The only way to escape the bonds of samsara | The Secret Power of Meditation to Strengthen the We...
https://youtu.be/d5nx9rKB6fw?si=n2nKQdORrFpDfNhk
https://www.youtube.com/watch?v=d5nx9rKB6fw
Transcript:
(00:06) ఇప్పుడు మనం మాయను జయించాలంటే సంసార బంధనాల్లో మనం చిక్కుకొని ఉంటాం కాబట్టి మాయను జయించాలి అంటే అంత సులభమైనది కాదు అన్నమాట మాయను జయించాలంటే ఎంతో ఇంద్రియ నిగ్రహం ఉండి ఎంతో చిత్తశుద్ధి కలిగి ధర్మయుక్తంగా జీవిస్తున్న వాళ్లకు కూడా చాలా కష్టసాధ్యమైంది మాయ జయించి అంటే ఎంతో తపోశక్తి ఉన్నవాళ్ళకు మునులు ఋషులు ఇటువంటి వాళ్ళు కూడా మాయను జయించలేక చాలా అవస్థలు పడతా ఉంటారు చాలా కష్టాలు పడతా ఉంటారు ఎందుకంటే మాయ అంత ఆకర్షణీయంగా అద్భుతంగా ఈ బంధాలన్నిటిని సృష్టించి వాటిని మన జీవితాలతో ముడిపెట్టి మనతో ఒక ఆటాడుకుంటా ఉంటుంది మా ఇంటి మాయ
(01:00) ఇస్ నథింగ్ బట్ ఇల్యూషన్ అని చెప్పాను కదా సో ఈ ఇటువంటి మాయ అనేది ఈ బంధాలన్నిటిని మన జీవితంతో ముడిపెడుతుంది. అటువంటి మాయను జయించాలంటే ఆ మనసుకు ఎంతటి శక్తి ఉండాలో ఒకసారి ఆలోచన చెయ్ ఆ మనసుకు మాయను జయించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆ భగవత్ శక్తి ధ్యానం ద్వారా మాత్రమే మనకు లభిస్తుంది.
(01:33) అలా ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తామో మన మనసు భగవంతుని శక్తిని తీసుకొని బలపడుతుంది. అందుకనే చెప్పాను నేను సంసారం అనే బంధాల వలలో సంసారం అనే బంధాల వలలో చిక్కుకున్న మనస్సు బలహీన పడిపోతుంది. అట్టి బలహీన పడ్డ మనసును ధ్యానము శక్తివంతంగా మారుస్తుంది అలా శక్తివంతంగా ఏ మనసైతే మారుతుందో ఏ మనసైతే ఆ శక్తిని భగవత్ శక్తిని తీసుకొని ముందుకు వెళ్తుందో ఏ మనసైతే భగవత్ శక్తిని నింపుకొని ఆ మాయ వైపు వెళ్తుందో ఆ మాయను జయించి శక్తి అట్టి అట్టి మనసుకు మాత్రమే అట్టి మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది.
(02:34) మాయను జయించాలంటే ధ్యానం అవసరం ఆ మాయను జయించే శక్తి ధ్యానం చేసే వాళ్ళకు మాత్రమే సాధ్యము. ఆ ధ్యానం చేసే వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఒక ధర్మాన్ని పాటిస్తూ ఒక యోగి లాగా జీవిస్తా ఉంటారు. ఒక యోగి మాదిరి జీవితాన్ని జీవించడం అంటే అంత సులభమైనది ఏం కాదు. చాలా కష్టాలతో కూడుకొని ఉంటుంది. చాలా క్రమశిక్షణ ఉండాలి. ఒక మనిషి ఆత్మ సాక్షాత్కార స్థితికి రావాలి అంటే ఒక ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి ఒక మనిషి అంటే దాని వెనకల ఎంతో శ్రమ దాని వెనకల ఎంతో కృషి దాగి ఉంటుందన్నమాట.
(03:18) సంసారం అనే బంధాల వలలో చిక్కుకున్న మనసు మాయకు లోబడి బలహీన పడుతుంది. అట్టి మనసును ధ్యానం మాయ నుండి వేరు చేసి భగవత్ శక్తిని జత చేసి మహాబల సంపన్నంగా తయారు చేసి ఆత్మ సాక్షాత్కార మార్గం వైపు మన జీవితాన్ని నడిపిస్తుంది.
No comments:
Post a Comment