నీమ్ కరోలి బాబా చెప్పిన మనుషుల నిజస్వరూపం | Neem Karoli Baba Wisdom | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=a9_HNExEnBk
Transcript:
(00:00) మీరు ఇప్పుడు వినబోయే ప్రతి మాట మీ గుండె లోతుల్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదు మీతో నేను జరుపుతున్న ఒక ఆత్మీయ సంభాషణ ఎవరు తోడు లేరని ఏడవకండి సింహం ఎప్పుడూ ఒంటరిగానే వేటాడుతుంది. ఇది వినటానికి కొంచెం సినిమా డైలాగ్లో ఉంది కదా కానీ నిజ జీవితంలో ఒంటరితనం అనేది ఒక శాపంలో అనిపిస్తుంది.
(00:21) మన చుట్టూ ఉన్న ప్రపంచం వెళ్ళిపోతుంటే మనల్ని ప్రేమించిన వారు చేయి వదిలేస్తుంటే ప్రాణ స్నేహితులు అనుకున్న వారు అవసరం తీరాక మొహం చాటేస్తుంటే లోపల తెలియని ఏదో ఒక బాధ మీరు ఎప్పుడైనా గమనించారా రాత్రిపూట అందరూ నిద్రపోయాక ఆ నిశ్శబ్దంలో మీ మనసు మిమ్మల్ని ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో నాకు ఎవరూ లేరా నేను అందరికీ అంత చులకనైపోయానా నాకంటూ ఒక తోడు ఉండదా అని మీ మనసు మూలుగుతుంటే ఆ బాధ వర్ణన తీరం ఫోన్ తీసి కాంట్రాక్ట్ లిస్ట్ మొత్తం వెతుకుతారు కానీ ఒక్కరికి కూడా ఫోన్ మీ మనసులో బాధ చెప్పుకోలేరు.
(00:53) ఎందుకంటే అవతల వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటాడనే నమ్మకం మీకు లేదు కాబట్టి చాలా మందికి ఈ ఒంటరితనం ఒక భయంకరమైన చీకటి గదిలా కనిపిస్తుంది. ఎవరో వస్తారు మనల్ని చీకటి నుంచి బయట పడేస్తారు. మనకు వెలుగు చూపిస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటాం. ప్రేమ వైఫల్యం కావచ్చు, ఇంట్లో గొడవలు కావచ్చు లేదా స్నేహితులు మోసం చేయడం కావచ్చు. కారణం ఏదైనా చివరికి మిగిలేది ఆ భరించలేని ఏకాంతం.
(01:18) మీరు అనుకుంటారు నేను అందరికీ అన్ని చేశాను కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఎవరు లేరని ఈ ఆలోచనలు అనేవి మనిషిని ఎంతగానో బాధ పెడతాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ నిశశబ్దం మిమ్మల్ని భయపెడుతుంది. ఎందుకంటే ఆ నిశశబ్దంలో మీతో మీరు మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ సంభాషణ మీకు ఇష్టం ఉండదు. అందుకే ఎప్పుడూ ఎవరో ఒకరు తోడు కోసం ఏదో ఒక డిస్ట్రాక్షన్ కోసం పరిగెడుతుంటారు.
