*_"పులుసు నిమ్మకాయలు".._*
_(నాకు నచ్చిన సరదా కథ)_
🍋🍋🍋🍋🍋🍋🍋🍋
*===================*
*(ఈకథ భలే సిత్రంగా ఉంటాదండీ... ఏంటి అట్టా సూత్తారు..... ఓమారు మనసెట్టి సదవండి.. మీకే తెలుత్తాది. మీ... --వెలిశెట్టి నారాయణరావు 🙏)*
*-----------------------------*
*యాండే... మాఇంట్లో ఓ మంచినిమ్మసెట్టు ఉందండీ... అదేనండీ పులుసు నిమ్మసెట్టండి....*
*దాని కాయలు మేవెప్పుడూ కొయ్యవండి.. పండిన కాయలు ఆటికవే రాల్తుంటాయి...*
*ఆటిని మా సుట్టుపక్కలున్న వోల్లికి..., మా ఆఫీసులో వున్న మా కొలీగ్స్ కి తలో నాలుక్కాయలు ఇత్తా ఉంటానండి...*
*పదిరోజుల క్రితం ఓనాడు కొన్ని కాయలు ఆఫీసుకి అట్టికెళ్లి మా ముందు షిఫ్ట్ వాళ్లకి తలో మూడుకాయలు ఇచ్చేనండి...*
*అందులో సాయిరాం అనేవోడు ఇంకారాలేదని... ఆడికోసం ఉంచిన మూడుకాయలు ఆడి బండి ట్యాంక్ కవర్లో ఎట్టేసి... సెపదావని ఆడికి పోన్ కొడితే ఎంగేజ్ వచ్చింది...*
*అలా పని అడావుడిలో పడి మళ్లీ ఫోను సెయ్యలేదండి ఆడికి...*
*****************
*నిన్న ఆడు పోన్ సేసి, "రేపు మాఇంట్లో హోమాలు చేయించుకుంటున్నాం...నువ్వు, మీయావిడ ఇద్దరూ రండిరా" అని సెప్పేడండి...*
*పొద్దున్నే రెడీ అయ్యి ఎల్లేవండి మేవిద్దరం...*
*ఎల్లేటప్పుడికే పీటలు మీద కూకున్నారు...*
*హోమం మాంచి ఊపుమీద జరుగుతా వుంది... పొగొత్తోందని నేను బయటకొచ్చి కూకుంటే..*
*ఒక హోమం పూర్తయ్యి... రెండో హోమానికి కొంచెం గేప్ దొరుకుతుంటే మావోడు నా దగ్గరికొచ్చేడు...*
*"ఏరా అబ్బాయ్... ఇప్పుడేంటి అంత సడన్గా హోమాలయ్యీ చేయింతున్నావ్ ?..." అంటే,*
*"పది రోజుల కితం మనకెవరో సేతబడి సేసేర్రా...*
*దానికోసం ఇలా చేయింతే దోసాలయ్యీ పోతాయన్నారని...."*
*"సేతబడి సేసేరని ఎలా తెల్సిందిరా నీకు ?..."*
*"ఎలా తెలుత్తుంది ఏంటి.. ఓనాడు పిల్లలు పెన్సిల్లు తెమ్మన్నారని డ్యూటీ నుంచి వత్తా వత్తా తీసుకుని ఇంటికెళ్లేను...*
*అయ్యి తీద్దాం కదాని సెయ్యెడితే షాక్ కొట్టినట్టయి పోయిందిరా..."*
*మంత్రం ఏసిన మూడు నిమ్మకాయలు బండిలో ఎట్టేసేడెవడో..*
*మా సిద్ధాంతి గార్కి పోన్ సేత్తే, ఆటిని అలాగే ఒట్టుకెల్లి, గోదాట్లో పడేసి, తానం సేసి, అప్పుడు ఎల్లమన్నాడు ఇంటికి..."*
*అంటూ ఇంకా ఏవేవో సెప్పేత్తున్నాడు...*
*'ఒరే ఆ నిమ్మకాయలు ఎట్టింది నేనేరా బాబూ..."*
*అని సెప్పాలా వద్దా... కూసింత మీరైనా సెప్పండే....!*
🤔🤔🤔
*_( మేం గోదారోళ్ళమండి.. ఆయ్...)_*
😄😄😄
👆 *[ఎవరూ ఏమనుకోకండే]*
*_{యావండీ, సదివేశారా....! అయితే ధన్యవాదాలండీ! తవరు సదివేసినాక, ఇంకొందరికి గూడా పంపండి; మర్సిపోకండే.. ఈ కథను నాకు వాట్సాప్ లో అందించిన గోదారి ప్రాంత మిత్రుడు, తెలుగు ఉపాధ్యాయుడు... శ్రీ 'బిరుదుగడ్డ నాగేశ్వరరావు' గారికి కృతజ్ఞతలు తెలుపుతూ....: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా 🙏}_*
No comments:
Post a Comment