మానసిక బాధను ఎలా అధిగమించాలి? How to overcome Trauma #telugu #reels #sadhguru
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=w7Pl5bYqanY
Transcript:
(00:00) దయచేసి నేను చెప్పేది శ్రద్ధగా వినండి లేకపోతే జీవితంలో మీరు ఎదుర్కునే వాటి పట్ల నేను సున్నితంగా లేను అనుకోవచ్చు. ఇతరులు నా పట్ల ఎలా ఉంటారు అనేది నా చేతుల్లో లేదు. కానీ నాకు నేను ఏం చేసుకుంటాను అనేది 100 శాతం నా చేతుల్లోనే ఉంది. ఎవరు మీ మనసుకి గాయాన్ని కలిగించలేరు. వారు మీకు శారీరక బాధ కలిగించొచ్చు.
(00:22) వాళ్ళు దానికి నొప్పిని కలిగించొచ్చు. వాళ్ళు మిమ్మల్ని దూషించొచ్చు కానీ మానసిక గాయం మీ వల్లే జరుగుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి చూడండి ఇదొక హిమపాతం లాంటిది ఎవరో ఒక చిన్న రాయి విసురుతారు. మీరేమో ఒక హిమపాతమే సృష్టించుకుంటారు. ఆ మంచుచర్యల బరువు కింద పడి చనిపోతారు. ఇతరులే దానికి కారణం అనుకుంటారు లేదు వాళ్ళు మీ మీదకి విసిరింది ఒక్క రాయే మీరు ఇప్పుడు ఆ రాయిని కేవలం ఒక్క రాయిలానే వదిలేయాలనుకుంటున్నారా లేదా మిమ్మల్ని చంపే ఓ హిమపాతంలా మార్చాలనుకుంటున్నారా ఇది మీ చేతుల్లో ఉంది.
(00:54) ఈ ప్రపంచం మనకు ఏం చేసినా సరే మనకు మనం మాత్రం మంచే చేసుకుందాం. దీన్ని ఆచరణలో పెట్టేందుకు కావలసిన సమతుల్యత చైతన్యం మీకు వస్తే అప్పుడు మీకే అర్థంవుతుంది జాలి పడాల్సింది ఆ రాయి విసిరిన వ్యక్తి మీదేనని ఎందుకంటే ఆ మూర్ఖుడికి జీవితపు ప్రాథమిక సూత్రాలు అర్థం కావట్లేదు
No comments:
Post a Comment