కాలం అమూల్యం
కాలం ఒక ప్రవాహం లాంటిది. దానికి ఆది, అంతం లేవు. 'లెక్కించే వాటిలో కాలాన్ని నేను' అంటాడు గీతాకారుడు. కాబట్టి అది భగవత్ స్వరూపం. అలాంటి కాలాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. గడచిన కాలం తిరిగి రాదు. వచ్చే కాలం మనకు అనుకూ లంగా ఉంటుందని చెప్పలేం. అందుకే వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలం అందరికీ సమానమే. కానీ, తనకు మంచి జరిగినప్పుడు కాలం కలిసొచ్చిందని, కష్టం వస్తే చెడుకాలం వెంటాడుతోందని సమయాన్ని నిర్వచిస్తాడు మనిషి.
నిజానికి కాలానికి ఇష్టులు, అయిష్టులు అంటూ ఉండరు. దానికి మనిషి మంచీ చెడులతో సంబంధం లేదు. మనకు కలిగే సుఖదుఃఖాలకు కాలాన్ని నిందించడం అవి వేకం, అవగాహనా రాహిత్యం. కాలం తన ధర్మాన్ని తాను పాటిస్తూ ముందుకు సాగు తుంటుంది. ఏనాడూ తన పరిధిని అతిక్రమించదు. సీతాన్వేషణలో నిమగ్నమైన హను మంతుడు ఏ ఒక్కక్షణాన్నీ వృథా చేయలేదు. మైనాకుని ఆతిథ్యాన్ని కూడా స్వీకరించ కుండా సమయం లేనందువల్ల ఆగలేక పోతున్నానని చెప్పి ముందుకెళ్లాడు. అలాగే అరణ్య, అజ్ఞాత వాసాలను పూర్తిచేసిన పాండవులు ఏనాడూ తమ కష్టాలకు కుంగిపో లేదు. ఆ సమయాన్ని వారు తమకు అను మార్చుకుని ధీరోదాత్తుల కూలంగా య్యారు. సంకల్ప శుద్ధి కలవారు సమ యాన్ని వృథా చేయరు. ప్రతి క్షణాన్నీ సర్వేశ్వర స్వరూపంగా భావించి, గౌరవించి లక్ష్యాలను సాధిస్తారు. సమస్యలు ఎదురై నప్పుడు పరిష్కారం దిశగా అడుగేసే ఉత్సాహవంతులే అవకాశాలను అందిపు చ్చుకుని విజయాలు సాధిస్తారు.
కాలానికి విలువివ్వని వాళ్లు ఏదీ సాధిం చలేరు. దుష్టులు వ్యసనాలతో, కలహాలతో కాలాన్ని వ్యర్థం చేస్తారని భర్తృహరి బోధిం చాడు. భోగాలకు, సుఖాలకు బానిసలైన వాళ్లు దైవం ప్రసాదించిన అమూల్యమైన కాలాన్ని వృథా చేస్తున్నామనే సత్యాన్ని గ్రహించరు. అందుకే మనిషి కాలానుగు ణంగా ప్రవర్తించి విజయపథాన్ని చేరుకోవా లని చెబుతారు పండితులు. కాలగతిలో మనిషికి ఎన్నో గాయాలు తగులుతాయి. కాలమే వాటిని మాన్పుతుంది. మానసిక బాధలను ఉపశమింపజేసే శక్తి కాలానికి మాత్రమే ఉంది. కాలం గాలానికి ప్రతి ప్రాణి తలవంచక తప్పదు. భీముడంతటి బలశాలి కొన్నేళ్లు వంటవాడిగా ఉండాల్సి వచ్చింది. రాకుమారుడైన శ్రీరాముడు కారణాంతరాల వల్ల అడవుల పాలు కావాల్సి వచ్చింది.
ప్రతి మనిషికీ అనేక కోరికలు ఉంటాయి. ఆశయాలుంటాయి. వాటిని ఆచరణలో పెట్టాలి. 'రేపు చేద్దామనుకున్న పని ఈ రోజే చెయ్యి, ఈ రోజు చేద్దామనుకున్న పని ఇప్పుడే చెయ్యి, ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు' అంటాడు భక్త కవి కబీర్. కాలం ప్రతి మనిషికీ ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఎన్నో ధర్మాలు బోధిస్తుంది. ఆశ, నిరాశలకు అతీతంగా జీవించమని చెబుతుంది. విధ్యుక్త ధర్మాన్ని ఆచరించేవారికి సహస్ర హస్తాలతో సహకరిస్తుంది. అలాంటి కాలం విలువ గుర్తించి ముందడుగు వేసే ఉత్సాహవంతులు ఎల్లప్పుడూ విజేతలుగానే నిలుస్తారు.
విశ్వనాథ రమ
No comments:
Post a Comment