిస్తుంది. సాహసాత్ భజతే లక్ష్మీహ్ అంటే ధైర్యం గలవారు అదృష్టంతో దీవించబడతారు.
(1:16:01) కష్టపడి పని చేసే తత్వం ధైర్యవంతులను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. రోజు కష్టపడి పని చేసే దినసరి కార్మికులు ఉన్నారు. కష్టపడి పని చేయడాన్ని నమ్మే రైతులు ఉన్నారు. కష్టపడి పని చేయడం వల్లే ఉద్యోగులు తమ ఉద్యోగాలలో పై పైకి ఎదుగుతారు. కష్టపడి చదివితేనే విద్యార్థులు మంచి మార్కులు పొందగలుగుతారు. గురువు కష్టపడి పాఠాలను చెబితేనే విద్యార్థులకు జ్ఞానం వస్తుంది.
(1:16:30) భర్త కష్టపడి సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది. గృహిణి ఇంటి పని చేస్తేనే ఇల్లు చక్కబెట్టుకోగలదు. పని మనిషి కూడా కష్టపడి పని చేస్తేనే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఒక వ్యాపారవేత్త పగలు రాత్రి కష్టపడి పని చేస్తేనే డబ్బు సంపాదిస్తాడు. పూజారి మంత్రాలను కష్టపడి చదివితేనే శుభ కార్యాలు జరుగుతాయి. అందుకే ప్రతి వ్యక్తి కష్టాల మీదనే జీవిస్తాడు.
(1:16:59) కష్టాలతో జీవిత బండివు నెట్టుకొస్తాడు. డబ్బు జ్ఞానం గౌరవం స్థిరాస్తులు సంపాదించడం అన్ని కష్టాల వల్లనే సాధ్యమవుతాయి. భగవద్గీతలో కృష్ణుడు నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని అంటాడు. ఎవరూ ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఖాళీగా ఉండరని కృష్ణుడు చెప్పాడు. ఋషులు యోగులు కూడా తాము రోజు చేసే తపస్సులో ఆరవ వంతును ఆ దేశరాజుకు ఇస్తారు.
(1:17:33) అదేవిధంగా తేనెటీగలు దాచుకున్న తేనెను మనం దొంగిలిస్తాము. చీమల పెట్టిన పుట్టలను పాములు దోచుకుంటాయి. నేటికి చాలామంది గొప్ప వ్యక్తులు తమ కృషి కారణంగా గొప్ప శిఖరాలకు ఎదిగారు. గతంలో మరియు ఈ యుగంలో కూడా గొప్ప పేరు సంపాదించారు. ఉదాహరణకు మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ ఐపిఎస్ వ్యాస్ ఐపిఎస్ ఉమేష్ చంద్ర అబ్దుల్ కలాం సచిన్ టెండూల్కర్ మహాత్మా గాంధీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్దార్ వల్లభాయి పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి మరియు అనేకమంది ఇతరులు ఇటీవలి కాలంలో విజయం సాధించారు.
(1:18:17) వారు తమ అవిశ్రాంత కృషితో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. వినాయకుడు మహాభారతాన్ని మధ్యలో ఎక్కడ ఆగకుండా వ్రాశాడు. ఆంజనేయుడు విద్య కోసం ప్రతిరోజు చాలా కష్టపడ్డాడు. లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోకుండా సీతారాములకు పగలు రాత్రి సేవ చేశాడు. ధ్రువుడు ఏడు జన్మల పాటు తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు.
(1:18:49) పార్వతీదేవి 5వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి శివుడిని భర్తగా పొందింది. మునిపటి ద్వాపర యుగంలో అంబ అర్జునుడు సైంధవుడు మరియు కృష్ణుడు తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఒక్కొక్క సంవత్సరం తపస్సు చేసి వరాలను పొందారు. ఏకలవ్యుడు కూడా చాలా కష్టపడి పని చేశాడు. అందుకే కష్టపడి పని చేసేవాడు సంతోషంగా ఉంటాడు. లక్ష్యం లేక విశ్రాంతి కోసం తిరిగేవాడు పెద్దయ్యాక ఇబ్బందులను ఎదుర్కుంటాడు.
(1:19:21) కాబట్టి 100 శాతం ఫలితాలను ఇచ్చే కష్టాన్ని నమ్ముకుందాం. మంచి ఫలితాలను పొందుదాం. జీవితంలో మనం రాణిస్తాం. మన తల్లిదండ్రులకు కీర్తిని తెద్దాం. డబ్బు ఉన్నత స్థానం బాగా సంపాదించి సమాజానికి మనకు సాధ్యమైనంత సేవ చేద్దాం. జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకుందాం. మనశశాంతిగా ఉండటానికి ఈ రెండు పనులను చేయాలి.
(1:19:49) మొదటిది ఈ పనిని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మైనా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చేయాలి. ఇలా చేస్తే మనం పాపపు పనులను చేయడానికి జంకుతాము. కర్మ సాక్షి అయిన భగవానుని తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము. రెండోది ఫలత్యాగం ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చేయాలి.
(1:20:18) అంతేగానీ ఇది చేస్తే నాకు ఈ ఫలం వస్తుంది అని కోరికతో చేయవద్దు. నేనుఏం చేసినా దాని ఫలం భగవానుడిదే అన్ని భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి. మనసే తీర్థం మనసు నిష్కల్మసంగా ఉండాలి. స్వచ్ఛంగా ఉండాలి. ప్రేమతో నిండి ఉండాలి. ఎల్లప్పుడూ సద్భావనలతో ఉండాలి. ఇలాంటి స్థితిలో ఉన్న మనసు పవిత్రమైన నదితో సమానం. గంగా నది లాంటి నదులలో స్నానం చేయకపోయినా అతడు ఎంతో పుణ్యాన్ని తప్పక పొందుతాడు.
(1:20:46) మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో మనసే మన బంధానికి మన మోక్షానికి కారణం కాబట్టి మనసును ఎల్లప్పుడూ అదుకులో పెట్టుకోవాలి మరియు ఎల్లప్పుడూ మనసు స్వచ్ఛంగా ఉండేట్టు చూసుకోవాలి. మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు. ఒక అరణ్యంలో ఒక బాటసారి నడుస్తూ ఉన్నాడు. బాగా అలసిపోయి ఒక చెట్టు మొదట్లో కూర్చున్నాడు.
