Sunday, December 28, 2025

🚨MAX MULLER EXPOSED: The real face of Max Muller who distorted the Vedas🤯 | TRUE HISTORY | Madan ...

🚨MAX MULLER EXPOSED: The real face of Max Muller who distorted the Vedas🤯 | TRUE HISTORY | Madan ...

https://youtu.be/cyt1wFLtxvM?si=Syooj0curulnABJg


https://www.youtube.com/watch?v=cyt1wFLtxvM

Transcript:
(00:00) భారతదేశ చరిత్ర మొత్తంలో మాక్స్ ముల్లర్ లాంటి మోసగాడు అస్సలు కనిపించడు అతని జీవితాంతం సనాతన ప్రేమికుడుగా నటిస్తూనే వచ్చాడు హిందువుల సంస్కృతిని నీచ సంస్కృతిగా చూపించి తమ సంస్కృతిని గొప్ప సంస్కృతిగా చెప్పే అవకాశం ఉంది. ఇక్కడి నుండే అసలు కథ మొదలైంది. భారతదేశం పైన ఆధిపత్యం చలాయించడానికి ఇక్కడ ఎటువంటి సంస్కృతి ఉంది అనే విషయాలను అర్థం చేసుకోవడానికి సంస్కృతాన్ని అధ్యయనం చేసేవారు.
(00:31) తాను సంపాదించిన 25,000 పౌండ్లు తీసుకొని ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ దానం చేశాడు. ఈ దానం వెనుక ఉన్న కుట్రను తెలుసుకోవాలంటే బోర్డెన్ రాసిన వీలునా మనం చూడాల్సి ఉంటుంది. ఈ ధనంతో క్రిస్టియన్ మిషనరీలు సంస్కృతాన్ని నేర్చుకుని దాని నుండి జ్ఞానాన్ని సంపాదించి భారత్ కు వెళ్లి క్రిస్టియానిటీని వ్యాపింప చేయాలి. కానీ ఈ పని చేయడానికి సరైన వ్యక్తి దొరకడానికి వారికి 20 సంవత్సరాలు పట్టింది వారు మాక్సిమల్ల ఎందుకు ఎందుకు ఎంచుకున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న ప్రధానంగా ఋగ్వేదాన్ని అనువాదం చేయడం అంత చిన్న పని కాదు దౌర్భాగ్యం ఏమిటంటే అతనికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు సంస్కృతం కూడా
(01:09) అంతంత మాత్రమే క్రిస్టియానిటీ సిద్దాంతాలు హిందూ సిద్దాంతాల కంటే గొప్పవి అన్నవి చాలా చోట్ల మనకు ఈయన అనువాదాల్లో కనిపిస్తాయి ఆ పరమేశ్వరుని శక్తి ఈ విశ్వంలో అనేక రూపాలలో ప్రకటితమవుతూ ఉంటుంది అని వేదాలు స్పష్టంగా చెప్పాయి కానీ దీన్ని బహుదైవతారాధనగా చూపించాడు మన మాక్స్ ముల్లర్ గారు అటువంటి మాక్స్ ముల్లర్ను సనాతన ధర్మానికి వైదిక ధర్మానికి మిత్రుడని చాటే మనవారికి సిగ్గు ఉండాలి.
(01:41) నమస్తే సదా వత్సలే మాతృభూమే నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త మిత్రులారా ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలను చిన్నాభిన్నం చేస్తూ మన సాహిత్యాన్ని సైతం వదలకుండా తప్పుడు భాష్యాలు రాసిన ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. అతనికి సంస్కృతమే కాదు ఇంగ్లీష్ కూడా రాదు కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదేశించిన ప్రకారం అతను వేదాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు.
(02:09) ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక 100 సంవత్సరాలు ఇతన్ని వేద సంస్కృతికి అత్యంత సన్నిహితమైన మిత్రుడుగా ప్రచారం చేశారు. భారతదేశ చరిత్ర మొత్తంలో మాక్స్ ముల్లర్ లాంటి మోసగాడు అస్సలు కనిపించడు. అతడు జీవితాంతం సనాతన ప్రేమికుడిగా నటిస్తూనే వచ్చాడు. ఇంగ్లీష్ వారి పంచన చేరి వేదాలను వక్రీకరించి రాబోయే తరాల మనసుల్లో కలుషిత వేద బీజాలను నాటుతూనే వచ్చాడు.
(02:36) అతడు చనిపోయిన తర్వాత అతడి భార్య అతను రాసిన లేఖలను బయట పెట్టడంతో అతడి అసలు స్వరూపం బట్టబయలయింది. మనం ఒక ఆర్డర్ లో ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇన్సిడెంట్ వన్ ది ట్రాంప్ ఆఫ్ ధర్మ ఓవర్ మిషనరీస్ మిత్రులారా మాక్స్ ముల్లర్ ద్వారా వైదిక ధర్మం చిన్నాభిన్నం చేయబడింది. దానికి బీజం 1757 లో ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చిన సమయంలో పడింది.
(03:11) భారతదేశాన్ని ఏలాలి అంటే భారతదేశాన్ని ఒక్కటిగా కలిపి ఉంచుతున్న వైదిక ధర్మాన్ని పెకలించి వేయాలని వారికి అర్థం అయింది. భారతదేశాన్ని కొట్టాలంటే ఏదో ఒక మూలన కొట్టడం కాదు. భారతదేశ మూలాల్లోకి వెళ్లి కొట్టాలి. భారతదేశంలో ఉన్న ఆర్థిక రాజకీయ సామాజిక వ్యవస్థలన్నీ వేదాల ఆధారంగా నడుస్తున్నాయని కులాలుగా విడిపోయి ఉన్న హిందువులు వేదాల వల్ల ఒకటిగా కలిసి ఉండగలుగుతున్నారు అని ఆంగ్లేయులు భారతదేశంలో అడుగుపెట్టినప్పుడే గుర్తించారు.
(03:56) అసలు ఈ వేదాలు ఏమిటి? వీటిని ముందు అర్థం చేసుకోవాలి అనేది బ్రిటిష్ వారి ఆలోచన. దీని కోసం వారికి రెండు మార్గాలు కనిపించాయి. ఒకటి వైదిక సంస్కృతిని బాగా అర్థం చేసుకోవడం వాటిని బాగా అధ్యయనం చేయడం హిందూ ధర్మానికి అనుగుణంగా హిందూ శాస్త్రాలను అనుసరించి వారిపైన రాజ్యం చేయడం రెండవది వేదాలు క్రిస్టియానిటీ కంటే తక్కువవి అని చూపించడం భారత్ను క్రిస్టియన్ దేశంగా మార్చడం దాని తర్వాత భారతీయ హిందువుల పైన రాజ్యం చేయడం కనిపించడానికి ఈ రెండు మార్గాలు వేరు వేరుగా ఉన్నా వీటిలో ఒక అంశం మాత్రం చాలా ముఖ్యమైంది సాధారణమైంది కూడా అది వేదాలను చదవడం అర్థం చేసుకోవడం ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి
(04:44) ఆంగ్లేయులే మొదట భారతదేశానికి రాలేదు హిందువులను క్రిస్టియన్లుగా మార్చడానికి వారి కంటే ముందు 17వ శతాబ్దంలో పోర్చుగీస్ నుండి ఇటలీ నుండి అనేక మిషనరీలు ఇక్కడికి వచ్చాయి. సెయింట్ జేవియర్ రాబర్ట్ డి నోబిలీ వాళ్ళ మిషనరీలు అప్పటికే ఇక్కడ అడుగుపెట్టి తమ కార్యాన్ని మొదలుపెట్టాయి. గోవా ఇంక్విజిషన్ను గమనిస్తే అక్కడ పెద్ద ఎత్తున హిందువులను క్రిస్టియన్లుగా మార్చారు.
