ఆత్మ సాక్షాత్కారానికి రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి ఎరుక మార్గం రెండోది లినమైపోయే మార్గం
https://youtu.be/UGA_k9vJYJE?si=uOwWYj-xg_ODNHHm
https://www.youtube.com/watch?v=UGA_k9vJYJE
Transcript:
(00:02) అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఆత్మ సాక్షాత్కారానికి రెండు మార్గాలే ఉన్నాయి. ఒకటి ఎరుక రెండు లీనమైపోవడం టైటిల్ ఇంకోసారి వినండి ఆత్మ సాక్షాత్కారానికి రెండు మార్గాలే ఉన్నాయి. ఒకటి ఎరుక రెండోది లీనమై పోవడం సో మనం విషయంలోకి వెళితే మనం ఆధ్యాత్మికతలో ఈ పదాలు వినడం జరుగుతుంది మిత్రులారా ఒకటి ఎరుక రెండోది లీనమై పోవడం నువ్వు కంప్లీట్ గా ఎరుకలో ఉంటే కూడా నీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అలాగే కంప్లీట్ గా లీనమై పోతే అప్పుడు కూడా నీకు కలిగేది ఆత్మ సాక్షాత్కారం ఎరుకను బోధించే మార్గాలు కొన్ని ఉన్నాయి
(00:53) అలాగే లీనమైపోయే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కనుక ఎరుక ద్వారా ప్రయాణించేవాడు ఆత్మ సాక్షాత్కారాన్ని చేరుకుంటాడు అలాగే పూర్తిగా లీనమైపోయిన వాడు కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. మరి ఎరుక మార్గం అంటే ఏమిటి? ఉదాహరణకు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పే ఆ యొక్క ధ్యాన విధానాన్ని చూడండి. అలాగే బుద్దుడు చెప్పిన లేదంటే ఓషో చెప్పిన వీరి వీరి యొక్క మార్గాలు ఏమిటి? వీరు బోధించే విధానం ఎరుకతో కూడిన మార్గాలు.
(01:32) కళ్ళు మూసుకొని నువ్వు అంతర్గతంగా శోధిస్తున్నప్పుడు అనేక ఆలోచనలు గాని బావోద్వేగాలు గాని అనేక ఊహలు గాని నిన్ను చుట్టూ ముట్టినప్పుడు నువ్వు వాటి పట్ల కంప్లీట్ గా ఎరుకలో ఉండాలి ఉదాహరణకు మనం కాన్సెంట్రేషన్ అంటాం కాన్సంట్రేషన్ అంటే ఏమిటి ఒకే విషయం పట్ల నీ యొక్క అప్రమత్తత ఒకే విషయంపై పెట్టడాన్ని అది కాన్సంట్రేషన్ అంటాం అటువంటి అప్రమత్తతనే అన్ని విషయాల పట్ల పెట్టినప్పుడు అంటే ఎంచుకోవడం లేదు అక్కడ నువ్వు ఒక విషయాన్ని ఎంచుకోవడం లేదు.
