శ్వాసే శక్తి! పురాతన ఋషులు చెప్పిన మనసుపై గెలిచే మహా రహస్యం || SANATHANA LIFE
https://youtu.be/MHkMw6IJprM?si=J9vqwz81erSO8QN6
https://www.youtube.com/watch?v=MHkMw6IJprM
Transcript:
(00:00) నమస్కారం సనాతన లైఫ్ ఛానల్ కి స్వాగతం. ఈ ప్రపంచంలో మనిషి సముద్రం లోతుల్లోకి వెళ్ళాడు ఆకాశంలో విమానాలు నడిపాడు. చివరికి చంద్రుడి మీద కాలు మోపాడు. బయట ఉన్న ప్రకృతిని జయించడంలో మనిషి ఎప్పుడూ ముందుంటాడు. కానీ యుగాలు మారుతున్న టెక్నాలజీ పెరుగుతున్న మనిషి ఇప్పటికీ ఓడిపోతున్నది ఎక్కడో తెలుసా తన సొంత మనసు దగ్గర. అవును మన భావోద్వేగాల దగ్గర.
(00:25) కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటే ఆలోచనలు దాడి చేస్తాయి. నిద్రపోదాం అనుకుంటే రేపటి గురించిన భయం నిద్రపోనివ్వదు. కోపం వద్దు అనుకున్నా వస్తుంది. బాధ పడకూడదు అనుకున్న కన్నీళ్లు ఆగవు. మన జీవితం స్టీరింగ్ వీల్ మన చేతిలో ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ నిజానికి ఆ బండిని నడుపుతున్నది మన ఎమోషన్స్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మనసుని కంట్రోల్ చేయడం నిజంగా సాధ్యమేనా? వేల సంవత్సరాల క్రితమే హిమాలయ గుహల్లో తపస్సు చేసిన మన ఋషులు యోగులు ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు.
(01:00) వాళ్ళు చెప్పిన రహస్యం ఏంటంటే నీ మనసు నీ మాట వినకపోవచ్చు కానీ నీ మనసుకి ఒక బాస్ ఉన్నాడు. ఆ బాస్ పేరే శ్వాస. ఇది వినడానికి చాలా సింపుల్ గా అనిపించవచ్చు. మనం రోజుకి 21,600 సార్లు గాలి పీలుస్తున్నాం. ఇందులో ఏముంది స్పెషల్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఋగ్వేదం ఏం చెబుతుందో తెలుసా సృష్టి జరగకముందు గాలి లేని శూన్యంలో కూడా ఆ పరబ్రహ్మం శ్వాస తీసుకుందంట అంటే శ్వాస అనేది కేవలం ఆక్సిజన్ తీసుకోవడం మాత్రమే కాదు అది ప్రాణశక్తి ఉపనిషత్తులు మనసుకి శ్వాసకి ఉన్న సంబంధాన్ని చాలా అందంగా వర్ణించాయి.
(01:39) ప్రాణోహి ఏకం సహస్రద ప్రవివేష తస్మిన్ స్వాసితమిదం సర్వం ప్రతిష్టితం దీని అర్థం ఏంటంటే ప్రాణశక్తి శరీరంలో వేల రూపాల్లో ప్రవహిస్తుంది. ఒకవేళ మనసు అనేది గాలిలో ఎగిరే గాలిపటం అనుకుంటే ఆ గాలిపటం ఎటు పడితే అటు ఎగరకుండా మన చేతిలో నిలబడేలా చేసే దారమే ఈ శ్వాస. దారం తెగిపోతే గాలిపడం ఏమైపోతుందో శ్వాస మీద పట్టు లేకపోతే మనసు కూడా అలాగే పిచ్చిగా మారుతుంది.
(02:10) పతంజలి మహర్షి యోగ సూత్రాలలో కూడా ఇదే చెప్పారు. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్చేద ప్రాణాయామః అంటే శ్వాస మరియు ఉచ్వాసల గతిని మార్చడమే ప్రాణాయామం ఎందుకు మార్చాలి? మీరు ఎప్పుడైనా గమనించారా? మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుంది? వేగంగా చిన్నగా వేడిగా ఉంటుంది. అదే మీరు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నప్పుడు శ్వాస నెమ్మదిగా లయబద్ధంగా ఉంటుంది.