(05:13) ఆ ప్రభావం ఈనాటికి మనకు అక్కడ కనబడుతుంది. మాక్స్ ముల్లర్ ముందు ముందు చేయాలనుకున్న పనిని రాబర్ట్ డి నోబిలీ ఇక్కడ ముందే చేశాడు. రాబర్ట్ డి నోబిలీ ఇటలీ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత అతడు వేదాలను బాగా అధ్యయనం చేశాడు. ఆ తర్వాత అతడు తనను తాను రోమన్ బ్రాహ్మిణ్ అని చెప్పుకున్నాడు. వేదాలకు ప్రథమ అనువాదాన్ని చేశాడు దాన్ని యజుర్వేదం అని పిలుస్తారు ఆ తర్వాతి కాలంలో అది తప్పుడు వ్రాతగా నిరూపించబడింది.
(05:43) ఈ గ్రంథం వైదిక గ్రంథాలను కళంకితం చేయడానికి వ్రాసినటువంటి గ్రంథం మాక్స్ ముల్లర్ కూడా రాబర్ట్ డి నోబిలీని వేదాలకు ప్రధమానువాదకుడిగా గౌరవిస్తాడు. అంతేకాకుండా తనకు ప్రేరణను ఇచ్చింది కూడా రాబర్ట్ నోబిలీ అని చెప్పుకున్నాడు. కానీ యజుర్వేదం రాబర్ట్ డి నోబిలీ వ్రాసింది కాదని మరేదో మిషనరీ మతమార్పిడి చేయడానికి ఈ యజుర్వేదం రాశరని మాక్స్ ముల్లర్ అభిప్రాయం రాబర్ట్ డి నోబిలేని తన గురువుగా భావించాడు కాబట్టి ఈ అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు.
(06:18) బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ అభిప్రాయం కూడా ఇదే ముందు భారతీయులను క్రిస్టియన్లుగా మారిస్తే వారి పైన రాజ్యం చేయడం చాలా సులభం అవుతుంది. కాబట్టి హిందువుల సంస్కృతిని నీచ సంస్కృతిగా చూపించి తమ సంస్కృతిని గొప్ప సంస్కృతిగా చెప్పే అవకాశం ఉంది. ఇక్కడి నుండే అసలు కథ మొదలైంది. 1793 లో ఇంగ్లాండ్ బాటిస్ట్ చర్చ్ నుండి ఒక సమూహం విలియం క్వారి నేతృత్వంలో కలకత్తా లోని శ్రీరంపూర్ లో ఒక మిషన్ స్థాపించింది.
(06:53) ఈ మిషన్ ద్వారా బైబిల్ ప్రచారం మొదలు పెట్టారు. హిందూ ధర్మం పైన అవగాహన లేని వారితో డిబేట్లు చేయడం వారిని ఓడించడం క్రైస్తవం గొప్పదని నిరూపించడం వాటి ద్వారా హిందువులను క్రిస్టియన్లుగా మార్చే కార్యాన్ని కొనసాగించడం ఇది వారి పని కానీ హిందువుల్లో ఉన్న ప్రకాండ పండితులతో డిబేట్లు చేసి ఓడిపోయేవారు. కాబట్టి వాళ్ళ మిషన్ ముందుకు కొనసాగలేదు. బ్రిటిష్ వాళ్ళు ఈ పరిస్థితిని గమనించి హిందూ పండితులతో వాదనలు చేయడానికి 1818లో విలియం ఆడం అనే అతని నేతృత్వంలో మరో మిషనరీని భారత్లోకి దించారు.
(07:32) విలియం ఆడం కూడా ఆనాటి పండితులతో వాదనలు చేయడం మొదలు పెట్టాడు. 1818 నుండి 1821 వరకు విలియం హిందూ పండితులతో వాదనలు చేశాడు కానీ ప్రతిసారి ఓడిపోయేవాడు. చివరకు ఈ వాదనల ద్వారా తాను సంపాదించుకున్న జ్ఞానం అతన్ని హిందువుగా మార్చింది. అతను రాసిన లేఖ బ్రిటిష్ వారిలో భూకంపాన్ని సృష్టించింది. ఆ లేఖ సారాంశం మీకు కొద్దిగా వినిపిస్తాను వైదిక ధర్మం పెద్ద పర్వతం ఆ పర్వతం ముందు క్రైస్తవం చిన్న రాయి వంటిది అని తర్వాత బ్రిటిష్ చర్చి అతన్ని చర్చి నుండి వెలివేశారు.
(08:13) ఈ ప్రయత్నం కూడా మట్టి కొట్టుకుపోవడంతో బ్రిటిష్ వారు మరో కుట్టను తడతీశారు. విలియం ఆడం హిందూ పండితులతో వాదించి ఓడిపోయింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే సిద్ధాంతం పైన హిందూ గ్రంథాలైన వేదాలలో బహుదేవతారాధన ఉంది అని నిరూపించగలిగితే హిందువులను క్రిస్టియన్లుగా మార్చవచ్చు అనే నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయంతో బ్రిటిష్ వాళ్ళకు ఒక మోటివ్ ఏర్పడింది.
(08:39) ఈ మోటివ్ కారణంగానే బ్రిటిష్ సంస్కృతం రాని ఒక జర్మనీ వ్యక్తిని సంస్కృత గ్రంథాలను ఇంగ్లీష్ లోకి అనువదించే కార్యక్రమానికి ఎన్నుకున్నారు. ఎలా ఎందుకు అనేది తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు మరో సంఘటన గురించి కూడా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటగా యూరప్ లో సంస్కృత భాషను అధ్యయనం చేయడం ఎప్పుడు మొదలైందో తెలుసుకోవాలి.
(09:06) 16వ శతాబ్దం వరకు గమనిస్తే యూరప్ వారికి సంస్కృతం పైన ఇంట్రెస్ట్ ఉన్నట్టు దాఖలాలు లేవు. ఆ తర్వాత హెన్రీచ్ రాత్ అనే జర్మన్ ఫాదర్ తో సంస్కృతం పైన అభిరుచి కలిగిందని కనిపిస్తుంది. హెన్రీచ్ 17వ శతాబ్దంలో ఆగ్రాకు వచ్చాడు అక్కడ అతడు సంస్కృతాన్ని నేర్చుకున్నాడు. 1682 లో అతను సంస్కృత వ్యాకరణం పైన ఒక పుస్తకం రాసినట్లుగా కనిపిస్తుంది.
(09:31) ఈ ఒక్క సంఘటన మాత్రమే 17వ శతాబ్దంలో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా యూరప్ లో సంస్కృతం పైన అధ్యయనం జరిగినటువంటి దాఖలాలు మనకు కనిపించవు. ఆ తర్వాత 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత మనకు ఆ దాఖలాలు కనిపిస్తాయి. ప్లాసీ యుద్ధం తర్వాత కలకత్తా ఆంగ్లేయుల వశమైన తర్వాత భారత్ పైన ఆధిపత్యం లభించింది. ఆంగ్లేయుల మొట్టమొదటి గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ ఒక కార్యాన్ని మొదలుపెట్టాడు.
(10:02) భారతీయుల నైతికత వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి అనే విషయం తెలుసుకోవాలి అంటే వారి భాషణ అధ్యయనం చేయాలి అప్పుడే వాళ్ళని పాలించడానికి ఇక్కడ ఎటువంటి శాసన వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఎటువంటి పాలనా పద్ధతులు అనుసరించాలి అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. ఇందుకోసం వారన్ హెస్టింగ్స్ 1784 లో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు.
(10:29) మొట్టమొదట చార్లస్ విల్కిన్స్ అనే ఆంగ్లేయుడు బనారస్ వెళ్లి సంస్కృతం నేర్చుకొని భగవద్గీత హితోపదేశం మహాభారతంలోని కొన్ని భాగాలను ఆంగ్లంలోకి అనువదించి ముద్రించాడు. ఆ తర్వాత 1763 లో ఈ ఆంగ్లేయుల ప్రధాన న్యాయాధీషుడు విలియం జోన్స్ సంస్కృతం నేర్చుకుని మనుస్మృతి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు.