(02:05) సమస్త విషయాలు సమస్త భావోద్వేగాలు అన్నిటిని నీకు నీకు ఎదురుపడ్డ ప్రతి విషయాన్ని ప్రతి భావోద్వేగాన్ని ఎరుకతో చూసినప్పుడు అంటే వీటన్నిటి పట్ల ఎంపిక లేకుండా అన్నిటి పట్ల నువ్వు ఎరుకతో అప్రమతతో ఉన్నప్పుడు దాన్నే ధ్యానం అన్నారు దాన్నే ఎరుక మార్గం అన్నారు జిడ్డు కృష్ణమూర్తి బోధించే మార్గం ఎరుకతో కూడిన మార్గం బుద్ధుడు చెప్పినా ఓషో చెప్పిన ఈ ధ్యాన మార్గాలన్నీ ఎక్కడికి దారితీస్తాయి ఎరుక అందుకే వారు అంటారు కంప్లీట్ గా అప్రమతతో ఉండు ఎరుకతో ఉండు సమస్త విషయాల పట్ల ఎరుకలో ఉండు అని చెప్పడం జరుగుతుంది సో ఈ ఎరుక మార్గం ద్వారా చాలామంది ఆత్మ సాక్షాత్కారం
(02:47) పొందారు సో ఇది ఒక మార్గం అలాగే ఇప్పుడు రెండో మార్గం ఏమిటి ఇది లీనమైపోయే మార్గం ఈ మార్గం ద్వారా ఎవరు ప్రయాణించారు ఉదాహరణకు మనం శ్రీరాం రామకృష్ణుల వారిని తీసుకోవచ్చు శారదామాతను తీసుకోవచ్చు అలాగే నీమ్ కరోలి బాబను ఇలాంటి వారిని తీసుకోవచ్చు లీనమైపోయే మార్గం ఏ మార్గంలో ఉంటుంది అది జప మార్గం ఇక్కడ నువ్వు అనేక విషయాల పట్ల ఎరుకతో ఉండాల్సిన పని లేదు జపంలో ఒక దైవ నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు నువ్వు ఆలోచనల మీద ఎరుకతో ఉండాల్సిన పని లేదు నీ భావోద్వేగాలు నీ యొక్క ఊహల మీద ఎరుకతో ఉండాల్సిన పని లేదు నువ్వు ఒక నామాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ ఉంటే చాలు
(03:32) నీ యొక్క నామాన్ని నువ్వు నిరంతరం ఉచ్చరిస్తూ ఉంటే అప్పుడు నీ యొక్క సంపూర్ణమైన శక్తి మొత్తం ఒక నామం మీదనే కేంద్రీకరించడం జరుగుతుంది. తద్వారా ఆలోచనలన్నీ అంతరించిపోతాయి నీ యొక్క అంతర్గతంగా ఉన్న అనేక ఆలోచనలు కానీ భావోద్వేగాలు కానీ నీ యొక్క అంతర్గతంగా పడిన ఏర్పడిన దుమ్ము కానీ అన్ని తొలిగిపోతాయి. సో ఇక్కడ నువ్వు ఎరుకతో ఉండాల్సిన పని లేదు జపమార్గంలో నీ యొక్క సంపూర్ణమైన శక్తి మొత్తం ఆ నామం మీద నువ్వు ఉచ్చరించి ఆ నామం మీద పెడుతూ ముందుకు కదలడం నిరంతరం ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఇక సమస్త విషయాలను విడిచిపెట్టడం సంపూర్ణంగా ఒకే నామం మీద కేంద్రీకరించి ఆ నామాన్ని
(04:19) ఉచ్చరిస్తూ లోతుల్లోకి వెళ్ళడం సో తద్వారా అన్ని ఆలోచనలు అంతమైపోతాయి బ్రమలన్నీ తొలిగిపోతాయి చివరిగా మిగిలేది ఏమిటి ఏటి నువ్వు జపిస్తున్న నామమే ఆ నామం కూడా చివరిగా లీనమైపోతుంది. కంప్లీట్ గా అన్ని లీనమైపోతాయి అప్పుడు కలిగేదే ఆత్మ సాక్షాత్కారం. సో మిత్రులారా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను ఒకటి ఎరుకతో కూడిన మార్గం అది ధ్యానానికి సంబంధించింది జిడ్డు కృష్ణమూర్తుల వారు ఒసో ఇటువంటి వారు చెప్పిన ఆ విధానం.