(1:21:10) అతనికి బాగా ఆకలి వేసింది. అతను కూర్చున్నటువంటి చెట్టు సామాన్యమైనది కాదు అది దేవలోకంలో ఉండే కల్ప వృక్షము. కోరిన కోరికలు తీర్చేటువంటి దేవతా వృక్షము. ఆ విషయం ఆ బాటసారికి తెలియదు. అతడు ఆకలితో ఉండటం చేత ఏ దేవుడన్నా తనకు పంచభక్ష పరమాణాలతో భోజనం పెడితే ఎంత బాగుంటుందో కదా అని మనసులో అనుకున్నాడు. వెంటనే అతని ముందు బంగారు పాత్రలలో రకరకాల భోజన పదార్థాలు ప్రత్యక్షమయ్యాయి.
(1:21:39) ఏ దేవుడో లేక దేవతో కరుణించారని ఆ పదార్థాలను అతను ఆనందంగా తిన్నాడు. కడుపు నిండటంతోనే అతనికి నిద్ర వస్తున్నది. అప్పుడు అతను రాజులు పడుకునేటువంటి హంసతూలికా తల్పం ఇక్కడ ఉంటే బాగుంటుంది. దాని మీద పడుకొని నిద్రిస్తాను అని మనసులో అనుకున్నాడు. వెంటనే అతని ముందు ఎంతో అందమైన హంసతూలికా తల్పం ప్రత్యక్షమైంది. అతడు ఆనందంతో పొంగిపోయి వెంటనే దాని మీద పడుకున్నాడు.
(1:22:03) చాలా దూరం నడవడం వలన అతని కాళ్ళు నెప్పి పుట్టడం ఆరంభమయింది. అప్పుడు అతనికి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. దేవలోకంలోని రంబ వచ్చి తన కాళ్ళు నొక్కితే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది నా కాళ్ళ నొప్పులు తగ్గుతాయి అని మనసులో ఇలా అనుకున్నాడో లేదో వెంటనే రంబ ప్రత్యక్షమై అతడు పాదాలను నొక్కటం ప్రారంభించింది. అప్పుడు అతను భయపడిపోయి నేను అనుకున్నవి వెంటనే జరిగిపోతున్నాయి.
(1:22:30) కాబట్టి ఇప్పుడు ఒకవేళ పులి వచ్చి నన్ను చంపి తింటే నా గతి ఏమవుతుందో కదా అని భయంతో అనుకున్నాడు. మరుక్షణం అక్కడ పులి ప్రత్యక్షమై అతన్ని చంపి తినేసింది. కాబట్టి మనసు ఎల్లప్పుడూ ఇది మంచిదా లేక చెడ్డదా అని ఆలోచించకుండా తన తాత్కాలిక ప్రయోజనం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా ప్రయత్నించడం దాని స్వభావము. కాబట్టి మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు.
(1:22:55) వివేకాన్ని ఉపయోగించాలి అన్ని పన్నుల్లో ఇదే ఈ కథలోని నీతి శరీరమే క్షేత్రం అనగా పుణ్యక్షేత్రాలలో దేవుళ్ళు లేక దేవతలు కొలువై ఉంటారు. వారిని దర్శిస్తే పుణ్యం వస్తుంది. అక్కడ ఉన్న పుష్కరణి, సరస్సు, భావి, నదుల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయి. అలాగే మన శరీరంలో షట్చక్రాలు మరియు ముఖంలో సరస్వతి చేతిలో ఇంద్రుడు ఇలా అన్ని అవయవాలను దేవుళ్ళు ఆశ్రయించి ఉంటారు.
(1:23:21) చేతులతో దానాలు మరియు పూజలు నోటితో మంచి మాటలు మరియు స్తోత్రాలు పలుకుతాము. ఇలా మన శరీరము నిండా దేవతలు మరియు దేవుళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి మనిషి తనలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నవాడే అందుకే శరీరమై పుణ్యక్షేత్రం అని అంటారు. అంతరాత్మయే గురువు అంతః అనగా లోపల ఆత్మ అనగా పరమాత్మ స్వరూపమైన ఆత్మ అది మన హృదయంలో దేదిప్యమానంగా వెలుగుచున్నది.
(1:23:44) ఇది పరమాత్మ స్వరూపము. మనం మంచి పనులను చేసినప్పుడు సంతృప్తిని సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది. చెడ్డ పనులను చేయబోతుంటే తప్పని సలహా ఇస్తుంది. మరియు వారిస్తుంది. కానీ మనం అంతరాత్మ చెప్పే సూచనలను పాటించకుండా చెడ్డ పనులను చేస్తాము. తద్వారా కష్టాల పాలు అవుతాము. ఎల్లప్పుడూ తాత్కాలిక సుఖాలను కోరుకునే మనసు మాటను వినడం వలన అనేక కష్ట నష్టాలు వస్తాయి.
(1:24:08) కాబట్టి మనం అంతరాత్మ ప్రబోధంగానే ఎల్లప్పుడూ పని చేయాలి. అంతరాత్మే గురువు. జీవితమే గ్రంథం ప్రతి మనిషి తన జీవితంలో ప్రతిరోజు చాలా పనులను చేస్తుంటాడు. చుట్టుప్రక్కల వాళ్ళు చేస్తున్న పనులను కూడా చూస్తుంటాడు. మరియు దూర ప్రదేశాలలో ఉన్న ప్రజలు చేసే రకరకాల పనులను గురించి వింటూ ఉంటాడు. అలాగే గతకాలంలో చాలా మంది చేసిన మంచి చెడు పనులను గురించి కూడా పుస్తకాల ద్వారానో ఎవరో చెప్పడం వలనో వింటూ ఉంటాడు.
(1:24:32) వీటన్నిటి ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు. తన జీవితంలో కూడా చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక పుస్తకం చదివితే మనకు ఎన్ని నూతన విషయాలు ఎలా తెలుస్తాయో అలాగే తన సొంత మరియు వివిధ వ్యక్తుల చరిత్రలో తెలుసుకోవడం ద్వారా ఎంతో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఆ అనుభవాలు మంచిగా ప్రవర్తించడానికి కారణం అవుతాయి. అందువలన జీవితమే ఒక గ్రంథం.
(1:24:55) వివేకవంతుడు వివేకం అనగా ఏది మంచో ఏది చెడో చెప్పేటువంటి మనసు యొక్క స్థితి ఏ పనిని చేస్తున్నాం వివేకంతో చేయాలి. మనోవివేకం కలగాలంటే జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం వల్లనే మనసు వికసిస్తుంది. వివేకంతో సందేహాలు తొలగించుకోవాలి. మంచి చెడులు గుర్తించు వివేకము ఇవ్వని చదువు వ్యర్థము అనాలోచితంగా ఏ పనిని తొందరపడి చేయవద్దు.