(10:56) భారత్ పైన బ్రిటిష్ వారి ఆధిపత్యం ఏర్పడిన తర్వాత సంస్కృతంలోని అనేక గ్రంథాలు ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు. అవి యూరప్ వెళ్లి అనేక యూరోపియ భాషలైన జర్మన్ ఫ్రెంచ్ మొదలైన భాషల్లోకి అనువదించబడ్డాయి. వారెన్ హేస్టింగ్స్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఏషియాటిక్ సొసైటీ అనేక గ్రంథాలను ఇంగ్లీష్ లోకి అనువదించి అవి యూరప్ లోనే అనేక భాషల్లోకి తర్జుమా చేసే కార్యాన్ని ఆయన చేపట్టాడు.
(11:26) అలా జర్మనీ వెళ్ళిన గ్రంథాలు జర్మన్లలో సంస్కృతం పైన జిజ్ఞాసను కలిగించాయి. భారతీయుల నుండి వెలువడిన ఉపనిషత్ జ్ఞానం మానవజాతి చరిత్రలో ప్రథమం మరియు సర్వోత్తమమైన గ్రంథాలు అని జర్మనీలోని గొప్ప ఫిలాసఫర్ షోఫెన్హోర్ రాశాడు. ఇక్కడ గమనిస్తే సంస్కృత గ్రంథాలను అనువాదం చేస్తున్నటువంటి వారు లేదా సంస్కృత గ్రంథాలు అధ్యయనం చేస్తున్న వారు మూడు రకాల వ్యక్తులు కనిపిస్తారు.
(11:54) వీరిలో మొదటి వారు జిజ్ఞాసువులు. వీరు నిజంగా సంస్కృతం పట్ల ఆసక్తితో సంస్కృతం నుండి కొంత నేర్చుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు. ఇక రెండవ రకం వారు మత మార్పిడి కోసం సంస్కృతాన్ని అధ్యయనం చేసేవాళ్ళు. మూడవ వారు భారతదేశం పైన ఆధిపత్యం చలాయించడానికి ఇక్కడ ఎటువంటి సంస్కృతి ఉంది? ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే వీరిని పాలించవచ్చు అనే విషయాలను అర్థం చేసుకోవడానికి సంస్కృతాన్ని అధ్యయనం చేసేవారు ఇక్కడే కథ ఒక కొత్త మలుపు తిరిగింది.
(12:27) నిజానికి 1810 వరకు ఇంగ్లాండ్ లో సంస్కృత భాష నేర్పడానికి గాని నేర్చుకోవడానికి గాని ఎటువంటి వ్యవస్థ లేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశంలో లెఫ్టినెంట్ గా జోసెఫ్ బోర్డెన్ నియమించబడ్డాడు. అతడు తన పదవికి రాజీనామా చేశాడు. అతడు భారతదేశంలో తాను సంపాదించిన 25వేల పౌండ్లు తీసుకొని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి దానం చేశాడు. దానం చేస్తూ అతడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సంస్కృత భాషను నేర్పించడం మొదలు పెట్టమని కోరాడు.
(13:00) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆ ధనాన్ని తీసుకొని సంస్కృతం కోసం ఒక ప్రొఫెసర్ పదవిని ఏర్పాటు చేసింది. దాన్ని బోర్డన్ చైర్ ఆఫ్ సంస్కృత్ అని పిలుస్తారు. ఒక సైనికుడు తాను జీవితాంతం సంపాదించిన ధనాన్ని సంస్కృత అధ్యయనానికి వెచ్చించాడు అంటే చాలా గొప్ప విషయమే కానీ అసలు విషయం వేరు ఈ దానం వెనుక ఉన్న కుట్టను తెలుసుకోవాలంటే బోర్డెన్ రాసిన వీలునామాను చూడాల్సి ఉంటుంది.
(13:32) 1811 లో బోర్డెన్ తన వీలునామాను యూకే లోని కాండర్వరీలో రిజిస్టర్ చేయించాడు. ఆ వీలునామాలో ఈ డబ్బు ఎలా ఉపయోగించాలో తన ఉద్దేశాన్ని తెలియజేశాడు. ఈ ధనంతో క్రిస్టియన్ మిషనరీలు సంస్కృతాన్ని నేర్చుకుని దాని నుండి జ్ఞానాన్ని సంపాదించి భారత్కు వెళ్లి క్రిస్టియానిటీని వ్యాపింపచేయాలి. బోడెన్ కుకి తెలుసు సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేయకుండా భారతీయ జ్ఞానులతో డిబేట్ చేసి గెలవడం అసాధ్యమైన పని అని కావలసిన ధనం లభించింది యూనివర్సిటీలో పదవి ఏర్పడింది కానీ ఈ పని చేయడానికి సరైన వ్యక్తి దొరకడానికి వారికి 20 సంవత్సరాలు పట్టింది.
(14:15) 1832 లో హెచ్ హెచ్ విల్సన్ అనే వ్యక్తి బోర్డెన్ చైర్ ఆఫ్ సంస్కృత పీఠాన్ని అధిష్టించాడు. హిందూ సంస్కృత గ్రంథాలపై క్రైస్తవ మిషనరీలకు తర్ఫీదు ఇచ్చి భారతదేశంలోని హిందువులను క్రైస్తవులుగా మార్చడమే ఈయన పని. 24 సంవత్సరాలు భారతదేశంలో ఉండి సంస్కృతం నేర్చుకొని ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్ వెళ్ళగానే ఆయనకు ఈ అవకాశం లభించింది.
(14:39) తాను నేర్చుకున్న విద్యను ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేస్తూ బోర్డన్ చైర్ ఆఫ్ సంస్కృత్ ఆ చైర్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటే కాదంటారా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన పోటీ పరీక్షల్లో నెగ్గి చైర్లో కూర్చున్నాడు. యూనివర్సిటీలో ఈ విభాగం ఉద్దేశం క్రిస్టియన్ మిషనరీలను ట్రైన్ చేసి మత మార్పిడులకు తయారు చేయడం. ఇక హెచ్ హెచ్ విల్సన్ ఎటువంటి వాడో అది కూడా చూద్దాం. ఈయన ఒక పుస్తకం రాశాడు.
(15:08) ఆ పుస్తకం పేరు ది రిలీజియన్ అండ్ ఫిలసఫికల్ సిస్టం ఆఫ్ ది హిందూస్ ఈ పుస్తకం ప్రిఫేస్ లో అతను ఇలా రాస్తాడు. ఈ పుస్తకం ఆ వ్యక్తులకు సహాయం చేయడానికి వ్రాయబడింది. జాన్ మ్యూర్ ద్వారా ఏర్పాటు చేయబడిన 200 పౌండ్ల ప్రైజ్ మనీని పొందడానికి హిందూ గ్రంథాలను అధ్యయనం చేసి వారి సిద్ధాంతాలను ఖండించడానికి వ్రాయబడింది అంటే ఇతడు కూడా బోడెన్ ఆలోచనలకు సరిపోయే వ్యక్తి బోడెన్ కోరిక ప్రకారం కాకుండా వేరే విధంగా ఆయన ధనాన్ని ఉపయోగిస్తే యూనివర్సిటీ మీద కరప్షన్ చార్జెస్ పడతాయి.
(15:49) కాబట్టి క్రిస్టియన్ మిషనరీలకు హిందూ సంస్కృత గ్రంథాల్లో శిక్షణ ఇచ్చి భారతదేశంలో హిందువులను క్రిస్టియన్లుగా మార్చే పనిని కొనసాగిస్తున్నారు. విల్సన్ 1860 లో చనిపోయాడు. ఆ తర్వాత ఆ చైర్ ను మోనియర్ విలియమ్స్ అనే అతను కైవసం చేసుకున్నాడు. మోనియర్ విలియమ్స్ భారత్లోనే పుట్టాడు. సంస్కృతం నేర్చుకున్నాడు.