(02:38) ఇక్కడ లాజిక్ ఏంటంటే మీ భావాలు మారితే శ్వాస మారుతుంది అనేది ఎంత నిజమో శ్వాసను మారిస్తే భావాలు మారుతాయి అనేది కూడా అంతే నిజం. మనసుని మనం నేరుగా పట్టుకోలేం. అది పొగమంచు లాంటిది. కానీ శ్వాసని మనం పట్టుకోగలం. అదే ఋషులు చెప్పారు. ఎవరైతే శ్వాసని జయిస్తారో వారు ప్రపంచాన్ని జయించినట్లే అని. ఇదంతా వినడానికి ఆధ్యాత్మికంగా బాగుంది.
(03:04) కానీ దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉందా అని మీకు సందేహం రావచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆధునిక న్యూరోసైన్స్ ఈ మధ్యకాలంలో కనుగొన్న విషయాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మన శరీరంలో ఒక అద్భుతమైన స్విచ్ ఉంది. దాని పేరు వేగస్ నర్వ్ ఇది మన మెదుడు నుండి మొదలై గుండె మీదుగా పొట్ట వరకు ప్రయాణించే ఒక పెద్ద నరం దీన్ని మనం నర్వస్ సిస్టం యొక్క రిమోట్ కంట్రోల్ అని పిలుస్తారు.
(03:32) మన శరీరంలో రెండు రకాల మోడ్స్ ఉంటాయి. ఒకటి ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటే యుద్ధం చేయడం లేదా పారిపోవడం. మీకు భయం వేసినప్పుడు కోపం వచ్చినప్పుడు టెన్షన్ పడినప్పుడు ఈ మోడ్ ఆన్ అవుతుంది. అప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస చిన్నగా మారుతుంది. స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. రెండవది రెస్ట్ అండ్ డైజెస్ట్ అంటే ప్రశాంతంగా ఉండటం మనం కావాలని శ్వాసని నెమ్మదిగా దీర్ఘంగా తీసుకున్నప్పుడు ఊపిరిదిత్తులు పూర్తిగా గాలితో నిండినప్పుడు ఈ వేగస్ నర్వ్ మెదుడికి ఒక సిగ్నల్ పంపిస్తుంది.
(04:05) హేయ్ అంతా సేఫ్ గా ఉంది రిలాక్స్ అవ్వండి అని వెంటనే మీ బ్రెయిన్ ఎసిటైల్ కోలిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. అది మీ హార్ట్ రేట్ ని తగ్గిస్తుంది. కండరాలని రిలాక్స్ చేస్తుంది. అంటే కేవలం శ్వాస ద్వారా మనం మన బ్రెయిన్ కెమిస్ట్రీని మార్చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఆయుర్వేదం వైపు వెళ్దాం. ఆయుర్వేదంలో వాతా దోషం అనేది గాలికి కదిలికకి సంబంధించినది.
(04:28) వాయురేవా శరీర ధారణం అంటే వాయువే శరీరాన్ని మనసుని కలిపి ఉంచుతుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం మనం పీల్చే గాలి ఒక్కటే కాదు. మనలో ఐదు రకాల ప్రాణవాయువులు పనిచేస్తుంటాయి. ప్రతి ఎమోషన్ వెనుక ఒక వాయువు డిస్టర్బ్ అవ్వడమే కారణం. మొదటిది ప్రాణవాయువు ఇది తల మరియు ఛాతి భాగంలో ఉంటుంది. ఇది డిస్టర్బ్ అయితేనే మనకు యంజైటీ ఓవర్ థింకింగ్ తల బరువుగా ఉండటం జరుగుతుంది.
(04:55) రెండవది అపాన వాయువు ఇది బొడ్డు కింద భాగంలో ఉంటుంది. విసర్జన క్రియను చూస్తుంది. ఇది దెబ్బ తింటే మనలో భయం ఇన్సెక్యూరిటీ కాళ్ళు వనకడం వంటివి జరుగుతాయి. మూడవది ఉదాన వాయువు ఇది గొంతు భాగంలో ఉంటుంది. మనం మాట్లాడే మాట మన కాన్ఫిడెన్స్ దీని మీదే ఆధారపడి ఉంటుంది. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడలేకపోవడానికి కారణం ఇదే. నాలుగవది సమాన వాయువు ఇది జీర్ణక్రియను చూస్తుంది.