(04:54) రెండోది లీనమైపోయే మార్గం. అది జపంతో కూడిన మార్గం. ఒక నామాన్ని ఉచ్చరించినప్పుడు, ఒక మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు నువ్వు ఎరుక ఉండది ఇందులో కంప్లీట్ గా డిస్పియర్ అయిపోతావు. జపిస్తున్న వాడే లాస్ట్ కు అంతమైపోతాడు. జపం అంతమైపోయి జపంతో పాటు జపించేవాడు కూడా అంతమైపోయినప్పుడు ఉండేదే ఆత్మజ్ఞానం ఆత్మస్థితి. కానీ ఇక్కడ రెండు భిన్నమైన మార్గాలు.
(05:22) అందుకే మిత్రులారా మీరు ఏ మార్గం గుండా ఎంచుకుంటారు అన్నది మీ యొక్క ఛాయిస్, మీ యొక్క నిర్ణయం. కొందరు ఎరుకతో కూడిన మార్గం ఎంచుకుంటారు, కొందరు కంప్లీట్ గా లీనమైపోయే మార్గాన్ని ఎంచుకుంటారు. ఎరుక మార్గంలో ప్రయాణించేవారు ఈ లీనమైపోయే మార్గాన్ని వారు అది అబద్ధం అని అందులో ఆత్మ సాక్షాత్కారం కలగదు అని ఒక విధమైనటువంటి అవగాహన రాహిత్యం ఉంటుంది.
(05:52) చాలామందికి ఇప్పుడు జపమార్గం అని చెప్పాను కదా, జపం ద్వారా ఆత్మ జ్ఞానం కలగదని వారికి ఒక విధమైనటువంటి తప్పుడు అభిప్రాయం ఉంటుంది. కానీ అది తప్పు. శ్రీరామకృష్ణుల వారు జపమార్గం ద్వారానే ఆత్మ స్థితిని చేరుకున్నాడు. ఒక శారదా మాత జపమార్గం ద్వారానే ఒక నీమ్ కరోలి బాబా కావచ్చు, అలాగే ఒక ఆనందమయ్య మాత కావచ్చు. ఇటువంటివారు దైవ నామాన్ని ఉచ్చరించడం ద్వారానే జపమార్గం ద్వారానే ఆత్మ జ్ఞానాన్ని పొందారు.
(06:25) అలాగే ఎరుకతో కూడిన మార్గం ద్వారా ఆత్మజ్ఞానం కలుగుతుంది అని ఈ లీనమైపోయే మార్గాన్ని అవలంబించే వారు ఉంటారు కదా, వారు అంగీకరించరు. కానీ అది కూడా తప్పే. ఎరుక మార్గాల ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారు ఉన్నారు. ఒక జిడ్డు కృష్ణమూర్తి, ఒక ఒసో సో ఇటువంటివారు ఒక బుద్ధుడు ఇటువంటి వారు బోధించేది ఎరుకతో కూడిన మార్గం. కానీ మార్గాలు భిన్నం మిత్రులారా ఎరుక మార్గం ద్వారా వెళ్ళినప్పుడు నీకు డిఫరెంట్ అనుభవాలు కలుగుతాయి.
(06:58) ఆ మార్గంలో వెళ్ళిన వారి యొక్క అనుభవాలు డిఫరెంట్ గా ఉంటాయి అలాగే లీనమైపోయే మార్గం ద్వారా వెళ్ళిన వారి యొక్క అనుభవాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి కానీ చివరి గమ్యం మాత్రం ఒక్కటే ఇద్దరు చేరుకునేది ఆత్మ స్థితినే నేను ఈ రెండు మార్గాల మధ్య తేడాను మీకు వివరిస్తాను మిత్రులారా అది ఏమిటంటే ఇప్పుడు మీరు ఎరుక మార్గం ద్వారా ప్రయాణించినప్పుడు అంటే కంప్లీట్ గా ఎరుకతో అన్నిటి పట్ల ఎరుకతో ఉంటారు కదా ఆ విధంగా ఎరుకతో ఉంటూ మీ ఆలోచనలన్నీ అంతమైపోతాయి.