(16:14) ఇతడు బోడెన్ విల్సన్ల కంటే రెండు ఆకులు ఎక్కువే సనాతన ధర్మాన్ని తుడిచి పెట్టాలని కంకణం కట్టుకున్నటువంటి వాడు ఈయన సంస్కృతానికి ఒక ఇంగ్లీష్ డిక్షనరీని రాశాడు. ఈ పుస్తకం భూమికలో అతడు నేను బోర్డెన్ సంస్కృత చైర్ కి రెండవ అధికారిని సంస్కృత గ్రంధాలను ఇంగ్లీష్ లోకి అనువదించాలి. క్రిస్టియన్లు భారతలోని మూల నివాసులను క్రిస్టియన్లుగా మార్చడానికి యోగ్యులు కావాలి అని కల్నల్ బోడెన్ తన వీల్నామాల్లో స్పష్టంగా వ్రాశాడు. ఆయన మరో పుస్తకం కూడా రాశాడు.
(16:48) ది స్టడీ ఆఫ్ సంస్కృత్ ఇన్ రిలేషన్ టు మిషనరీ వర్క్ ఇన్ ఇండియా ఈ పుస్తకం పీఠికలో ఆయన ఇలా రాస్తాడు. హిందూ ధర్మం అనే కోట గోడలను చుట్టుముట్టి వాటిలో బొక్కలు చేసి ఆఖరిలో క్రీస్తు సైనికుల ద్వారా వారిపై దాడి చేస్తే క్రిస్టియన్లు పూర్తిగా అంతిమ విజయాన్ని పొందుతారు అని రాసుకున్నాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే యూనివర్సిటీ సంస్కృత హెడ్ సింహాసనం కోసం జరిగే పోటీలో మోనియర్ విలియమ్స్ తో పాటుగా ఈ పదవి కోసం మాక్స్ ముల్లర్ కూడా పాల్గొన్నాడు.
(17:26) మాక్స్ ముల్లర్ ఈ పదవి కోసం 1847 నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ కుర్చి కోసం జరిగే ఎన్నికలో మోనియర్ విలియమ్స్ కు 883 ఓట్లు వస్తే మాక్స్ ముల్లర్ కు 610 ఓట్లు వచ్చాయి. అందువలన ఈ ఎన్నికలో ఓడిపోవడం మాక్స్ ముల్లర్ కి గట్టి దెబ్బ మాక్స్ ముల్లర్ బయట వ్యక్తి జర్మనీ వాడు కాబట్టి అతడికి అంత సపోర్ట్ దొరకలేదు. ఇది మత మార్పిడికి సంబంధించిన పదవి కాబట్టి మాక్స్ ముల్లర్ ఈ పదవిని కావాలని గట్టిగా ప్రయత్నం చేశాడు.
(18:04) ఈ విషయానికి సంబంధించి రెండు కోణాలను మనం పరిశీలించాం. బ్రిటిష్ వారికి హిందువుల్లోని బహుదేవతారాధనను పైకి తెచ్చి హిందూ ధర్మాన్ని నాశనం చేసే వ్యక్తి కావాలి. మాక్స్ ముల్లర్ ఈ పదవిని కోల్పోవడం వల్ల అతన్ని నిరాశ ఆవహించడంతో పాటు ఒక మోటివ్ అతనికి గట్టిగా ఏర్పడింది. అది హిందువులను క్రిస్టియన్లుగా మార్చడం అతడి నేపథ్యం తెలిస్తే గాని అతడు చేసిన పనిని అర్థం చేసుకోవడం కష్టం అందుకే ఇదంతా చెప్పుకున్నాం.
(18:34) ఇప్పుడు మనం మాక్స్ ముల్లర్ పూర్తి కథను తెలుసుకుందాం. మిత్రులారా మాక్స్ ముల్లర్ పూర్తి పేరు ఫ్రెడ్రిక్ మాక్స్ ముల్లర్ అతడు 6 డిసెంబర్ 1823 లో జర్మనీలో డెసో పట్టణంలో పుట్టాడు. ఇతడి తండ్రి పేరు విల్హం ముల్లర్ ఇతడు ఒక కవి వృత్తిరిచ్చ లైబ్రేరియన్ మాక్స్ ముల్లర్ విషయానికి వస్తే అతడు చాలా టాలెంటెడ్ పర్సన్ 20 సంవత్సరాల వయసులోనే అతడు డాక్టరేట్ సంపాదించాడు.
(19:04) అతడు ఫిలాలజీ అంటే భాషా విజ్ఞానంలో యూనివర్సిటీ ఆఫ్ లిఫ్టింగ్ నుండి కేవలం 18 నెలలలోనే డాక్టరేట్ పట్టా పొందాడు. మాక్స్ ముల్లర్ కు భాషా విజ్ఞానం అంటే చాలా ఇష్టం భాషల స్ట్రక్చర్ ని తెలుసుకోవడానికి చాలా కృషి చేశాడు సంస్కృతం గ్రీకు లాటిన్ మొదలైన పురాతన భాషలన్నింటినీ నేర్చుకోవాలి అనుకునేవాడు 1843 లో అతనికి డాక్టరేట్ వచ్చింది. 1844 లో అతను జర్మన్ ఫిలాసఫర్ ఫ్రెడ్రిక్ షెల్లింగ్ దగ్గర ఉపనిషత్తులను అనువదించడం మొదలుపెట్టాడు.
(19:41) దీంతో పాటుగా ఒక జర్మన్ లింగ్విస్ట్ ఫ్రెంచ్ బాప్ అనే అతడి దగ్గర సంస్కృతం నేర్చుకోవడం మొదలు పెట్టాడు. ఈ రెండు చోట్ల పనుల తర్వాత 1845 లో బుపేరి వెళ్లి యూజిన్ బర్నార్స్ దగ్గర సంస్కృతం నేర్చుకున్నాడు. యూజిన్ బర్నార్స్ మాక్స్ ముల్లర్ను ఋగ్వేదాన్ని అనువదించమని ప్రోత్సహించాడు. ఆ సమయానికి కొన్ని ఋగ్వేద మ్యాన్స్క్రిప్ట్లు యూరప్ లో ఉండేవి.
(20:09) వాటిలో ఎక్కువ భాగం ఇంగ్లాండ్ లో ఉండేవి. ఇంగ్లాండ్ వెళ్ళడానికి అతడికి తగినంత డబ్బు లేదు. సరిగ్గా అదే సమయంలో బోర్డెన్ చైర్ ఆఫ్ సంస్కృత్ ను హెచ్ హెచ్ విల్సన్ అధిష్టించాడు. విల్సన్ కు సంస్కృతం కొద్దిగా వచ్చిన ఒక కుర్రవాడే అవసరం ఏర్పడింది. విల్సన్ కు జర్మనీలోని యూజన్ బర్నాస్ కు మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. యూజిన్ బర్నాక్ఫస్ రెకమెండేషన్ తో మాక్స్ ముల్లర్ విల్సన్ సహాయకుడుగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అడుగుపెట్టాడు.
(20:38) బ్రిటిషర్లు మాక్స్ ముల్లర్ ని ఋగ్వేద భాష్యానికి ఎందుకు ఎన్నుకున్నారు? మాక్స్ ముల్లర్ ఆంగ్లేయుడు కాదు ఎప్పుడు ఇండియా రాలేదు. మాక్స్ ముల్లర్ కంటే బాగా సంస్కృతాన్ని చదువుకున్న ఆంగ్లేయ పండితులు ఇంగ్లాండ్ లో ఉన్నారు. జర్మనీలో కూడా ఉన్నారు. ఇండియాలో ఉన్నారు. అయినా వారు మాక్స్ ముల్లర్ నే ఎందుకు ఎందుకు ఎంచుకున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న.
(21:04) ఈ ప్రశ్న సమాధానం వెతుకుదాం. ప్రధానంగా ఋగ్వేదాన్ని అనువాదం చేయడం దానిపైన కామెంట్ రాయడం అంత చిన్న పని కాదు. సులువైన పని అంతకంటే కాదు ఋగ్వేదం చాలా పెద్ద గ్రంథం దాంట్లో 10 మండలాలు 10580 మంత్రాలు ఉన్నాయి. ఇది వైదిక సంస్కృతంలో వ్రాయబడిన గ్రంథం ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయాలి అంటే ముందు వారికి పాణిని వ్యాకరణం నిరుక్తం వచ్చి ఉండాలి.