(1:25:26) తల్లి శరీరమును ఇస్తుంది. గురువు విజ్ఞానమును వివేకమును ఇస్తాడు. చెవిటివాని ముందు శంఖము ఊదినట్లు వివేకం లేని వానికి ఎంత చెప్పినా తలకెక్కదు. వివేకము లేని వానితో స్నేహము చేయవద్దు. ఏ సమయంలో ఏమి మాట్లాడితే సరిపోతుందో అని ఆలోచించి దానికి తగినట్లుగా ఇతరులను బాధించక తానును బాధపడక సమయస్ఫూర్తితో మాట్లాడి వ్యవహారమును పరిష్కరించుకొనువాడే వివేకవంతుడు.
(1:25:57) ప్రజ్ఞ ప్రజ్ఞ అనేది సృజనాత్మకత లేదా నైపుణ్యంతో కూడిన ప్రతిభ. ఇది ఒక కళ ఏదైనా రంగంలో ప్రత్యేకమైన సామర్థ్యాన్ని సూచిస్తుంది. అద్భుతమైన ఆలోచనలను కలిగి ఉంటుంది. కళ లేదా హస్తకలలో నైపుణ్యం అనగా కవిత్వం చిత్రలేఖనం మొదలైన క్రొత్త ఆవిష్కరణలు చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తికి ప్రజ్ఞ ఉంటే అద్భుతమైన కళాఖండాలను సృష్టించవచ్చు.
(1:26:28) కర్మఫలం మనం ఒక పనిని చేసినప్పుడు దానికి ప్రతి కర్మ లేదా ప్రతిచర్య ఏర్పడుతుంది. మనిషికి నీడలాగా అన్నట్లు మనం ఏ మూతాదులో ఎంత బలంగా ఎంత వేగంగా ఒక పనిని చేస్తామో అలాగే అంతే వేగంగా అదే విధంగా తిరిగి ఆ ప్రతిఫలం మనల్ని చేరుతుంది. ఎప్పుడు తిరిగి అది మనల్ని చేరుతుందో చెప్పలేము. కర్మఫల ప్రదాత భగవంతుడు.
(1:26:58) ఎప్పుడు ఆ కర్మఫలాన్ని జీవునికి తిరిగి ఇవ్వాలో అతనికి మాత్రమే తెలుసు కర్మలు జడములు కానీ కర్మఫలాలు మాత్రం అనుభవించే వరకు నిత్యములు ఒక్కోసారి మంచి గాని చెడు గాని చేశమంటే ఎన్ని జన్మల వరకైనా ఆ కర్మఫలం వెంటాడుతుంది. అనుభవించేట్టు చేస్తుంది. అప్పుడే అది అంతరిస్తుంది. ప్రతి ఒక్కరికీ ఎన్నో వేల జన్మల పాప పుణ్య కర్మ ఫలాలు కొండల్లాగా పేరుకొని ఉంటాయి.
(1:27:26) అవి అనుభవించడానికే జన్మ పరంపర సాగుతుంది. మనిషికి పాప పుణ్యాలే నిజమైన ఆస్తులు. చేసిన కర్మము చెడని పదార్థము. శ్రీకృష్ణదేవరాయులని కాపాడటానికి మహామంత్రి తిమ్మరసు జింక కన్నులను పీకించాడు. తర్వాత కాలంలో తిమ్మరసు మీద తన పిల్లవాడిని అపహరించాడని అభియోగం వచ్చి తిమ్మరసి యొక్క కళ్ళను రాయలు పీకాడు. రాముడు వాలిని చెట్టు చాట నుండి బాణంతో కొట్టి చంపాడు.
(1:27:56) తర్వాత జన్మలో వాలి ఒక బోయవానిగా జన్మించాడు. రాముడు కృష్ణుడిగా జన్మించాడు. ఆ బోయవాని చేతిలోనే బాణఘాతానికి గురై శ్రీకృష్ణుడు మరణించాడు. ఒక బోయవాడు అరణ్యంలోనే చెట్టు మీద ఉన్న 100 పక్షి గుడ్లను నేలకేసి కొట్టి నాశనం చేశాడు. 50 జన్మల తర్వాత ఆ బోయేవాడు ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. తన వంద మంది పుత్రులను కోల్పోయాడు. అప్పటి దుష్కర్మ 50 సంవత్సరాల తర్వాత ఫలించింది.
(1:28:24) శ్రీనాథుడు ఒక ఊరిలో నీటిని రప్పించడానికి గాను శివునిని ఎగతాళిగా ప్రార్థించాడు. ఆ శివనిందా ఫలం వలన అతడు తన చివరి దశలో కాళ్ళకు చేతులకు సంకెళ్లతో రోడ్డు మీద నడిచాడు చెరసాల పాలయ్యాడు. దుర్యోధనుడు దుశాసనుడు ద్రౌపదిని అవమానించారు. అత్యంత దయనీయమైన స్థితిలో మరణించారు. భీష్ముడు ద్రోణాదులు ఆ అధర్మాన్ని వారించలేదు. చివరకు ఎంతో బాధతో చనిపోయారు.
(1:28:52) అశ్వద్ధామ కురుక్షేత్ర యుద్ధం చివరి రాత్రి దుర్యోధనుని విన్నపం మేరకు పాండవ శిబిరానికి వచ్చి ఎంతో మందిని నిద్రపోతున్నప్పుడు చంపాడు. చిన్న పిల్లలైన ఉపపాండవులను ఉత్తర గర్భాస్థ శిశువుని కూడా చంపాడు. ఆ ఘోర పాపాల ఫలితంగా అశ్వద్ధామ చిరంజీవి అయినా కూడా పిచ్చివానిగా ఈ కలియుగాంతం వరకు హిమాలయాల్లో తిరుగుతున్నాడు కృష్ణుని శాపం వలన పాప ఫలితాలు కాదు పుణ్యఫలాలు కూడా పొందుతాము.
(1:29:19) భక్తితో ఒక ఉసిరికాయను దానం చేస్తే ఎన్నో బంగారు ఉసిరికాయలు లభించాయి. ఒక భక్తురాలికి భక్తితో పిలవగానే కృష్ణుడు వచ్చి ద్రౌపదిని కాపాడాడు. గజేంద్రుడు భక్తితో పిలవగానే విష్ణుమూర్తి వచ్చి కాపాడాడు. కేవలం అకుంఠిత భక్తి వల్లే శివాజీ కాళికాదేవి నుండి ఖడ్గాన్ని పొందాడు. తెనాలి రామకృష్ణుడు కాళిదాసు పోతన మొదలైన వారు ఎందరో మహాకవులయ్యారు. కాబట్టి సత్కర్మలు చేసి సుఖాలు పొందాలి.