(05:18) కోపం వస్తే కడుపులో మంట ఎందుకు పుడుతుందో తెలుసా ఈ సమాన వాయువు హీట్ ఎక్కడం వల్ల. ఐదవది వ్యాన వాయువు. ఇది శరీరంంతా వ్యాపించి ఉంటుంది. సో మీకు డిప్రెషన్ ఉందంటే ఉదాన వాయువుని సరిచేయాలి. భయం ఉందంటే అపాన వాయువుని సరిచేయాలి. కోపం ఉందంటే సమాన వాయువుని సరిచేయాలి. వీటన్నింటిని సరిచేసే ఏకైక మార్గం సరైన ప్రాణాయామం.
(05:43) శ్వాసను సరిచేస్తే ఈ ఐదు వాయువులు లైన్ లోకి వస్తాయి. వాయువులు సెట్ అయితే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది ఆయుర్వేదం చెప్పిన గొప్ప రహస్యం. ఇప్పుడు మనం కొంచెం లోతుగా వెళ్దాం. మీకు ఎవరు చెప్పని చాలా ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీన్నే స్వరయోగం అంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా మీ రెండు ముక్కు రంద్రాల నుండి గాలి ఎప్పుడు సమానంగా రాదు.
(06:07) ఒక గంట కుడి వైపు నుండి గాలి ఎక్కువగా వస్తే మరో గంట ఎడమ వైపు నుండి ఎక్కువగా వస్తుంది. దీని వెనుక సృష్టి రహస్యం దాగి ఉంది. మన కుడి ముక్కుని సూర్యనాడి లేదా పింగళా నాడి అంటారు. ఇది సూర్యుడికి సంకేతం. ఎప్పుడైతే కుడి వైపు శ్వాస నడుస్తుందో అప్పుడు శరీరం వేడెక్కుతుంది. మనం చురుకుగా ఉంటాం. కోపం, ఆవేశం పనులు చేయడం అప్పుడు సులభం. మన ఎడమ ముక్కుని చంద్రనాడి లేదా ఇడానాడి అంటారు.
(06:34) ఇది చంద్రుడికి సంకేతం ఎప్పుడైతే ఎడమ వైపు శ్వాస నడుస్తుందో అప్పుడు మనసు చల్లబడుతుంది. క్రియేటివిటీ, కలలు విశ్రాంతి అప్పుడు బాగుంటాయి. దీనిని మన జీవితంలో ఎలా వాడుకోవచ్చు. ఉదాహరణకు మీకు ఎవరి మీదైనా విపరీతమైన కోపం వచ్చింది అనుకోండి గొడవ జరిగే అవకాశం ఉంది. అప్పుడు వెంటనే చెక్ చేసుకోండి. కచ్చితంగా మీ కుడి ముక్కు యాక్టివ్ గా ఉంటుంది.
(06:58) ఆ క్షణంలో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే కుడి ముక్కును మూసేసి బలవంతంగా ఎడమ ముక్కుతో గాలి పీల్చి వదలండి. కేవలం మూడు నిమిషాల్లో ఆ చంద్రనాడి యాక్టివేట్ అయ్యి మీ కోపాన్ని నీటిలా చల్లార్చేస్తుంది. ఇది శివుడు పార్వతీ దేవికి చెప్పిన రహస్యం. మరో అద్భుతమైన విషయం ఏంటంటే మన ఆయుష్యుకి శ్వాసకి ఉన్న లింక్ మన ఋషులు జంతువులను గమనించి ఒక విషయాన్ని కనిపెట్టారు.
(07:25) కుక్కను తీసుకోండి. అది ఎప్పుడు నోరు తెరిచి వేగంగా గాలి పీలుస్తుంది. నిమిషానికి సుమారు 30 సార్లు శ్వాస తీసుకుంటుంది. అదే కుక్క ఆయుషు కేవలం 10 నుండి 15 సంవత్సరాలు [సంగీతం] మాత్రమే అదే తాబేలును తీసుకోండి అది నిమిషానికి కేవలం మూడు నుండి నాలుగు సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటుంది. అందుకే అది 300 సంవత్సరాలు బ్రతుకుతుంది.