(21:31) ఋగ్వేదానికి భాష్యం రాయాలన్నా సంపాదకీయం రాయాలన్నా ముద్రించాలన్నా ఎంత పెద్ద పండితుడైనా కనీసం ఆరుఏడు సంవత్సరాలు కృషి చేసి ఉండాలి. బ్రిటిష్ వాళ్ళకు ఋగ్వేదం పైన తన జీవితంలో ఎనిమిది 10 సంవత్సరాలు ఖర్చు పెట్టగలిగిన వ్యక్తి కావాలి. అతడు ఆంగ్లేయుడు కాకుండా ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఋగ్వేదాన్ని ఒక ఆంగ్లేయుడు అనువదించాడు అంటే భారతీయులు ఆ అనువాదాన్ని నమ్మరు.
(22:01) భారతీయులు ఆంగ్లేయులను ఎప్పుడూ అనుమానాస్పదంగానే చూసేవాళ్ళు అందుకే వారికి ఆంగ్లేయులు కాని వ్యక్తి ఈ పనికి కావలసి వచ్చింది. అతను క్రిస్టియన్ అయి ఉంటే ఇంకా మంచిది అంటే అతడు యువకుడై ఉండాలి తన జీవితంలో 10 సంవత్సరాలు ఈ పని కోసం వెచ్చించగలిగి ఉండాలి క్రిస్టియన్ అయి ఉండాలి. ఆంగ్లేయుడై ఉండకూడదు. ఈ మూడు గుణాలు మాక్స్ ముల్లర్ లో ఉన్నాయి.
(22:27) ఈ ప్రాజెక్టును ఇచ్చే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ జర్మనీలోని అనేకమంది పండితులను పరీక్షించింది. వారిలో యూజిన్ బర్నాస్ కూడా ఒకడు యూజిన్ బర్నాస్ సంస్కృతంలో గొప్ప పండితుడు కానీ ముసలివాడు. కంపెనీ అనుకున్న పని చేయలేకపోవచ్చు. ఆయన సూచనతో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మాక్స్ ముల్లర్ ను ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్ద మొత్తాన్ని ఏర్పాటు చేసింది.
(22:55) మాక్స్ ముల్లర్ కూడా జర్మనీ వదిలి ఇంగ్లాండ్ లో ఉండడం ఖర్చుతో కూడుకున్న పని అతనికి డబ్బు అవసరం ఉంది. 15 ఏప్రిల్ 1847 న ఈ ప్రాజెక్ట్ మాక్స్ ముల్లర్ కు ఇవ్వబడింది. మాక్స్ ముల్లర్ రొట్టె విరిగి నేతిలో పడింది. ఈ ప్రాజెక్ట్ రావడంతో మాక్స్ ముల్లర్ చాలా సంతోషపడ్డాడు. తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తన తల్లికి ఒక లేఖ కూడా రాశాడు అమ్మ నేను విజయం సాధించాను ఆఖరికు నేను పడ్డ కష్టానికి ఫలితం లభించింది.
(23:27) నా యోగ్యతకు మించిన పెద్ద పని నాకు దొరికింది. ఈ పని ద్వారా నాకు డబ్బు కూడా వస్తుంది. నేను ప్రతి సంవత్సరం 50 పేజీల పని చేయవలసి వస్తుంది. అందుకు నేను ప్రతి సంవత్సరం 200 పౌండ్లు అడిగాను. వారు దానికి సమ్మతించారు. ఇది 400 పేజీల పని ఈ పని నేను పార్ట్ టైం గా కూడా చేయగలను ఈ పని చేసుకుంటూ నేను మరోచోట పని చేసి డబ్బు సంపాదించగలను. ఈ పని దొరకకపోతే డబ్బు ఇబ్బంది వల్ల నేను తిరిగి జన్మని రావలసి వచ్చేది అని వ్రాశాడు.
(24:04) దీనివల్ల మనకు కొన్ని విషయాలు అర్థంఅవుతాయి. అతని అర్హతకు మించిన పని ఇది అని అతనికి తెలుసు ఇది చాలా చిన్న విషయం ఈ పని చేసుకుంటూ మరో పని చేసుకోవచ్చు అనేది రెండవ విషయం ఎందుకంటే నేను ఏది రాసినా ముందు ముందు భారతీయ విద్వాంసులు ఎవరు పరిశీలించరు అనే ధీమ దౌర్భాగ్యం ఏమిటంటే అతడికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు సంస్కృతం కూడా అంతంత మాత్రమే అతని పాండిత్యం ఎంతో అది కూడా చూద్దాం అతడు ఇంగ్లాండ్ రావడానికి ముందు ముందు పారిస్ వెళ్ళాడు అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ తాతగారు ద్వారకానాథ్ ఠాగూర్ గారు ఒక హోటల్ నడిపేవారు అక్కడికి వెళ్లి మాక్స్ ముల్లర్ ఇంగ్లీష్ నేర్చుకునేవాడు. అతడు ఇంగ్లాండ్
(24:47) వెళితే అక్కడ కనీసం వాళ్ళతో మాట్లాడడానికైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి గనుక ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అతడు తన జీవిత చరిత్రలో స్వయంగా రాసుకున్నాడు. ఇంగ్లాండ్లో తన సర్వెంట్ తో కూడా సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోయేవాడిని అని 1847 లో అతడికి వేదాలను అనువాదం చేసే ప్రాజెక్ట్ దొరికింది. 1851 లో అతడు ఇంగ్లీష్లో ఎమ్మే పట్టా పుచ్చుకున్నాడు.
(25:17) అంటే నాలుగు సంవత్సరాలు అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాడు అన్నమాట. ఇతడికి ఇంగ్లీష్ అంతంత మాత్రమే అనడానికి ఈ సంఘటన చాలు ఇక సంస్కృతం ఎంత వచ్చో అది కూడా పరిశీలిద్దాం. 1898 లో సంస్కృత పండితుడు చెవిలాల్కు రాసిన లేఖ మనకి ఇప్పుడు దొరుకుతుంది. 1898 అంటే మాక్స్ ముల్లర్ కు 75 సంవత్సరాల వయసు ఈ విషయం గుర్తుంచుకోండి ఆ లేఖలో మాక్స్ ముల్లర్ ఏం రాశాడో మనం ఒకసారి చూద్దాం.
(25:48) మీకున్న సంస్కృత జ్ఞానం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మా యూరప్ వాసులు ఎప్పటికీ మీతో సమానులు కాలేరు. మేము భారతదేశాన్ని గురించి తెలుసుకోవడానికి మాత్రమే సంస్కృతాన్ని నేర్చుకుంటాము కానీ మేము సంస్కృతంలో ఎప్పటికీ రచనలు చేయలేము. ఇప్పుడు నాకు ప్రశ్న ఉంది బేరాంజీ మల్బరీ నా హిబర్ లెక్చర్లను మరాఠి బెంగాళీ గుజరాతీ మరియు తమిళాలలో అనువదించి అచ్చు వేస్తున్నారు.
(26:17) వారు ఈ అనువాదాలను సంస్కృతంలో అనువాదించాలనుకుంటున్నారు. మీరు ఈ పని చేసి పెట్టగలరా? లేదు ఈ పని కోసం మరెవరినైనా నియోగించగలరా మీ శ్రమకు తగిన మూల్యం కూడా లభిస్తుంది. దీనిని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏమంటే 75 సంవత్సరాల వయసులో కూడా మాక్స్ ముల్లర్కు తన సంస్కృతం పైన అంత నమ్మకం లేదు అని అతడు కేవలం లౌకిక సంస్కృతాన్ని మాత్రమే నేర్చుకున్నాడు.