(07:30) ఆ తరువాత ఎరుక మాత్రమే మిగిలి ఉంటుంది తద్వారా ప్రజ్ఞ అన్నది ఉదయిస్తుంది. ఆ ప్రజ్ఞ ద్వారా తర్వాతనే ఏర్పడేది ఆత్మజ్ఞానం మీకు అర్థమైందా మిత్రులారా ఎరుక మార్గం ద్వారా మొదటగా మీకు సిద్ధించేది ఏమిటి ప్రజ్ఞ ప్రజ్ఞ ఉదయించిన తర్వాత వారికి సమాధి అనుభవం కలుగుతుంది. అంటే మిత్రులారా ఎరుక మార్గంలో మొదట మీకు ఏమి సిద్ధిస్తుంది, ప్రజ్ఞ.
(08:03) ప్రజ్ఞ ఉదయించిన తర్వాత మీకు ఆ ప్రజ్ఞ ద్వారా సమాధి అనుభవం మీకు కలుగుతుంది. అలాగే లీనమైపోయే మార్గంలో ఏం మొట్టమొదటగా ఉదయిస్తుంది. అది సమాధి సమాధి తర్వాత మీకు ప్రజ్ఞ ఉదయిస్తుంది. ఈ యొక్క తేడాని మీరు గమనించండి. ఎరుక మార్గంలో మొదటగా మీకు ప్రజ్ఞ ఉదయించి ఆ ప్రజ్ఞ ద్వారా సమాధి ఏర్పడుతుంది. అంటే సమాధి స్థితి కలుగుతుంది.
(08:31) అలాగే లీనమైపోయే మార్గంలో మొదటగా మీకు సమాధి స్థితి ఏర్పడి ఆ సమాధి ద్వారా మీలో ప్రజ్ఞ ఉదయిస్తుంది. అందుకే మీరు చూడండి శ్రీరామకృష్ణుల వారికి సమాధి స్థితులు కలిగేవి కానీ బుద్ధుడికి ఎక్కడ కలిగినట్టుగా మీరు వినలేదు అంటే బుద్ధుడు ప్రజ్ఞ గురించి మాట్లాడుతాడు శ్రీరామకృష్ణుల వారు సమాధి గురించి మాట్లాడతాడు బుద్ధుడికి ప్రజ్ఞ కలిగిన తర్వాత సమాధి స్థితి కలిగింది.
(08:59) అలాగే శ్రీరామకృష్ణుల వారికి మొదట సమాధి స్థితి కలిగిన తరువాత ప్రజ్ఞ అన్నది ఉదయించింది. సో ఏ మార్గం గుండా వెళ్ళినా మీకు ఆత్మజ్ఞానం అనేది సిద్ధిస్తుంది. బుద్ధుడు ఎక్కడ సమాధి శ్రీరామకృష్ణుడు పొందినటువంటి ఆ సమాధులను పొందినట్టుగా ఎక్కడ మీరు విని ఉండరు. బుద్ధుడికి సమాధి స్థితి గురించి తెలుసు కానీ ఆయన ఎక్కువ ఎక్కడ సమాధి స్థితి గురించి మాట్లాడడు.
(09:26) ఆయన మాట్లాడేది ప్రజ్ఞ గురించే అలాగే శ్రీరామకృష్ణుల వారు కూడా సమాధి స్థితి గురించి చాలా వివరించడం జరిగింది. సో మిత్రులారా ఇవి భిన్నమైన మార్గాలు ఒకటి ఎరుకతో కూడిన మార్గం ఇంకొకటి కంప్లీట్ గా లీనమైపోయే మార్గం అందుకే మీరు చూడండి బుద్ధుడు ఎక్కడ సమాధి స్థితుల గురించి చర్చించినట్టుగా మీకు కనిపించదు.