(1:29:44) దుష్కర్మలు చేయకుండా కష్టాలను తప్పించుకోవాలి. నవ్వుతూ చెడ్డ పనులను చేస్తే భవిష్యత్తులో ఏడుస్తూ వాటి ఫలాలను అనుభవించాలి. మనకు పుణ్య పాపాలు ఎలా వస్తాయి? మనసా వాచా కర్మణ మనం పుణ్య పాపాలను సంపాదిస్తాము. మనసా అనగా మనసులో మంచి చెడు ఆలోచన ద్వారా వాచ అనగా మనం మాట్లాడే మంచి చెడు మాటల ద్వారా కర్మన మన శరీరము చేత మంచి మరియు చెడ్డ పనులు చేయడం ద్వారా మనకు పుణ్య పాపాలు సంక్రమిస్తాయి.
(1:30:15) ఒక మంచి పని గాని ఒక చెడ్డ పని గాని జరిగినప్పుడు ఆ పనిలోని పుణ్య పాపాలను నలుగురు సమానంగా పంచుకుంటారు. వారు ఒకటి చేసేవాడు రెండు చేయించేవాడు మూడు ప్రేరేపించేవాడు నాలుగు అంగీకరించేవాడు. మన పుణ్యాలే మనల్ని కాపాడతాయి. మనల్ని ఎల్లవేలలా కాపాడేది మనం ఇంతకుముందు చేసిన పుణ్యములే అవి ఒకటి అరణ్యంలో మనం తిరిగేటప్పుడు ఏ జంతువుల వల్ల గాని విషకీటకాల వల్ల గాని ఎలాంటి బాధలు పడకుండా రెండు యుద్ధంలో ఎలాంటి ప్రమాదం సంభవించకుండా మూడు శత్రువుల నుండి ఎలాంటి ఆపదలు రాకుండా నాలుగు నీటిలో ప్రయాణించేటప్పుడు ఐదు అగ్ని ప్రమాదంలో మనం చిక్కుకోకుండా ఆరు మహాసముద్రంలో
(1:30:56) ప్రయాణించే సమయంలో ఏ ప్రమాదం రాకుండా ఏడు ఎత్తైన పర్వతం మీద ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎనిమిది నిద్రపోయే సమయంలో తొమ్మిది పిచ్చివాళ్ళు కూడా ఎలాంటి ఆపదల్లో చిక్కుకోకుండా 10 మన కష్టకాలంలో ఎలాంటి బాధలు రాకుండా ఇలా ఈ 10 సందర్భాలలోనే కాకుండా సమస్త సందర్భాలలో కాపాడేవి మనం ఇంతకుముందు చేసిన పుణ్యరాశులే.
(1:31:20) కాబట్టి పుణ్యకర్మలను ఎల్లప్పుడూ మనం అవశ్యం చేస్తూ ఉండాలి. భగవద్గీత వలన విద్యార్థులు ఏమి నేర్చుకోవచ్చు? గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. కృష్ణుడు 574 అర్జునుడు 84 సంజయుడు 41 ధృతరాష్ట్రుడు ఒక శ్లోకమును చెప్పారు. మొత్తం గీతను కేవలం మూడు నిమిషాల 36 సెకండ్లలో చెప్పబడింది. భక్తి యోగంపై ఉన్న శ్లోకాలను మాత్రమే పారాయణలో ఉపయోగిస్తారు.
(1:31:48) మిగిలిన శ్లోకాల సారాన్ని జీవితంలో ఆచరించాలి. ఈ శ్లోకాల ద్వారా కృష్ణుడు మనకు ఏమి చేయాలో సూచించాడు. గీత చదవడం ఒత్తడిని తొలగిస్తుంది. ఇది మంచితనాన్ని పెంపొందిస్తుంది. కోపాన్ని తొలగిస్తుంది. సందేహాలను నివృత్తి చేస్తుంది. మరియు ఆత్మను బలపరుస్తుంది. ఇది ఎంత వినాలో ఏమి తినాలో పెద్దలు మరియు గురువుల పట్ల గౌరవాన్ని మరియు కృతజ్ఞతను కలిగించడాన్ని బోధిస్తుంది.
(1:32:10) ఇది మనిషి మరియు చెడుల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. గీతను ఎవరు చదవాలి? విద్యార్థులు క్రమశిక్షణ కోసం యువత ఎలా జీవించాలో నేర్చుకోవడానికి పెద్దలు ప్రశాంతంగా ఎలా చనిపోవాలో అర్థం చేసుకోవడానికి అజ్ఞానులు జ్ఞానాన్ని పొందడానికి నేర్చుకున్నవారు వినయం కోసం ధనవంతులు కరుణను పెంపొందించుకోవడానికి కలలు కనేవారు వారి రక్షాలను సాధించడానికి బలహీనులు బలం కోసం బలవంతులు దిశా నిర్దేశం కోసం వినయపూర్వకులైన వారు శ్రేష్టత కోసం అలసిపోయిన వారు విశ్రాంతి కోసం విరామం లేనివారుశా శాంతి కోసం సందేహస్పదులు సమాధానాల కోసం పాపులు విముక్తి కోసం ముముక్షువులు మోక్షం కోసం మానవులందరూ
(1:32:54) మార్గదర్శనం కోసం అందుకే కృష్ణం వందే జగద్గురుం అని చెప్పబడింది. అనగా జగత్తుకు గురువైన కృష్ణునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. విష్ణువులో 1/14వ వంతు కృష్ణుడిగా భూమికి దిగి వచ్చాడు. త్రేతా యుగంలో విష్ణువులో 1/7వ వంతు హంస రాముడిగా అవతరించింది. అందుకే రాముడు చేసినట్లు చేయి కృష్ణుడు చెప్పినది అనుసరించు అని ఆర్యోక్తి కృష్ణుడు 128 సంవత్సరాలు జీవించాడు.
(1:33:22) చెడ్డవాళ్ళు ఎలాంటివారు? దుష్టులకు దూరంగా ఉండాలి. దుర్జనులను దగ్గరకు రానియకూడదు. వేరు పురుగు లాంటివారు చెట్టు మొత్తము నాశనము చేయను. దుర్జనులు చీడ పురుగు లాంటి వాళ్ళు చీడ పురుగు ఆకులను తినటం ద్వారా చెట్టును నాశనం చేస్తుంది. ఎలుకతోలు ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. చెడ్డవాడు మారడు వేప చెట్టుకు పాలు పోసిన ఉపయోగం లేదు. నీచ స్వభావం మారదు.
