*_హోళీ కా దిన్.._*
*_దిల్ మిల్జాతీ హై...!_*
బట్టలు ఖరాబు చేసినా..
సంబరాలు
గుట్టలు గుట్టలు..
ఆత్మీయతల రంగులు
కలబోసి జల్లుకునే సరంగులు..
కులమడగని..మతమడగని
ఆనందాల కేళి..
రంగుల హోళి..!
నన్ను బరిలోకి దింపేస్తే..
నిన్ను లాగెయ్యాల్సిందే..
అది పోటీ కాదు..ఆట..
తప్పించుకోవాలని ప్రయత్నం
దొరికిపోవాలని ఆరాటం..
హోళీ కోలాటం..!
కాముని పున్నమి..
రాధాకృష్ణుల సయ్యాట..
ప్రేమకు సంకేతం..
ఆనందాల విజయకేతనం..!
వయసున్నది సొగసున్నది
అన్నీ ఉన్నా
ఉలకదు పలకదు
అయ్యో పాపం చిన్నది..
బందిపోటు మనసు దోచింది
ఈ రోజే కృష్ణకుమారి..!
హోళీ కబ్ హై..
రామ్ ఘడ్ పై దాడికి
గబ్బర్ పెట్టుకున్న ముహూర్తం..
ఇదే హోళీ..
ఇంకెన్నో సినిమాల రంగోలీ..!
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
9948546286
7995666286
No comments:
Post a Comment