(09:57) అంటే బుద్ధుడి యొక్క బోధనలో కావచ్చు అతడి యొక్క చర్చలలో సమాధి స్థితుల గురించి మాట్లాడినట్టుగా మీకు ఎక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా మీకు కనిపించదు. బుద్ధుడు ఎరుక గురించి మాట్లాడుతాడు ప్రజ్ఞ గురించి మాట్లాడుతాడు. అలాగే మనం శ్రీరామకృష్ణుల విషయానికి వస్తే ఆయనే సమాధి స్థితుల గురించి గొప్పగా వివరించడం జరుగుతుంది. కంప్లీట్ గా లీనమైపోవడాన్ని సమాధి యొక్క అనుభవాన్ని వీటి గురించి వివరించినట్టుగా జరుగుతుంది.
(10:27) కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. బుద్దుడికి రెండు తెలుసు అలాగే శ్రీరామకృష్ణుల వారికి రెండు తెలుసు. అవి ఏమిటి? బుద్ధుడికి ప్రజ్ఞ గురించి తెలుసు అలాగే సమాధి గురించి కూడా తెలుసు కానీ ఆయన ఎక్కువగా మాట్లాడింది ప్రజ్ఞ గురించి బుద్ధుడు అలాగే రామకృష్ణుల వారికి సమాధి గురించి తెలుసు అలాగే ప్రజ్ఞ గురించి తెలుసు కానీ రామకృష్ణుని బోధనలో ఎక్కువగా మీకు సమాధుల గురించి మాట్లాడినట్టుగానే ఉంటుంది ఆయన బోధన కానీ ఇద్దరికీ ఆత్మజ్ఞానం సిద్ధించింది.
(11:04) మార్గాలు భిన్నమైనవి వారికి కలిగిన అనుభవాలు భిన్నమైనవి కానీ వారు చేరుకున్న చివరి గమ్యం ఆత్మ జ్ఞానం సో ఆ ఫైనల్ డెస్టినేషన్ అన్నది బుద్ధుడికి ఒకటే రామకృష్ణుల వారికి ఒక్కటే కానీ చాలామంది ఎరుక మార్గంలో ప్రయాణించేవారు శ్రీరామకృష్ణుని మార్గాన్ని అంగీకరించరు అలాగే శ్రీరామకృష్ణుని మార్గంలో ప్రయాణించే వారు ఈ బుద్ధుడి యొక్క మార్గాన్ని వారు ఒప్పుకోరు కానీ రెండు సత్యానికే దారి తీస్తాయి.
(11:40) అందుకే బుద్ధుడు మీరు చూడండి తరచుగా ఆయనే సంపూర్ణంగా ఎరుకలో ఉంటాడు. ఆయన నడిచినా మాట్లాడినా చేయి కదిలించినా అతడు ఏమి చేసినా సంపూర్ణమైన ఎరుకలో చేస్తూ ఉంటాడు. అలాగే శ్రీరామకృష్ణుల వారిని మీరు చూసినప్పుడు ఆయన కంప్లీట్ గా లీనమైపోయే స్థితిలో ఉంటాడు, డిస్ప్పియర్ అయిపోయే స్థితిలో ఉంటాడు. సో ఇద్దరి మార్గాలు భిన్నమైనవి ఒకరి మార్గం ఎరుకతో కూడిన మార్గం ఇంకొకరి మార్గం లీనమైపోయే మార్గం ఎరుకలో ఏమి కలుగుతుందని మీకు చెప్పాను నేను మొదటిగా ప్రజ్ఞ ఉదయించి దాని తర్వాత సమాధి స్థితి కలుగుతుంది.
(12:22) ఆ విధంగా ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. అలాగే లీనం అయిపోయే మార్గంలో మొదటగా మీకు సమాధి స్థితి కలిగి దాని ద్వారా ప్రజ్ఞ ఉదయించి తద్వారా ఆత్మ జ్ఞానం సిద్ధిస్తుంది సో ఆత్మ సాక్షాత్కారానికి ఇవి రెండు భిన్నమైన మార్గాలు ఇది మిత్రులారా నా యొక్క ఎక్స్ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు
No comments:
Post a Comment