(1:33:58) కనకపు సింహాసనమున సునకమును కూర్చోబెట్టినట్లు దుర్జనుడితో స్నేహము చేసినచో దానికి తగినట్లే ఆపదులు కలుగుతాయి. మంచంలో నల్లులు ఉంటే దాని నేలకేసి కొడతాము. నల్లులకు మాత్రమే బాధ కలుగుట లేదు. మంచానికి కూడా బాధ కలుగుతున్నది. అప్రయోజకుడైన కొడుకు తాను చెడుటయే గాక తండ్రి పేరును కూడా పాడు చేస్తాడు. చెరుకుగడ చివరలో వెన్ను పుట్టి దానిలోని తీపినంతా పాడు చేసినట్టు దుర్జనుడు పాము తేళ్లు కన్నా భయంకరుడు నీళ్లు పాలలో కలిసినప్పుడు ఆ పాలను పాడు చేస్తాయి.
(1:34:38) అలాగే దుర్మార్గుని చేరదీస్తే మంచివాడు కూడా చెడిపోతాడు. నీచులకు ఉపకారం చేస్తే దాని వలన అపకారమే కలుగుతుంది. పాముకు పాలు పోస్తే దాని విషము వృద్ధి పొందుతుంది. ధర్మము కొరకు సుఖము కొరకు సత్పురుషులతో సహవాసం చేయాలి. బంగారంలో ప్రతి అణువు విలువైనదే అలాగే ప్రాణి ఏదైనా విలువైనదే సుఖిస్తున్నావు అని అంటే పూర్వజన్మ పుణ్యఫలాన్ని అనుభవిస్తున్నావు అని అర్థం.
(1:35:12) దుఃఖపడుతున్నావు అంటే పూర్వజన్మ పాప ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం. నిష్కల్మసమైన ప్రవర్తనను కలిగి ఉన్నవాడు ఏ తీర్థ దర్శనము చేయకుండానే పుణ్యగతులను తప్పక పొందుతాడు. చతుర్విధ ఉపాయాలు సామదాన భేదండోపాయాలు ఏదైనా పనిని ఈ నాలుగు ఉపాయాల ద్వారా సాధించవచ్చు. సామ అనగా మంచిగా మాట్లాడుట ద్వారా పనిని సాధించటం దానం అనగా డబ్బు ఇచ్చి పనిని సాధించటం భేదం అనగా ఇద్దరి మధ్య భేదాన్ని సృష్టించి కార్యాన్ని సాధించుకోవటం చివరిది దండోపాయం ఈ మూడు ఉపాయాల ద్వారా సాధించలేని పనిని శిక్షించి సాధించుకోవటం పురుషార్థ చతుష్టయం ప్రతిమానవుడు తప్పక
(1:36:02) ఆచరించవలసిన పనులుఇవి ధర్మార్థ కామ మోక్షాలను పురుషార్థాలు అని అంటారు. అనగా ప్రతి మనిషి ధర్మబద్ధంగా పనులు చేయాలి. ధర్మబద్ధంగా డబ్బును సంపాదించాలి. ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవాలి. చివరికి ధర్మబద్ధంగా మోక్షాన్ని సాధించాలి. ఎవరైతే ధర్మార్థ కామాల ద్వారా సరిగా ఉంటారో వారికి మోక్షం సాధ్యంగానే సిద్ధిస్తుంది. ఎంత చదివితే అంత ప్రయోజనం.
(1:36:31) పుస్తకాలు వ్యాసాలు చదివే అలవాటుతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. విశాల ప్రపంచంలోని భిన్న భావాలు అవగతమవుతాయి. మరింత జాన తృష్ణ అంకురిస్తుంది. జానం సమాచారం గ్రహించడంలో అవధులు లేని ఆనందం అనుభవంలోకి వస్తుంది. బాడీ లాంగ్వేజ్ మెరుగుపరచడానికి ఏడు సలహాలు చేతులు జేబుల్లో పెట్టుకోవడం మానేయండి. ఇది ఆత్మవిశ్వాసం లేనట్టుగా కనిపిస్తుంది.
(1:37:01) వంకరగా లేదా నీరసంగా నిలవకండి అలా కనిపిస్తే మనలో ఆసక్తి లేకపోయినట్టు అనిపిస్తుంది. మారుమూలంగా ప్రవర్తించకండి ఇది మనపై నమ్మకాన్ని తగ్గిస్తుంది. నెమ్మదిగా స్పష్టంగా మాట్లాడండి. హ ఇంకా లాంటి పదాలు వాడకండి. తలకిందుగా చూడకండి. నేరుగా చూస్తూ మాట్లాడితే మీరు ధైర్యంగా కనిపిస్తారు. చెయ్యి కలుపుతున్నప్పుడు బలంగా ధైర్యంగా కలపండి.
(1:37:31) ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని చూపుతుంది. నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం జీవితంలో పది మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు. పది మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. అందరినీ ఆనందంగా ఉంచడానికి చూడడం అంటే కప్పలను తక్కెడలో తూచడమే ఒకదాన్ని కూర్చోబెడితే రెండోది గెంతేస్తుంది.
(1:37:59) కొడుకు గుణం పెళ్లయిన తర్వాత కూతురు గుణం వయసులోనూ భర్త గుణం భార్య అనారోగ్యంలోనూ భార్య గుణం భర్త పేదరికంలోనూ స్నేహితుని గుణం కష్టం నందు అన్నాదమ్ముల గుణం జగడం నందు పిల్లల గుణం వృద్ధాప్యంలోనూ తెలుస్తాయి. దేవుడు కనిపించడు అని అందరూ అంటుంటారు. కష్టాలు చుట్టుముట్టి నలువైపులా ఎవరు దేవుడు కనిపిస్తాడు. మనిషికి అందనివన్నీ అందంగాను అందినవన్నీ అలుసుగాను కనిపిస్తాయి.
(1:38:30) ఎవరి నుండి ఏమేమి నేర్చుకోవాలి తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వరుల వలె చూసుకోవాలి. వినాయకుడు ఎంత నేర్చుకున్నా వదిగి ఉండాలి హనుమంతుడు ధర్మమే ముఖ్యము శ్రీరాముడు పతిని ఎల్లవేళలా అనుసరించాలి సీతాదేవి అన్నావనలను సొంత తల్లిదండ్రుల వలె సేవించాలి. లక్ష్మణుడు తెలిసింది గుప్పడు తెలియనిది కొండంత ఇంద్రుడు భరద్వాజ మహర్షికి చెప్పాడు తొందరపాటుతో ఆలోచించకుండా ఏ పని చేయరాదు.