(26:45) అతడు వైదిక సంస్కృతాన్ని అస్సలు నేర్చుకోలేదు. అతడు పాణనీయ వ్యాకరణాన్ని నిరుక్తాన్ని కూడా ఎప్పుడూ చదవలేదు. పాణిని వ్యాకరణాన్ని నిరుక్తాన్ని చదవకుండా వేదాల పైన భాష్యం రాయడం అసంభవం నేను భారతదేశాన్ని తెలుసుకోవడానికి మాత్రమే సంస్కృతాన్ని నేర్చుకున్నాను అని చెప్పిన వ్యక్తి తన ఆంగ్ల ఉపన్యాసాలను మరొకరి చేత సంస్కృతంలో అనువదింపజేయాలని అనుకున్నాడు అంటే అతని సంస్కృత భాష పరిజ్ఞానం ఏ పాటిదో ఈ పాటికి మీరు అర్థం చేసుకొని ఉంటారు.
(27:18) సరే వయోభారం వల్ల అతను ఈ పని చేయలేక మరొకరి దగ్గరికి వెళ్లి ఉండవచ్చు అనుకుందాం. అలాగైతే నేను భారతదేశాన్ని తెలుసుకోవడానికి మాత్రమే సంస్కృతం నేర్చుకున్నాను కానీ సంస్కృతంలో రచనలు చేయలేను అన్నాడు కదా అంటే పాణిని వ్యాకరణాన్ని నిరుక్తాన్ని చదవలేదు అనే విషయం మనకు అర్థంవుతుంది. పాణిని వ్యాకరణాన్ని నిరుక్తాన్ని నేర్చుకున్న పెద్ద పెద్ద పండితులకే వైదిక గ్రంథాల పైన భాష్యం రాయడానికి 10 నుంచి 15 సంవత్సరాల సమయం పడుతుంది.
(27:49) మాక్స్ ముల్లారికి ఈ విషయం తెలియకపోవచ్చు అనుకుందాం కానీ అతనికి ఖచ్చితం ఈ విషయం తెలుసు అనడానికి అతడు రాసిన మరో లేఖను చూద్దాం నేను భారతదేశం వెళ్లి ఉంటే నేను ఈ విషయాలను నేర్చుకొని ఉండేవాడిని అని వ్రాశాడు అంటే భారతదేశం రాలేదు అనే విషయం మనకు ఇక్కడ అర్థం అవుతుంది. ప్రారంభంలో అతడు భారతదేశానికి రావాలనుకున్నాడు కానీ ఒక వ్యక్తిని అతడు కలవడం వల్ల అతడు భారతదేశాన్ని చూడాలనే ఆశనే వదులుకున్నాడు.
(28:19) ఆ వ్యక్తిని గురించి మనం ముందు ముందు మాట్లాడుకుందాం. మాక్స్ ముల్లర్ ఇంగ్లాండ్ లో కూర్చుని క్రిస్టియానిటీని ఎలా వ్యాపింప చేయాలి అనే కుట్ర చేశాడు. అతడు తన మిత్రుడికి రాసిన ఒక లేఖ ఈ విషయాన్ని బయట పెడుతుంది. సెయింట్ పాల్ సమయంలో గ్రీస్ రోములు క్రిస్టియానిటీకి ఎలా శుద్ధంగా ఉండేవో అలా ఈనాడు భారతదేశం కూడా క్రిస్టియానిటీని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది.
(28:43) ఈ శిధలమైన వృక్షం కొంత కాలం పాటు కృత్రిమ మద్దతును కలిగి ఉంది. ఎందుకంటే దాని పతనం ప్రభుత్వానికి అసౌకర్యాన్ని కలుగజేయవచ్చు. కానీ బ్రిటిష్ వారు ఈ చెట్టును కొంచెం ముందుకు వెనుక్కు కదిపితే అది పడిపోతుంది. దీనికోసం నేను నా దేశాన్ని విడిచిపెట్టి నా జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను క్రైస్తవ మిషనరీ లాగానో లేదా సివిల్ సర్వెంట్ గానో భారతదేశం వెళ్ళాలి అని అనుకోవడం లేదు.
(29:12) ఎందుకంటే ఫాదరీల పైన లేదా ప్రభుత్వం పైన ఆధారపడవలసి ఉంటుంది. నేను భారతదేశంలో 10 సంవత్సరాలు ప్రశాంతంగా జీవిస్తూ సంస్కృతం నేర్చుకుంటూ కొత్త మిత్రులను సంపాదించుకుని ఆ తర్వాత నా వేద భాష్యంతో భారతీయ పూజారుల ఆకృత్యాలను రూపుమాపడానికి తద్వారా క్రైస్తవ మతం యొక్క సరళమైన బోధనలకు తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తాను. ఈ లేఖ వల్ల మీకు అర్థమై ఉంటుంది మాక్స్ ముల్లర్ భారతదేశం వచ్చి హిందూ ధర్మాన్ని సమూలంగా నాశనం చేయడానికి తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని తన సన్నిహిత మిత్రుడికి రాసిన లేఖ మనకు స్పష్టం చేసింది. హిందూ సనాతన
(29:56) ధర్మాన్ని కుళ్లిపోయిన వృక్షంతో పోల్చాడు. అటువంటి మాక్స్ ముల్లర్ను సనాతన ధర్మానికి వైదిక ధర్మానికి మిత్రుడని చాటే మన వారికి సిగ్గు ఉండాలి కేవలం 20 సంవత్సరాల వయసులోనే భాషా విజ్ఞానంలో డాక్టరేట్ సంపాదించి సంస్కృత భాష మీద ప్రేమతో నేర్చుకుంటూ ఉపనిషత్తులకు భాష్యం రాయడానికి సిద్ధపడ్డ వ్యక్తి సంస్కృత భాష పైన ప్రేమతో తన మాతృదేశాన్ని వదిలి ఇంగ్లాండ్ వచ్చిన వ్యక్తి భారత్లో క్రిస్టియానిటీని వ్యాపింప చేయాలనే మిషన్ లో ఎందుకు చేరాడు అనేది ఆలోచించదగ్గ విషయం మాక్స్ ముల్లర్ ను మెకాలే హెచ్చరించాడు.
(30:36) ఈ విషయం కూడా మనం గమనిద్దాం. మాక్స్ ముల్లర్ లో ఈ మార్పు ఎందుకు వచ్చిందో చూద్దాం. మాక్స్ ముల్లర్ కు సంస్కృత భాష పైన ప్రేమను చూసాం. సంస్కృత భాష ద్వారా క్రిస్టియానిటీని వ్యాపింపజేయాలనే మార్పును చూసాం. ఈ మార్పు రావడానికి కారణం లార్డ్ మెకాలే. 1855 లో లార్డ్ మెకాలే మాక్స్ ముల్లర్ ను కలిసాడు. మెకాలేతో మాట్లాడిన తర్వాత మాక్స్ ముల్లర్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి.
(31:05) సంస్కృత సాహిత్యాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి అది యువకులకు నేర్పించి భారత్కు పంపించాలి అనేది మాక్సిముల్ల ఆలోచన. కానీ మెకాలే ఆలోచన వేరు. నువ్వు చేస్తున్న పని చాలా మంచిది. దీనివల్ల బ్రిటిష్ పాలనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా సంస్కృతం నేర్చుకున్నందువల్ల యువకులు హిందువులుగా మారే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నువ్వు అనువాదం చేసేటప్పుడు ఆ సిద్ధాంతాలను క్రిస్టియానిటీ సిద్ధాంతాలతో కంపేర్ చేస్తూ క్రిస్టియన్ విద్య చాలా గొప్పది అన్నట్టు నీ అనువాదాలు ఉండాలి అని ముల్లర్ కుక్కు మెకాలే బోధించాడు.
