*2016...*
ఒక వివాహ వేడుక..
అతిధులు వచ్చారు..
గ్యాస్ కూడా ఉంది..
కానీ పెద్ద నోట్ల రద్దు వల్ల
డబ్బులే లేవు..
*2021..*
ఇప్పుడూ వివాహ వేడుకే..
అయితే పరిస్థితి కొంచెం అటూ ఇటూ అయింది..
డబ్బులు ఉన్నాయి..
గ్యాస్ కూడా ఉంది..
అతిధులే కొరత..
కరోనా వెత..
*2026..*
ఇదీ పెళ్లి వేడుకే..
డబ్బుకు లోటు లేదు..
అతిథులతో వేదిక కిటకిట..
వంట కోసం గ్యాస్ లేదు..
మదర్పిత విందు లేకుండానే
జనం ఇళ్లకు..
కారణం..గల్ఫ్ రణం..
పొయ్యిలో మంట లేదు.. మంటపంలో వెలవెలబోయింది
ప్రతి తోరణం..!
ఇంకో ఐదేళ్ల తర్వాత..
*అంటే 2031లో..*
డబ్బులున్నాయి..
గ్యాస్ కూడా పుష్కలం..
అతిథులకూ లోటు లేదు..
మరి..
*_అసలు పెళ్ళే లేదు.._*
మారుతున్న తరం..
ఏదో ఒక వెలితి నిరంతరం..!
_*(సురేష్..9948546286)*_
*_7995666286_*
No comments:
Post a Comment