(01:40) కానీ గుర్తుంచుకోండి మీరు ఎవరి కోసం అయితే పరిగెడుతున్నారో వారు మీ శూన్యాన్ని పూరించలేరు అంటే ఆ గ్యాప్ ని ఫిల్ చేయలేరు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని అడిగితే మనకి ఒంటరితనం ఎందుకు ఇంత భయంకరంగా అనిపిస్తుందో తెలుసా? ఎందుకంటే మనం మన సంతోషాన్ని ఇతరులలో చూసుకుంటున్నాం కాబట్టి. సో నీమ్ కరోలి బాబా గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు అందరినీ ప్రేమించు అందరికీ సేవ చేయి కానీ నీ లోపల ఉన్న దైవాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకు అని మనం ఏం చూస్తున్నాం అంటే అందరినీ ప్రేమిస్తున్నాం అందరికీ సేవ చేస్తున్నాం కానీ మనల్ని మనం ప్రేమించుకోవడం మర్చిపోతున్నాం. మన సమస్య
(02:14) ఎక్కడ మొదలవుతుంది అంటే మనం మన విలువను ఇతరుల కళ్ళల్లో వెతుకుతాం. ఒకరు మనల్ని మెచ్చుకుంటే మనం గొప్పవాళ్ళం అనుకుంటాం. ఒకళ్ళు మనల్ని వదిలేస్తే మనం పనికి రాని వాళ్ళం అనుకుంటాం. ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడకపోతే మన ప్రపంచం ఆగిపోయినట్లు ఎందుకు అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఇతరులపై మానసికంగా ఆధారపడటం నేర్చుకున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి మనకి ఏం నేర్పారంటే నలుగురితో కలిసి ఉండాలి అందరితో కలిసి నవ్వాలి అని కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలో మనకి ఎవ్వరూ నేర్పరు.
(02:47) నిజం చెప్పాలంటే మనకి మనమే నేర్చుకోవాలి. ఈ సమస్య ప్రధానమైనది ఎందుకంటే మీరు ఇతరుల మీద ఆధారపడిన ప్రతిసారి మీ ఆత్మగౌరవం మీరు కోల్పోడుతున్నారు అంటే వాళ్ళ చేతిలో పెట్టవదలు పడేస్తున్నారు వాళ్ళేమో దాని వాల్యూ తగ్గించేస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని వదిలేసినప్పుడు మీకు కలిగే బాధ కంటే నన్ను వదిలేశారు అనే అవమానం ఎక్కువగా ఉంటుంది.
(03:09) ఆ అవమానం వల్ల మీరు మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తారు బ్రతిమాలుతారు. దీనివల్ల మీ విలువ ఇంకా తగ్గిపోతుంది. బాబాగారు చెప్పినట్లు ప్రేమ అనేది ఇవ్వాలి. కానీ ఆ ప్రేమలో బానిసత్వం ఉండకూడదు. మీరు ఎప్పుడైతే నా జీవితంలో ఒక మనిషి లేకపోతే నా జీవితమే లేదు అని అనుకుంటారో అప్పుడే మీరు మీ వినాశనానికి పునాది వేసుకున్నట్లు ఆ మనిషి వెళ్ళిపోగానే మీరు ఒక ప్రాణం లేని బొమ్మలా మిగిలిపోతారు.
(03:33) ఇది మీ కెరియర్ ని మీ ఆరోగ్యాన్ని మీ భవిష్యత్తుని కూడా నాశనం చేస్తుంది. నిజం చెప్పాలంటే చాలా మంది మగాళ్ళ ఏంటంటే మధ్యాహానికి బానిస అవ్వడానికి కారణం కూడా ఇదే అన్నమాట. వాళ్ళక ఒక ఉద్యోగం పోయినా తట్టుకోలేరు. వాళ్ళ జీవితంలో ఒక మనిషి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినా తట్టుకోలేరు. సో బేసికల్గా వాళ్ళు ఏంటంటే ఆ తట్టుకోలేని బాధని మధ్యం రూపంలో తీసుకుంటారు.