(1:39:07) భారవి ఎన్ని కష్టాలు పడుతున్నా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. శ్రీకృష్ణుడు వ్యాసుడు సమస్త పుస్తకాల సారాంశము ఒక వాక్యంలో చెప్పాడు ఇతరులకు మేలు చేస్తే పుణ్యము హాని చేస్తే పాపము వస్తుంది. మంచి పనిని పొడిగించవద్దు ఆ రోజే చేయాలి. రావణాసురుడు పంచరుణాలు మాతృ ఋణము పితృ ఋణము దేవ ఋణము ఋషి ఋణము గురు ఋణము మాతృ ఋణము మరియు పితృ ఋణము ఈ రెండు రుణాలను తీర్చుకోవాలంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేయాలి.
(1:39:43) మరణానంతరం శ్రాద్ధాది కర్మలను యధావిధిగా చేయాలి. లేకపోతే తరువాత జన్మలో తల్లిదండ్రుల ప్రేమ దక్కదు. దేవఋణం తీరాలంటే మానవుడు తన శక్తి కొలది తోటి వారికి సహాయం చేయాలి. అప్పుడే దేవఋణం తీరుతుంది. అలా చేయకపోతే మరలా మానవ జన్మ రాదు. వివాహం చేసుకొని మగ సంతానాన్ని పొందాలి. అప్పుడే ఋషి ఋణం నుండి విముక్తుడు అవుతాడు.
(1:40:11) యధాశక్తి గురువుకి గురుదక్షిణ ఇచ్చి గురు ఋణం నుండి విముక్తుడు కావాలి. లేకపోతే తరువాత జన్మలో చదువు రాదు. ధర్మము కొరకు సుఖము కొరకు సత్పురుషులతో సహవాసం చేయాలి. బంగారంలో ప్రతి అణువు విలువైనదే అలాగే ప్రాణి ఏదైనా విలువైనదే సుఖిస్తున్నావు అని అంటే పూర్వజన్మ పుణ్య ఫలాన్ని అనుభవిస్తున్నావు అని అర్థం. దుఃఖపడుతున్నావు అంటే పూర్వజన్మ పాప ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం.
(1:40:47) నిష్కల్మసమైన ప్రవర్తనను కలిగి ఉన్నవాడు ఏ తీర్థ దర్శనము చేయకుండానే పుణ్యగతులను తప్పక పొందుతాడు. చతుర్విధ ఉపాయాలు సామదాన భేద దండోపాయాలు ఏదైనా పనిని ఈ నాలుగు ఉపాయాల ద్వారా సాధించవచ్చు. సామ అనగా మంచిగా మాట్లాడటం ద్వారా పనిని సాధించటం. దానం అనగా డబ్బు ఇచ్చి పనిని సాధించటం. భేదం అనగా ఇద్దరి మధ్య విభేదాన్ని సృష్టించి కార్యాన్ని సాధించుకోవడం చివరిది దండోపాయం ఈ మూడు ఉపాయాల ద్వారా సాధించలేని పనిని శిక్షించి సాధించుకోవడం పురుషార్థ చతుష్టయం ప్రతి మానవుడు తప్పక ఆచరించవలసిన పనులు ఇవి ధర్మార్థ కామ మోక్షాలను పురుషార్థాలు అని అంటారు.
(1:41:32) అనగా ప్రతి మనిషి ధర్మబద్ధంగా పనులు చేయాలి. ధర్మబద్ధంగా డబ్బును సంపాదించాలి ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవాలి. చివరికి ధర్మబద్ధంగా మోక్షాన్ని సాధించాలి. ఎవరైతే ధర్మార్థ కామాల ద్వారా సరిగా ఉంటారో వారికి మోక్షం సహజంగానే సిద్ధిస్తుంది. పాడగా పాడగా రాగం వస్తుంది. తినగా తినగా వేప చిగుళ్లు కూడా తీయగా ఉంటాయి. అలాగే ఏం మొదట ఏ పనైనా చేత కాకపోయినా చేయగా చేయగా చేయ తిరిగి నైపుణ్యం వస్తుంది.
(1:42:08) వెదురు చెట్టు ఐదు సంవత్సరముల వరకు నీళ్లు పోసిన మొలకెత్తదు. ఆ తర్వాత మొలకెత్తి ఆరు నెలల్లోనే 100 అడుగులు పెరుగుతుంది. అన్ని సంవత్సరములు ఆ చెట్టు వేళ్ళు లోతుకు పెరుగుతున్నాయి. అప్పుడే అది అంత ఎత్తున నిలబడుతుంది. పూర్వం అత్తలు గయ్యాళిగా ఎందుకు ఉండేవారు? పూర్వకాలంలో అమ్మాయికి ఎనిమిది సంవత్సరాలు రాగానే కన్య అయింది అనే భావనతో పెళ్లి చేసేవాళ్ళు ఆ పెళ్లి కొడుకులు కూడా ముసలివాళ్ళు 70 సంవత్సరాలుగా ఉండేవారు.
(1:42:39) అమ్మాయి పెద్ద మనిషి అవ్వగానే కాపురానికి పంపించేవాళ్ళు దాదాపు 13 సంవత్సరాలు భార్యకు మొగుడికి 70 లేక 75 సంవత్సరాలు ఉండేవి. ముసలి మొగుడు కాబట్టి మూడు నాలుగు సంవత్సరాలలో చనిపోయేవాడు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆమె పెంచేది. మగపిల్లలకు పెళ్లిళ్లు అయ్యేవి తాను పొందని దాంపత్య సుఖాన్ని తన కొడుకు ద్వారా పరాయి స్త్రీ పొందుతున్నది అనే ఈర్షతో ఉండేది అత్త.
(1:43:04) అందుకే కోడల్ని తిడుతూ కొడుతూ రాచి రంపన పెట్టేది. కోడలు భర్తకి కంప్లైంట్ చేస్తే అతను కూడా అర్థం చేసుకోకుండా ఆమెనే తిట్టేవాడు. ఇంకొక కారణం ఏమిటంటే తన అత్తగారు తనని తిట్టేది. ఇప్పుడు తనవంతు వచ్చింది కాబట్టి తన కోడల్ని తిట్టడం తన బాధ్యతగా అనుకునేది అత్త. ఈ రెండు కారణాల వల్ల పూర్వము గయ్యాళి అత్తలు ఉండేవారు స్వభావాన్ని మార్చలేము కానీ ప్రవర్తనను మార్చవచ్చు.
(1:43:36) స్వభావో దురితిక్రమః స్వభావము మార్చలేనిది. పుట్టుకతో వచ్చే బుద్ధులు పుడకలతోనే పోతాయి అని తెలుగు సామెత. అంటే జన్మతో వచ్చినటువంటి స్వభావం చనిపోతే గాని పోదు. మనిషికి మంచి లక్షణాలు చెడ్డ లక్షణాలు మనసుతో పాటే జన్మతః వస్తాయి. మనసులో పాతుకుని ఉన్న పూర్వజన్మ నుంచి వచ్చిన ఆ లక్షణాలు రకరకాల ఆయా సందర్భానుసారం మంచి లేక చెడు ఆలోచనలు కలిగిస్తాయి.
