*ఒక మగ మనిషికి ముసలితనం రావడానికి, ఒక ఆడ మనిషికి ముసలితనం రావడానికి తేడా:*
*ఒక మానసిక విశ్లేషకుల మాటల్లో, ఒప్పుకోవలసిన నిజాలు*
*1.మగవాడు ముసలివాడు అవుతాడు, ఆడమనిషి పరిపక్వత చెందుతుంది.*
*2. ఒకసారి పిల్లల పెళ్లిళ్లు చేశాక, ఆర్ధికంగా నిలదొక్కుకున్న తర్వాత, మగవాడి ఇంటిపెద్దగా వుండే గౌరవం, నిదానంగా తగ్గిపోతుంది.*
*3. ఆ తర్వాత, అందరికీ అతనొక భారంగా , ఊరికే చిరాకు పడే వాడిగా, విసుగుకలిగించే వాడిగా, ఎప్పుడు ఏ విధంగా మసలుతాడో తెలియని వాడుగా అగుపిస్తాడు.*
*4.ఒకప్పుడు భార్య, పిల్లల కోసం కఠినమైన నిర్ణయాలు అతను, తర్వాత కాలంలో వాటిని విశ్లేసించడం, విమర్శించడం చేస్తారు;*
*ప్రతి పనీ సరిగా చేయడం లేదని తప్పులు పడుతూ వుంటారు. నిజంగా తప్పులు చేసివుంటే అతన్ని దేవుడే రక్షించాలి!*
*5. అదే ఒక ఆడ మనిషి చేస్తే, పిల్లలనుండి, కోడలు నుండి సానుభూతి పొందుతారు ఎందుకంటే, ఆమె ద్వారా ఇంకా చాలా పనులు జరగాల్సి వుంటుంది.*
*6. సరైన సమయంలో ఆమె తెలివిగా భర్త పరిధిలోనుంచి, పిల్లల పరిధిలోకి వెళ్ళిపో తుంది(మారిపోతుంది)*
*7. భర్త పెద్దవాడైపోతే, భార్య కోడలి కుటుంబంవైవు మొగ్గుచూపుతుంది ఎందుకంటే, కొడుకు తన నుండి దూరం కాగూడదని, కొడుకు తనను బాగా చూసుకుంటూ వుంటాడాని.*
*8.మగవాడు వయసులో వున్నప్పుడు ఎన్ని గొప్ప పనులు చేసినా, పెద్దయ్యాక ఆ గొప్పతనం అతనికి ఏవిధంగా కూడా ఉపయోగపడవు.*
**9.అదే ఆడ వాళ్లకు, అంతకుముందు చేసిన మంచి పనులు ఆవిడకి గౌరవాన్నీ, గుర్తింపును యిస్తూనే వుంటాయి.*
*10. ఎవరికైనా వంశ పారంపర్య ఆస్తులు లేదా పొలాలు వుంటే (ఇప్పటికీ కొంతమంది పిల్లలు కోరుకుంటున్నారు) వారి పరిస్థితి కొంత మేలు.*
*కానీ, ముందుముందు ఆస్తుల విషయంలో ఇబ్బందులు లేకుండా ఆస్తులను పంచేసిన వారి జాతకం పైన చెప్పినట్లు అవుతుంది.*
*కాబట్టి ముందుగానే ఆస్తులను పంచకండి.*
*11.ఏదైనా హాస్పిటల్ పోయి చూడండి. ఎవరైనా ముసలాయన గానీ, ముసలావిడ గానీ చేర్చబడి వుంటే వాళ్ళ బంధువుల కళ్ళు చూడండి.*
*చేర్చిన అతను మగవాడైతే (కూతురు తప్ప) ఇతరుల కళ్ళలో తడి కనబడదు.*
*12) నీతి: ఒకసారి మగవాడు ముసలివాడైతే, ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా జీవించడం నేర్చుకోవాలి.*
*మగవాడు జీవితమంతా విద్యార్థి గానే వుంటాడు.*
*నిజంగా, ఈ ప్రపంచంలో ఎవరూ, ఎవరికోసమూ (చెందినవారై ) వుండరు అనే విషయాన్ని గ్రహించాలి.*
*నిర్లిప్తంగా, ఇతరులపై ఆధారపడకుండా, స్వాభిమానంతో జీవించడం నేర్చుకోవాలి.*
*13) నా సలహా:*
*నువ్వు ఇతరులకు చేసిన పాత సహాయ విషయాల ఊహలలో వుండవద్దు.* *కనీసం వాటి గురించి మాట్లాడ వద్దు.*
*14) ఆఖరికి పురాతన గ్రంధాలలో కూడా ,పెద్దవాళ్ళు అయిన తరువాత, ఆడవాళ్లు వానప్రస్త ఆశ్రమం గానీ, సన్యాస ఆశ్రమం గానీ తీసుకున్న ఉదాహరణలు లేవు*
*జీవితంలోని దశలన్నీ మగవారికే చెప్పబడ్డాయి.* *వాటి ప్రాముఖ్యతను అర్ధం చేసుకుంటే, మీకు అర్ధమవుతుంది మన పూర్వీకులు ఎంత ముందుజాగ్రత్త కలవారో అని!!*
No comments:
Post a Comment