(03:52) దానివల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా నాశనం అయిపోతుంది. సో ఓవరాల్ గా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెట్టినప్పుడు మీరు బాగా అభిమానించే వాళ్ళు మీరు బాగా గౌరవించే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా సరే మీకు పెద్దగా బాధ అనిపించదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి అలా కాకుండా మిమ్మల్ని మీరు పక్కన పడేసి వేరే వాళ్ళు మీ పక్కన ఉంటే సంతోషంగా ఉంటారు అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ నిజమని చెప్పి నమ్ముతారో ఆ నిజాన్ని మొక్కకు నీళ్లు పోసి పెంచినట్లు మీరు ఆ నిజాన్ని పెంచుతూ పోషిస్తూ ఉన్నారనుకోండి వాళ్ళు మీ దగ్గర నుంచి
(04:24) వెళ్ళిపోయినా వాళ్ళు తప్పు చేసి వెళ్ళిపోయినా కూడా మీరు బాధపడుతూనే ఉంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఏదైనా తప్పు చేస్తే మనక ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. అయ్యో ఆ మనిషిని ఇబ్బంది పెట్టానే అని చెప్పేసి మనం ఇష్టపడే వాళ్ళు వాళ్ళు తప్పు చేసి మన నుంచి దూరంగా వెళ్ళిపోయినా సరే మనమే బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే మనం వాళ్ళని అంతగా ఇష్టపడతాం కాబట్టి అలా ఏం కాకుండా వాళ్ళని మనం ఇష్టపడతాం ఓకే వాళ్ళకంటే మనల్ని మనం ఎక్కువ ఇష్టపడ్డాం అనుకోండి మన జీవితంలో ఎవరున్నా లేకపోయినా మనం ప్రతిరోజు ప్రతి క్షణం హ్యాపీగా ఉంటాం.
(04:56) సరే ఇదంతా పక్కన పెట్టండి. అసలు ఈ సమస్యని ఎలా అధిగమించాలంటే దీనికి ఒకటేనండి పరిష్కారం బయట ఎక్కడో లేదు మీ లోపలే ఉంది. ది సొల్యూషన్ మిస్టరీ అంటారు. ఒంటరితనాన్ని భయంగా కాకుండా ఒక వరంగా మార్చుకుంటారు. సో బాబాగారు ఎప్పుడూ ఒక మాట అనేవారు ప్రేమ ఈ ప్రపంచంలో అతి పెద్ద శక్తి అని చెప్పేసి మొదట ఆ ప్రేమని మీ మీద మీరు చూపించుకోండి. ఒంటరితనం వేరు ఏకాంతం వేరు.
(05:20) ఒంటరితనం అంటే ఏంటి ఎవ్వరూ లేరని చెప్పేసి బాధపడటం. ఏకాంతం అంటే నాకోసం నేను ఉన్నాను అని చెప్పేసి సంతోష పెట్టడటం. మీరు సింహంలా వేటాడాలంటే ముందు మీరు సింహంలా ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి. అడవిలో సింహం ఎప్పుడూ గుంపులుగా తిరగదు. అది ఒంటరిగా ఉన్నప్పుడే దాని గంభీరం కనిపిస్తుంది. మీ జీవితం కూడా అంతే. మీరు ఎప్పుడైతే మీతో మీరు గడపడం మొదలు పెడతారో అప్పుడు మీకు అద్భుతమైన నిజాలు తెలుస్తాయి.
(05:45) మీకు ఏం కావాలి? మీ కలలు ఏంటి, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఇవన్నీ ఆ ఏకాంతంలోనే అర్థమవుతాయి. మీకు తోడుగా ఎవరు లేరంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటివరకు ఇతరుల కోసం బ్రతికావు ఇప్పుడు నీకోసం నువ్వు బ్రతుకు అని బాబాగారి దగ్గరికి ఎంతో మంది భక్తులు వచ్చేవారు. కానీ ఆయన అంతర్గత స్థితిలో ఎప్పుడు ఒంటరిగానే ఉండేవారు.
(06:06) ఆ స్థితి మీకు రావాలి. నా చుట్టూ జనం ఉన్నా నాకు సంతోషమే లేకపోతే ఇంకా సంతోషం అనే మానసిక దృఢత్వాన్ని మీరు సంపాదించుకోవాలి. సెల్ఫ్ లవ్ అంటే అద్దం ముందు నిలబడి అందంగా ఉన్నానని చెప్పుకోవడం కాదు. మీ లోపల ఉన్న లోపాలు అంగీకరిస్తూనే మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం. సరే ఇదంతా బాగానే ఉంది. మనల్ని మనం ప్రేమించుకోవడం వల్ల మన జీవితం ఏమన్నా మెరుగుపడుతుందా అంటే కచ్చితంగా మెరుగుపడుతుంది.
