Saturday, March 28, 2026

 ప్రసాదం

అన్నానికి మరో పేరు 'సాదం'. దైవనివేదనకు యోగ్యమైన సాదం- ప్రసాదం! ప్రసా దమనే సంస్కృత శబ్దానికి ప్రసన్నమైన, అనుగ్రహ రూపమైనదని అర్థం. మనం రోజూ తినే ఆహారం ప్రసాదం కావాలంటే- అది ముందుగా భగవంతుడికి నివేదన కావాలి. ఆ నివేదన భక్తిశ్రద్దలతో కూడినదై ఉండాలి. ఆహారానికి భక్తి కలిస్తేనే అది ప్రసాదం అవుతుంది. నీటికి భక్తిని జోడిస్తేనే అది తీర్ధం అవుతుంది. తీర్థ ప్రసాదాలంటే-దైవానుగ్రహాన్ని, తేజస్సును తమలో నింపుకొన్నవని అర్ధం. కాబట్టి వాటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు. భక్తితో స్వీకరిస్తారు. అప్పుడే తీర్థ ప్రసాదాల్లోని దేవతాశక్తి మన దేహాల్లోకి ప్రసరిస్తుంది.

మట్టి బొమ్మల్లోకి, రాతి విగ్రహాల్లోకి దైవశక్తిని ఆవాహన చేసేందుకు- ఆహూత, సన్నిహిత, వ్యాపక... అనే మూడు విధానాలను పాటిస్తారు. రాగితీగల్లోకి విద్యుచ్ఛ క్తిని ప్రసారం చేసినట్లు వాటి ద్వారా ఈశ్వర శక్తిని ఆ ప్రతిమల్లోకి ప్రవేశ పెడతారు. అలా ప్రతిమల్లోకి ప్రవేశించిన ప్రాణశక్తికి పోషణ కోసం నివేదన చేసిన వాటినే ప్రసా దాలంటారు. ప్రతిమల్లోని పరమాత్మశక్తిని బలోపేతం చేసిన పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించిన ప్రాణికి ఆత్మశక్తి బలపడుతుంది. సాధారణమైన రాగితీగ శక్తిమంతమైన విద్యు తీగ అవుతుంది. పదార్థాల్లోకి భగవచ్చక్తిని ప్రవేశపెట్టేందుకు బలమైన భావనాశక్తి అవ సరం. భావన చేసేవారికే- భగవంతుడు. భావనాశక్తి చాలని సందర్భాల్లో మనిషి మంత్రబలాన్ని ఆసరాగా స్వీకరిస్తాడు.

అలా భావనాశక్తి, మంత్రబలం కలగలిసిన ప్రసాదాలకు పవిత్రత ఇనుమడిస్తుంది. ఇళ్లల్లో నిత్యం చేసే సాధారణ నివేదనలకు, టికి అదే తేడా. ఇంట్లో లాంఛనంగా దేవుడి ముందుంచే ప్రసాదాల్లోని జీవశక్తి- కుండీల్లో పెరిగే లేత మొక్కల జీవశక్తి వంటిది. దేవాలయాల్లోని తీర్థ ప్రసాదాలది కొండల్ని చీల్చుకుంటూ ఏపుగా ఎదిగి ఆకాశాన్ని ముద్దాడే గిరివృక్షాల జీవశక్తి లాంటిది
వాస్తవానికి మనకు లభించే ఆహార పదార్ధాలన్నీ భూమాత ప్రసాదాలే. గ్రీష్మతా పానికి నెర్రెలు వారిన భూదేవి దాహాన్ని మేఘాలు తీరుస్తాయి. సమృద్ధిగా కురిసిన వర్షాలకు భూగర్భంలోని ఓషధులు జీవం పోసుకుంటాయి. సస్యాలు మొలకెత్తు తాయి. జీవుల ఆకలి తీరుస్తాయి. ఆరోగ్యాన్నిస్తాయి. ఆ విధంగా వానచినుక్కీ అన్నం మెతుక్కీ మధ్య మేఘుడు సంధానకర్తగా వ్యవహరిస్తాడు. అన్నం జీవుల ప్రాణాలు నిలుపుతుంది. ప్రసాదాల్లో మాదిరే అన్నానికీ స్థాయీభేదాలు ఉన్నాయి. పదిమందికి పెట్టగా మిగిలిన అన్నం- విఘసం. యజ్ఞాల్లో ఆహుతి కాగా మిగిలి నది అమృతం! మనం హోటళ్లలో తినేదానికీ- వీటికీ చాలా తేడా ఉంది. విఘసా మృతాలు ప్రసాదాలు. అందుకే దేవాలయాల్లోనూ, శ్రీరామనవమి, వినాయకచవితి పందిళ్లలోనూ జరిగే సంతర్పణలకు 'అన్నప్రసాదాలు' అని పేరు. ప్రసాదమనే పేరు ప్రాశస్త్యానికి, పవిత్రతకు చిహ్నం.

మనిషి జీవితమూ అంతే! నిర్లక్ష్యంగా బతికేస్తే- అది హోటల్ భోజనం. భగవం తుడికి భక్తితో నివేదిస్తే అది ప్రసాదం.

ఎర్రాప్రగడ రామకృష్ణ

No comments:

Post a Comment