(1:44:05) ఆలోచనల అనుసారం మంచి పనులు చెడ్డ పనులు మనిషి చేస్తాడు. అందుకే బుద్ధిహి కర్మనుసారిని అని శాస్త్రం అనగా మన బుద్ధి అనగా నిర్ణయాలు తీసుకునే మనసునే బుద్ధి అంటారు. ఆ బుద్ధియే మనం పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మ మరియు దుష్కర్మలను అనుసరించే ప్రస్తుత ఆలోచనలు వచ్చి మంచి లేక చెడ్డ నిర్ణయాలు తీసుకునేట్టు చేస్తాయి. ప్రవర్తన మాత్రం నేర్చుకుంటే వచ్చేది.
(1:44:30) పిల్లలు తల్లిదండ్రుల నుంచి గురువుల నుంచి పెద్దవాళ్ళ నుంచి స్నేహితుల నుంచి సమాజం నుంచి రకరకాల మాధ్యమాల నుంచి సత్ప్రవర్తన లేక దుష్ట ప్రవర్తన నేర్చుకుంటారు. కాబట్టి ప్రవర్తనను మంచి మాటలు చెప్పో నయానో గయానో మార్చవచ్చు. స్వభావాన్ని మాత్రం మార్చలేము ఏ యుగానికి ఏ ధర్మాలు ఏ పనులను చేయాలి కృత యుగమున తపస్సు త్రేతా యుగమున జ్ఞానము ద్వాపర యుగమున యజ్ఞము కలియుగమున జ్ఞానమును ఉత్కృష్టమైనవి అలాగే ఆయా యుగాలలోని మానవులు ఆచరించవలసిన ధర్మాలను మన ఋషులు నిర్దేశించారు.
(1:45:12) వాటిని స్మృతులు అని అంటారు. అంటే మన ఐపీసి సెక్షన్లు లాగా అన్నమాట. అవి కృత యుగమునకు మనస్మృతి త్రేతా యుగానికి గౌతమ స్మృతి ద్వాపర యుగానికి యాజ్ఞవల్క్య స్మృతి కలియుగానికి పారాసర స్మృతిని మానవులందరూ పాటించాలి. రామనామన్ని మూడు సార్లు చెబితే ఎంత పుణ్యం విష్ణు సహస్రనామ స్తోత్రంలో పార్వతీదేవి ఈశ్వరుని అడుగుతుంది. స్వామి విష్ణు సహస్రనామం చాలా పెద్దదిగా ఉంది.
(1:45:41) పండితులేమో రోజు చదవగలరు. కానీ సామాన్యులకు వీలు కాదు అందువల్ల దానిని చిన్నది చేసి చెప్పండి అని అడిగింది. అప్పుడు ఈశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఈ శ్లోకమును ఒక్కసారి చదివితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక్కసారి చదివినంత ఫలితం వస్తుందని చెప్పాడు. ఎలా అంటే తెలుగు వర్ణమాలలో య ర లవ స లో రెండవ అక్షరము ప ఫలో మ ఐదవ అక్షరము రెండు మ 5 ఇప్పుడు రామ రామ రామ అని మూడు సార్లు అంటే 2* 5*2* 5*2*5= 1000 అవుతుంది.
(1:46:28) మోక్షం ఎలా వస్తుంది? మన నిజమైన ఆస్తులు సంచిత ఆగామి ప్రార్ధ కర్మలు ఒకటి సంచితం అనగా మనం ఇన్ని జన్మల్లో కూడబెట్టిన పాప పుణ్య రాశి ఇది ఎలా నశిస్తుందంటే మనకు బ్రహ్మజ్ఞానం వస్తే ఆ జ్ఞానాగ్ని చేత సంచిత కర్మలు కాలిబోడదయపోతాయి. రెండు ప్రారబ్ధం అంటే సంచితంలో నుంచి కొంత కర్మ తీసి ఈ జన్మలో మనం అనుభవించాలని మన నుదుటన బ్రహ్మ వ్రాస్తాడు.
(1:46:57) ఈ ప్రారబ్ధ కర్మను మనం అనుభవిస్తేనే నశిస్తుంది. మూడు ఆగామి కర్మ. ఇప్పుడు చేసే మంచి చెడు కర్మల ఫలితాలను వచ్చే జన్మలో మనం అనుభవిస్తాము. ఇవి ఎలా పోతాయి అంటే ప్రస్తుతం మనం చేసే కర్మల మీద కోరికలు లేకుండా భగవంతునికి ఆ ఫలాలు చెందుగాక అని అనుకుంటే అవి మనకు అంటము. పాప పుణ్యాలన్నీ శూన్యమైనప్పుడే మనిషికి మోక్షం వస్తుంది.
(1:47:22) శరీరం ఒక రథం లాంటిది. రథంలో కూర్చున్న వ్యక్తి ఆత్మ. రథసారధి అంటే బుద్ధి పగ్గాలు అంటే మన మనసే అనగా మన ఆలోచనలు గుర్రాలు మన ఐదు ఇంద్రియాలు రథసారధి గుర్రాలను సరిగ్గా నడపాలి. అదేవిధంగా మనం సరైన మార్గంలో ప్రయాణించాలంటే మన తెలివి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. చర్మం, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అనే ఇంద్రియాలను నియంత్రించాలి. మరియు వాటిని ఇష్టానుసారం వెళ్ళనివ్వకూడదు.
(1:47:52) పిల్లల్లాగే మంచి చెడుల గురించి ఆలోచించకుండా ఇంద్రియాలు తమకోసం ప్రతిదాన్ని కోరుకుంటాయి. మనసులో కూడా ఇంద్రియాల కోరికల ప్రకారం ఆలోచనలు వస్తాయి. కానీ రథసారధి అయిన బుద్ధికి నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉంటుంది. మరియు అది మంచిదైనా చెడ్డదైనా కనిపెట్టే వివేచన శక్తి ఉంటుంది. కాబట్టి అటువంటి బుద్ధి మనసు యొక్క పగ్గాలను లాగి గుర్రాలు వంటి ఇంద్రియాలను సరైన మార్గంలో నడిపించాలి.