(31:40) ఈ విషయాన్ని మాక్స్ ముల్లర్ తన తల్లికి ఉత్తరం ఈ విధంగా రాశాడు. మెకాలీతో నేను ఎంతోసేపు మాట్లాడాను భారతదేశానికి పంపబడే యువకులకు అవసరమైన విద్యను గురించి మా సంభాషణ సాగింది. ఆయన ఆలోచనలో స్పష్టత ఎంతో ఉంది. మాటలో అసాధారణమైన వాక్చాతుర్యం ఉంది. ఆ సంభాషణ తర్వాత నేను ఆక్స్ఫర్డ్ కు తిరిగి వచ్చాను కొంత విషాదంతో కానీ బహుశా మరింత జ్ఞానంతో కూడిన మనిషిగా అంటే మెకాలే తో కలయక తర్వాత మాక్స్ ముల్లర్ అనువాదాలు బ్రిటిషర్లకు క్రిస్టియానిటీకి హాని కలగకుండా ఉండే విధంగా అనువదించడం మొదలు పెట్టాడు అన్నమాట.
(32:22) హిందూ క్రిస్టియానిటీ కంపారిజన్లు ఈయన రచనలో అనేక చోట్ల మనకు కనిపిస్తాయి. ఈ సిద్ధాంతం క్రిస్టియానిటీలో ఇలా ఉంది. క్రిస్టియానిటీ సిద్ధాంతాలు హిందూ సిద్ధాంతాల కంటే గొప్పవి అన్నవి చాలా చోట్ల మనకు ఈయన అనువాదాల్లో కనిపిస్తాయి. బైబిల్ క్రైస్ట్ క్రిస్టియానిటీ అనేవి చాలా గొప్పవి అనే పదాలు చాలా చోట్ల మనకు ఈయన అనువాదాల్లో కనిపిస్తాయి.
(32:46) ఈ విధంగా అనువాదాలు చేయడం మొదలు పెట్టిన తర్వాత 1860 లో హెచ్ హెచ్ విల్సన్ చనిపోయిన తర్వాత బోర్డన్ చైర్ ఆఫ్ సంస్కృత్ కుర్చి మీద ముల్లర్ ఆశలు మళ్ళీ చిగురించాయి. మాక్స్ ముల్లర్ రాసిన అనేక లేఖలు కాల్చివేయబడ్డాయి అందువలన ఆయన ఉద్దేశాలు ఎవరికీ అర్థం కాకుండా పోయాయి. ఆయన చనిపోయిన తర్వాత అతని భార్య తను దాచుకున్న లేఖలను బయట పెట్టడంతో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి.
(33:14) ఆమె ఈ లేఖలను బయట పెట్టకపోతే మాక్స్ ముల్లర్ ఉద్దేశాలు ఎప్పటికీ బయటపడేవి కావు. 15వ డిసెంబర్ 1866 లో మాక్స్ ముల్లర్ భార్య జార్జినా మాక్స్ ముల్లర్ తనకు రాసిన లేఖను బహిర్గతం చేస్తూ మాక్స్ ముల్లర్ రెండవ జీవితం గురించి రాసింది. నేను ఆ పనిని పూర్తి చేస్తానని ఆశిస్తున్నాను. నేను దానిని పూర్తి చేసిన ఫలితాన్ని నా జీవిత కాలంలో చూడకపోవచ్చు.
(33:41) నా ఈ ఎడిషన్ మరియు వేదాల అనువాదం భవిష్యత్తులో భారతదేశపు విధి మీద ఆ దేశంలోని కోట్లాది ఆత్మల అభివృద్ధి పైన గణనీయమైన ప్రభావం చూపుతాయని నాకు ఎంతో నమ్మకం ఉంది. అది వారి మతానికి మూలం ఆ మూలం ఏమిటో వారికి చూపించడం గత 3000 సంవత్సరాలలో ఆ మూలం నుండి పెరిగిన అన్ని భావాలను సమూలంగా తొలగించే ఏకైక మార్గమని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను.
(34:11) ఈ లేఖను చదివిన తర్వాత మనకు ఏ సందేహం అక్కర్లేదు. చివరిగా వేదాలలో మాక్స్ ముల్లర్ చేసిన మార్పుల గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాం. మిత్రులారా వేదాలను వికృతంగా అనువదించాలని అనుకున్నాడు అన్న సంగతి మనకు ఈ పాటికి అర్థమయి ఉంటుంది. భారతదేశంలో వేద భాష్యాలు డజన్ల కొద్ది ఉన్నాయి కానీ ఈయన సాయన భాష్యాన్నే ఎన్నుకున్నాడు.
(34:37) సాయనుడు తన భాష్యంలో వైదిక కర్మకాండకు చాలా ప్రాముఖ్యం ఇచ్చాడు. వైదిక కర్మకాండకు సంబంధించిన భాషల భాష్యాన్ని చాలా సులభంగా వికృతంగా చేయవచ్చు. సాయన భాష్యాన్ని తీసుకొని తర్వాత వేదాలకు మాక్స్ ముల్లర్ దయతో దయచేసిన సంవత్సరం 1200 బిసి దీనికి ఆయన ప్రమాణాన్ని చూపించలేదు కానీ తన స్టేట్మెంట్ నే తాను కాంట్రడిక్ట్ చేసుకున్నాడు ఆయన వ్రాసిన ఫిజికల్ రిలీజియన్ అనే పుస్తకంలోని ఐదవ పేజీలో ఇలా రాస్తాడు.
(35:11) మనం ఆ వేద మంత్రాలకు ఒక కచ్చితమైన కాల ప్రమాణాన్ని నిర్ణయించడం అసాధ్యం ఆ మంత్రాలు బిఫోర్ కామనరా 1000లోనా 1500 లోనా 2000లోనా లేక 3000లో రచింపబడ్డాయా అనేది భూమి పైన ఉన్న ఏ శక్తికి దాన్ని నిర్ధారించడం సాధ్యం కాదు ఇదే పుస్తకంలో అతను మరోచోట ఏమంటాడయ్యా అంటే ఒకవేళ ఈ లోకాన్ని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఉంటే మోషేకు పూర్వం జన్మించిన కోట్లాది మనుషులను ఆయన దైవజ్ఞానానికి దూరం చేయడం ఆయనకు అన్యాయం అవుతుంది.
(35:48) దేవుడు ఈ భూమిపై మొదటిసారి ప్రత్యక్షమైనప్పటి నుంచే తన దైవజ్ఞానాన్ని మానవులకు అందజేశాడనే నమ్మకమే సముచితం. వేదాలు ఏం చెబుతున్నాయి అంటే వేదాలు సృష్టి జరిగినప్పటి నుంచే ఉన్నాయి అని వేదాలను గమనిస్తే వేదాలు వివిధ మండలాలుగా విభజింపబడి ఉన్నాయి. ప్రతి మండలంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలలో కొన్ని సూత్రాలు వివరించబడ్డాయి.
(36:12) ఈ సూత్రాలను గమనిస్తే నాలుగు విషయాలు వెల్లడవుతాయి. ఆ మంత్రాలకు ఒక ఋషి ఉంటాడు, దేవత ఉంటాడు, ఛందస్సు ఉంటుంది, స్వరం ఉంటుంది. ఈ మంత్రాలను దర్శించిన ఋషిని మంత్ర ద్రష్ట అంటారు. దేవత అంటే ఒక రూపం ఉన్న దేవుడు కాదు. దేవత అంటే ఆ మంత్రాలలో ఉన్న విషయం లేదా ప్రకృతి శక్తి ఛందస్సు ఈ మంత్రాలలోని అక్షరాలు ఎలా ఏర్పాటు చేశారు అనేది చెబుతుంది.
(36:39) స్వరం ఈ మంత్రాలను ఎలా పలకాలో చెబుతుంది. ఈ విషయంలో మాక్స్ ముల్లర్ రెండు తప్పులు చేశాడు. మాక్స్ ముల్లర్ ఉద్దేశంలో ఋషి అంటే మంత్రాలను రాసినవాడు అని కానీ నురిక్తంలో ఋషి అంటే ద్రష్ట అంటే దర్శించినవాడు అని ఋషియో మంత్రదష్టారః ఋషి అన్నవాడు తాను తన అంతఃచేతనంలో దర్శించిన భగవంతుడు వినిపించిన విషయాన్ని తాను పరిశీలించి నిర్ధారించుకుని విలువరిస్తాడు.