(06:31) కాకపోతే మీతో మీరు ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. సరే మరి నన్ను నేను ఎలా ప్రేమించుకోవాలి నాకు తెలియట్లేదు కదా అని చెప్పేసి మీరు అడిగితే మాత్రం అందులో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి మీరు చేయాల్సిన మొట్టమొదటి పని డిజిటల్ డటాక్స్ వారానికి ఒక రోజు సోషల్ మీడియాకి ఫోన్ కి పూర్తిగా దూరం అవ్వండి. ఆ రోజు ఎవరికీ అందుబాటులో ఉండకండి ఆ సమయంలో ఒక మంచి పుస్తకం చదవండి లేదా మీకు నచ్చిన చోటకి వెళ్ళండి ప్రశాంతంగా కూర్చొని ప్రకృతిని గమనించండి.
(06:57) మీరు మీ ఫోన్ ని పక్కన పెట్టినప్పుడు మాత్రమే మీ మనసులో ఉన్న శబ్దాలు మీకు వినపడతాయి. ఇక రెండవది మీ మీద మీరు పెట్టుబడి పెట్టండి. మీకు నచ్చిన ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోండి. మీ పనిలో బిజీగా ఉన్నప్పుడు మీ ఎదుగుదల మీద దృష్టి పెట్టినప్పుడు అనవసరపు మనుషుల జ్ఞాపకాలు మిమ్మల్ని పలకరించవు. బాబాగారు చెప్పినట్లు సేవ చేయి మీకు బాధగా ఉన్నప్పుడు మీకంటే ఎక్కువ బాధలో ఉన్నవారికి ఏదైనా సహాయం చేయండి.
(07:22) అప్పుడు మీ సమస్య ఎంతో చిన్నదో మీకు అర్థమవుతుంది. ఆ సేవలో దొరికే తృప్తి ఏ మనిషి ఇచ్చే ప్రేమలోనూ దొరకదు. మూడవది నువ్వు చెప్పడం నేర్చుకోండి. మిమ్మల్ని గౌరవించని చోట మీ విలువ తెలియని బంధంలో ఉండటం కంటే గౌరవంగా ఒంటరిగా ఉండడం చాలా మేలు. ఒంటరితనం మిమ్మల్ని చంపదు కానీ తప్పుడు మనుషుల తోడు మిమ్మల్ని బ్రతకనీయకుండా శవంలా మారుస్తుంది.
(07:46) చివరిగా ఒక మాట ఈరోజే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి. ఎవరైనా వెళ్ళిపోయారని ఏడవడం ఆపేయండి. మీ జీవితం ఒక అద్భుతమైన క్యాన్వాస్ దాన్ని ఇతరుల రంగులతో కాకుండా మీ సొంత రంగులతో నింపండి. మీరు ఎప్పుడైతే మీ ఒంటరితనాన్ని ప్రేమిస్తారో అప్పుడు ఈ ప్రపంచం మొత్తం మీతో ప్రేమలో పడుతుంది. మీరు లోపల నుంచి నిండుగా ఉన్నప్పుడు మీకు ఎవరి తోడు అవసరం ఉండదు.
(08:08) అలా అవసరం లేనప్పుడే మీరు నిజమైన సింహం అవుతారు. సో నేటి నుంచే మారాలి. నిన్నటి బాధని నిన్నటితోనే వదిలేయండి. రేపటి గురించి భయపడకండి ఈ క్షణం మీది. మీలో ఉన్న ఆ గొప్ప శక్తిని నిద్రలేపండి. మీ జీవితంలో మీరు అత్యంత ఒంటరిగా ఫీల్ అయిన ఆ ఒక్క క్షణం ఏది? మరియు ఆ క్షణం మీకు నేర్పిన అతి పెద్ద పాఠం ఏంటి? కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి.
(08:32) మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్
No comments:
Post a Comment