(1:48:19) అప్పుడే రథంలోని ఆత్మ మోక్ష లక్ష్యాన్ని చేరుకుంటుంది. గుర్రాలను అవి ఇష్టపడిన విధంగా వదిలివేయలేము. ఆ రథం రోడ్డు మీద నుంచి పడి బోల్తా పడుతుంది. ఇంద్రియాలు చెప్పేది బుద్ధి వినకూడదు. ఇంద్రియాలు బుద్ధి చెప్పినట్లుగా పని చేయాలి. ఇది మానవ ప్రయత్నం వల్ల జరగదు. అందుకే మనం ప్రతిరోజు దేవుని మనకు సద్బుద్ధిని ప్రసాదించమని ప్రార్థించాలి. ఆయనే మన మనసును, బుద్ధిని సరైన మార్గంలో పెట్టగలడు.
(1:48:47) ఏ యుగానికి ఏ ధర్మాలు ఏ పనులను చేయాలి కృత యుగమున తపస్సు త్రేతా యుగమున జ్ఞానము ద్వాపర యుగమున యజ్ఞము కలియుగమున జ్ఞానమును ఉత్కృష్టమైనవి అలాగే ఆయా యుగాలలోని మానవులు ఆచరించవలసిన ధర్మాలను మన ఋషులు నిర్దేశించారు. వాటిని స్మృతులు అని అంటారు. అంటే మన ఐపిసి సెక్షన్లు లాగా అన్నమాట అవి కృతయుగానికి మనుస్మృతి త్రేతా యుగానికి గౌతమ స్మృతి ద్వాపర యుగానికి యాజ్ఞవల్క్య స్మృతి కలియుగానికి పారాసర స్మృతిని మానవులందరూ పాటించాలి.
(1:49:30) భగవద్గీత వలన విద్యార్థులు ఏమి నేర్చుకోవచ్చు. గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి? కృష్ణుడు 574 అర్జునుడు 84 సంజయుడు 41 ధృతరాష్ట్రుడు ఒక శ్లోకమును చెప్పారు. మొత్తం గీతను కేవలం మూడు నిమిషాల 26 సెకండ్లలో చెప్పబడింది. భక్తి యోగంపై ఉన్న శ్లోకాలను మాత్రమే పారాయణలో ఉపయోగిస్తారు. మిగిలిన శ్లోకాల సారాన్ని జీవితంలో ఆచరించాలి.
(1:50:04) ఈ శ్లోకాల ద్వారా కృష్ణుడు మనకు ఏమి చేయాలో సూచించాడు. గీత చదవడం ఒత్తిడిని తొలగిస్తుంది. ఇది మంచితనాన్ని పెంపొందిస్తుంది కోపాన్ని తొలగిస్తుంది సందేహాలను నివృత్తి చేస్తుంది మరియు ఆత్మను బలపరుస్తుంది. ఇది ఎంత వినాలో ఏమి తినాలో పెద్దలు మరియు గురువుల పట్ల గౌరవాన్ని మరియు కృతజ్ఞతను కలిగించడాన్ని బోధిస్తుంది.
(1:50:32) ఇది మంచి మరియు చెడుల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. గీతను ఎవరు చదవాలి? విద్యార్థులు క్రమశిక్షణ కోసం యువత ఎలా జీవించాలో నేర్చుకోవడానికి పెద్దలు ప్రశాంతంగా ఎలా చనిపోవాలో అర్థం చేసుకోవడానికి అజ్ఞానులు జ్ఞానాన్ని పొందడానికి నేర్చుకున్నవారు వినయం కోసం ధనవంతులు కరుణను పెంపొందించుకోవడానికి కలలు కనేవారు తమ లక్ష్యాలను సాధించడానికి బలహీనులు బలాన్ని పొందడానికి బలవంతులు దిశా నిర్దేశం కోసం వినయపూ పూర్వకమైనవారు శ్రేష్టత కోసం అలసిపోయిన వారు విశ్రాంతి కోసం విరామం లేనివారు శాంతి కోసం సందేహాస్పదులు సమాధానాల కోసం పాపులు విముక్తి కోసం ముముక్షువులు మోక్షం కోసం
(1:51:22) మానవులందరూ మార్గదర్శకత్వం కోసం అందుకే కృష్ణం వందే జగద్గురుం అని చెప్పబడింది. అనగా జగత్తుకు గురువైన కృష్ణునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. విష్ణువులో 14వ భాగం కృష్ణుడిగా భూమికి దిగి వచ్చాడు. త్రేతా యుగంలో విష్ణువులో 1/7వ వంతు హంస రాముడిగా అవతరించింది. అందుకే రాముడు చేసినట్లు చేయి కృష్ణుడు చెప్పినది అనుసరించు అని ఆర్యోక్తి కృష్ణుడు 128 సంవత్సరాలు జీవించాడు.
(1:51:58) ఆత్మ ఎన్ని శరీరాలు ధరిస్తుంది లైఫ్ సైకిల్ మొదటగా మనం చెట్లుగా జలచరాలు క్రిమి కీటకాలు పక్షులు పశువులుగా జన్మిస్తాము. తరువాత మానవ జన్మలను ధరిస్తాము. మనం చనిపోయిన తరువాత యమలోకానికి వెళ్తాము. అక్కడ భూమి మీద చేసిన కొన్ని పాపాలకు యముడు నరకలోకంలో శిక్షలు విధిస్తాడు. పుణ్యాత్ములు నరకలోకం నుండి స్వర్గానికి వెళ్లి పుణ్యం ఉన్నంతవరకు స్వర్గలోకంలో సుఖాలను అనుభవిస్తారు.
(1:52:28) స్వర్గం నుండి ఆ ఆత్మ చంద్రమండలం మీదకు వెళుతుంది. అక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకుంటుంది. భగవంతుని నుండి సందేశం రాగానే చంద్రుని నుండి ప్రతిఫలించే కిరణాలను పట్టుకొని భూమి మీద ఉన్న మేఘాలను చేరుతుంది. మేఘాలతో పాటు ప్రయాణించి అవి వర్షించగానే ఆ వర్షపు నీటి చినుకులను పట్టుకొని భూమి మీద పడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఏదో ఒక చెట్టు వేరును పట్టుకొని కాయలేక పండులోకి ఆ ఆత్మ ప్రవేశిస్తుంది.
(1:52:57) పండును లేక ఆ గింజను తిన్నవాని ఇంట్లో జన్మిస్తుంది. ఆత్మజ్ఞానం కలిగే వరకు లేదా భగవత్ సాక్షాత్కారం కలిగే వరకు ఈ జీవుని యాత్ర సాగుతుంటుంది. అసంఖ్యాకమైన శరీరాలను పొందుతూ సుఖ దుఖాలను అనుభవిస్తుంటుంది.

No comments:

Post a Comment