(37:12) కానీ మాక్స్మల్ల చేసిన మొట్టమొదటి తప్పు ఋషి అంటే విశ్వామిత్రుడు భరద్వాజుడు అంగీరసుడు మొదలైన వారు రచయితలు అని ప్రచారం చేశాడు. వేదాలు సృష్టి నియమాలు వేదాలు సృష్టితో పాటుగానే పుట్టాయి అని పెద్దలు చెబుతారు. మాక్స్ ముల్లర్ అబ్జెక్టివ్ ఏంటంటే వేదాలు బహుదేవతావాదాన్ని చెబుతాయి అని నిరూపించడం దేవత అనే పదాన్ని మాక్స్ ముల్లర్ గాడ్ అనే అర్థంలో తీసుకున్నాడు.
(37:40) కానీ దేవత అనేది ఆ మంత్ర సమూహంలోని విషయం నిరుక్తంలో దేవత లేదా దేవి అనేదానికి ఇచ్చిన అర్థం ఏమిటంటే జీవనానికి సపోర్ట్ చేసే అన్ని తత్వాలను దేవుడు లేదా దేవి అని అంటారు. చంద్రుడు సూర్యుడు వాయువు అగ్ని ఇవన్నీ తత్వాలు మానవ జీవనానికి సహకరించే తత్వాలు కాబట్టి వాటిని దేవతలు అని పిలిచారు. కానీ అవి ఈశ్వరుడు లేదా బ్రహ్మ లేదా సర్వవ్యాపి కాదు ఇలా వేదాలలో వేల మంది దేవతలు మనకు కనిపిస్తారు.
(38:14) మాక్స్ ముల్లర్ చాలా తెలివిగా ఈ శక్తులన్నింటిని పరబ్రహ్మగా లేదా ఈశ్వరుడుగా చెప్పాడు. హిందువులకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళు వివిధ సమయాలలో ఈ దేవతలను పూజిస్తారు అని వ్రాశాడు. వేదాల్లో అనేక చోట్ల ఈ శక్తులు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నట్లు అవి పరబ్రహ్మ స్వరూపమే అన్నట్లు చెప్పబడ్డాయి. ఆ పరమేశ్వరుడు ఒక్కడే ఆ పరమేశ్వరుని శక్తి ఈ విశ్వంలో అనేక రూపాలలో ప్రకటితం అవుతూ ఉంటుంది అని వేదాలు స్పష్టంగా చెప్పాయి కానీ దీన్ని బహుదైవతారాధనగా చూపించాడు మన మాక్స్ మోల్లర్ గారు హినోతిజం అనే థియరీని ఆయన తీసుకొని వచ్చాడు. ఈ వాదం పైన భారతదేశంలో అతని పైన
(38:59) చాలా క్రిటిసిజం వచ్చింది. తర్వాత 4 ఫిబ్రవరి 1875 లో డ్యూక్ ఆఫ్ టార్గెట్ట కు రాసిన లేఖలో హిందువులు అనుసరించేది బహుదేవతారాధన కాదు అది ఏకేశ్వరవాదమే అని ఒప్పుకున్నాడు. ఆర్యజాతికి తెలిసిన అత్యంత ప్రాచీన మత రూపం సాధ్యమైనంతవరకు ఒక శుద్ధ ఏకదేవతా సిద్ధాంతం మొనోతిజం అవును అది పూర్తిగా నిజమే అది నిశ్చలమైన సందేహ రహితమైన ఏకదైవతా విశ్వాసం ఒక కోణంలో చూసినప్పుడు అత్యంత మంగళమైన ఏకదేవత భావం కూడా అయితే అది సందేహాలు మరియు విరోధ భావాల నుండి పూర్తిగా రక్షించబడినదని మాత్రం చెప్పలేం.
(39:49) వేదాలలో ఇన్ని తప్పులు చేసిన దాన్ని అతను సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. తాను ప్రతిపాదించిన దాన్ని తానే చాలా చోట్ల కాంట్రడిక్ట్ చేసుకున్నాడు. తను రాసిన చిప్స్ ఆఫ్ జర్మన్ వర్క్షాప్ పుస్తకంలో అతడు ఈ విధంగా రాశాడు. వేదాల్లో చాలా మంత్రాలు పిల్లదనంగా విసుగు పుట్టించేవిగా నీచమైనవిగా ఉంటాయి. మాక్స్ ముల్లర్ జీవితం పైన పరిశోధన చేసిన నిరాజ్ చౌదరి మాక్స్ ముల్లర్ గురించి రాస్తూ ఏ వ్యక్తి అయినా భాష యొక్క మూలాలను ఆలోచనలను ధర్మ దర్శనాలను లేదా మానవ చరిత్ర యొక్క రచనలపై ఇంట్రెస్ట్ ఉంటే వారు వేదాల సమయంలోని సాహిత్యాన్ని తప్పకుండా చదవాలి అని మాక్స్ ముల్లర్ అంటాడు ఒకవైపు వేదాలను
(40:32) తక్కువ చేసి చూపిస్తూ మరోవైపు వేదాలను అత్యున్నతమైనగా వాటిని చదవాలి అని చెప్పడం మాక్స్ ముల్లర్ ద్వంద్వ వైకరిని మనకు చూపిస్తుంది. మాక్స్ ముల్లర్ ఇంగ్లాండ్ లో కూర్చుని భారత్లోని అతని స్నేహితులు కేశవ చంద్రసేన్ కేసీ మజుదారులను క్రిస్టియన్లుగా మార్చడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే వచ్చాడు. అతను చనిపోయే ముందు హెన్రీ ఓక్లాండ్ కు రాసిన లేఖలో ఆయన ఇలా రాస్తాడు.
(41:00) అతడు చనిపోయే ముందు కూడా కేశవ చంద్రసేన్ రాజా రామ్మోహన్ రాయ్ లాంటి ఆర్చి బిషప్లను భారతదేశానికి పంపిస్తే భారతదేశం ఒక్క క్షణంలోనే క్రిస్టియన్ స్టేట్ గా మారిపోతుంది. ఇది మిత్రులారా మాక్స్ ముల్లర్ నిజ స్వరూపం అతడు వేదాల మీద లేదా సంస్కృత భాష మీద అభిమానంతో వేదాలు ఇంగ్లీష్లోకి అనువదించలేదు. బ్రిటిష్ వారికి క్రిస్టియన్ మిషనరీలకు తోడుగా నిలచి భారతదేశాన్ని క్రిస్టియన్ దేశంగా మార్చడానికి నియమించబడ్డ ఒక బ్రిటిష్ నౌకర్ అతడు తన జీవితంలో ఒక్క డిబేట్ ను కూడా గెలవలేదు.
(41:40) మిత్రులారా మన వేదాలు మన ఉపనిషత్తులు మన దర్శనాలు మానవ చరిత్రలో మానవుడి బుద్ధికి అత్యున్నతమైన నిదర్శనాలు మనం మనదైన సాహిత్యాన్ని చదవాలి అధ్యయనం చేయాలి. మిత్రులారా ఇంతటితో ఈ విషయానికి స్వస్తి పలుకుదాం. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవా మరి మిత్రులారా మీ ఆర్థిక చేయుత ఈ మహత్కార్యాన్ని కొనసాగించడానికి మనకు చాలా ఉపకరిస్తుంది.
(42:07) చాలామంది ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు వారికి ధన్యవాదాలు. స్క్రీన్ పైన ఉన్న అకౌంట్ కు మీ సహాయ ధనరాశిని పంపించవచ్చు. లేదా స్క్రీన్ పైన ఉన్న బార్కోడ్ను స్కాన్ చేసి అయినా మీరు సహాయం అందించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయతే మన డి మదన్ గుప్త ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.
(42:30) మా వీడియోలు విడుదల అయినప్పుడల్లా మీకు సందేశం వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి. మీ మిత్రులకు కూడా ది మదన్ గుప్త ఛానల్ లో పరిచయం చేయండి. జై హింద్ జై మా భారతి. నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్త

No comments:

Post a Comment