(07:49) దీని అర్థం ఏంటి? ఎవరు వేగంగా శ్వాస తీసుకుంటారో వారి ఆయుష్షు త్వరగా కరిగిపోతుంది. ఎవరు నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకుంటారో వారి ఆయుష్షు పెరుగుతుంది. మనసు నిశ్చలంగా ఉంటుంది. కోపం, భయం, ఆందోళన ఇవన్నీ మన శ్వాస వేగాన్ని పెంచేస్తాయి. అంటే ఇండైరెక్ట్ గా మన ఆయుష్షుని తగ్గించేస్తాయి. కాబట్టి మనం మన భావద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం అంటే కేవలం మనశశాంతి కోసమే కాదు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకడం కోసం కూడా సరే ఇదంతా విన్నాక రేపటి నుంచి కాదు ఈ క్షణం నుంచి మనం ఏం చేయాలి ఆఫీస్ టెన్షన్ లో ఉన్నా ట్రాఫిక్ లో ఇరుక్కున్న ఇంట్లో సమస్యల్లో ఉన్నా మీ మనసుని రీసెట్ చేయడానికి ఇక్కడ
(08:31) మూడు పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. మొదటిది బాక్స్ బ్రీతింగ్ మీకు ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అనిపిస్తే వెంటనే ఒక బాక్స్ ని ఊహించుకోండి. నాలుగు సెకండ్లు గాలి పీల్చండి. నాలుగు సెకండ్లు గాలి లోపలే ఆపండి. నాలుగు సెకండ్లు గాలిని బయటకు వదలండి. నాలుగు సెకండ్లు గాలి లేకుండా ఖాళీగా ఉండండి. ఇలా నాలుగు సార్లు చేయండి. ఇది మీ నర్వస్ సిస్టం ని తక్షణమే బ్యాలెన్స్ చేస్తుంది.
(08:58) నేవీ సీల్స్ కూడా యుద్ధ సమయంలో తమని తాము కూల్ గా ఉంచుకోవడానికి వాడే టెక్నిక్ ఇదే. రెండవది బ్రామరి మీకు నెగిటివ్ ఆలోచనలు ఆగకపోతే కళ్ళు మూసుకొని చూపుడు వేళ్ళతో చెవులు మూసుకొని ఒక తుమ్మెద లాగా హం అని శబ్దం చేస్తూ గాలి వదలండి. ఆ వైబ్రేషన్స్ మీ మెదుడులో నరాలను శాంతపరుస్తాయి. మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది అవేర్నెస్ రోజుకు కనీసం మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కేవలం ఒకే ఒక్క నిమిషం మీ శ్వాసను గమనించండి.
(09:32) గాలి ఎలా లోపలికి వెళ్తుంది ఎలా బయటకి వస్తుంది అది చల్లగా ఉందా వేడిగా ఉందా అని మీరు శ్వాసని గమనిస్తున్న ఆ ఒక్క క్షణం మీకు ఆలోచనలు ఉండవు. మీరు వర్తమానంలో ఉంటారు. చివరగా భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట అంటాడు అపానే జూహది ప్రాణం ప్రాణేపానం తథాపరే యోగులు తమ శ్వాసనే ఒక యజ్ఞంలా చేస్తారు. శ్వాసను జయించడం అంటే మరణ భయాన్ని జయించడమే. ఎందుకంటే మిత్రులారా మన కోపం తాత్కాలికం.
(09:59) మన భయం తాత్కాలికం. మన ఈ శరీరం కూడా తాత్కాలికమే. కానీ నేను ఉన్నాను అనే ఆత్మ చైతన్యం శాశ్వతం. ఆ శాశ్వతమైన ఆత్మను చేరుకోవడానికి మనకు దొరికిన ఏకైక వంతెన ఈ శ్వాస. ఋషులు ఊరికే చెప్పలేదు. శ్వాసను చూడగలిగితే నీ ఆత్మను నువ్వు చూడగలవు అని మన భావాలు బయట పరిస్థితుల వల్ల రావు. అవి మన శ్వాసలో దాగి ఉన్నాయి. మీ శ్వాసను నియంత్రించండి.
(10:26) మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. ఈ వీడియో చూసాక మీరు తీసుకున్న తర్వాతి శ్వాస మామూలుగా ఉండకూడదు. నేను గాలి పీలుస్తున్నాను అనే స్పృహతో ఉండాలి. మీకు ఈ విషయం నచ్చితే ఈ వీడియో చాలా మందికి చేరాలి అనుకుంటే దయచేసి లైక్ చేయండి. అలాగే శ్వాస అని కింద కామెంట్ చేయండి. ఇలాంటి అద్భుతమైన లోతైన విషయాల కోసం సనాతన లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(10:51) మన సనాతన లైఫ్ ఛానల్ లో ప్రతి రోజు ఒక అద్భుతమైన వీడియో వస్తుంది. ఇలాగే ఎన్నో అద్భుతమైన వీడియోలు మీకోసం తీసుకువస్తాను. అంతవరకు శ్వాసను గమనిస్తూనే ఉండండి. సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదాలు
No comments:
Post a Comment